about me:

నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు
గంటలైనా క్షణాల్ల గడిచిపోతవి
నా కళ్ళు నవ్వగలవని
నా పెదాలు మాట్లాడగలవని
నాలోను చైతన్యంవుందని
అప్పుడే తెలుస్తుంది......
గుప్పెట జారిన ఇసుకలా కాలము
కరిగే కలలా జారిపోతుంది
వెళ్ళోస్తానంటూ నువ్వు బయలుదేరుతావు
వద్దంటూ నిన్ను పట్టి ఆపాలని నా హస్తం
అప్రయత్నంగా నీకు టాటా చెబుతుంది....
బ్రతుకు బాటలో నీవు బాటసారివవుతావు
నేను మాత్రం అభిసారికనై
నిన్ను కలిసే మరో రోజుకై
నేటిని నిన్నగా మార్చే రేపుకై
ఎప్పుడు మాట్లాడుతావని చూసే రేపటి నీ రాకకై
"నా" నీకొసం నిరీక్షిస్తుంటాను "నీ" నేస్తాన్నై.....!!!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి