కొంటె గాలిలా గిల్లిపోకు
కనుపాపలో కలవైపో…
మెరుపులా వచ్చి మాయమైపోకు
మదిలోతులో కొలువుండిపో…
మంచుబిందువులా వచ్చి కరిగిపోకు
మైమరపులోకి నను తీసుకుపో…
కునుకుపాటులో కనుమరుగైపోకు
చిరునవ్వులా చిరకాలం ఉండిపో…
చీకటిలో జాబిలిలా
నువ్వు వెలిగిపో…
శలయేటిలో అలలా
నను తాకిపో…
నే రాసే ప్రతి పాటలో ఉండిపో…
నా ప్రతి అక్షరంలో ఇమిడిపో…
మురిపించే గతంలా నను అల్లుకుపో…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి