8, జనవరి 2011, శనివారం

నువ్వే నా లోకం

నువ్వే నా లోకం

ఐన తరుణం

నన్ను వదిలి వెళ్ళడం

ఎంత దారుణం!!

కానీ …

నేల రాలే ఆకుని చూసి

చెట్టు నీడను చులకన చేయడం

ఎంత మూర్ఖత్వం?

వాడిపోయే పూవుని తలచి

పూదోటనే కాదనుకోవడం

కాదా మూర్ఖత్వం?

అమావాస్య నిశీధిలో

నింగిని చూచి వగచి

సుర్యోదయన్నే చూడకపోవడం

ముమ్మాటికీ మూర్ఖత్వమే!!

కనుకనే ….

నువ్వు లేని జీవితం

నీ తలపులకు అర్పితం
ఎంతైనా…

నేనూ మూర్ఖున్నేగా :)

(అంటే.. మనిషినేగా :D )

కామెంట్‌లు లేవు: