కలలు కంటూ సాగునా బతుకు
విలువలంటూ పెరగవా ఇకను,
గుండె నిండా భారమే నిండెనే
కనుల ముందే కంటి పాపలే,
కారు చిచ్చి కాలుతుండగా
లేదుగా మంచు కరిగి కన్నీరవగా,
ఏది ఏమైనా నా మనసు పొరలలో
కలిగి తీరెను తీవ్ర జ్వాలలు,
జరుగుటెన్నడో మేలు ఈ జన్మకు
మనసు నిండా ఆశలున్నవని
తెలియకుండా పెరుగుతున్నవని,
తెలుసుకోలేకే బతుకు కడతేరునా
నాదు ప్రాణం నీవే కావా అని
పలుకుచున్నా నన్ను కాదు అని
వెళ్ళిపోయావు న్యాయమా
ప్రియతమా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి