నా మనసులో
ఒక ఒంటరి మౌనం
అప్పుడే
నాలో నుండి బయటకు వెళుతున్న ఊపిరి
ఆ మౌనాన్ని పలకరించింది
నాతో వస్తావా అంది
మౌనం ఆనందంతో ఆ ఊపిరిలో కలసి పోయింది
ఆ మౌనం అలా
నా నుంచి బయటకి వచ్చేసింది
ఇంతలో నీవు తీసుకోబోతున్న ఊపిరి
అది బయటకు వచ్చేసిన నా మౌనాన్ని చూసింది
నాతో వచ్చేయమంది
నా మౌనం ఆనందంతో
నీ ఊపిరిలో మమేకమయింది
అలా నా మౌనం నీ మనసులోకి వెళ్ళింది
అక్కడే నీ మనసులో ఇంకో మౌనం
ఇక్కడ నేను తీసుకోబోతున్న ఊపిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి