29, జనవరి 2011, శనివారం

మనిషి స్నేహాన్ని కాంక్షిస్తాడు..

ప్రతి
మనిషి స్నేహాన్ని కాంక్షిస్తాడు.. 

ఆ స్నేహ కాంక్షని పాలతో పోల్చవచ్చు....
అవతలి వ్యక్తీ ఇచ్చేది పంచదార అయతే మనలో కరిగి పోతుంది...

ఉప్పు అయితే విరగ్గోడుతుంది...
పెరుగు అయితే మన అస్తిత్వాన్ని మారుస్తుంది..
నీరు అయితే పలుచన చేస్తుంది.. 
అందుకే మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి జాగ్రత్తగా.

28, జనవరి 2011, శుక్రవారం

నన్ను మాట్లాడనివ్వు...

నన్ను మాట్లాడనివ్వు...
లోలోన అదిమిపెట్టుకున్న ఎన్నో ఆశలు
ఆనందాలు,కన్నీటి సవ్వళ్ళను
ఇప్పటికైనా నీ చెవిని తాకనివ్వు !

చాలు...ఈ మూగ రోదనింక చాలు
గుండె పాటను గొంతులో ఆపేసిన
ఆనవాళ్ళు చెరిగిపోయేలా
ఒక్కసారి కేక పెట్టనివ్వు...
ఇకనైనా నన్ను మాట్లాడనివ్వు!

వర్షించడానికి సిద్దం గా
ఎన్నేళ్ళ భావాలో?
ప్రవాహం లా
ఎన్నెన్ని కన్నీళ్ళో?

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా
పర్లేదు
పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వు
ఎవ్వరైనా పర్లేదు
ఓ ఓ ఓ .... నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు అర్ధమే లేదు
మచ్చేదో ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి
దాగుండిపోదు ...... || పరవాలేదు ||

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ ఐనా మరి పర్లేదు
మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని
అందంగా లేను అని నిన్నెవరు చూడరని
నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు
ఎంత మంచి మనసో నీది దాని కన్న
గొప్పదే లేదు అందగాళ్ళు నాకెవ్వరూ ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని కోకిల
కొమ్మల్లో దాగుండిపోదు ...... || పరవాలేదు ||

అంతలేసి కళ్ళుండకున్నా
నాకు పర్లేదు కోర మీసం లేకున్న గాని మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్ళిలా
అని నిన్నే అడగమని సరదాగా తరిమిందే మది నీపై మనసుపడి
మురిపించే ఊహలతో
ముఖచిత్రం గీసుకొని అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి
చేరదీసి
లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు అందుకే ఇంకెవ్వరూ ఇంత నచ్చలేదు
ఎవ్వరేమన్నా
సరే నా చేయి నిన్నింక వదిలేది లేదు ...... || పరవాలేదు ||

27, జనవరి 2011, గురువారం

చిన్ని ఆశ


చిన్ని ఆశ

జీవితంలో పెద్దవి, చిన్నవి ఆశలనేకం. అందులో తీరినవీ, తీరనివీ, తీరాలని ఆశపడేవీ, మరో జన్మలోనైనా తీరితే చాలు
అని ఆరాట పడేవీ...ఇలా ఎన్నెన్నో ఆశలతో జీవితం సాగిపొతుంది. అందులో కొన్ని దగ్గరే
ఉన్నా వాటిని గుర్తించక అవి పోయాక వాటి కోసం తపన పడుతూ, కాలం ఒక్క సారి వెనక్కెళితే
మళ్ళీ వాటిని తనివితీరా ఆశ్వాదించాలని ఆరాటపడే క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో
కొన్నైనా తప్పదు. అలా ఆరాటాలుగా మిగిలిపోయే "చిన్ని ఆశ"లు మన గుండె
లోతుల్లోంచి బయటకి వచ్చి చెప్పుకోగలిగితే ఎలా ఉంటుందన్న నా  "ఛిన్ని ఆశ". - ప్రేమతో మీ శేషు...

26, జనవరి 2011, బుధవారం

అప్పుడప్పుడు ఎలావున్నావంటూ ఒక్కపలకరింపు చాలు...


అప్పుడప్పుడు ఎలావున్నావంటూ ఒక్కపలకరింపు చాలు...

నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు...

సంతోషమైనా, బాధయినా నేనుంటే బాగుండుననిపిస్తే చాలు....

మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు కొన్నయినా మధురంగా అనిపిస్తే చాలు...

చాలు.....నా స్నేహానికిది చాలు.......

మనిషి కీ, మనిషికీ... మనసుకు, మనసుకూ మధ్య

ఈ మాత్రం వారధి చాలు...

తలుపు తీస్తే..

తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే..

ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ.. కరిగిపోతూ ..
అలజడిచేస్తూ..
అక్షరాల జల్లు

నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?

పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.

తడుపుదామనో
కలిసి తరిద్దామనో..

గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది..!

25, జనవరి 2011, మంగళవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు నేస్తమా.

ఆకాశంలొ నుండి ఒక నక్షత్రం నేలపైకి వచ్చిన రోజు,

నిండుచంద్రుడి పండువెన్నెల భువిని చేరిన రోజు,

హరివిల్లు ఆకాశానికి రంగులిచ్చిన రోజు,

మేఘాలు ఆనందంతో చిరిజల్లులు కురిపించిన రోజు,

మంచు బిందువులు మనసుని తడుపుతున్న రోజు,

కోకిలా గొంతు విప్పిన రోజు,

ఆ పాటకి నెమలి నాట్యం చేసిన రోజు,

ఆనందాలు, అందాలు ఒక్కసారిగా వచ్చిన రోజు,

ఆదే అదే నీ పుట్టిన రోజు.

నా కోసం ఒక నేస్తం పుట్టిన రోజు,

స్నేహానికి ప్రాణమిచ్చే నా నేస్తం పుట్టినరోజు,

ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు నేస్తమా.

ఒకొక్కసారి

ఒకొక్కసారి
అందాన్ని చూసిన కనురెప్పలు
ఆనందంతో ముచ్చటగా
టపటప కొట్టుకుంటాయి!

ఒకొక్కసారి
ఒక్కసారిగా అంతందాన్ని చూసిన కళ్ళు
విస్మయంతో ఆల్చిప్పలవుతుంటాయి...
అందాన్నంతా కళ్ళలోనే దాచుకుంటూ
అప్పుడప్పుడు కళ్ళలోనే
కలలు కంటుంటాయి!

ఒకొక్కసారి
ఆ అందాన్ని చూసిన కళ్ళు
కుళ్ళుకుంటుంటాయి...
తనలో లేని తనానికి లేకిబుద్ధి తోడై
అనేక వంకరలను ప్రదర్శిస్తుంటాయి!!!

ఒకొక్కసారి అందం
అందనంత ఎత్తులో ఒదిగి కూర్చుని
చందమామలోని చల్లదనాన్ని
వెనె్నలగా విరగబూయిస్తుంటుంది!

ఒకొక్కసారి
అందాన్ని బలవంతంగా అనుభవించాలనే
కఠిన కోర్కె రగిలి
కళ్ళకు మబ్బు పట్టినట్లు
జబ్బు పుట్టిస్తూంటుంది...
అందమైన గులాబీని నలిపి తుంపేసినట్లు
అంగాంగాన్నీ విరిచి వశపర్చుకోవాలనిపిస్తుంది!!

ఒకొక్కసారి కళ్ళు
ఓర్వలేక, ఓర్పు లేక
కఠిన పాషాణ హృదయమవుతుంటుంది...
కళ్ళనుండి ఆనంద భాష్పాలనే కాదు
యాసిడ్ సెగలనూ ఒలికిస్తూ
ఒళ్ళంతా దహించివేస్తూంటుంది!!!

ఇప్పుడైతే
అందానికే తన అందమంటే బెంగై కూర్చుంది!
ఇప్పుడైతే
తన అందమే తనకు శత్రువు అన్నట్లు
భయంతో పరుగులు పెట్టిస్తోంది!!?
ఇప్పుడైతే
యాసిడ్‌కీ తన అందమంటే
చచ్చేంత ప్రేమ పుట్టుకొచ్చి
తనవైపే అడుగులేస్తున్నట్లు జడుపు పుట్టుకుంటోంది!!!!
ఇప్పుడైతే అందం
అందహీన మొహం పెట్టి
అంద‘వికారం’గా తయ్యారయ్యేందుకు
సిద్ధపడుతోంది!!!??

నేనున్నది సముద్రపు ఎడారిలో

నేనున్నది సముద్రపు ఎడారిలో
ఒంటరిగా, నిరాశగా
ప్రాణంలేని చలనం ఉన్న గాలిలో
మేఘం నన్ను చూసి,
జాలితో కలత చెంది, కలవరపడింది
ఉద్రేకంతో ఆగ్రహించింది
ఆ ఆగ్రహం,
గాలికి ప్రాణం,
రెట్టింపు చలనం కలిగించింది
ఎంతోదూరంలొ నాకొసం ఏదో వస్తుంది
నన్ను తాకాలని,
ఈ ఎడారిని తాకాలని
చివరికి తెలిసింది
వచ్చేది కెరటమని

నన్ను దరిచేరింది
నిరాశగా వున్న నాలో
ఉత్సాహం రేపింది
ఆశతొ నే దరిచేరగా
అమాయకంగా, సముద్రంలో కలిసిపొయింది
మేఘం వెర్రిగా నవ్వి వీడింది
ప్రాణంలేని,
చలనం ఉన్నదిగా గాలి మారింది
అపుడు తెలిసింది,
నేను కోల్పొయింది
తిరిగి వచ్చే కెరటం కాదని…
మరణాన్నైనా జయించగల్గే
మళ్ళీ తిరిగిరాని
నీ చిరునవ్వని…

చివరికి ఏడారే
నాకు తోడుగా మిగిలింది.

చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు


చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు

చూసి పోవాలే తప్ప

ఉండి పోకూడదు

గదులు ఖాళీలుండవు

మదులూ ఖాళీలుండవు
కొంప కొల్లేరయినా

ఊరు వేగై అయినా

కొలువు తప్పదు

చెదిరిపోతుందని తెలిసినా

ముస్తాబు తప్పదు
వీధి గుమ్మంలోంచి

వెళ్ళిపోవాల్సిన వానలకి

నగరమెప్పుడూ సిద్ధం కాదు

డ్రైనేజీల్లేని నగరాలు

గొడుగుల్లేని జవరాళ్ళు
తడిసి తడిసి ప్రవహించడమేతప్ప -

వెలుతుర్లేని చీకట్లో

చెప్పకుండా వచ్చి వెళ్ళిపోతే మంచిది

ఉదయానికీ ఉద్యమానికీ

అడ్డు పడకూడదు
వానని ప్రేమించడానికి

ఆకుపచ్చని అడవిని ఊహించడానికి

స్థిమితం కావాలి
ఎప్పుడైనా వాన కురిసినరోజు

సెలవు ప్రకటిస్తే బావుణ్ణు

ఇంటిముందు కాగితప్పడవల్తో

దారాల వానలో

గెంతులేయచ్చు

ఘల్లునమోగే జల్లులో

జవరాలిలా

నీకంటేనా అని....

ప్రకృతి అందమైనదని  అంటుంటే ఆలోచించా!!!!!!! 
నీకంటేనా అని.... 
జలపాతం ఆహ్లాదకరం అంటుంటే
ఆలోచించా!!!!!!!!
 
నీ కురుల గాలికంటేనా అని...  
సముద్రం లోతైనదని  అంటుంటే
ఆలోచించా!!!!!!
   
నీ మనసు లోతు కంటేనా అని... 
కాని నాకు తరువాత తెలిసింది  
ప్రకృతి నీ ముంగిట  తల దించిందని.

23, జనవరి 2011, ఆదివారం

ఒక్కొక్కప్పుడు ఆలోచనలన్నీ


ఒక్కొక్కప్పుడు ఆలోచనలన్నీ

తామరాకుపై నీటిబొట్లై

అస్థిరంగా జారిపోతాయి.
ఉద్వేగాలు,ఉత్సాహాలు,

వేదనల తాకిడికి

కొంచమైనా కదలకుండా

సుప్తమై మిగిలిపోతుంది చైతన్యం,

నిద్రిస్తున్న నాగినిలా.
అరంగేట్రానికి ముందు

గురువాజ్ఞకై కైమోడ్చి

కదలని భంగిమై నిలచిన నాట్యకత్తెలా

నా కవిత్వం సహనంతో వేచివుంటుంది,

తనను తాను ఆవిష్కరించుకునే

ఓ అద్భుతమైన క్షణం కోసం.
ఆల్చిప్పలో ముకుళించిన ముత్యమై,

పూమొగ్గలో దాగిన పరాగమై,

తొలిపొద్దు స్పర్శకు ఎదురు చూసే ఆకాశమై .

నువ్వొస్తున్నావని నాకు తెలిసిందిలే…


నువ్వొస్తున్నావని నాకు తెలిసిందిలే…

నా కన్నులరమోడ్పులు పెదవులు దరహాస వికసితాలు…
ఎటు చూసినా నువ్వే కనిపిస్తావేం,

నన్ను పిచ్చిదాన్ని చేసే కుట్రా?
నువ్వంటే నాకు చెప్పలేని చిరాకు, అంతులేని కోపం,

ఎందుకు నిన్నింతగా ప్రేమించేలా చేస్తావు నన్ను మరి?
వెన్నెల ఉందో లేదో చంద్రుడు ప్రత్యేకంగా చెప్పాలా

నమ్ము ప్రియా, నీ ప్రేమ కంటే నిషా విశ్వంలోనే లేదు
అదేమిటో మరి, నీతో ఉంటె చంద్రుణ్ణి మునివేళ్ళతో ముట్టుకున్నట్లే ఉంటుంది

వెన్నెల గంధాన్ని బుగ్గలకు రాస్తున్నట్లే ఉంటుంది
చూసావా మరి, నా నిద్ర కూడా నిన్నే జపిస్తూ ఉంటుంది

నీ ఎదురుచూపులో నన్నొదిలి పారిపోతుంది
ప్రతిక్షణం నా తలపులలోనే ఉంటావు, నిరంతరం నాలో ప్రవహిస్తుంటావు

లిప్తపాటయినా నాతో ఉండవు, కన్నుల దాహమయినా తీరనీయవు
ఇంతగా ప్రేమించే నీ హృదయం సుమసద్రుశమనుకున్నాను

నన్నిలా విసిరేస్తుంటే యిప్పుడేమనుకోను?
నీది తీపి జ్ఞాపకాల పరిమళం

నా ప్రేమ దహించే శాపం
ప్రేమంటే నీకో హృదయాల సమాహారం

నాకయితే అదే జీవనాధారం
సీతాకోకచిలుక రెక్కల్ని నాకతికించి ఎగరేసింది నువ్వే

నిర్దాక్షిణ్యంగా నేలకు తోసేసింది నువ్వే
అందుకే, నీ సాన్నిహిత్యం కంటే కూడా ఎదురుచూపే మధురం

విషాద సమ్మిళిత సమ్మోహన యోగం

దోసిట్లో సముద్రం

దోసిట్లో సముద్రం

ఆటుపోట్ల అల

సూర్యకాంతిలో తడిసి మెరిసే

మేఘాల పగుళ్ళలోంచి

చీల్చుకొస్తున్న వెలుగు

ఆకాశానికి వేలాడుతున్న చెట్టు

ఏరుకున్న ఫలక్షణం

తనలో తానే మాటాడుకుంటూ

వీచి విస్తరించే గాలి స్పర్శ

పూలగుండెల్లో ప్రశ్నల మంట

ప్రకృతి కిటికీ

ప్రపంచ గురువు

కళ్ళు కడిగే కన్నీరు

అశరీర ఆత్మ నిశ్శబ్ద నాట్యం

ఇదీ అదని ఎన్ని చెప్పినా

జీవితాన్ని మరణాన్ని

పూర్తిగా విప్పి చెప్పలేనట్లు

కవిత్వం.

కాళ్ళకీ కళ్ళే.

సూర్యోదయం

సమూహం వేపు తోస్తే

సూర్యస్తమయం

ఏకాంతం వేపు

ఏకాంతం

ఆకాశాన్ని హత్తుకుంటున్న వంతెన

అద్దంలో కనబడని రూపం

సమూహం

దేనికీ బెదరని నది

చూసీ చూదని అద్దం

అలవాటయిన దారిలో

కాళ్ళకీ కళ్ళే.

ఎదురు చూడడం నా వంతైంది అని.


ముందుగా వచ్చిన ఈదురు గాలి

వర్షం అతిథి రాకను తెలుపుతుంటే-

దాని ఒళ్ళంతా దుమ్మని

నా శుభ్రమైన ఇంట్లోకి రానీకుండా

మొహమ్మీదే తలుపేసేశాను.
ప్రేమతో …

నన్నెలాగైనా కలవాలని వచ్చిన వానజల్లును

ఆపేశాను,అంతే వేగంగా

కిటికీలు మూసేసి!
ఉరుముల పిలుపులను

టీవీ అరుపుల్లోపడి వినిపించుకోనేలేదు

చిరుజల్లు తెచ్చిన మట్టి వాసనలు

చాట్ మసాల ఘుమఘుమల ముందు

పనికిరాలేదు.
సకల ప్రాణులను సంతోషపెట్టిన

ఆ స్వచ్ఛమైన వర్షపు చినుకులు-

నాకు మాత్రం

సమస్తాన్నీ బురదతో నింపే

పనికిరాని నీటి బిందువుల్లానే తోచేవి.
కానీ-

ఇప్పుడు అనుకోకుండా

ఈ వర్షంలో చిక్కుకుపోయినప్పుడు కదా,తెలిసింది…
షవర్లో ఎంత తడిస్తే మాత్రం

ఈ ఆనందం దొరుకుతుందా?

ఉప్పొంగే సముద్రాన్ని కలిసిన తర్వాత

స్విమ్మింగ్ పూల్ ఎంత ఇరుకనిపిస్తుందీ?
ఇదీ అంతేనేమో!!
తన ఆత్మీయతను నాపై గుమ్మరించి

తడిపి ముద్ద చేసి

నేను మెచ్చిన ఆనందాన్ని

మళ్ళీ మోసుకొస్తానని

సెలవు తీసుకుంటుంటే-

బాధగా చెప్పా!
ఈదురుగాలి కోసం

ఉరుములూ మెరుపుల కోసం…

మరీ ముఖ్యంగా, నీ కోసం

ఎదురు చూస్తూనే ఉంటా.

త్వరగా రా మళ్ళీ

నిన్నిలా కలిశాక

ఎదురు చూడడం నా వంతైంది అని.

“అమ్మ నీకెందుకు నచ్చింది?


“అమ్మ నీకెందుకు నచ్చింది?

అమాయికంగానే అడిగినట్టూ

అమాంతంగా అడిగేస్తే-

ఏం సమాధానం చెప్పగలను?
“అమ్మ నీకు అమ్మ అయినందుకు!”

అన్నానంతే!!

బ్రతుకుకి అర్ధమే లేకుండా పోతుంది


కన్నీళ్ళు కార్చడం నేర్పామంటే

ప్రతి చిన్న కారణానికీ

కదిలి కదిలి ఏడుస్తుంది

నవ్వడం నేర్పామంటే

ప్రపంచంలో నవ్వదగిన

విషయాలు దొరకక

నిరాశ పడుతుంది
కాస్తంత చురుకుదనం నేర్పామంటే

చుక్కల్ని తాకి వస్తానని గొడవ చేస్తుంది

భరించలేక పరాకు నేర్పితే

పక్కనే వున్న ఆనందాన్ని కూడా

అందుకోలేని పిచ్చిదవుతుంది
ఆదర్శాలు నేర్పామంటే

అవనిలో మన బ్రతుకు

దుర్భరం చేస్తుంది

అవసరాలే తెలియచెప్తే

నరకంలో కూడా

మనకి చోటు లేకుండా చేస్తుంది
గుప్పెడంత మనసు..

దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టామా

బ్రతుకంతా దానికే సరిపోతుంది

ఎందుకొచ్చిన గోల అని

పట్టించుకోకుండా వదిలేసామా

బ్రతుకుకి అర్ధమే లేకుండా పోతుంది

నువ్వాడే నాటకంలో


నువ్వాడే నాటకంలో

నీ అంతరంగానికే పరిమితమైన

ఓ కీచురాయి పాత్రను
నువ్వు చేస్తున్న కర్మల్లో

కోల్పోయిన నా ఉనికిని శోధిస్తూ

గుండె తడారిపోయి తపిస్తున్న అస్తిత్వాన్ని
నువ్వేస్తున్న బొమ్మల్లో

రూపాంతరం చెంది

ఆనవాలు పట్టలేని అదృశ్య చిత్రాన్ని
నువ్వు రాస్తున్న కథల్లో

కనుమరుగైన సత్యాన్ని,

నువ్వు పలికే పైమినుకు మాటల ఇరుకుల్లో

ఊపిరాడని ఉపేక్షిత గీతాన్ని
అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో

నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా…
ఒక్కసారైనా

నన్ను నువ్వుగా లోకానికి పంచు,

నువ్వు నువ్వుగా జీవించు

ఈ అలంకారాలన్నీ వొలిచి.

ఈ సెలయేటిలో దాహం తీర్చుకుంటాను


ఈ సెలయేటిలో దాహం తీర్చుకుంటాను

ఈ చెట్టు నీడలో విశ్రమిస్తాను

వచ్చిపోయే మేఘాల్ని లెక్కించడంలో

మధ్యాహ్నమంతా గడిచిపోతుంది
సాయంకాలం

గూళ్ళని చేరే పక్షులతోపాటు

నా మనసుకూడా

పాటనుండి క్రమంగా

మౌనంలోకి ప్రయాణిస్తుంది
అర్ధరాత్రి నిశ్శబ్దంలో

ఆత్మనొక పుష్పంగా

వికసింపజేసే రహస్యం

ప్రతిమొక్కా నాకు

చెప్తూనే ఉంటుంది

* * *

వేకువ కాంతిలో

వెలిగిపోతూ…

నీ పాదాల చెంత

మరో పువ్వు!

చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు


చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు

చూసి పోవాలే తప్ప

ఉండి పోకూడదు

గదులు ఖాళీలుండవు

మదులూ ఖాళీలుండవు
కొంప కొల్లేరయినా

ఊరు వేగై అయినా

కొలువు తప్పదు

చెదిరిపోతుందని తెలిసినా

ముస్తాబు తప్పదు
వీధి గుమ్మంలోంచి

వెళ్ళిపోవాల్సిన వానలకి

నగరమెప్పుడూ సిద్ధం కాదు

డ్రైనేజీల్లేని నగరాలు

గొడుగుల్లేని జవరాళ్ళు
తడిసి తడిసి ప్రవహించడమేతప్ప -

వెలుతుర్లేని చీకట్లో

చెప్పకుండా వచ్చి వెళ్ళిపోతే మంచిది

ఉదయానికీ ఉద్యమానికీ

అడ్డు పడకూడదు
వానని ప్రేమించడానికి

ఆకుపచ్చని అడవిని ఊహించడానికి

స్థిమితం కావాలి
ఎప్పుడైనా వాన కురిసినరోజు

సెలవు ప్రకటిస్తే బావుణ్ణు

ఇంటిముందు కాగితప్పడవల్తో

దారాల వానలో

గెంతులేయచ్చు

ఘల్లునమోగే జల్లులో

జవరాలిలా

21, జనవరి 2011, శుక్రవారం

ఒక్కొక్కప్పుడు ఆలోచనలన్నీ


ఒక్కొక్కప్పుడు ఆలోచనలన్నీ

తామరాకుపై నీటిబొట్లై

అస్థిరంగా జారిపోతాయి.
ఉద్వేగాలు,ఉత్సాహాలు,

వేదనల తాకిడికి

కొంచమైనా కదలకుండా

సుప్తమై మిగిలిపోతుంది చైతన్యం,

నిద్రిస్తున్న నాగినిలా.
అరంగేట్రానికి ముందు

గురువాజ్ఞకై కైమోడ్చి

కదలని భంగిమై నిలచిన నాట్యకత్తెలా

నా కవిత్వం సహనంతో వేచివుంటుంది,

తనను తాను ఆవిష్కరించుకునే

ఓ అద్భుతమైన క్షణం కోసం.
ఆల్చిప్పలో ముకుళించిన ముత్యమై,

పూమొగ్గలో దాగిన పరాగమై,

తొలిపొద్దు స్పర్శకు ఎదురు చూసే ఆకాశమై .

లోతుగా


లోతుగా

పాతుకు పోయిన వాటిని

చేతులతో పెకలించే కన్నా

కలిసిన రోజుల

రంగురంగుల

జ్ఞాపకాల ఆకులను

పెళుసు కొమ్మలతో

దులుపు కోవడమే

మేలు.

గుమి గూడిన ఆకులను

ఎగుర గొట్టి

గిరగిరా తిప్పి

నేల రాలుస్తుంది

సుడిగాలి.

గాలి వీచినప్పుడల్లా

పసిపిల్లల్లా

రోడ్డుకటూ ఇటూ

పరుగులు తీస్తాయి

రాలిన ఆకులు

ఎండిన చెట్టును

అంటి పెట్టుకొనే ఉంది

పండిన ఆకు

వెండిలా వెలిగే పగటి ఎండ-

ఉండుండి వీచే గాలి

వేచి చూస్తోంది.

చుట్టూ

ఆకులను రాల్చుకొని

మిగిలిన రంగుల ఆకులతో

గుట్టుగా రోజులు

నెట్టుకొస్తోంది

సంసారి చెట్టు.

తేమతో కూడిన పిల్లగాలి

ప్రేమగా వీచినా అసలు

ఆకులు రాల్చనంది

సోమరి చెట్టు:

లేత ఎండలో

అల్లాడుతూ

వెలిగిపోయే

పసుప్పచ్చ ఆకులు.

అన్ని ఆకులు రాల్చిన చెట్టు :

నిలువు గుబురు కొమ్మలను

వెలిగిస్తుంది వెన్నెల

నీ దిగులు జ్ఞాపకాల్లా…

నాటినుండి నేటివరకు

నాటినుండి నేటివరకు

 ను
  స
   రి
    స్తూ
     నే
వున్నా
నిన్ను

నువ్వు చేయమన్నదల్లా
చేస్తూనే వున్నా
నువ్వు చూపిందల్లా
చూస్తూనే వున్నా
నువ్వు చెప్పిందల్లా
వింటూనే వున్నా

జీవితం అనే ఈ నాటకం లో అందరం పాత్రధరులం ...

జీవితం అనే ఈ నాటకం లో అందరం పాత్రధరులం ...


మనల్ని నడిపించేవాడు ఆడించేవాడు ఆ సూత్రధారీ మాత్రమె...

మనం వేసే పాత్రల గురించి.... వాటి ప్రవర్తన గురించి....మన జీవన నాటకం లో ప్రతి అంకం గురించి చివరికి అంతిమ అంకం దాకా  కూడా తెలిసిన వాడు మనకి ఎందుకు ఇన్ని ఆలోచనలిచ్చాడు???

తను ఆడమన్నట్లు ఆడి తీరవలసిన్దేగా???

మరి ఎందుకు మనకి నిర్ణయాలు...ఆలోచనలు...వివేకం...బుధి....ఇవన్ని అవసరమా???

అసలు మనసెందుకు ఇచ్చాడు  దేవుడు??.....మనుషులు మనసులతో ఆడుకోడానికా లేక తనే ఆడుకోడానికా??

ఏమో .....

నాకైతే అదే అనిపిస్తోంది....ఇదంతా జగన్నాటక సూత్రధారి నవ్వుకోవడం కోసం తన వినోదం కోసం ఆడే నాటకం.

మనం అందులూ పాత్రదారులం ....మన పాత్ర మనం సక్రమంగా పోషించాలి....అంతే 

నేను ఎవరని ఎవరడిగినా...

కనులు మూసినా..
కలలో వున్నా....
అంతా నువ్వే
కనులు తెరిచినా...
చుట్టూ ఎవరున్నా ఏమున్నా....
నాకు కనిపించేది నువ్వే
నేను ఎవరని ఎవరడిగినా...
నేను చెప్పే సమాధానం.. నువ్వే

నిన్ను చుసిన క్షణం........మదిలో మెరిసిన సుందరస్వప్నం

నిన్ను చుసిన క్షణం........మదిలో మెరిసిన సుందరస్వప్నం

నీవు పలికిన తోలి పలుకు.......నా హృదయం లో కురిసిన స్వాతి చినుకు.....

నీతో నడిచిన తొలి అడుగు.....నా గుండె రహదారి పై వేసిన ప్రతి అడుగు....

నీవు పిలిచిన తొలి పిలుపు ......నాలో కలిగిన మైమరపు.......

 నీవు పంచిన ఆత్మీయత......నాలో చిలికిన అభిమానం.........ఇప్పటికి నాకు గుర్తే......
కానీ ,...
నీవు లేని ఈ క్షణం....
    నేను చేస్తోన్న నిరీక్షణం....
               నీవు అందించిన స్నేహ హస్తం.....
                    ఇప్పటికీ కాదు...
                      ఎప్పటికీ నాకు గుర్తే.......

నీవు లేని ఈ వేళ...

మది లో వీచిన మలయమారుతం లా స్పృసించే నీ నవ్వు... మనసులో మధురానుభూతులు మేల్కొలుపుతుంది ......

కాని...

నీవు లేని ఈ వేళ...

నా ఎద లో మెరిసే నీ చిరునవ్వు....

అమృత వర్షం లా  కురిసి...నన్ను బ్రతికిస్తున్నది....












14, జనవరి 2011, శుక్రవారం

ee sankranthiki nenu design chesina greeting

nvuu

about me:
 
నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు
గంటలైనా క్షణాల్ల గడిచిపోతవి
నా కళ్ళు నవ్వగలవని
నా పెదాలు మాట్లాడగలవని
నాలోను చైతన్యంవుందని
అప్పుడే తెలుస్తుంది......

గుప్పెట జారిన ఇసుకలా కాలము
కరిగే కలలా జారిపోతుంది
వెళ్ళోస్తానంటూ నువ్వు బయలుదేరుతావు
వద్దంటూ నిన్ను పట్టి ఆపాలని నా హస్తం
అప్రయత్నంగా నీకు టాటా చెబుతుంది....

బ్రతుకు బాటలో నీవు బాటసారివవుతావు
నేను మాత్రం అభిసారికనై 
నిన్ను కలిసే మరో రోజుకై
నేటిని నిన్నగా మార్చే రేపుకై
ఎప్పుడు మాట్లాడుతావని చూసే  రేపటి నీ రాకకై
"నా" నీకొసం నిరీక్షిస్తుంటాను "నీ" నేస్తాన్నై.....!!!!!! 

సంక్రాంతి శుభాకాంక్షలను

సంకురాతిరి
డిసెంబరులో జననం
జనవరిలోనూ సాగే పెద్ద సంబరం
పురులు నిండిన ధాన్యపు రాసులు
చకచకసాగే దాళ్వా పనులు
పూదోటల ఘుమఘుమలు
చిక్కటి మంచువానలు
చలిపులి గజగజ
చలిమంటల భగభగ
సంకురాతిరి
తెలుగింటికి వెలుగులు
ఇంటి ముంగిట రంగవల్లులు
గొబ్బిమ్మలు – పూలు
గోవింద గోవింద
హరిదాసుల సంకీర్తనలు
అమ్మగారికీ దండం పెట్టు – అయ్యగారికీ దండంపెట్టు
గంగిరెద్దుల విన్యాసాలు
కొత్తల్లుళ్లతో ఇల్లంతా కళకళ
మనవళ్లు – మనుమరాళ్ల ముద్దుమురిపాలు
సంకురాతిరి
అరిసెల ఘుమాయింపు
నేతి అరిసెలు – నూనె అరిసెలు
నువ్వులద్దిన అరిసెలు
బెల్లపు అరిసెలు – పంచదార అరిసెలు
సంకురాతిరి
భోగిమంటలు – పాతకు పాతర
తలంట్లు – కొత్త బట్టలు
సంకురాతిరి
పాల పొంగులు – పొంగళ్లు
ముద్దపప్పు – కమ్మాని నెయ్యి
గారెలు – సున్నండలు – కజ్జికాయలు – కారప్పూసలు
పనివాళ్లకు వితరణలు
ఊరంతా సందడి – వీధివీధిన కళారవళి
సంకురాతిరి
మూడోనాడు కనుమ – అది పశువుల పండుగ
తెప్ప తిరునాళ్ల – సాయంత్రం వేళ గొప్ప సందడి
సంకురాతిరి – క్రాంతి – సంక్రాంతి  శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను...

12, జనవరి 2011, బుధవారం

konni

జీవితం ఒక ఆశా కిరణం ..

  కటిక చీకటిలో కూడా వెలుగు రేఖగా మారగలదు..!!

సుఖదుఖ్ఖాలు గాలిమేడల్లాంటివి..

  అంతలోనే అవి నిలుస్తాయి ..కొంతలోనే కూలిపొతాయి..!!

నీకంటూ ఏమి లేదనీ ఏనాడూ అనుకోకు

  ఈ ప్రపంచంలో ఏదీ  కూడ ..ఎవరి సొంతమూ కాదు..

అంతా కూడా మనదే కలిసే అనుభవించు..!!














నీ చిరుమందహాసం  నా జీవన ధరహాసం..

 నీ స్నేహ స్పర్శ  నా తనువు కర్మం..

నీ వెలుగు ధార నా బతుకు నావ..

 నీ అంతిమ చరణం నా అస్తమయ కిరణం..

నీవు లేని చోట నా జీవితమే లేదు..









విడిపోయే బంధమైతే మరి ముడివేసిందెవరు ??

   మనప్రేమ నిజమైతే మరి విడదీసిందెవరు ??

కడ దాకా కలిసుంటే నిలదీసేదెవరు ??

     ఈ పాషాణ హ్రిదయాన్ని కరిగించిందెవరు ??

కోటి ఆశల కలల సౌధాన్ని కూల్చేసిందెవరు ??

   దారుణంగా దారులు వేరు చేసిందెవరు ??

కలకంఠి కన్నీరు ఒలికించిందెవరు ??

    ఈ ఒంటరితనంలో ఓదార్చేదెవరు ??

మూసిఉన్న మనసు ద్వారాలను తెరిపించిందెవరు ??

    ఈ కళ్ళకు ఆశలపరదాలు కట్టిందెవరు ??

  కవితలల్లితే కలవరం దూరమౌతుందా??

దూరాన వీక్షించే తీరం నీ దరికొస్తుందా??











గతించిన జీవితంలో నా గతం నువ్వు..

    ఊరించే భవిష్యత్తు లో గుణపాఠం నువ్వు..

తెలిసీ తెలియని ఆలోచనల ఏమరుపాటువు నువ్వు..

    ఆత్మవిశ్వాసం తో నే వేసిన తప్పటడుగు నువ్వు…

వ్యర్ధం కానియ్యను నా జీవిత పుస్తకం లో నీ పేజిను ..

సరిదిద్దుకుంటాను నన్ను నేను ..









ఓ ప్రేమా ఇలా మోడు గా మారుస్తావనుకోలేదు..

   చిగురిస్తున్న ఆశల్ని చూసి వసంతం అనుకున్నాను..

 ఉధ్రుతమైన సుడిగాలివై మనసు విరుస్తావనుకోలెదు..

మరో నవోదయాన్ని హ్రిదయ ఫలకం మీద లిఖిస్తావనుకున్నాను..

  పిరికితనంతో  గుండెచీలుస్తావనుకోలేదు …

 అడుగులో అడుగువై గమ్యం చేరుస్తావనుకున్నాను..

  విష సర్పానివై నిండు జీవితాన్ని   కాటేస్తావనుకోలేదు  …















కుదురు లేని మనస్సుకో ఆధారమై..

 తడబడె ఆడుగులకు ఒక  సాయమై..

గమ్యాన్ని చూపే దిక్సూచివై..

 గాయాన్ని మాపే స్నేహానివై…

పరిపూర్ణతనిచ్చే ప్రణయానివై..

  ప్రేమను పంచే ఒక తోడువై..

చిరకాలము వీడని ఒక బంధమై…

 ఏడడుగులు నడచి…మూడుముళ్ళు వేసి…మరి ఉంటావా నా వాడివై.. ??  

  మాట తప్పని నా చెలికాడివై…








10, జనవరి 2011, సోమవారం

premalekha

అప్పుడెప్పుడో రాసుకున్న ప్రేమలేఖ గుండె కు గుర్తొచ్చింది.

ఆనాటి లేఖలో కొంత బాగం ఇలా కదిలొచ్చింది. 
——————————
ప్రియమైన నీకు,
ఎక్కడ మొదలెట్టను? 
….
ఈ కాస్త సమయంలో నాలో ఎన్నెన్ని భావాలని! ఏమిటవి అంటే, ఏమని చెప్పను? ఎన్నని చెప్పను? అసలెక్కడ మొదలెట్టను?
 
ఇదిగో, నీతో మాట్లాడాలని ఫొన్ చేతిలోకి తీసుకోని బాల్కనీ లోకి గానే
హడవుడిగా వచ్చే వాన చినుకులు స్వాగతం చెప్పాయి, అచ్చూ నీ జ్ఞాపకాల్లా.
నన్ను బలంగా తాకి ముందుకి పోయిన వర్షపు గాలి తాలూకూ మట్టి వాసన.
నీ నంబరు డయలు చేయబోతుండగా అనిపించింది.
“నా లోని భావాలను నీకు చెప్పటం కన్నా, నాలో దాచుకోవటమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందేమోనని.”
ఊహూ, కాదు కాదు, నీకు చెప్పాలి, కానీ ఫొన్ లో కాదు. అందుకే …
ఇలా కాగితం పై పరిచేసిన ఈ అక్షరాలు,

నాలో కదిలే అనుభూతుల క్షణాలు;
ఉదయం కాస్త ఆలస్యంగా చలి దుప్పటిలోంచి బద్దకంగా బయటకు వచ్చే సూర్యుడు,

చిరు వర్షం రాగానే పరిగెత్తే పిల్ల కాలువ,

మళ్ళీ గోధూళి వేళ పశ్చిమాన పరచుకొనే సంజ కెంజాయపు  రంగు,

వెన్నెల రాత్రిలో కదిలే కొబ్బరాకు క్రీనీడలు,

వీటన్నిటిలోనూ మైమరిచిపోయె నన్ను తట్టి లేపే మంచు గాలి;
….
ఎలా చెప్పను నీకు, నిన్ను చూసిన క్షణం నాలో ఇన్ని భావాలు ఒక్క సారిగా ముప్పిరిగొంటాయని,

ఎలా చెప్పను నీకు, నిన్ను చూసిన క్షణం నాలో నాదం ప్రణవిస్తుందని,

ఎలా చెప్పను నీకు, నిన్ను చూసిన క్షణం నాలో వేదం ప్రభవిస్తుందని,
మా ఇంటి టెర్రెస్ పైనుండి చూస్తే, ఒక పక్క బీచ్ రోడ్డు, కాస్త దూరంగా
సముద్రం, ఇంకాస్త పైన వెలుగు నీడల క్షితిజ రేఖ. నా చూపులతో పాటు
పరిగెత్తుకు వచ్చే ఒంటరి నక్షత్రం. తాకనా వద్దా అన్నట్టుగా కొద్ది కొద్దిగా
వణికించే చలిగాలి. ఇంకా నాకు తోడుగా నీ జ్ఞాపకం.
ఆన్నట్టు-
“నువ్వు నాకు గుర్తొస్తే , నా పక్కన ఎవరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప,

నువ్వు నా పక్కనుంటే, అసలు నేనే ఉండను, నువ్వు తప్ప!”
ఏమంటారు ఈ అనుభూతిని?  
నేటి ఒంటరి తనంలో నిన్నటి దగ్గరితనం మాటిమాటికీ గుర్తొస్తుంది-

నిన్నటి దగ్గరితనంలో,మరెప్పటిదో ఒంటరితనం,
ఎలా చెప్పను నీకు ఈ అనుభవాన్ని?

జీవితాన్ని గెలిచే ప్రయత్నంలో, నన్ను నేను కోల్పోయాను. అలా కోల్పోయిన
“నన్ను” నీ దగ్గర వెతుక్కునే ప్రయత్నం ఇదంతా. నా విజయం తాలూకూ
ప్రతిబింబాల్ని, నీ అభినందనపూర్వకమైన చిరునవ్వులో చూసుకోవాలని ఆశ
పడుతున్నాను.
ఎలా కోరను, నిన్ను ఈ వరాన్ని?
ఇన్నాళ్ళుగా ఎదురుచూసిన స్వప్నం ఒక్కసారిగా ఎదురు పడితే,
నేను; ఏం చేయాలో తెలీక    
అడుగులు తడబడి,

ఆడలు కడబడి,

మతి చెడి, విరి జడి,

మది నే విడివడి,

మనసై కలబడి,

మదనుని పాలబడి,



మదిలో నీ సడి,

మాయని సవ్వడి,
అందుకే,
అడలు కడబడి,

అడుగులు తడబడి…
   

… ఎలా వినిపించను నీకు, మనసు పలికే మౌన గీతాన్ని?
నిన్ను చూసిన తర్వాత మళ్ళీ నిన్ను గుర్తు చేసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. అసలు మర్చిపోతే కదా, గుర్తు చేసుకోవడానికి.
నీ జ్ఞాపకం నాకు తోడుగా లేనిది ఎప్పుడని?

అందుకే, నా కల కూర్పుగా,

నీ జ్ఞాపకాల సాక్షిగా,
“నేడే తెలిసింది,

ఈనాడే తెలిసింది,

కమ్మని కలకే రూపం వస్తే,

అది నీ లాగే ఉంటుందనీ….”
ఇలా ఇంతసేపూ నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, నా అనుభూతి తాలూకూ గాఢత నీకు తెలీకపోతే;
నా ప్రేమ లోని నిజాయితీ లో ఎక్కడో లోపం ఉన్నట్టు!”
అవునా, అందుకేనా ఇంత మౌనం. అలా కాకపోతే,

రా! ప్రియతమా,

నువ్వు వస్తావని,

వచ్చే దారంతా,

అనుభూతులతో పరిచి

ఆశల దీపాలు వెలిగించి ఉంచాను.
నీ నిర్ణయం తో

నా కలలని “కళ్యాణి” రాగం ఆలపించమంటావో,

లేక

నా కళ్ళని “మేఘమల్హర్” రాగం ఆశ్రయించమంటావో !
ఎదురు చూస్తూ ,

నీ

నేను.

naaku nachinavi

నా  హృదయ  నందనవనంలోని  వసంతమా,
నా వలపు  తోటలోని  సాహిత్యమా,
నా  పెదవి  పాడే    మౌన గితమా,
నన్ను   వెంటాడే   ఓ  నా   కళల  బంధమా,
నన్ను  రచిచపజేసేయ్  ఓ  నా   అక్షర  అలంకారమా  ,
నన్ను  గమనించే   ఓ  ప్రకృతి   నేస్తమా




నిలదీసే నా మనసుకు తెలుసు
నను వదలని నీ తలపుల విలువ......
నిదుర లేని నా కంటికి తెలుసు
నిను చూడలేని ప్రతి క్షణముల విలువ......
అడగలేని నా అడుగుకు తెలుసు
కడకు రాని నీ కదలిక విలువ......
మాట రాని నా మౌనానికి తెలుసు
నను చేరని నీ మాటల విలువ......




జననమెందుకు .....
ఉన్న మనిసి కి మనసే లేదు....
రాని మార్పుకు మూర్తమెందుకు ?
మనసు లోపల మమతే లేదు....
మేమున్నామంటూ మాటలెందుకు ?
సాయం చేసే మనసే లేదు....
పెట్టెల నిండ డబ్బులెందుకు ?
చేసే పనిలో స్పష్టత లేదు....
రాత్రి కలల్లో మేడలెందుకు ?
నిజాయితీకి కాలం లేదు....
అది ఉన్న వాడికి జననమెందుకు ?
ఆలోచనలో అందం లేదు....
దేహం పైన రంగులెందుకు ?
డబ్బు నీడలో తీరిన దాహం,
దారంతా నీ తోడుంటుందా....?
తోడుంటే నీ బతుకు ప్రయాణం,
తీరం చేరుట వీలవుతుందా....?
తీరం అంటే మరణం కాదు....
మరణం అయినా అమరం చూడు......




ఎన్నో ఆలోచనలు…..గతకాలపు జ్ఞాపకాలు….
అక్షర రూపం ఇద్దామంటే పదాల అమరిక
పరుగిడిపోయింది అందనత దూరంగా ….
పాటలా పొందుపరుద్దామంటే …
పల్లవే కుదరనంది…..మరింకెలా రాసేది పాట?
గమకాల్లో అందామంటే గొంతు మూగబోయింది….
నీవు లేవన్న నిజాన్ని తట్టుకోలేక……!!!





కల ఒక జ్ఞాపకం
గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది
జ్ఞాపకం ఒక కల
నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది
కలలాంటి జ్ఞాపకం
జ్ఞాపకం లాంటి కల
నువ్వే....

నువ్వెవరో...
అనుక్షణం వెంటాడుతుంటే నా నీడవనుకున్నాకున్నా
కానీ నీదయిన రూపం నీకుంది..నీకు దయలేదు..
నీ హ్రుదయం బండరాయి..
నీ ఒక అందమైన రాక్షశివి
ప్రతిక్షణం నీ ఆలోచనలే చుట్టుముడుతుంటే
కించిత్ ఆలోచనలేని నీవు
నువ్వే నా మనసనుకున్నా
కానీ నీకేన్నో జీవితాలున్నాయి
నా నీడవు కాక నేను కాక ..నీకెన్నో

వేకువఝామున నిద్దుర లేపే పిల్ల తెమ్మెర నువ్వే
నా ముంగిలి తాకే తొలి సూర్యకిరణం నువ్వే
నా కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళం నువ్వే
రాత్రంతా నన్నల్లరి పెట్టే వెన్నెల నువ్వే
కానీ నేనే
నీకేమీ కాను....అంటున్నది నువ్వే 



ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా

ఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా

పోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలని

కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలని

చెరిగిపోయిన చిరునవ్వుని నీ చెలిమితో మరలా చిత్రించాలని..

ఎన్ని ఆశలో తెలుసా...... ఎన్ని ఆశలో తెలుసా.....





గుండె గొంతు విప్పింది


జ్ఞాపకాల మాలిక,


గుండె గొంతు విచ్చింది


గాయాలే నాకిక
కనులు కనులు కలుసుకుంటే


కాలం జ్ఞాపకాల వారధి గా,


కనుల కలలు నిలువకుంటే


కలం గాయాలతో వరదే గా
నీ కన్నుల్లో నేనుంటే


ఆనందం అనంతం,


నీ కన్నుల్లో నీరుంటే


ఆవేదన అనంతం
నా మదిలో నిరంతరం


నువ్వు వెన్నెల్లో ఆడపిల్ల,


నీ మదిలో నే, ఈ అంతరం


నాలో వేదననూ చూడవేల
కౌముది కోసం అనాదిగా


ఆగదు సాగర ఆరాటం!


నీ మది కోసం అనాధగా


సాగును జీవన పోరాటం!!














కాలమా..నీవెంత కఠినమో..

కడ దాకా ఎవ్వరినీ కలిసి ఉండనీయవు..

క్షణ క్షణము ఏమౌనో తెలియరానీయవు..

కొత్త కొత్త బంధాలెన్నో కలుపుతోంది నీవు..

అనుబంధాలన్నిటినీ చెరుపుతోంది నీవు..

కష్టమైన వాళ్ళతొనె కుదురుగా ఉండంటావు..

కోరుకున్నవారందర్ని దూరం చేస్తుంటావు..

చిక్కుముడి వేసి జీవీతాన్ని ఆస్వాదించమంటావు..

















పోట్లాట కూడా…నీతో అయితేనే హాయి …

   కోపం తో కొట్లాడుకున్నా    …నీ సమక్షం లో నే సంత్రుప్తి 

నీ ఉఛ్వాసనిశ్వాసాలే తెలియని ఓదార్పు…

       ప్రతి అడుగులో నీ తోడుంటే  చావునైన  జయించగలనన్న ధీమా…

నీ చల్లని స్పర్శే నా మానసిక శాంతి  …

     నీవు నా లో లేని రోజున నేను లేను…..

అందుకే ఆ రోజు నా జీవితం లో రాకుండా… గమనాన్నే మార్చేస్తాను…

      నిన్ను ఒక అనుభూతిగానే నా గుండెల్లో మలచుకుంటాను….













యుగాలుగా మారాయి నీ కోసం ఎదురుచూస్తుంటే..

కొద్ది క్షణాలే అయిన …

      కాలం గడ్డ కట్టిందా అన్నట్టుంది ఆలోచిస్తుంటే…

     నిముషాలు కరుగుతున్నా కూడా…

అక్కడితో ఆగిన మన ప్రయాణం ఎక్కడ పూర్తి అవుతుందో …

   కలుపుతుందా రాబోయే కాలం వేరైన ఈ దారుల్ని ??

లేక విడదీస్తుందా నిర్దాక్షిణ్యంగ రెండు హ్రిదయాల్ని ??