దాచుకోలేక....
తెలియని ఆనందాలను పంచే నీ స్నేహపు హృదయం,
నా మదిలో చీకటిహృదయానికి ప్రేమను ప్రకాసింపజేసిన ఉదయం.
తెలియకుండానే నీ స్నేహంలో ప్రేమను ఆశ్వాదించడం మొదలుపెట్టను.
తెలియజేయలేక నీకు నా ప్రేమను, నా మనసులోనే మధనపడ్డాను.
గుండెలో నుండి జారే కన్నీళ్ళను నీ స్నేహపు ఆనందాభాష్పాలని ఇంకెన్నాళ్ళు చెప్పాలో,
పగిలిపోతున్న హృదయాన్ని అదిమిపెడుతూ పెదవిపై చిరునవ్వును ఇంకెన్నేళ్ళు పొందుపరచాలో.
నేస్తమా నీవే నా మనసులో నిండిన ప్రేమవని ఎలా తెలుపను.
స్నేహమా నీవే నా జీవిత సర్వస్వం అని ఎలా తెలియజేయను.
ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,
స్నేహమే అని మోసంచేస్తూ ప్రేమను దాచుకోలేక.
ప్రేమిస్తున్నానుఏమని చెప్పను ఎందుకు ప్రేమించవంటే,
నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!
ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!
గడిచిపోతున్న కాలాన్ని, కనులలో దాచుకున్న స్వప్నాలని కూడ మర్చిపోయేంతగా
నా అలోచనలలో ఒదిగిపోయావనా!!!
ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!
ఒక్కమాటలో చెప్పలంటే-
"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".
అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".మూగ మనసుతెలవారుఝామున నీ కనుల గుమ్మం ముందు నిల్చొని
నీకు చిరునవ్వుతొ శుభోదయం తెలుపాలని.
నీవు నడిచే ప్రతిదారిలో నీ పాదాలు కందకుండా
నీకు పూలమార్గం వెయ్యాలని.
నీవు పొందే ప్రతి ఆనందంలో,
నీ చిరునవ్వునై నీ అధరాలపై నిలవాలని.
ఆలోచనలతో అలసిపోయిన నీ మనసుకి,
ఏకాంతంలో నేను జ్ఞాపకం కావాలని.
నా ఆలోచనలు మొదలైన మరుక్షణం,
నీ కనుపాపల నుండి జారే కన్నీరు నవ్వాలని.
అలసిపోయి నిదురించు వేళ,
నీకు ఆనందాలను అందించే కలగా మారాలని.
కనులనిండా కన్నీళ్ళతో,కలల నిండా ఆశలతో ఎదురుచూస్తున్నా,
కనీసం రేపైనా నా యీ భావాలని నీకు తెలుపాలని.మన్నించు ప్రియ
ముసుగుకప్పిన నీ మాటాల తెరచాటున,
బయటపడలేక బంధించబడ్డ భావం ప్రేమ కాదా?
తడి ఆరని నీ కనుపాపల మాటున,
మసకబారిన నా రూపం దాచుంచడం ప్రేమ కాదా?
ప్రేమలేదని చెప్పే నీ మాటలతో,
నీ పెదవి ఒణుకు ప్రేమ కాదా?
గెలవలేమని తెలిసి నీ గుండెదాటని,
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?
తలిదండ్రులు మన ప్రేమకు కంచెలు వేస్తుంటే...
అది దాటిరాలేక దుఖంలో నీవు,
నిను చేరుకోలేక చేతకాని వాడిలా నేను......
జీవితాంతం ప్రేమలేని ప్రాణులుగా బ్రతికేద్దాం....
ఒంటరిని
ఏం మాయ చేసేవే నా గుండెకి,
నను వీడి చేరింది నీ గూటికి.
ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.
ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.
ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.
ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి