28, ఫిబ్రవరి 2011, సోమవారం

నిజమయిన ప్రేమ ఆకాశానిదే అని...


నా ఈ గుప్పెడు గుండె లో సముద్రమంత ప్రేమ
అందులో ప్రతీ భిందువు ప్రేమే
ఆకాశం ఆశగా చూస్తుంది నా ప్రేమ కావాలంటు
కాని ఆకాశం అందదే , ఎలా ఇవ్వాలి నా ప్రేమను
గుప్పెడు గుండెను కాస్త కరిగించాను
సముద్రమంత ప్రేమ లో ఒక్క బిందువు భాష్పం అయింది
అకాశాన్ని అందుకుంది
ఆకాశం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది
ఇంకాస్త ప్రేమ కావాలంది
ఆకాశం ఆనందం చూసిన నేను
నా గుండెను ఇంకాస్త కరిగించాను
మరింత ప్రేమను అందించాను
అకాశం ఇంకాస్త ఆనంద పడింది
అల అలా నా సముద్రమంత ప్రేమని మొత్తం ఇచ్చేసాను
ఇక నాకెం మిగిలింది ఇక అన్న బాధతో
నా గుండె వైపు చూసాను
అద్భుతం, ఆశ్చర్యం
ఇంకాస్త పెద్ద సముద్రమంత ప్రేమ నాలొ ఉంది
అప్పుడు అర్ధం అయింది
నేను ప్రతీసారి ఇచ్చిన కొంత ప్రేమకి
ఆకాశం మరింత ప్రేమ వర్షం రూపంలో ఇచ్చింది అని
నిజమయిన ప్రేమ ఆకాశానిదే అని

bagunnaai


నీ నవ్వుల వెల్లువ చూసే
నా హ్రుదయం స్పందిస్తుంది
నీ అడుగుల సవ్వడి తోటె
నా ప్రాణం స్వాసిస్తుంది
నీ చల్లని చూపులు తాకే
నా పెదవులు వికసిస్తొంది
నీ మాటల మధురిమ తోటే
నా అణువణువూ పులకిస్తొంద
వీటన్నిటికి దూరంగా నేను
ఊహించటమే చాలా కష్టం
నా కన్నీటికి పని కల్పించే
అవివర్ణ ప్రాణ సంకటం





నేను నేనుగా లేని నాలో నిలిచిన నీతో
నా లో నీ లా నేను కూడా నీలొ ఉన్నానా అని అడిగితే
మౌనమే నీ సమాధానమైతే
మౌనం అర్ధంగీకారమనుకునేనా
అసలు అర్ధవంతమైన అభిప్రాయమేదీ లేదనుకునేనా!
 
ఎటు చూసినా నీవే కనిపిస్తున్నా
 నీ చెంత లేదనే భాధ ఎందుకని
నా మనస్సు ని ప్రశ్నిస్తే
ఎంతైనా అది ఊహేగాఅని తిరిగి ప్రశ్నిస్తే
నీ సమాధానం కోసం ఎదురుచుస్తున్నాను
కోటి వరాల ఆ సంతోషం కోసం నిరీక్షిస్తున్నాను




నిన్ను చూసినప్పుడు తప్ప
నా కన్నులు చూసేది శూన్యం

 నువ్వు విన్నప్పుడు తప్ప
నా పెదవి పలికేది మౌనం

నీ మాట మధురిమ తప్ప
నా చెవిని చేరేది నిశబ్ధం


నీ చల్లని చూపే తప్ప
నను తడమదు ఏ స్పర్శ

నీ పెదవికి చిరునవ్వు తప్ప
నా మనస్సు కు లేదానందం

నువ్వుండే ప్రాంతం తప్ప
నాకేదీ వేరే స్వర్గం…




ఏవరు నువ్వు

స్వప్నం లో కనిపించి నిదురలేపినావు
నవ వసంత కోకిలవా

సంవత్సరం వరకు వేచిచూడాలేమో
పున్నమి వెన్నల జాబిలివా

పక్షం రోజుల వరకు రావేమో
అందమైన సంధ్యాసమయానివా

పన్నెండు గంటలు గడపాలెమో
మిరుమిట్లు గొలిపే మెరుపువా

క్షణ కాలమే కనిపిస్తావేమో
ఎండమావి లోని నీరువా

ఎప్పటికీ కనిపించవేమో






మోయలేని ఈ మాయ హాయిని
కనుల క్రింద కలల వాకిలిలో
బంధించాలని కనులు మూస్తే
మూసుకుంది కనురెప్పలే కాని
విచ్చుకుంది నా హ్రుదయ నేత్రం
ఇంద్రధనస్సు రంగులలో
వర్తమానం భవిష్యత్తు
కలగలిపి కనిపించే క్షణం
చిరుధరహాసానికి కారణం
తర్కించలేని తరుణం
చిలిపి ఊహలకు బంధనం
వేయలేని నిస్సహాయం
మౌనంలో మాటలు వినిపించే వైనం
మాటలలో అమృత భాండాగారం
శూన్యం లో వెన్నెల సాక్షాత్కారం
వివాహ సుముహూర్తానికి ముందు
వివాహ నిశ్చయానికి తరువాత
అనుభవించే అనుక్షణం ప్రీతిప్రాయం
అద్భుతం అమోఘం అనన్యం అసామాన్యం
అవివర్ణం అనిర్వచనీయం అసాధారణం
నిర్వ్యక్తం నిగూఢం నిత్యనూతనం
ఆ సుందర సుమధుర క్షణం

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

bagunnai


నీ కోసం ఎదిరి చూస్తూ ఉంటాను ...
నువ్వు రావని తెలిసిన....
నిన్ను చూస్తూనే ఉంటాను ..
నువ్వు నా ఎదుట లేకున్నా ..
నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను ..
నీకు నేను గుర్తుకురాకున్న ...
నిన్ను నా మనసులో కొలువు0చుతాను..
నా హ్రూధయాన్ని నివు గాయపరిచినా ....
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను....
నీవు నన్ను విడిపోయిన ......
నీ అనుకునే నేను..




నీ కై తపనలో  వెదుకులాటలో
ఎక్కడో నన్ను నేను పారేసుకున్నాను
జీవితాన్ని చే జార్చుకున్నాను
ఇప్పుడు అంత శూన్యం
నాకు నేను మిగలకుండా ఎందుకిలా.....?
ఒక్క నీ కోసం చాల పోగుట్టుకున్న
నాకు ఎందుకింత ఆశ....?
నీ కన్నుల వెలుగులతో నా జీవితాన్ని నింపుకోవాలని
నా కనుఉల లోగిలిలో నిన్ను బందిచాలాని






మనసు లో వున్న భాద............
నిన్ను వదిలేక్షణం నాకు అర్థం కాలేదు
ఏమి జరుగుతోంది మరుక్షణం అని.
ఏముందిలే పక్కన ఉండదనే భాద తప్ప
నాలోనే వుంది గా అన్న ఊహతో బ్రతికేద్దామనుకున్న.
కానీ అప్పుడు తెలియలేదునాకు..
బ్రతకడానికి ఊహా వుంటే చాలదు..
ఊపిరి వుండాలి ఆ ఊపిరినే వదిలేస్తున్నఅని.
ఒక్కసారి జారవిడిచాక పొందటానికి
నువ్వేమి ఒక వస్తువు కాదు మరి నిన్నుపొందాలంటే?
నా ప్రాణాలని వదిలేయటం తప్ప ఏమి చేయగలను.....




ప్రేమ చూడడానికి రెండక్షరాలే కానీ ఈ మానవ మనుగడనే శాసించే ఆయుధం ప్రేమ...
అమ్మ పేగు బంధాన్నిరుచి చూసి కళ్ళుతెరవడం తో మొదలైన ఈ ప్రయాణం
ప్రేమ అనే ఒకే ఒక్క తియ్యని ఆలోచనలో సాగిపోతుంది.....
అమ్మ పెట్టె ముద్దలో ప్రేమ
నాన్న కొట్టే దెబ్బలోను ప్రేమ.
ఇలా మొదలైన ఈ జీవితం లో
అదే ప్రేమ అనే ఆలోచనవల్ల వచ్చే నరకం అనే బాధ ఎలావుంటుందో నీకు తెలుసా?
మగువ / మగవాడు అనే రూపంలో వుంటుంది.
అమ్మ నాన్న ప్రేమ లో వున్నంత సంతోషం
నువ్వు నేను ప్రేమ లో వుండవు...
మగువ / మగవాడును ప్రేమిచడం తప్పు కాదు కానీ
ఆ అతని /ఆమె  కోసమే ఈ జీవితం అన్నంత గా ప్రేమించడం తప్పు.
ఆ భ్రమ లో పడి తనువుని సైతం చాలించడానికి సిద్దపడే ఓమగువ/మగవాడు ...నీకో విషయం తెలుసా!
నువ్వు జీవించే ఈ జీవితం నీది కాదు రా..
రక్తం పంచిన అమ్మది రక్తం ధారపోసి పెంచిన నాన్నది..
అలాంటప్పుడు వాళ్ళ ఊపిరిని తీసే హక్కు నీకెవరిచ్చారు ..
అమ్మ నాన్న కు నువ్వే ఊపిరి నీ ఊపిరి ఆగితే నీకంటే ముందు పోయేది వారి ప్రాణమే....తెలుసుకో...






నీ మనసు లో మాట........
మనసు లో మాట కాదది గుండెలో రగిలే జ్వాలది..
ఆ జ్వాలంత ఒక్క సారిగా వెల్లువైన క్షణాన
నువ్వడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానమే లేదే...
నేను లేకుండా నువ్వెలా బ్రతక గలుగుతున్నావు అని అడిగితే
నా లో వున్న నీ ప్రేమ బ్రతికిస్తుంది అని చెప్పగలను.
ప్రేమ వుంటే చాల నేను ఉండక్కర్లేద అని అడిగితే
నా లోనే నా తోనే నువ్వెప్పుడు ఉంటావన్న నమ్మకం చాలాని చెప్పగలను.
అదే నువ్వు, నువ్వు కంట నీరు పెడితే అమ్మనైన మరిచి నీతో నే నడిచొచ్చే దానిని కదా రా
ఎందుకు నన్నిలా వదిలేసావు అని అడిగిన క్షణాన, నా నోట మాటే కాదు నా గుండె చప్పుడే ఆగిపోయిందే.






నిన్ను చుసిన నా మది పలికిన మాటలు.....
నిన్ను చూసిన క్షణం చుట్టూ శూన్యం , ఒక్క నీ అందాల మోము తప్ప.
నీ ఫై ప్రేమ పుట్టాక జగమంతా శూన్యం , ఒక్క నువ్వు అనే ఆలోచన తప్ప.
నీ వైపు అడుగులు వేసాక నేనే శూన్యం , ఒక్క నాలో వున్న నువ్వు తప్ప.
నిన్ను తలచిన ప్రతిక్షణం నా మనసంతా శూన్యం ,ఒక్క నీ మీద వున్న ప్రేమ తప్ప.
నీ ఫై నా ఈ ప్రేమను చెప్పాలని వుంది కానీ నువ్వు కాదంటే?
ఆ ఆలోచనే నా ఊపిరిని శాసిస్తుందే.
అలా అని నిన్ను వదిలి వెళ్ళే ధైర్యం నాకు లేదు..
అందుకే నీ నీడై నీ వెంటే వుంటూ నీ ప్రేమను గెలవాలని.......
ఈ జన్మకైనా కాకున్నా, మరుజన్మకైనా కాకున్నా, ఏనాటికైనా నీతో నే జీవించాలని తపనపడే నీ ప్రేమికురాలు






ఈ జీవితం లో ఎన్నో పేజీలు ,ఆ పేజీల్లో ఎన్నో కొట్టివేతలు, కొన్నే ఆణిముత్యాలు..
అలా కొన్నే ఆణిముత్యాల కోసం ఎన్ని భరించాలి ఎంత వేచి చూడాలి..
ఎంత కాలమైన వేచి చూడటానికి నేను సిద్ధం ....
కాని అలా వేచి చూడటం లో నాలో భయం అనే భావన రాకూడదు...అలా అని
రాబోయే ఆణిముత్యం కోసం సంతోషం గా ఎదురుచూడాలి అనే అత్యాశ లేదు..
కాని ...ఆ ఆణిముత్యం నా పేజీల్లో చేరిన చేరకపోయినా .....
నా జీవితాన్ని నేనే చాలించాలి అనే భావన కలిగించే భయం అనే ఆయుధం మాత్రం ..
నా జీవితం లో రాకుండా వుంటుంది అనే నమ్మకాన్ని ఇవ్వగలరా..
ఇవ్వ లేరు..ఖచ్చితంగా ఇవ్వలేరు...అలాంటప్పుడు..
చస్తూ బ్రతకలేక బ్రతికే ఈ జీవితం నీకు నాకు అవసరమా...
ఇన్ని తెలిసి చేసేదేముంది వాడు అదే ఆటలో, బొమ్మలా ఆడటం తప్పా....
కాని ఒక్కటి వాడు ఎంత ఆడిన ఆడించిన , భయం అనే వాడి ఆయుధాన్ని నీ దగ్గరకి రానివ్వకు నేస్తం.....
భయం అనే పదం లేని జీవితం కోసం ఎదురు చూస్తున్న మీ స్నేహితుడు....

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఇవి కూడ బాగున్నాయి


ఉప్పెనై వస్తావు ఊహలకేమీ మిగల్చక ఊడ్చుకెళతావు
అంతటా నీవే ఆవహిస్తావు ఆసాంతం ఆక్రమిస్తావు
గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెను గాయపరచి వెళుతుంటావు

అయినా నా పిచ్చి గానీ...
నీవు లేనిదెప్పుడనీ నా ఊహల్లో!?
వెలుపల వెలుగై కనిపించేదీ నువ్వే
అంతరాన ఆరని మంటైనదీ నువ్వే!
అంతగా ఆక్రమించావు నన్ను

అయినా అమాయకంగా అనుకుంటాను...
నిన్ను నా గుండె గదిలో బంధించేశానని...
ఇక బయటకు రాలేవని...
నా ఊహలకు అడ్డు రావని...

ఈ కుల మతాల కుట్రకు బలియై పోయాను
చుట్టూ ఉన్న ప్రపంచానికి భయపడి
పిరికి వాడిలా మిగిలిపోయాను నీదృష్టిలో...

పిచ్చి వాడినే కదా మరి..!?
నీ ప్రేమను అందుకో లేక పోయిన కుల పిచ్చివాడిని

అయినా ఏ మంత్రం వేశావో తెలియదు
నా మది తలపుల తలుపులు ఛేదించుకు వచ్చినప్పుడల్లా
నీ ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
ఉవ్వెత్తున ఎగసే అలలై కల్లోలం సృష్టిస్తాయి

లోకం దృష్టిలో నిన్ను కాదనుకున్నా
నా వరకు నెటికీ నీతోనే ఉంటున్నా
బహుశా అందుకేనెమో!?
ఎవ్వరికీ అందంకుండా నాలోనేనే ఒంటరిగా మిగిలిపోతున్నా

కులం గొప్పదా? ప్రేమ గొప్పదా? అన్న చిన్న ఆలోచనవచ్చి అది ఆవేశమై ఏదో రాశేశా..







అరుణుడు అస్తమించేది
వెన్నెల వెలుగును చూపడానికే.....

కడలి ఆవిరైనది తిరిగి
చిరుజల్లై కురవటానికే....

రాలే ఆకులు చెబుతున్నవి
వసంతమై మరలి వస్తామని....

పరుగిడు కాలం తెలుపుతున్నది
మరచిన మానవత్వాన్ని మరల ఆశ్రయిస్తావని....

ఇవి అన్నీ అస్తమయంతో ఆగిపోవు
నవ నవోన్మేషమై ఉదయించే వరకూ ఊరుకోవు ...

గతించిన వన్నీ పునరాగతమౌతున్నవి

పడిన చోటే ఆపకు నీపరుగు
లేచి నడిచావంటే ఉండరు నీసాటి ఇంకెవరూ

అని మరోమారు మనకు తెలుపుతున్నవి .







మనిషిని అని మాత్రమే గురుతుచేసే ఈ లోకం లో ..
ఎవరిని నేను ?
మనసు వుందని వుహించు కున్నాను...
అది స్నేహానికి స్పందిస్తుందని తలచాను ...
మనిషి లో స్నేహాన్ని చూసాను అని అనుకున్నాను....
అది కేవలం ఒ ఆట అని వుహించలేక పోయాను ...
మనసుని పరీక్షించే ఈ లోకాన్ని మరిచి స్నేహ హస్తాన్ని అందుకున్ననని ఆనందించాను ...
మోసాన్ని చూసాను...
మనసుని చంపుకున్నాను....
మౌనంగా మిగిలను...
దూరం గా వెళుతున్నాను

21, ఫిబ్రవరి 2011, సోమవారం

"భగవంతుడు కుదిర్చేది రక్త సంబంధం"


"భగవంతుడు కుదిర్చేది రక్త సంబంధం"
"తలిదండ్రులు కుదిర్చేది వివాహ బంధం" కాని
"మనమంతట మనం కుదుర్చుకునేది జన్మ జన్మల బంధం స్నేహ బంధం"

"భగవంతుడు మన నుంచి ఆశించేది కానుకలు"
"తల్లిదండ్రులు మన నుంచి ఆశించేది వేడుకలు" కాని
"ఏమి ఆశించకుండ నిరంతరం మన గురించి కలలు కనేది మాత్రం స్నేహితులు"

నా దృస్థిలో
"స్వసుఖం గురించి ఆలోచించేది స్వార్ధం "
"పరుల సుఖం గురించి ఆలోచించేది స్నేహం"
"అలాంటి స్నేహం ఒకరితో ఐన చేస్తేనే జీవితానికి అర్ధం" కాని
"నాకు లబించే వారందరు అలాంటి వారే కావటం నా పూర్వ జన్మ సుకృతం

ఒక అందమైన అమ్మాయి చూడగానే .......


ఒక అందమైన అమ్మాయి చూడగానే "బెట్టు" చేయాలి ........
"కొండపల్లి బొమ్మకు ప్రాణం పోసినట్లు వుండాలి" ....
"పొడవాటి కురులు..వుండాలి"..
నాకు నేను ఇంటరెస్టింగ్ గా "ఆమెను" పరిచయం చేసుకోవాలి.
"ఆమె" మాటలా లో "ఉగాది" రుచులు తెలియాలి..
"ఆమె" లో చిలిపితన్నం మనస్సుకు హత్తుకు పోయేలా వుండాలి...
"ఆమె" పెదవుల పై చిరునవ్వు ఎప్పుడు నర్తిస్తూ వుండాలి..
"ఆమె" చిరునవ్వు హరివిల్లు ఇచ్చే ఆనందం ఇవ్వాలి...
"ఆమె" కళ్ళల్లోకి చూస్తున్నపుడు, నా కన్ను రెప్ప వాలిన నా హృదయం మాత్రం "ఆమె" చూస్తూ వుండిపోవాలి,,అంటే "ఆమె"కళ్ళల్లో" తెలియని పవర్ ఏదో వుండాలి....
"ఆమె" కలిసిన మొదటి సరి నుంచి ప్రతీ రోజు ఒక వసంతం లా వుండాలి....
రోజు కు ఒక్కసరైనా "ఆమె" ను కలవాలి...
కలిసిన ప్రతి సరి ఒక కొత్త లోకంలో విహరిసితున్నట్టుగా అనుబుతి కలగాలి....
"ఆమె" కు కోపం వస్తే చిన్న పిల్లలు మారం చేస్తున్నాటుగా వుండాలి,నేను బుజ్జగించే విధంగా....
"ఆమె" చూపించే జాలి "చందమామ"వెన్నల వుండాలి...

పద పదమని తరిమెను హృదయం..


పద పదమని తరిమెను హృదయం..
ప్రియ తలుపులు తెరచిన సమయం...
పద నిసమని పలికెను రాగం..
సరి గమలుగ పెరిగెను వేగం...
తడబడుతున్నది పాదం వింతగా..
కలబడుతున్నది కాలం కవ్వింతగా...
త్వరపడుతున్నది పయనం పలకరించగా..
ఎగబడుతున్నది నయనం పులకరించగా...

జీవితం సప్తస్వరాల సమ్మేళనం


జీవితం సప్తస్వరాల సమ్మేళనం
షడ్రుచుల మృష్టాన్న భోజనం
ఒక్కోసారి అది పెద్ద చదరంగం
నవ్వుతూ ఆస్వాదిస్తే నిత్యనూతనం
యవ్వనమైన,వృద్దాప్యమైన
దేవుడాడే వైకుంఠపాళీ మన జీవిత గమనం





మనిషిని అని మాత్రమే గురుతుచేసే ఈ లోకం లో .. ఎవరిని నేను ?
మనసు వుందని వుహించు కున్నాను ...అది స్నేహానికి స్పందిస్తుందని తలచాను ...
మనిషి లో స్నేహాన్ని చూసాను అని అనుకున్నాను ....అది కేవలం ఒ ఆట అని వుహించలేక పోయాను ...
మనసుని పరీక్షించే ఈ లోకాన్ని మరిచి స్నేహ హస్తాన్ని అందుకున్ననని ఆనందించాను ...
మోసాన్ని చూసాను ...మనసుని చంపుకున్నాను ....మౌనంగా మిగిలను ....దూరం గా వెళుతున్నాను




నా కన్నుల వెనుక స్వప్నం నీవ్వు
నా మాటల వెనుక మౌనం నీవ్వు
నా శ్వాసల వెనుక స్పందన నీవ్వు
నా విజయం వెనుక శ్రమ వి నీవ్వు
నా భాధల వెనుక కన్నీరు నీవ్వు
నా గమ్యం వెనుక పయనం నీవ్వు
నా రేపటి వెనుక నిన్నటివి నీవ్వు
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడువి నీవ్వు





నీతొ పరిచయం
నీ జ్ఞాపకాలు చాలు,,,,,,,,
నీ జ్ఞాపకలు చాలు నా జీవితానికి,
నీతొ గడిపిన క్షణాలు చాలు నా జన్మకి,
నీ ఊసులు చాలు నా ఊపిరికి,
నీ నవ్వులు చాలు నా ఆనందానికి,
నీ మాటలు చాలు నా చిన్ని గుండె పొంగిపొవటానికి,
నీ చూపు చాలు నా కంటిపాపలకి,
చిన్నప్పుడు ఎన్నొ అడుగులు నేర్పిన నాన్న ప్రేమని కూడా మించిపొయెలా చేశవు నీ ఏడడుగులతొ,
పాలుపట్టిన తల్లిప్రేమను గుర్తుచేశవు, నీ తీపి ప్రేమతొ,
తల్లితండ్రులని తలపించేలా వున్న నీ ప్రేమకన్నా నాకు ఏం కావాలి ఈ జీవితానికి.





నీ ప్రయత్నం నువ్వు చేయి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోంచించకు. ఎందుకంటే అది
మంచైనా సరే, చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి.
లేకపోతే పతనం తప్పదు




దీపావలి అంటే స్వాతంత్ర్యపు వెలుగు. ఆ వెలుగు నిరంకుశత్వం నుంచి, మానవుల
మధ్య కల్పించిన కృత్రిమ విభజన నుంచి లభించే స్వాతంత్ర్యం - స్వామి
వివేకానంద.



మన ఆలోచనలే మనం ఏమిటి అనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి - స్వామి వివేకానంద.




మానవత్వంపై నమ్మకం కోల్పోకూడదు. సముద్రంలోని కొన్ని చుక్కల్లో కాలుష్యం
చేరినంత మాత్రాన సముద్రమంతా కలుషితం కాదు. మానవత్వం కూడా ఒక సముద్రం వంటిది
- మహాత్మా గాంధీ.




అస్తమానం ఎదుటివారిని అంచనా వేయటంలోనే మునిగి తేలితే.. ఎవరితోనూ ఎన్నటికి స్నేహం చేయలేము - మధర్ థెరిస్సా

16, ఫిబ్రవరి 2011, బుధవారం

దాచుకోలేక....


దాచుకోలేక....
తెలియని ఆనందాలను పంచే నీ స్నేహపు హృదయం,
నా మదిలో చీకటిహృదయానికి ప్రేమను ప్రకాసింపజేసిన ఉదయం.

తెలియకుండానే నీ స్నేహంలో ప్రేమను ఆశ్వాదించడం మొదలుపెట్టను.
తెలియజేయలేక నీకు నా ప్రేమను, నా మనసులోనే మధనపడ్డాను.

గుండెలో నుండి జారే కన్నీళ్ళను నీ స్నేహపు ఆనందాభాష్పాలని ఇంకెన్నాళ్ళు చెప్పాలో,
పగిలిపోతున్న హృదయాన్ని అదిమిపెడుతూ పెదవిపై చిరునవ్వును ఇంకెన్నేళ్ళు పొందుపరచాలో.

నేస్తమా నీవే నా మనసులో నిండిన ప్రేమవని ఎలా తెలుపను.
స్నేహమా నీవే నా జీవిత సర్వస్వం అని ఎలా తెలియజేయను.

ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,
స్నేహమే అని మోసంచేస్తూ ప్రేమను దాచుకోలేక.
ప్రేమిస్తున్నానుఏమని చెప్పను ఎందుకు ప్రేమించవంటే,

నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!

ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!

గడిచిపోతున్న కాలాన్ని, కనులలో దాచుకున్న స్వప్నాలని కూడ మర్చిపోయేంతగా
నా అలోచనలలో ఒదిగిపోయావనా!!!

ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!

ఒక్కమాటలో చెప్పలంటే-

"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".

అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".మూగ మనసుతెలవారుఝామున నీ కనుల గుమ్మం ముందు నిల్చొని
నీకు చిరునవ్వుతొ శుభోదయం తెలుపాలని.

నీవు నడిచే ప్రతిదారిలో నీ పాదాలు కందకుండా
నీకు పూలమార్గం వెయ్యాలని.

నీవు పొందే ప్రతి ఆనందంలో,
నీ చిరునవ్వునై నీ అధరాలపై నిలవాలని.

ఆలోచనలతో అలసిపోయిన నీ మనసుకి,
ఏకాంతంలో నేను జ్ఞాపకం కావాలని.

నా ఆలోచనలు మొదలైన మరుక్షణం,
నీ కనుపాపల నుండి జారే కన్నీరు నవ్వాలని.

అలసిపోయి నిదురించు వేళ,
నీకు ఆనందాలను అందించే కలగా మారాలని.

కనులనిండా కన్నీళ్ళతో,కలల నిండా ఆశలతో ఎదురుచూస్తున్నా,
కనీసం రేపైనా నా యీ భావాలని నీకు తెలుపాలని.మన్నించు ప్రియ


ముసుగుకప్పిన నీ మాటాల తెరచాటున,
బయటపడలేక బంధించబడ్డ భావం ప్రేమ కాదా?

తడి ఆరని నీ కనుపాపల మాటున,
మసకబారిన నా రూపం దాచుంచడం ప్రేమ కాదా?

ప్రేమలేదని చెప్పే నీ మాటలతో,
నీ పెదవి ఒణుకు ప్రేమ కాదా?

గెలవలేమని తెలిసి నీ గుండెదాటని,
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?

తలిదండ్రులు మన ప్రేమకు కంచెలు వేస్తుంటే...

అది దాటిరాలేక దుఖంలో నీవు,
నిను చేరుకోలేక చేతకాని వాడిలా నేను......

జీవితాంతం ప్రేమలేని ప్రాణులుగా బ్రతికేద్దాం....
ఒంటరిని
ఏం మాయ చేసేవే నా గుండెకి,
నను వీడి చేరింది నీ గూటికి.

ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.

ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.

ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.

ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి.

మన కన్నీళ్ళే మనకు మరపురాని నేస్తాలు...


మన కన్నీళ్ళే మనకు మరపురాని నేస్తాలు...




మనం ఎప్పుడూ ఒంటరి వాళ్లంకాదు దుక్కంలో , ఆనందంలో అందరికీ తోడుండేది ఆ కన్నీళ్ళే,
ఎందుకంటే నా కన్నీళ్లు నాకు తోడున్నాయి,నులలివెచ్చగా ఓదార్పుని ఇచ్చేవి ఆకన్నీళ్ళే
ఈ రోజే తెలుస్తోంది నాకు ,కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని ,
కన్నీళ్ళని మించిన చెలిమి లేదని,కన్నీళ్ళకేమీ సరిరావని.

సుఖాల్లోనే కాదు కష్టాలలో కూడా ,నేనున్నానంటూ ఆప్యాయం గా హత్తుకునే
కన్నీళ్లు ,నాకెప్పుడు దూరం కాకూడదు .కన్నీళ్ళన్నీ వచ్చిన ఆక్షనం మనస్సు ప్రశాతంగా ఉంటుంది

ఇది నేను కోల్పోతున్న ,నీ తీయని చెలిమి ఇస్తున్నకన్నీళ్ళు ఉప్పటి వరమేమో కదా .
లేక నా దురదృష్టం అని మాత్రం తొందరపడి డిసైడ్ కాకు ...అనేక ఆలోచనలతో వచ్చే ఆకన్నీళ్ళను ఆపకండి
కారే ఆకళ్ళీకు అడ్డు పడకండి...చివరివరకు మనకుతోడు నీడ అవే అనేవాస్తవాన్ని మరువకు
ఎవరు భాదపెట్టినా... ఆనందం ఎక్కువైనా నేనున్నానంటూ పలుకరించేవి ఆకన్నీళ్ళే కదా
కన్నీళ్ళు వచ్చేప్పుడు మరొకరు మీవద్ద లేకుండా ఓంటరిగా ఉండేందుకు ట్రై చేయండి..
లేదంటే కన్నీళ్ళు పెట్టుకొని మనస్సును ప్రశాతంగా చేసుకునే అవకాశాన్ని కోల్పోతాం
ఈ కన్నీళ్లపై ఇంకా ఏదో చెప్పాలని ఉంది కాని గతంతాలూక భాదలు గుర్తుకొస్తున్నాయి..
నాకన్నీళ్ళను ఎందుకు ఆపుకోవాలి అందుకే ఆ అవకాశాన్ని వదులుకోను..
ప్లీజ్..ప్లీజ్..ఒంటరిగా వదిలేయండి ఇప్పటికే అర్దం అయిందనుకుంటా

ప్రేమా ఎక్కడ నీచిరునామా... ??


ప్రేమలో నమ్మకంలేదు..
ఇప్పటి ప్రేమల్లో నిజాయితిలేదు ...
ప్రేమను ప్రేమగా ప్రేమించేవాళ్ళు తగ్గిపోయారు...
 నాటి ప్రేమలుపెదవులతోనే మాటాళ్డుతున్నారు..
హ్రుదయం లేనివాల్లు ప్రేమిస్తున్నాంఅని బ్రమపడి ఎదుటివారిని మోసంచేస్తున్నారు..
వాళ్ళని వాళ్ళు మోసంచేసుకొంటూ ఎదుటివార్ని మోసం చేస్తున్నారు ..
 ప్రేమా ఎక్కడ నీచిరునామా... ??

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఇది మాతృభాషకు దక్కిన మహోన్నత గౌరవమెకాదు ...


ఇది మాతృభాషకు దక్కిన మహోన్నత గౌరవమెకాదు ...
ఆదికవి నన్నయకు ...
ఆముక్త మాల్యదకు...
అన్నమయ్య కీర్తనకు ....
జరిగిన అక్షరాభిషేకం .....
కవిబ్రహ్మ తిక్కనకు ...
కలవిన్యాసుడు పోతనకు ..
శ్రీనాధుడి సీస పద్యానికి .....
కాళ్ళు కడిగి చేసిన కనకాభిషేకం ....
తేనెలొలికే తెలుగు పదానికి ...
తెలిమంచు చేసిన పుష్పాభిషేకం ...
వేయి పడగలకు...క్రిష్ణపక్షానికి ...
వెన్నెల్లో ఆడుకున్న తిలకుడికి ...
జానపదాలకు ...జగమెరిగిన బుర్రకథకు ...
యక్షగానాలకు ...వీధి బోగాతాలకు ...
భారతావని తొడిగిన గండపెండేరం .....
గిడుగు రామమూర్తి కి ,గిజిగాడి కథలకు...
అందాల ''బొమ్మరిల్లుకు'' ,చక్కనయ్య ''చందమామకు'' ..
భేతాళ కథలకు ...భట్టి విక్రమార్కీయానికి ...
మహాకవి శ్రీ శ్రీ కి ..మహోన్నతుడు ఆరుద్రకు ...
సముద్రాలకు ...పెండ్యాలకు ...
వేటూరికి ...వెన్నలకంటికి ...
సిరివెన్నెలకు...చంద్రబోసుకు ....
సుద్దాలకు ...భాస్కర భట్లకు ...
వెరసి ఆంద్ర సాహిత్యానికీ దక్కిన ...
అరుదైన ఘనత ...

నేను ఇంకా మరువలేదు..



 ఈ ళొవె Yఔ $.
ఈ లొవె Yఔ సొ ముచ్...

ఈ మూడు మాటలు కేవలం.. నా ప్రేమని నీకు చెప్పటానికే కాదు..
నీ మీద నేను పెంచుకున్న ఆశలను చెప్పటానికి..
నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని చెప్పటానికి..
నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పటానికి.. నిన్ను నేను ఎంతగా ప్రేమించానో చెప్పటానికి..

ఈ లొవె యౌ $
ఈ లొవె యౌ సొ ముచ్..


సంస్ మోసుకొచ్చే నీ మాటలు వినాలనుంటుంది.. కానీ సంస్ రాదు
సెల్ ఫోన్ తీసుకొచ్చే నీ కబుర్లు పంచుకోవాలనుంటుంది.. కానీ నా రింగ్ టోన్ వినపడదు..
కాలం గడుస్తున్న కొద్దీ నీకు దగ్గరవ్వాలని ఉంటుంది..
కానీ ఎంత ధగ్గరౌతున్నా.. నీకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది..
వీటన్నింటిని నీకెలా చెప్పను.. నిన్నెలా ఒప్పించను.. నీ మనసుని నేనెలా కదిలించను ..

ఈ ళొవె యౌ $
ఈ లొవె యౌ సొ ముచ్..

ఈ మూడు మాటలు.. కేవలం నా ప్రేమని చెప్పటానికే కాదు..
నీకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో చెప్పటానికి..
నువ్వు చెప్పే మాటలు నాకెంత ఆనందం ఇస్తాయో చెప్పటానికి..
నీ కోసం ఎదురు చూసే ప్రతి నిమిషం.. నేనెంతగా వేదన చెందుతానో చెప్పటానికి..

ఈ ళొవె యౌ $
ఈ లొవె యౌ సొ ముచ్..

నాకు తెలిసిన ఈ మూడు మాటలకు.. ఈ అర్ధమే తెలుసు..
జీవితాంతం నిన్ను ప్రేమగా ప్రేమిస్తానని చెప్పటం మాత్రమే తెలుసు..

కాని ఒక్కటి నిజం ఆరాధన..

నా ఊపిరి ఆగిపోయే వరకు.. నిన్ను ప్రేమిస్తాను!
నా ప్రాణం నిలిచి ఉన్నంత వరకు.. నిన్ను ప్రేమిస్తాను!!
నా కనులు ఈ లోకాన్ని చూసినంత వరకు.. నిన్ను ప్రేమిస్తాను!!!

ఈ ళొవె Yఔ $
ఈ ళొవె Yఔ శొ ంఉచ్..
నీకోసం ఎదురు చూసే నాకు.. నీ తోడు దొరుకుతుంది కదూ!!
నేను వేసే ప్రతి అడుగుకి.. నీ అడుగుల తోడు ఉంటుంది కదూ!!!

ఈ ళొవె Yఔ $
ఈ ళొవె Yఔ శొ ంఉచ్..


నీ కోసం ఎదురు చూస్తూ..
ప్రేమతో..








నా ఊపిరి ఇంతటితో ఆగి పోనీ.. నీ జ్ఞాపకాల బాధతోనే గతించి పోనీ..
మరువ లేని ఈ జ్ఞాపకాల ముసుగులో ఏడ్చే కన్నా.. ఈ ఊపిరి ఇంతటితో ఆగిపోనీ..
దహించి వేసే ఈ కన్నీటి వేడి.. ఇంతటితో చల్లారి పోనీ..
కాలం చేసిన ఈ గాయం.. కాలం ఒడిలోనే అంతమై పోనీ..

పోనీ.. నీ ఊసుల సుడిగుండంలో చిక్కిన నేను.. ఎవ్వరికీ అందకుండా పోనీ..
నీ ఊసులు లేని మరేదైనా చోటుకి.. నన్ను వెతుక్కుంటూ పోనీ..
నీ చేతుల తోడు కోరిన ఈ ఒంటరి తనాన్ని.. ఒంటరిగానే పోనీ..
మాటలు చెప్పాలనుకున్న నా మౌనాన్ని.. మౌనం గా పోనీ..

పోనీ.. ఈ వెలుగులో నను కలిసి పోనీ..
ఆ చీకటిలో నన్ను ఇమిడి పోనీ..
ఈ నేలలో.. నన్ను నిదుర పోనీ..

మునుపెన్నడూ లేని ఈ బాధ.. ఇక నైనా నను వదిలి పోనీ..
ఈ జన్మకి అందని నీ స్నేహం.. మరుజన్మకైనా వస్తుందని అనుకుంటూ పోనీ..,

పోనీ.. నా బాధని ఆస్వాదిస్తూ.. ఈ రోదనని అనుభవిస్తూ..
నీ ప్రేమని కలవరిస్తూ..
ఓ ఏకాంతంలోకి .......
నన్ను ఒం'టరిగా పోనీ..
చాలా బాధతో.. పోనీ..
నీ జ్ఞాపకాలకు తుది వీడ్కోలు పలుకుతూ.. ఇకనైనా.. నన్ను పోనీ.. దూరంగా వెళ్లి పోనీ.. వెళ్లి పోనీ..






నువ్వు చెప్పినట్లు నిన్ను వదిలి వెళ్ళాలనే అనుకున్నాను..
కాని నా వల్ల కాదు..అలా ఉండటం నా వల్ల కానే కాదు..

నువ్వు పంచిన జ్ఞాపకాలను వదిలి వెళ్ళటం నా వల్ల కాదు.
నువ్వు పంచిన ప్రేమని తిరిగి ఇవ్వటం నా వల్ల కాదు..
నీతో పెనవేసుకున్నఈ బంధాన్ని తెంచుకోవటం.. నా వల్ల కానే కాదు..

నన్ను వదిలి వెళ్ళ మనకు.. నీ దారికి నేను అడ్డు కాను..
నీడలా నీ వెంట నడుస్తాను.. మౌనంగా నీ దారిలో నడుస్తాను..
నీ చిరు నవ్వులో ఆనందాన్నై ఉంటాను..
నీ కన్నీటిలో బాధలా కరిగి పోతాను..
నీ ఆశయానికి సంకల్పంలా తోడు ఉంటాను..

కలలోనైనా.. నన్ను విడిచి వెళ్ళ మనకు..
నీ శ్వాసలో ఊపిరి పోసుకుంటున్న నన్ను.. నిన్ను విడిచి వెళ్ళ మనకు..
నా వాళ్ళ కాదు.






నిన్ను వెతికే కనులకు తెలుసు ..
నీకోసం ఎదురు చూస్తూ.. ఎంతగా మధన పడ్డాయో..

నిను వెంటాడే పాదాలకు తెలుసు..
నీ అడుగుల స్నేహం కోసం ఎంతగా పరితపించాయో..

నీ చిరునవ్వుల అందంలో చిక్కుకున్న నా వయసుకు తెలుసు..
ఆ చెరగని అందం నన్నెంతగా దహించి వేస్తుందో..

నీ తీయని ప్రేమ కోసం ఎదురు చూసే నాకు మాత్రమే తెలుసు..
తీయని నీ పిలుపులో ఉండే ఆనందం ఎంతో.. నువ్వు విసిరిన ఈ మౌనంలో ఉండే భారం ఎంతో..

మాటైనా పలకలేని నీకేమి తెలుసు...
మాటలు చెప్పాలనుకునే నా మనసు పడే బాధేంటో..
ఏకాంతంలో నీ జ్ఞాపకాలు పెట్టే వేదన ఎంతో..

తెలియదు.. ఈ బాధేంటో నాకూ తెలియదు..
కాని వద్ధకున్న ప్రతీసారి.. నీకోసం ఎదురు చూడటం మాత్రం తెలుసు..
నీ ప్రేమ దక్కుతుందనే ఆశతో జీవించటం తెలుసు..
చివరి వరకు.. నిన్ను ప్రేమించటం మాత్రమే తెలుసు..





నిదురలో నువ్వే గుర్తొస్తావ్..
మెలకువలో నువ్వే గుర్తొస్తావ్..
ప్రతి పనిలోనూ నువ్వే గుర్తొస్తావ్..

ప్రతి మాటలో.. ప్రతి పాటలో.. నా ప్రతి ఆలోచనలో ..నువ్వే గుర్తొస్తావ్..
నిన్ను మరువాలనుకున్న ప్రతిసారీ.. ఆ ఆలోచనలోనూ.. నువ్వే గుర్తొస్తావ్.
మరి నిన్నెలా మరువను???
నిన్నెలా మరువను??






మౌనంగా వెళుతున్నా..


కనులకేం తెలుసు నేస్తం.. కన్నీటి బాధ..
వాటికి దూరం చేసుకోవటం మాత్రమే తెలుసు..

కన్నీటిని అడిగి చూడు.. ఉప్పొంగిన వాటి బాధని తడిమి చూడు..
ఆ కనులను విడువటానికి.. అవి ఎంతగా పరితపించాయో చెప్పుకుంటాయ్.
ఆ కనులను తిరిగి చేరలేమని.. అవి ఎంతగా విలపించాయో చెప్పుకుంటాయ్.
తీరమెచటో తెలియ లేక.. గమ్యమేమిటో పోల్చుకోలేక..
గుప్పెడంత బాధతో నేలరాలి వెళుతున్నాయ్..
తిరిగి చేరలేమని తెలిసి .. మౌనంగా నింగికెగసి పోతున్నాయ్.

పాపం.. ఏం చేస్తాయిలే.. వాటికి మాత్రం ఇంకెవరు తెలుసు..
అవి కోరుకునే ఆ కనులు తప్ప.. ఆ కనులతో ఉన్న స్నేహం తప్ప..
బాధని పంచుకున్నా.. బంధం పెంచుకున్నా ఆ కనులతోనే కదా..
కాదంటే బ్రతక లేవు.. కనుపాపలో ఇమడ లేవు.
మౌనంగా దూరమై పోతాయ్.. మౌనంగా ఆవిరై పోతాయ్.. మౌనంగా కను వీడి పోతాయ్..
మౌ..నంగా.. కను వీడి పోతాయ్!!!







నువ్వు లేని వెన్నెల వేసవిలా వేడెక్కుతుంది..
నిను చూడని సందెవేళ వెలుగయినా చీకటవుతుంది..

మబ్బులు కమ్మిన ఈ వేళలో..
చల్లని గాలుల నిశ్శబ్దంలో..
మంచు తెరల వసంతంలో..

నీ పిలుపు వినపడక..
నీ మోము కనపడక..
నీ స్పర్శ అనుభవింపక..

ఆకులా నేల రాలుతున్నాను..
నువ్వు వస్తావనే ఆశతో.. కొమ్మలా చిగురిస్తున్నాను.





నా కనుల కన్నీరు ఆవిరై పోయినా...
నా కలల సౌధాలు కను దాటి వెళ్ళిన...
నా మనసులో బాధ నిను మరువ చూసినా..

నిన్ను నేను ఇంకా మరువలేదు...
నీ జ్ఞాపకాలను ఇంకా మరువలేదు..
ఆనందం వచ్చిన ప్రతీసారి...
నువ్వు పంచుకుంటావనే జ్ఞాపకాన్ని...
నేను ఇంకా మరువలేదు..

inkaa



వెదికి చూడు ప్రియతమా నీమీద నాకున్న ప్రేమ.......
ఎగిసి పడే హృదయ..  “నా” హృదయ తరంగాల నుండి...
వెదికి చూడు ప్రియతమా నీమీద నాకున్న ప్రేమ
నిను దాచుకున్న “నా” కనురెప్పల నుండి......
వెదికి చూడు ప్రియతమా నీ మీద నాకున్న ప్రేమ
నాలో నిలుపుకున్న “నీ” తలపుల నుండి...
వెదికి చూడు ప్రియతమా నీమీద నాకున్న ప్రేమ





జాడలేని ప్రాణం రూపాన్ని.... పరిచయం చేశావు
నేనెరగని నన్ను నాకే కొత్తగా చూపించావు
చేతికందని నింగిలోని తారల్ని నవ్వుతూ దోసిళ్లలో పోశావు
సరసమైనా తెలియని మనసుకు విరహాన్ని రుచి చూపించావు
మాధుర్యం తెలియని జీవితంలో వసంతాలు రప్పించావు
అన్నీ తెలిశాక మాత్రం అందనంత దూరాన నిలిచావు....ఎప్పుడు కరునిస్తావు ప్రియతమా ...





నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది
నీతో నన్ను ఊహించుకుంటూ నా మది
మురిసిపోయింది
నీ అభిమానానికి నా హృదయం పొంగిపోయింది
ఆ అభిమానానికి
అర్థం తెలిసి నా గుండె ఆగిపోయింది
నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై
కరిగిపోయింది
తీగ తెగిన వీణలా నా గొంతు మూగబోయింది
నీకోసం
ప్రాకులాటలో నా మనసు అలసిపోయింది
ఏంటో ఇదంతా కలలా జరిగిపోయింది
కాని
నీకు తెలియదు, నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది.....





నేస్తమా ,
             నీ కళ్ళలో దాగి ఉన్న కలలను ఊహించాను..నిన్ను కలవక ముందే ........
             ప్రశాంతమైన నీ మనసులో అలజడిని చూసాను,నువ్వెవరో తెలియకముందే..........
             పదిలమైన నీ నవ్వులను పంచుకున్నాను.....నీ చెంతకు చేరకముందే...........
             సుమనోహరమైన నీ స్నేహ పరిమళాన్ని ఆస్వాదించాను,నీ చూపు నన్ను తాకక ముందే....
             నా జీవితమే నువ్వై పోయావు ...నా దరికి నువ్వు రాకముందే.
                          తిరిగి ఎప్పుడు దర్సనమిస్తావు??







నా ఊపిరి ఆగిపోయే వరకు.. నిన్ను ప్రేమిస్తాను..
నా ప్రాణం నిలిచి ఉన్నంత వరకు.. నిన్ను ప్రేమిస్తాను..
నా కనులు ఈ లోకాన్ని చూసినంత వరకు.. నిన్ను ప్రేమిస్తాను..

వాన చినుకుల పలకరింపులో నిను చూసిన ఆ మొదటి నిమిషం..
నా హృదయ స్పందన తెలిపింది..నిన్ను నేను ప్రేమించానని..
నీ కోసమై.. నేను ఎదురు చూస్తూ ఉన్నానని..

మాటలు కలిపే ప్రయత్నంలో.. మాటలు మరచిన ఆ నిమిషం..
నా మౌనం తెలిపింది..నిన్ను నేను ప్రేమించానని..
నీ పలకరింపుకై .. పరితపిస్తూ ఉన్నానని..

నీ చేతి స్పర్స తో మనసు ఉప్పొంగిన ఆ నిమిషం..
నా గుండెలోని అలజడి తెలిపింది..నిన్ను నేను ప్రేమించానని..
నీ ఆత్మీయ స్పర్సతో..మైమరచి పులకరిస్తూ ఉన్నానని..

నిన్ను చూడని నిమిషాన..వేదన చెందిన నా మనసుకి తెలుసు..
కన్నీరు కార్చిన కనులకు తెలుసు ..
మౌనం ఆశ్రయించిన పెదవులకు తెలుసు ..
ఉసూరు మంటున్న ప్రాణానికి తెలుసు..
నిన్ను నేను ప్రేమించానని...
నీ కోసం పిచ్చిగా... ఎదురు చూస్తూ ఉన్నానని..

కానీ..
ఎలా చెప్పను..ఇంకేమని చెప్పను.. ఇంకెన్నని చెప్పను..
నా ప్రాణం నువ్వని.. నా ఊపిరి నువ్వని.. నా రేపటి గమ్యం నువ్వని..

వినపడుతుందా ప్రియతమా..
నా మాట వినపడుతుందా..

ఒక్కటి నిజం..

నా ఊపిరి ఆగిపోయే వరకు.. నిన్ను ప్రేమిస్తాను..
నా ప్రాణం నిలిచి ఉన్నంత వరకు.. నిన్ను ప్రేమిస్తాను..
నా కనులు ఈ లోకాన్ని చూసినంత వరకు.. నిన్ను ప్రేమిస్తాను.. ప్రేమిస్తాను.






కలల తీరం నీ వైపుకు అడుగులు వేసింది..
ప్రణయ గీతం నీ మాటలు గుర్తు చేస్తుంది..
ప్రతి నిమిషం వెంట నడిచే నీ ఊసుల నిట్టూర్పు.. మనసుకి తీరని గాయం చేస్తుంది.
కనులు మూసినా.. కనులు తెరిచినా.. నీ స్నేహం.. మనసుని కలవర పెడుతుంది.

కలలా కలిసిన నీ స్నేహం.. కలలా చెదిరి పోతుంటే.. కన్నీరు నా లోకమైంది..
ఒంటరితనం నా ప్రపంచమైంది..
మాటలు మూగబోయి.. మనసు మౌనంగా రోదిస్తుంది.
నా ఆశల చితి మంటలు చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.


నీ ప్రేమ కోసం నే భాదని అనుభవిస్తే.. "ఆ భాద నా ఆనందాలను దూరం చేసిందేగా" అన్నావ్..
ప్రేమ అంటే ఇంతేనా.. మనుషులంతా ఇంతేనా...
నిజమైన ప్రేమకి అర్ధం.. నిరాశేనా!!!








అబద్ధం... అంతా అబద్ధం..
మాటలు చెప్పే మనసు అబద్ధం..
ప్రేమని పంచే మాటలు అబద్ధం..
నిన్ను నిన్నుగా కోరుకునే మనిషి అబద్ధం..
నీ తోడుగా నడిచే అడుగులు అబద్ధం..

ప్రాణం పెంచుకునే ప్రేమ అబద్ధం..
నీతి అబద్ధం..
నిజాయితీ అబద్ధం..
చచ్చేంత ప్రేమ అబద్ధం..

రంగుల ఈ లోకంలో ప్రతి రంగు ఒక అబద్ధం..
అద్దంలో కనిపించే నీ రంగూ ఒక అబద్ధం..
రంగులు పులుముకుంటూ అసలు రంగును మరచి పోతూ..
మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతకడమే ఇక్కడి నిజం..
నమ్మి తీరాల్సిన నిజం.. నమ్మ లేని నిజం..





చల్లని ఈ గాలికి నీకు నాకు మాత్రమే తెలుసు..
ఈ క్షణం నీ ఊసులను ఈ చల్లని గాలి మోసుకొచ్చిందని..

నా కనులలో కన్నీటికి.. నీకు.. నాకు మాత్రమే తెలుసు..
నా మనసు నీ జతని కోరుతూ విలవిలలాడుతుందని..

కాలం ఒడిలో ఎన్నో మధుర జ్ఞాపకాలు...
నీ జతలో నేను అనుభవించిన ఆ తీపి జ్ఞాపకాలు..
కరుగుతున్న ఈ కాలానికి..నీకు.. నాకు మాత్రమే తెలుసు.
కలలను.. కబుర్లను.. రాబోయే కాలపు మధురానుభూతులను...
మనసు పలకపై లిఖించుకున్న నీకు నాకు మన ఆశలకు మాత్రమే తెలుసు..
జంటగా వేసే అడుగులకై ఈ ఒంటరితనం ఎంతగా కలవార పడుతుందో అని..

నీ తీయని స్నేహం కోసం ఎదురు చూసే కనులకి..
నీ చేతి స్పర్స కోసం ఎదురు చూసే తపనకి..
నీ ఊసులు మోసుకొచ్చే నిన్నటి జ్ఞాపకానికి... ప్రతి క్షణానికి..
నువ్వొక తీయని జ్ఞాపకం..
మరువ లేని.. మరపు రాని ఒక మధుర జ్ఞాపకం.


కరుగుతున్న ఈ కాలం నిన్ను దూరం చేస్తుంటే..
పెరుగుతున్న ఈ దూరం నిన్ను దగ్గర చేస్తుంది..







కలలా నను కలిసావ్..
కలవరమై నా మనసులో మిగిలిపోయావ్ పోయావ్..
కనుమూసి తెరిచేలోగా కన్నీరై కరిగిపోయావ్..
కల కాదు నిజమిది చూడమంటూ.. నా కనులు తెరిపించి వెళ్లిపోయావ్..
నిను వలచిన నన్ను విడిచి వెళ్లి పోయావ్..

మునుపెన్నడూ తెలియదు నాకు ఈ ఆవేదన...
ప్రేమంటే ప్రేమించటమే అనుకున్నాను..
ప్రేమించబడటం కూడా ఉంటుందని నన్ను వదిలి నాకు తెలిపావ్.
కన్నీటిని నాకు తోడుగా ఉంచి.. నీ జ్ఞాపకాల కోటలో నన్ను బంధించి వెళ్లిపోయావ్...

జ్ఞాపకాలతో....







బాధ నా మనసుది కాదు.. నా ఊపిరిది..
దానికేం తెలుసు.అది నిన్నెంతగా శ్వాసించిందో..

భాద నా మనసుది కాదు.. నా నమ్మకానిది..
దానికేం తెలుసు.. నా మూగ ప్రేమ నిన్నెంతగా నమ్మిందో..

బాధ నా మనసుది కాదు.. నా కనులది.
దానికేం తెలుసు.. నా కనులు నీకోసం ఎంతగా కన్నీరు కార్చాయో..

బాధ నా మనసుది కాదు.. నువ్వు విడిచి వెళ్ళిన ఈ నా ఒంటరితనానిది..
దానికేం తెలుసు..ఈ ఒంటరితనం నన్నెంతగా గుచ్చి గుచ్చి వేదిస్తుందో..

వెచ్చని నా కన్నీటికి మనసులేకున్నా..
నా మనసుని ద్రవింప చేసింది..
నువ్వు తోసి వెళ్ళిన నా ప్రేమని చూసి..

రూపం లేని నమ్మకమైనా..
నా మనసుని చలింప చేసింది.
నువ్వు నువ్వు విడిచి వెళ్ళిన చీకటిని చూసి.

మాటలు చెప్పలేని నా శ్వాస కుడా ..
నా మనసుని చలింప చేసింది..
నువ్వు బద్దలు చేసిన నా గుండెని చూసి........

inkon


నిన్ను కలిసేదాకా సమయం కదలదే అన్న కోపం,
నిన్ను కలిసాక ఈ క్షణం ఆగిపోవాలన్న కోరిక,
నీపై ఉన్న ప్రేమను చూపడానికి నువ్వు కానరాక
మనసులో చెలరేగుతున్న అలజడులను ఆపుకోలేక
సతమతముతున్న నా బాధ నీకు తెలిపేదెలా .........ప్రియతమా



వర్షానికి ఏడవడం తెలుసు కాని
నవ్వడం తెలీదు
సూర్యుడికి మండించడం తెలుసు కాని
ఆర్పడం తెలీదు
నాకు నిన్ను తలచుకోవడం తెలుసు
కాని మరవడం తెలీదు !!!!





ప్రియ నేస్తం
          ఉరకలేసే
గోదారిలా......
          పరుగులెత్తే
కావేరిలా.....
          ఎగిసిపడే
కడలి తరంగంలా.......
కలవరపడే
          ఈ మనసు
తరంగాల సవ్వడి.......
          ఈ యదనాద
ఝరి
వినపడలేదా.........
ఇదంతా నిజం కాదని....కలలాంటి
కలని తెలుసు.........కాని...
ఎప్పుడో నిదురించిన
జ్ఞాపకాలని.........
మూసిన గుండె గది తలుపులని...........
          ఎవరో
తట్టి లేపుతుంటే........
ఓక్క క్షణమైనా.....ఓకే ఓక్క
క్షణమైనా............
ఈ కలని నిజం చేసుకోవాలని........
మనసు ఉరకలేస్తుంటే...........
ఎగసిపడే ఈ భావాలని .................నీతో
తెలిపేదెలా................







నువ్వు నేను అన్న అస్తిత్వాన్ని
కోల్పోయి,
తనువు లోను ...........మనసు లోను...................ఆత్మలోని..........
అణువణువు లోను ... ఐకమత్యపు
భావాన్ని...........
అనుభవించి......... అనుభవించి....
భావాన్ని.......అనుభవాన్ని............
భవాతీత ఙ్ఞానంగా, మార్చుకొని............
సరిక్రొత్త  సృష్టి కి ప్రాణం
పొయ్యడమే ................................దాంపత్యం........






ప్రియ నేస్తం.... ప్రపంచం అంతా దూరం అయినా... నీకు నేను ఉన్నా అని చెప్పేవాడే “స్నేహితుడు”...ఆ స్ధానంలో నాకు నాకు నువ్వు నీకు నేనుఒకరి కొకరు.. ఈ స్నేహమే మన ప్రపంచంనువ్వు అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి నడిపిస్తుంటే...
నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే...
నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే.....
ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో... నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....
నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే ........... నాకు నువ్వు వున్నావనే భావన.....మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే, నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....

ఈ ప్రపంచానికంతా వినపడేలా అరిచి చెప్పాలని వుంది..... “ఇదిగో నా ప్రియ నేస్తం అని






నీకోసం..... ఈ హ్రుదయం.......నీకోసం..... ఈ ప్రాణం నీకోసం..... ఈ కనులు......నీకోసం..... ఈ ఎదురు చూపులు......నీకోసం......... ఎగిసిపడే నా అంతరంగం.....మనిషి ని ఇక్కడున్నా.........మనసంతా నీ తోనే......
నీతో కలసి నీ ఆలోచనల
వేగాన్ని నేనవ్వాలని
నీతో కలసి ఆ విజయ శిఖరాన్ని
అందుకోవాలని.....
నీతో కలసి మధురానుభూతి
ని సొంతం చేసుకోవాలని.....
నీతో కలసి నీ జీవితంలో
సగం స్దానం పొందాలని.......
నీతో కలసి నీ అడుగులో
అడుగెయ్యాలని.....
నీతో కలసి కడదాకా
కలిసి నడవాలని......
నువ్వే నా సర్వస్వం
కావాలని.....
నీతో నే ఈ జీవితం సాగిపోవాలని........
రేపటి మన ప్రపంచానికి......
ఈ రోజే... పునాది కావాలని.......
ఈ బ్రతుకంతా నీకే
అంకితం కావాలని......
నా ప్రియమైన నీకు....
నీ ప్రియమైన నేను......
చెప్పే కవితాంజలి.......ఇదే.....







కనులు మూసినా,  తెరిచినా నీ రూపమే
మెలుకువ నైనా, కలలో
నైనా,..........నీ తలపులే......
మనసు నిండా నీ ఆలోచనలే.......
నిరంతరం నీ సాన్నిధ్యం
లోనే వుండాలని.... మనసు పడే
ఆరాటం...
నువ్వు......... నేను... ..... అనే
... ఈ రెండు పదాలే..........
నా ప్రపంచంగా  మారుతుంటే......
మనం కలసి పంచుకున్న....
మధురస్మ్రుతులు.........
నిన్ను అనుక్షణం..
నా మనసు తెర మీద నిలబెడుతుంటే........
నేను దాచుకున్న నీ
తీయ్యని జ్ఞాపకాలు........
అలసిన మనసును... సేదతీరుస్తుంటే....
ఈ నా చిన్ని మనసు పడే
ఆరాటాన్ని...
నీకు వివరించాలని.....
నీ కోసం వెతుకుతుంటే.....
తెలిసింది.....నువ్వు ఎక్కడో
లేవని......
నా గుండె గది లోనే....
నిన్ను పదిలంగా.. దాచుకున్నానని........
వినపడిందా
నేస్తం ...... నా .... ఈ .... హృదయ స్పందన....







నువ్వు అక్కడ నేనిక్కడకాలం ఎందుకు ఇలా నిన్ను
నన్నువిడదీస్తోందో......తెలియదు
కాని....
కలల్లో నీవే.....కళ్ళల్లో నీవే....ఊహల్లో నీవే....ఊపిరిలో నీవే.....భాషలో నీవే.....భావంలో నీవే.....మనసున నీవే....మౌనంలో నీవే.....ప్రాణంలో నీవే.....ప్రతి అణువణువునా
 నీవే.....నిను చూడని రోజు.....
ఆ రోజు నీస్సారమై
పోతుంది....
నీ మాట వినిపించని
క్షణం.....
ఈ ఊపిరి ఆగిపోతుందేమో
అనిపిస్తుంది......
గడచిన కాలం... అంతా...కలలా
కదిలి పోతుంటే...
ఇక ముందున్న కాలం
అంతా...క్షణమైనా.. ఓక్క క్షణమైనా...
నీ చేతిని విడవకుండా.......నీపై చూపు మరల్చకుండా.....నీ అడుగులో అడుగేస్తూనీ తోడునై .. నిన్ను నా
తోడుని చేసుకొని...... ఒకరి
కోసం ఒకరై ... మిగిలిన కాలం
అంతా గడపాలని...మనసు పరుగులు
తీస్తోంది....






నీ కోసం పరితపించే మనసు...
నిన్ను చూడాలని ఆశపడే కనులు.....
మనసుని నిద్రలేపే నీ సాన్నిహిత్యం......
కలకాలం కలిసివుండాలనే నా ఆరాటం...
మాటలకందని ....ఈ భావం.....
మనసు దాటని....అభిమానం.......
బరువెక్కిన నీ ఊహల సౌరభం.......
హ్రుది నిండిన ఆశల పరవశం.......
నిన్ను తలచిన ప్రతిక్షణం.......
నన్ను నేను మరిచిన వైనం.......





ఆ నింగి ఈ నేల
వున్నంత వరకు.......
నువ్ను...నేను......
మన స్నేహం....వుంటుంది.....
నేను దాచుకున్న నీ నవ్వుల జ్ఞాపకాలు
మనం కలిసి చెప్పుకున్న మధురమైన ఊసులు
నీ కోసం నేను ఎదురు చూసిన మరుపురాని క్షణాలు....
పరుగులెట్టే కారుమబ్బులు.......నన్ను......సృశించిపోయే వాన చినుకులు.......అన్ని .....అన్ని ....
అంటున్నాయి....మీ స్నేహం.... మధురాతి మధురం అని.........
మరి నువ్నేమంటావు...........నేస్తమా.........?

14, ఫిబ్రవరి 2011, సోమవారం

అమ్మానాన్నలకి భారమవ్వగా……నేను పుట్టానట…!!!


సెకెను సెకెనుకీ పుట్టుకొస్తున్న…పుట్టగొడుగుల్లా….నేను పుట్టానట…!!!
అమ్మానాన్నలకి భారమవ్వగా……నేను పుట్టానట…!!!
….
ఎందుకున్నాన్నో…ఆయువుతో ఇంకా నేటివరకూ…???
ఏమిచేస్తానో…కాటిలోన కాలిపోయే రోజు వరకూ…???
….
కదులుతున్న….తనువు నాదే…!!!
ఎగురుతున్న….మనసు నాదే…!!!
మంచి నాదే…చెడ్డ నాదే…!!!
నేడు నాదే….రేపు నాదే…!!!
అన్నీ నావి అని చెప్పుకోవడానికే…నోరుందేమో నాకు…!!!
అంతా నేనని గొప్పలు పోవడానికే…పుట్టానేమో నేను…!!!
….
ఇలాంటి నాకు…సహనం లేని సుడిలాంటి నాకు….ఎందుకో..ఈ ప్రపంచం…!!!
కొంచమైనా…ఓర్పులేని పిడుగులాంటి నాకు….ఎందుకో…ఈ జీవితం…!!!
కాని నా పుట్టుకకి కూడా సంబరాలెందుకో…!!!
అందరి కన్నుల్లో వెలుగులెందుకో….!!!
చిరునవ్వులెందుకో…!!!
నాకు మాత్రం ఒక్కటే ఆలోచన….ఎందుకు పూట్టానా అని…!!!
కానీ…!!!
….
పుట్టానట…!!!
సెకెను సెకెనుకీ పుట్టుకొస్తున్న…పుట్టగొడుగుల్లా….నేను పుట్టానట…!!!
అమ్మానాన్నలకి భారమవ్వగా……నేను పుట్టానట…!!!





చిన్న నవ్వు నవ్వగానే ఏమవ్తుందో..???
గువ్వపిల్లలా మనసు ఎందుకు ఎగురుతుటుందో..!!
ఓరకంట చూడగానే ఏమవ్తుందో…???
చిన్నపిల్లలా ఎందుకు ప్రాణం ఉరకలేస్తుందో..!!

నా మోములో…నీకు ఏం కనిపిస్తుందో..???
పెద్ద పెద్దగా చక్రాల్లా కన్నెందుకు చూస్తుందో..!!
నీ నవ్వులో…నాకు ఏం వినిపిస్తుందో…???
ఎందుకు ఎదలో ఏదో సవ్వడి మొదలవ్తుంటూందో..!!
….
చిన్ని నవ్వు నవ్వగానే…ఏమవ్తుంటుందో..???
చిన్ని చిన్ని ఆశలన్ని వెంటేసుకొస్తుందో…

నవ్వేస్తాను….తెగ నవ్విస్తాను…!!!



నవ్వేస్తాను….తెగ నవ్విస్తాను…!!!
ఏడుస్తాను…ఏడ్పిస్తుంటాను…!!!
ఊ అంటాను…ఊహూ అంటుంటాను…!!!
అంతా నా ఇష్టం అంటూ…ఫోసులు కొడతాను…!!!
తిక్కగా ఎదో చేసి…తప్పుకుంటాను…!!!
గట్టిగా గదిమారంటే…ఒప్పుకుంటాను…!!!
అల్లరి చేద్దామంటే నేనే ముందుంటాను…!!!
గమ్ముగ కూర్చుని నేను కలలే కంటుంటాను…!!!
తెల్లవారి లేస్తానని శబధం చేస్తాను…!!!
బద్దకం పోనిలే అంటే…అంతా వదిలేస్తాను…!!!
దింతాన దింతానా…దింతాన దింతానా……!!!
కాదన్నా అవ్నన్నా..ఆ వింత నేనేనా…..!!!
చిన్ని చిన్ని చేతలతో..మురిసిపోతుంటాను…!!!
కలత ఏమాత్రమున్నా…బెదిరిపోతుంటాను…!!!
సినిమా చూస్తూ…సెంటీ అయిపోతాను…!!!
విఒలెంచె ఉంటే…అంతి నేనవ్తాను…!!!
నవ్వుల సంపద ఉన్న…జమిందారు నేను…!!!
సాకులు చెప్పని గొప్ప…షావుకారు నేను…!!!
గత జన్మలో…ఏం వెలగబెట్టానో…!!!
బ్రహ్మకే…తలనొప్పే తెప్పించేసానో…!!!
సరస్వతే సై అంటూ టా టా చెప్పిందా…!!!
లక్ష్మీ దేవి గూద్ లుచ్క్ అంటూ నన్ను దీవించేసిందా…!!!
స్వర్గం నుండి దిరెచ్త్గా ఇక్కడ పడ్డాను…!!!
అల్లరితో అందరికీ నరకం చూపించాను…!!!
దింతాన దింతానా…దింతాన దింతానా……!!!
కాదన్నా అవ్నన్నా..ఆ వింత నేనేనా…..!!!
 
ఎవరైనా నవ్వారంటే…ఇట్టే కరిగిపోతాను…!!!
కన్నీరే కార్చారంటే…వామ్మో మునిగిపోతాను…!!!
కాని ఎందుకో…నాకు నేను పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాను…!!!
తేనె జల్లు…వాన విల్లులా…ముచ్చటగా అనిపిస్తాను…!!!



ivi kooda



ఏవరైనా పొగిడారంటే..నా గుండె నన్నే వదిలీ…వేగంగా పరుగులు తీస్తూ ఉంటుందే…!!!
ఏమైందని ఆరా తీస్తే…భయమేస్తోందీ నాకంటూ…దూరంగా దాక్కుని వణుకుతూ ఉంటుందే…!!!
నుంచున్న నేలని వదిలీ…పైనున్న నింగికి ఎగిరే పొగరే నన్ను కమ్మేస్తుందనుకుంటుందే…!!!
నాలాగా నేనుండాలని..నవ్వుల్తో జీవించాలని…ఆశిస్తూ ఊపిరి పోసుకుంటుందే…!!! :)

……

నేనెంతా దాన్నైనా…నాతోనే ఉంటుందే…!!!
తప్పైనా ఒప్పైనా…నా తోడొస్తూ ఉంటుందే…!!!
మంచి చేసే గుణముండాలని…శాసిస్తూ ఉంటుందే…!!!
చెడు చేసే ఆలోచనొస్తే…నన్నే దహిస్తుందే…!!!

……
నువ్వు చెయ్యగలవంటే…తెగ భయపడుతుందే…!!!
తప్పు చేస్తానేమో…అని అనుకుంటుందే..!!!
నీపై నమ్మకమంటే…అమ్మో చచ్చిపోతుందే…!!!
నిలబెట్టలేనంటూ….తానే మూగబోతుందే..!!!

……

కొంచమైన ధైర్యం లేదే…!!!
చెయ్యనని చెప్పే పంతం లేదే…!!!
తనకు తానై బ్రతికేటి తెగువ లేదే…!!!
చిటి వరకు ఆ స్వార్ధం తనను చేరలేదే…!!!

……

నా గుండెకే…ఈ లోకంలో బ్రతకడం తెలియదే…!!!








నిన్నై గడిచిందో…
నేడై నిలిచిందో…
రేపై నీకై వేచిందో…!!!
ఆశై చేరిందో….
శ్వాసై తాకిందో….
ఎదకే ఏమైపోతుందో…!!!
నీ తలపులో…..నీ తలపులో…. ||2||
ఒక్క నువ్వే నా కళ్ళలో….తెలిపేదెలా నీకు???
బ్రతికేదే నీ ఊసులో….తెలిపేదెలా నీకు??
రోజంతా నీ ధ్యాసలో…తెలిపేదెలా నీకు??  
ఉన్నానే నీ తలపులో….తెలిపేదెలా నీకు???
నిన్నై గడిచిందో…
నేడై నిలిచిందో…
రేపై నీకై వేచిందో…!!!
ఆశై చేరిందో….
శ్వాసై తాకిందో….
ఎదకే ఏమైపోతుందో…!!!
నీ తలపులో…..నీ తలపులో….
నిన్నే చూస్తు  మనసే మబ్బుల్లోకే ఎగిరెనే…నేల మీద నిలవదు ఎందుకూ…..????
రాదు నోట పలుకే నువ్వే ఉంటే ఎదురుగా…మాట చెప్ప బెరుకే ఎందుకూ…???
ఏనాడు ఇది లేదు….!!!
ఈ నేను నే కాదు…!!!
నీలాగ మారానా సరికొత్తగా….!!!
గుండెల్లో ఈ అలజడే…తెలిపేదెలా నీకు…??  
నాలోనా ఈ ప్రేమలే….తెలిపేదెలా నీకు..??
నిన్నై గడిచిందో…
నేడై నిలిచిందో…
రేపై నీకై వేచిందో…!!!
ఆశై చేరిందో….
శ్వాసై తాకిందో….
ఎదకే ఏమైపోతుందో…!!!
నీ తలపులో…..నీ తలపులో….
గడియ గడియ మనసే నీకై వెతికే ఇంతగా…వదిలి ఉండలేదే ఎందుకూ….!!!
ఊపిరడనంతా నిన్నే నాలో నింపినా….దరికీ చేర బిడియం ఎందుకూ…!!!
నా అడుగు లో నేడూ…
తడబాటు మొదలైందే…
ప్రతి చోట ఉంటావే…ఆ నింగిలా..  
నా హ్రుదయం నీ అద్దమే…తెలిపేదెలా నీకు.. ???
నా సర్వం నీ కోసమే….తెలిపేదెలా నీకు..???
నీ నవ్వే నా  లోకమే…తెలిపేదెలా నీకు..???
అయ్యవే నా ప్రాణమే…తెలిపేదెలా నీకు..???

konni


నన్ను అర్ధం చేసుకుందామని చూడకు…నేను నీకు అర్ధంకాను….
నీకే కాదు ఎవ్వరికీ అర్ధం కాను….!!!
…………….
అందాన్ని వెతికే కళ్ళకు నేను అస్సలు కనబడను…!!!
తీయని స్వరం వినాలని చూసే చెవులకు నేను వినబడను…!!!
…………….
మంచి చేసే మనసుకి బానిసను నేను…!!
కరుణ నిండిన కనులలో కదిలే కన్నీటిని నేను…!!!
…………….
మంచి చెడ్డల సంద్రంలో దారి మరిచిన నావని నేను…!!!
గెలుపు ఓటముల మూలం బొధపడని అజ్ఞానం నేను….!!!
………………
నన్ను అర్ధం చేసుకుందామని చూడకు…నేను నీకు అర్ధంకాను….
………………
ప్రక్రుతి ప్రళయ తాండవం చేస్తుంటే..ఎవరికీ ఏం కాదు అనుకునే ఆశావాదం నేను…!!
కాలం నన్ను మోసగిస్తున్నా, స్నేహం నన్ను ఏమారుస్తున్నా పట్టించుకోని నిర్లక్ష్యం నేను…!!!
………………..
నన్ను అర్ధం చేసుకుందామని చూడకు…నేను నీకు అర్ధంకాను….
……………..
కావాలని నువ్వంటుంటే…"కాదు" అని అనాలనుకున్న అనలేని కల్మషం నేను….!!!
ఎవరు నన్ను ఏమంటున్నా, తిరిగి ఏమనాలో తెలియక తికమక పడే తత్వం నేను..!!!
……………..
నన్ను అర్ధం చేసుకుందామని చూడకు…నేను నీకు అర్ధంకాను….
…………….
నా జీవితం ఏవైపుగా పయనిస్తుందో గమనించలేని అమాయకత్వం నేను….!!!
నేనేంటో నాకే అర్దం కాని వింత మనిషిని నేను….అంతరంగాన్ని నేను…!!!
……………..
నన్ను అర్ధం చేసుకుందామని చూడకు…నేను నీకు అర్ధంకాను….
నీకే కాదు ఎవ్వరికీ అర్ధం కాను….!!!




గతం నన్ను మరచింది….
భవిత నన్ను వద్దంది….
ఈ నిముషమే పూర్తిగా నాకంటూ మిగిలింది…
…………….
కాలం నన్ను కాదంది….
కదిలి వెళ్ళిపొమ్మంది…
కధను మార్చేటందుకేమో కలం నాకు మిగిలింది…
…………….
కంటి చూపు ఏమార్చింది…
శూన్యాన్నే చూపిస్తుంది…
మనసు మాత్రం మొదటి నుండి వెలుగల్లే ప్రకాసిస్తుంది…
……………….
గుండె గాడి తప్పింది…
సుడిగుండాలే స్రుస్టిస్తుంది…
తెగువ మాత్రం తొణకకుండా నాతొనే ఉంటానంటుంది….
………………..
ప్రపంచం పో పొమ్మంది…
అనాధలు నాకొద్దంది…
ప్రేమ మాత్రం జాలిగా నన్ను కావలించుకుంది…
ఒక అమ్మలా, ఒక నాన్నలా నన్ను కవాలంటుంది….







అడుగులో….అడుగులా….
నడవగా….నువ్వలా…..
ఈ క్షణం…ఇక్కడే…
ఆగినా….చాలుగా….
    నా జీవితం నీ సాక్షిగా….
    వదిలి నన్ను నేరుగా….
    మారిందిలా నీ నీడగా..ఈ గాలిలో నీ శ్వాసగా…!!!
***
నిన్ను దాటి నడవ తలచినా….
పడదు అడుగు ఎంత అడిగినా…..
ఇలా…నా ఎదురుగా…
నువ్వుండగా….సాధ్యమా…. !!!

వద్దు అంటు ఎంత చెప్పినా…
నీ నుండి కనులు కదులునా…
ఇలా…నా మనసునే
నీ చూపులే…మార్చేసెనా…!!!
***
అడుగులో….అడుగులా…
నడిచినా…అందమా…..
    నీ తోడులో…అదేమిటో…
    ఆ మెరుపుల…సడేమిటో…
    నా కళ్ళలో ఓ స్వప్నమే నిలిచిందిలాగ సత్యమై…!!!
***
నన్ను నేను ఇన్నాళ్ళుగా….
చూడలేదు ఈ తీరుగా…
హయ్యో…ఏమాయెనో
నీ రాకతో…ఈవేళనా…!!!!
.....
చల్లగాలి నన్ను తాకినా….
నువ్వు అంటూ నేను నమ్మినా….
ఇదే…ఈ మాయనే
ప్రేమనే….అనెయ్యనా….!!!
***
అడుగులో అడుగులా…
నడవకే నువ్వలా…
    నా ఊపిరై…. నా ఆయువై
    నువ్వుండిపో… నా లోకమై…!!!
    నా నిన్నవై…నా రేపువై…తోడుండిపో నా నేడువై…!!!



నా కవితలో
నా మాటలో
అన్నీ ఉండాలి…!!!
నేను నేనుగా
నేల తోడుగా
సాగిపోవాలి….!!!
…..
జీవితానికే కొత్తగా  చిరునామా కావాలి…!!!
భాధలకే వీలునామా రాసి పంపెయ్యాలి…!!!
నా చిన్ని కవితలో ప్రపంచం ఉండాలి..!!
ప్రాణవాయువే నాకు పాళీ కావాలి..!!!
కాలం నాకోసమే కలమై కదలాలి…
ఆశలే ఒక్కసారిగా నింగికి ధ్వజమెత్తాలి…!!  

ఏదేమయ్యినా నాలాగే నేను ఉండాలి…
రేపు మారినా రోజు మారినా…నిన్న నేడుల రూపు మారినా…

ప్రకృతి లోని అందాన్ని

ప్రకృతి లోని అందాన్ని

సున్నితమైన బావాన్ని

అందమైన మనసున్ని

జీవితాంతం ఆస్వాదిస్తూ

ఆనందంగా ఉండాలని ఆశిస్తూ....

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

konni... unnai


లేదు నాకు గమ్యం నాటి వరకు….
ఆశ అంతకన్నా లేదు ఆనాటి వరకు
కానరాలేదు దేవుడు నాటి వరకు
ఆయన సృష్టించిన స్వర్గం ఆనాటి వరకు
కాని నిన్ను చుసిన తరుణం నుంచి…
ఆశ నా యెదలో, నువ్వు నా మది లో, స్వర్గం నీ సడిలో
అందుకే, నా ఆశ, నా ఊపిరి, నా ఆలోచన,
అన్ని నీకే అంకితం ఓ నా ప్రాణమా…




నిన్ను చూడక ముందు గడిపిన కాలం, కాలమే కాదు
నిన్ను చూడకుండా గడుపుతున్న ఈ సమయం, సమయమే కాదు
నువ్వూలేకుండా ఆనందంగా గడపగలిగితే ఆది నేను కానే కాను



నే చేరలేని దూరాన నువ్వున్నా...
నిన్ను చేరే ఆ క్షణం కోసమే...
వేల కన్నులతో నిరీక్షిస్తున్న...
వేయి కరములుసాచి వేచివున్న!!

ఏకాంతపు క్షణాలు...
నీతో గడిపిన గతకాలపు మధురాలను...
గుర్తుకు తెస్తుంటే...
ఈ దూరం బారమౌతుంది...
ఆ బారం భరించలేక నా సగభాగం నీకిచేయ్యాలన్న...
ఆరాటం అధికమౌతున్న తరుణాన...

ప్రతిక్షణం నువ్వు... అనుక్షణం నీ నవ్వు...
క్షణక్షణం నన్ను నీ విరహంలో ముంచివేస్తుంది!!
మరుక్షణం నీ ద్యాసలో నన్ను దాచేస్తుంది!!






ప్రతిక్షణం నీ కోసం...
పరితపించే నా మనసునడుగు!!

అనుక్షణం నీకోసం...
అన్వేషించే నా ఆలోచనగుడు!!

నువ్వు ఎదురైతే...
నవ్వులు పూచే నా పెదవులనడుగు!!

నువ్వు పలకరిస్తే...
తడబడే నా మాటలనడుగు!!

తెలుపుతాయి అవి నీకు...
నీకై తలచిన తలపులు ఎన్నో!!





నీ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి
ప్రేమను ప్రేమించడానికి
ఆటుపోటులు వచ్చాయి ప్రేమలో
ఏం చేద్దాం...అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

ఎంత ఆలోచించినా నీ జ్ఞాపకాలను మరులేకున్నాను
అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

ప్రేమలో అన్ని కలలు తియ్యగానేవున్నాయి
కాని.. నీవు లేని లోటుతో
చేదుగా మారింది జీవితం
అయినా నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

క్షణమొక యుగంలా గడిచినా...
రోజులు, నెలలు, సంవత్సరాలు జెట్ స్పీడుతో పరుగెట్టినా...
మునుపటి ఉత్సాహం లేదు..
నిరాశ..నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాను
అయినా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

నిద్ర కోడి నిద్రలా మారింది
ఆలోచనలు ముసురుకుంటున్నాయి
అయినా నీజ్ఞాపకాలు వెంటా...డుతూ...నే.....ఉన్నాయి

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

naa hrudaya


నా  హృదయ  నందనవనంలోని  వసంతమా,
నా వలపు  తోటలోని  సాహిత్యమా,
నా  పెదవి  పాడే    మౌన గితమా,
నన్ను   వెంటాడే   ఓ  నా   కళల  బంధమా,
నన్ను  రచిచపజేసేయ్  ఓ  నా   అక్షర  అలంకారమా  ,
నన్ను  గమనించే   ఓ  ప్రకృతి   నేస్తమా,
- అందుకో  నా  కవిత  వధానం!




మరణిస్తున్నాను మన్నించు నేస్తం
శరీరంతో ప్రతీ సారి
మనసుతో ప్రతిక్షణం
నేడు రేపుల మధ్య నలుగుతున్న
నీలి ఘటనా దృశ్యాల మధ్య
ఒంటరిగా
అచేతనంగా.. నవ్వుకుంటూ
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!
స్వప్నాలు ఆగిపొతున్నా
కెరటాలు కదలనంటున్నా
ఆదర్శం అణగనంటున్నా
నాకంటూ ఎవ్వరు మిగలనంటున్నా
ఈ మానసిక ప్రయాణం
శబ్ద సమూహాల వద్ద చేరి
ఆత్మసంఘర్షణల మధ్య .. కన్నీటితో
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!
ఆనందం కోసమో ..
అనురాగం కోసమో..
సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో
మధ్య మధ్య మండుతున్న ఈ విశ్రాంతి భరించలేక
ఒక్కోసారి తగలబడుతున్న వెలుగు కంటే
కళ్ళు కనిపించనంత చీకటే నాయమనిపిస్తుంటే...
తట్టుకోలేక
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!
జననానికి మరణానికి నడుమ మిగిలేది
ఒకే ఒక కన్నీటి పంక్తి మాత్రమే..
నలుదిక్కులనుండి చేయి చాస్తున్నది
ఎపుడో ఒక నాటి నవ్వు మాత్రమే..
అందుకే.. దేన్నీ ఆహ్వానించలేక
అలాగని త్యజించలేక
నాలో ఉన్నా నీతో బతికే ధైర్యం లేక
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

10, ఫిబ్రవరి 2011, గురువారం

inkonni kavitalu


నిదురిస్తున్న రేయి ఎదురుచూసేది ఉదయం కోసం
నిదుర లేచిన నా నయనం ఎదురుచుసేది నిన్ను చూసే క్షణం కోసం
అదరాలు కదిలేది మాటల సడి కోసం
నా పెదవులు సడి లేక మౌనమైంది నీ తీయని ముద్దు కోసం

గుండె చేసే అలజడి ప్రాణం కోసం
నా ప్రాణమైన నువ్వు నా గుండె గుడిలో నిదరోవడం కోసం
కరములు చలించేది అన్ని అవసరాల కోసం
నా చేతుల అవసరం నిన్ను దగ్గరికి తీసుకొనే వెచ్చని కౌగిలి కోసం
పాదాల పయనం జీవిత గమ్యం కోసం
నా అడుగుల గమనం నిను చేరుకొనే ఆస కోసం ....





నా జీవిత గమ్యానికి ఊపిరి నీవు
నా పలుకుల భావానికీ అర్ధం నీవు
నా ఆనందాల క్షణాలకి ఆకాంక్షవు నీవు
నా ఆవేశానికి అణుకువ నీవు
నా నడకల పయనానికి గమనం నీవు
అలాంటి నిన్ను.....
ఏ దారని వెతకాలి , ఏ దిక్కున పయనించాలి





నా కన్నుల వెనుక స్వప్నం నీవ్వు
నా మాటల వెనుక మౌనం నీవ్వు
నా శ్వాసల వెనుక స్పందన నీవ్వు
నా విజయం వెనుక శ్రమ వి నీవ్వు
నా భాధల వెనుక కన్నీరు నీవ్వు
నా గమ్యం వెనుక పయనం నీవ్వు
నా రేపటి వెనుక నిన్నటివి నీవ్వు
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడువి నీవ్వు






పచ్చని నీ పయనంలో..
ఏది శాశ్వతం ఏది జ్ఞాపకం?
నచ్చినవన్ని నెడుతూ ముందుకు దూకే నీ జీవిత గమనంలో..
ఎన్నెని పరిచయాలు ఎన్నెని పంజరాలు...!

అన్నింటిని తెంపి అన్నింటిని మరిచి
ముందుకు సాగే నీ ప్రయాణంలో..
నీది అంటూ ఏమి మిగలక
ఓ స్నేహ హస్తం కోసం సతమతమవుతున్న ఓ చిలకా.....
నా దరి చేరకు నన్ను పిలవకు
నాది నీ బ్రతుకే అని మరువకు...





నా మదిలో ఆశల హరివిల్లు నిలిపిన చినుకు తడివి నీవే
నా కలల కోటను కూల్చిన కడలి కెరటం నీవే
నా మనసు నేర్చిన ప్రేమ ఓనమాలు నీవే
నా పెదవులు రచించిన మౌన కావ్యం నీవే

నా కంటి పాపకు జోల పాడిన జాబిలమ్మ వి నీవే
నా కంటి రెప్పల పై అల్లుకున్న కాళరాత్రి వి నీవే
నీ ఉహల దారులలో నన్ను నడిపింది నీవే
నీ యడబాటు తో నన్ను శూన్యం లో నిలిపింది నీవే
ఒంటరిగా సాగుతున్న నా జీవితాన్ని ఆక్రమించింది నీవే

నిన్ను నా అణుఅణువునా నింపుకున్న నన్ను ఒంటరిని చేసింది నీవే
నిన్ను పొందటాన్నికి నేను మరణించిన అది వరమే
మరు జన్మకైనా నా ప్రేయడివి నీవే






నా హృదయం లోని ఆవేదనను నీకు చెప్పాలని
సాగరం లో ఎగసిపడే అలలా నీ దరికి వస్తాను...
కానీ ఈ చిన్న మనసుకేం తెలుసు
హృదయమే లేని చోట ప్రేమను వెతకటం
అత్యాశ అని ....?

నిరాశతో తిరిగి అలలా వెనక్కి వెళ్ళిపోతాను
మళ్ళీ పుడుతుంది వింత కోరిక.....
నా మనసులో మాట చెప్పాలని
మళ్ళీ కెరటం లా నీ దరికి వస్తాను
కానీ అప్పటికి కూడా తెలియదు నా మనస్సుకి
నీ గుండెలో ప్రేమ ఎండమావిలో నీరు అని ....

అంతే...
మళ్ళీ తిరిగి
వెనక్కి వెళ్ళిపోతాను....
వేగంగా...
నిరాశతో....






ఎగసి పడే భాధనంత
కంటనీరుగా కారకుండా
గుపెడంత గుండెలోన
దాచి వుంచ భద్ర పరిచ
దాగలేనని అది అలల కడలిల
ఉరకలేస్తూ పరుగుతీస్తూ
మది భంధనాలను తేన్చుకుంటూ

వాన చినుకుల...,కనుల నుండి కారుతుంది జలపతమలే
కంటి చూపు మసకబారింది
గుండె బరువుతో క్రుంగిపోయింది
కారి కారి కనీరు ఆవిరై
కనులు ఎండి ఎర్రబారినవి
పోదు గడవదు రేయ్ తలియదు
కలల స్వప్నం చదిరిపోయింది
కంట నీరుగా తరలిపోయింది

జ్ఞాపకాలను వీడిపోయింది
గాలి వానలో నను వదిలిపోయింది
................ఒంటరై తాను సాగిపోయింది.......!
ఒట్టులని గట్టుకి చెల్లు
కన్న కలలు కాటికి చెల్లు
జ్ఞాపకాలు మనసుకి మీగులు
నా కంటి పాప.....నీ మరణం పాపం ఎవరికి చెల్లు???

అదుముకున అపుకున అగనన్నవి కనీళ్ళు !!

inkonni



నేను పుట్టిన రోజు నాకిష్టం ..
నన్ను ప్రేమించే నా కుటుంబం అంటే నాకిష్టం..
నన్ను విడిచి వెళ్ళిన ప్రతీది నాకిష్టం ..
నేను విడిచి ఉండలేని స్నేహ బంధాలు నాకిష్టం ..
ఎల్లప్పుడూ నాతో దోబూచులాడే జయాపజయాలన్నా నాకిష్టం ..

నేను ఎవరికీ దూరమైన ఏదో ఒక రోజు దగ్గర అవుతాననే భావన నాకు చాలా ఇష్టం!
కొంచెం వెటకారంగా !
మరి కొంచెం చమత్కారంగా !
కొంచెం ముక్కు సూటిగా !
మరి కొంచెం డొంక తిరుగుడిగా !
కొంచెం అమాయకంగా !
మరి కొంచెం గడసరిగా !

ఇలా నేను నేనులా ఉంటాను... అందుకే నాకు నేనంటే చాలా ఇష్టం!
అన్ని ఇష్టాలేనా...! అనుకుంటే ఎలా?
అందుకే
అస్తమాను ఏడ్చేవాళ్ళంటే నాకు భలే చిరాకు.
ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు మహా చిరాకు!
అలాగే..

గోరంత దాన్ని కొండంతగా చూసుకొని బెదిరిపోయే వాళ్లన్నా చిరాకు!
అందుకే నాకు చిరాకు తెప్పించే వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచుతా...
గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంటా...
ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటా!

ఈ చిన్న జీవీతాన్ని ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా గడపాలనుకుంటాను..
నాతో ఉన్న వాళ్ళని సంతోష పెట్టాలనుకుంటాను....





చెంతనున్నదేదో చెయి జారిందని ఒకరు
కోరిక ఏదో తీరక కుమిలి కుమిలి ఒకరు
తోడు దూరమయ్యిందని గోడుమంటు ఒకరు
చావు వచ్చి ఒకరు పోతె బావురంటు ఇంకొకరు
రకరకాల శోకం చూస్తున్నా గాని
ఒకసారైనా నయనం చెమ్మగిల్లదేమి
కంటి నీటిలో ఉప్పదనం తెలియాలంటే ముందు
కమ్మని అమృతమంటి ప్రేమనూ చవి చూడటమే మందు
ఒంటరి వాడిని నే ఒంటరి వాడిని
ప్రేమను పొంది ప్రేమించేందుకు ఎవరున్నారనీ
ఎవరున్నారనీ నాకెవరున్నారనీ
ఎందుకు అనుకుంటావయ్యా నీ కెవరూ లేరనీ
అందాకా అనుకోవయ్యా నీకన్నీ నేననీ
ఎందుకు అనుకుంటావయ్యా నీ కెవరూ లేరనీ
అందాకా అనుకోవయ్యా నీకన్నీ నేననీ
నీ వేలి కొనలు నేను అలా తాకుతుంటే
నా గుండె లో వీణలు మ్రోగినట్టు ఉంది
అదే సుమా ప్రేమ
నీ నీలి కనులలోకి తొంగి చూస్తూ ఉంటే
ఆకాశం నా కోసం దిగి వస్తూ ఉంది
అదే సుమా ప్రేమ
కదిలీ కదలని పెదవుల మౌనం వింటుంటే
కధలెన్నో నువు నాకు చెబుతున్నట్టు ఉంది
అదే సుమా ప్రేమ





చలనం లేని న మనసు ను ...
ప్రళయం లా వచ్చి దొచేసావు.....

ప్రాణం ఉన్నా , రూపం లెని నా ఊహలకు ...
నీ పరిచయం తో జీవం పోసావు .....

ప్రణయం కోసం పరితపించే నా ఈడు కు ...
పరువం అంటే స్వర్గం అని తెలిసేలా చేసావు .....

శూన్యం అని అనుకున్న నా ప్రాయం ను ...
సాగరం అనే కలవరం లోకి దిన్చేసావు .....

చీకటిగా ఉన్న నా పయనంలో వెలుతురును పంచావు ...
ప్రియతమా నా ప్రాణం నీకు అంకితం చేస్తున్నాన్ను ...





నువ్వు లేని ఈ క్షణం ఎంతో భారం అది ఆనందపు మిళితమైన,
నువ్వు లేని ఈ హృదయం ఎంతో కఠినం అది ఎంత సుకుమారమైన,
నువ్వు లేని ఈ జీవితం ఎంతో వ్యర్ధం అది ఎంత విలువైనదైనా,

నువ్వు అన్నే నన్ను నీలో చూసుకోవాలని ఈ ఆరాటం ఆ సంద్రం కెరటానీదా లేక నీ ప్రేమ దా,
నీ ప్రేమదే అనీ నా గుండె సవ్వడి నీరంతరం అంటుంది .......
అనీ నీకు చెప్పాలని ఆశ.. ....
కానీ నీ మాటలు నన్ను మౌనిని చేస్తున్నాయి...
నన్ను మైమరిపిస్తున్నాయి ......

అపుడు అనిపించింది ఇంకా నాలో నేను లేనని....మొత్తం నువ్వనీ .....
అనుమతైన అడగని నీపైన కోపం తెచ్చుకోవాలి అనీ ...
కానీ..
ఎలా తెలుపను....







కనులనోని కావ్యమై
కనిపించని గమ్యమై
కన్నీటి గానమై
కాలరాచే కష్టమై
కబళించే ప్రళయమై
కనిపించని గానమై
నను వేధించావు
నా వేదన రూపమైన
ఈ కవితను నీకే అర్పిస్తున్నా.....కాని
ఎన్నటికి నిను మరవనని మాటిస్తున్నా

ivikooda


ఎన్ని యుగాల నిరీక్షణ ఫలితమో కదా
నిర్మలమయిన నీ స్నేహం
నా కలలన్నీ నీ ఆలోచనల ప్రాకారాలయ్యాయి
నేను నేను కాదు
నువ్వు నువ్వు కాదు
మనం మాత్రమే
ఒకే ఆలోచన
ఒకే ఊహ
ఒకే ప్రపంచం




అమావస్యలో చంద్రుడిని వెతుకుతున్న..
ఎగసిపడే కెరటంలో సుఖ సంతోషాలు వెతుకుతున్న..
కాలిపోయే కట్టెలో సుగంధాన్ని వెతుకుతున్న..
రాలిపోయే పువ్వులో మకరంధం వెతుకుతున్న..
మూగపోయే గానంలో సరిగమలు వెతుకుతున్న..
గమ్యం లేని దారిలో ముగింపును వెతుకుతున్న..





ప్రేమ అనే పరుగు పందెం యుద్దం లో పరిగెడుతున్నావు ....
మద్యలో రాళ్లు , ముల్లులు , ఎత్తులు , పల్లలు ,
వస్తూనే ఉంటాయి ...
నిన్ను గాయపరుస్తూనే ఉంటాయి ...
ముల్లు ఉంది కదా అని బయపడితే ముందుకు అడుగు వెయలేం ..
రాయి తగిలుతుందని అనుకుంటే గమ్యం చేరలేం ..
ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కరం ఉంటుంది ...
జీవితం సముద్రం ఈదాలి కాని మునగకూడదు ..
జీవితానికి అర్థం సృష్టించాలి ... వ్యర్థం కాదు ....
పరిష్కరాన్ని వెతుకండి ...
సమస్యను కాదు ...
నీ ......... సంతోషం కోరె ....





తనే జివితం,నా ప్రపంచం అనుకున్నాను కాని తనకు మత్రం నెను కాకుండ మరో
జివితం ఉందని కోత్త ప్రపంచం ఉందని తెలిసింది తనను అడలేక తనను మర్చిపోలేక
నరకయాతన పడుతున్నాను మిత్రమా నా దారిలో మళ్ళు,రాలు,.... లేవు అస్సలు నా
దారే ముసిపోయింది నడి సంద్రన చికటిలో సంద్రన్ని ఈదలేక
మునిగిపోతున్నాను.....................

మిత్రమా




నాకళ్ళదుట నీవు లేకున్న నాకను పాపలలో మేదులుతున్నావ్
నాలో నీ మిద వున్న ప్రేమ చవనంటుంది.
ఎడారిలో కోయిల్ రాగాల కొసం పరుగెట్టినట్టు నీప్రేమ ఎండామావి అని
తెలిసిన్ నా ప్రాణం నిన్నే చెరుకోవాలనుకుంటుంది.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

ivi kooda


ఎన్నాళ్ళు నువ్వు లేని ఈ ఒంటరి పయనం ?
నీ జ్ఞాపకాల తీరంలో నీ అనుభూతుల తెన్నెలలో కూర్చున్నాను ఒంటరిగా
నీ తోడు లేని నా పాదాలు తాకి వెనక్కిపోతున్నాయి ఆ కెరటాలు మౌనంగా
నీ కోసం నాలో రగిలే విరహ ఆవిరిని చల్లచలేక
మారుతున్నాయి ఆ శీతల పవనాలు వెచ్చగా
నా హృదయఘోషకి దిగ్భాంతి చెంది చూస్తుంది సాగరం వింతగా
నా మనసు లోని నీ తలపుల వెల్లువ ప్రోగింది కన్నీరుగా
శాంతించింది నా హృదయం నువ్వు పంపిన ఓదార్పు చిరుజల్లు తాకగా
ఇలా నీ ఓదార్పుతో నేను ప్రతిరోజు గడుపుతున్నా?
ఎన్నాళ్ళు నువ్వు లేని ఈ ఒంటరి పయనం





ప్రేమ........తేలుస నీకు
తేలుస నీకు ఒ ప్రేమ
నువ్వు చేసిన గాయం లొతెంతొ
నువ్వు చితిపెటిన హ్రుదయం విలువెంతొ
కన్నీరు కనులనుండి జాలువారి తరలిపొతుంటే
అ తడి అరే వరుకే బాద!!
అదే కన్నీరు కనులనుండి కంఠన చేరి
ఎదలొతులకు జారుతుంటే
యవరు వర్ణించగలరు మనసు పడేక్షొబ!
తొడునీడై అడుగు వేస్తనని
చీకటి నీడలొ వీడిపొయవు
మాటిమటికి మదినితటి
జ్ఞపకమై ఏదను వేంబడిస్తవు






క్షణక్షణమున అణువణువునా కరుగుతున్నా తన వెలుగును
ఈ లోకాన్నికి పంచక మానదు ద్వీపం ప్రేమ
తన స్పర్శతో పరవశం కలిగించి తన రూపును దోచుకుంటున్నా
క్రాంతి ని అడ్డుకొద్దు చీకటి ప్రేమ
ఎగిసిపడుతూ వచ్చి తాకి మరుక్షణంలో తనన్ని విరహలో
ముంచి పోయే కెరటాలను ఆపదు తీరం ప్రేమ
ఏ రూపు లేకుండా తన ఒడిన్ని చేరి ఓ రూపు వచ్చినక
తనన్ని చేసి పోయే చినుకు పై ద్వేషం పెంచుకొద్దు నింగి ప్రేమ
బిడ్డలా ఒడిన్ని చేర్చుకున్ని సాకిన తన గుండెనే చీల్చి
ఎదుగుతున్న మొక్కను నాశనం చేయద్దు నేల ప్రేమ
తన ఉనికి తో తమ మనుగడను సాగిస్తున్నా
ప్రతిగా ఎటువంటి ఫలం ఇవ్వకున్నా జీవకోటిన్ని విడిపోద్దు వాయువు ప్రేమ
ఇలా
తన చుట్టూ ఉన్న ప్రేమలలో ఏ ఒక్క ప్రేమన్ని ఆదర్శంగా తీసుకున్న
చిరకాలం మధురస్ముతిగా మారుతుంది " మనిషి ప్రేమ





ఎన్నాటికి నన్ను మరువకు ఓ నేస్తం .
అలిసిన నా కన్నుల్లో ఓ కమ్మని కల చేరినప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
మూగబోయిన నా పెదవుల పై ఓ చిరునవ్వు విరిసిన్నప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
ఆగక సాగే నా పయనం లో ఓ చల్లని మజిలి ఎదురైనప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
నా హృదయపు ప్రతి స్పందన కు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
నన్ను నేను తలుచుకున్న ప్రతి నిమిషం : గుర్తుకొస్తుంది మా స్నేహం .
అందుకే,
నన్ను విడిపోని నీ జ్ఞాపకాలతో సాగిస్తాను నా జీవితం .
ఎన్నాటికి నన్ను మరువకు ఓ నేస్తం





ఎలా ఉన్నావని ఇలా అడిగితే ఏమని చెప్పను..?
నీ ఎడబాటుల సుడిగుండంలో యేరులై పారుతున్న నా కన్నీటి వరదలో శిధిలమై ఉన్నాను..
నీ విరహాగ్ని జ్వాలల అగ్నిగుండంలో వెచ్చని నీ విరహపువడిలో దహనమవుతున్న కట్టెనై ఉన్నాను..
నీ దర్శనానికై వెతికి వేసారిన నా నయణం కానలేక నువుకానరాక మనలేక మరణించలేక ఉన్నాను..
నీ ప్రేమలేక ప్రేమార్ధినై ప్రేమ మైకపు మత్తులో ఎలా ఉన్నానో ఏమిచేస్తున్ననో తెలియకుండా ఉన్నాను..

అప్పుడు హఠాత్తుగా మాటైనా చెప్పకుండా కనుమరుగైన నువ్వు..
ఇప్పుడు హఠాత్తుగా ఎదురై ఎలా ఉన్నావని ఇలా అడిగితే ఏమని చెప్పను..





నా హృదయం లోని ఆవేదనను నీకు చెప్పాలని
సాగరం లో ఎగసిపడే అలలా నీ దరికి వస్తాను...
కానీ ఈ చిన్న మనసుకేం తెలుసు
హృదయమే లేని చోట ప్రేమను వెతకటం
అత్యాశ అని ....?
నిరాశతో తిరిగి అలలా వెనక్కి వెళ్ళిపోతాను
మళ్ళీ పుడుతుంది వింత కోరిక.....
నా మనసులో మాట చెప్పాలని
మళ్ళీ కెరటం లా నీ దరికి వస్తాను
కానీ అప్పటికి కూడా తెలియదు నా మనస్సుకి
నీ గుండెలో ప్రేమ ఎండమావిలో నీరు అని ....
అంతే...
మళ్ళీ తిరిగి
వెనక్కి వెళ్ళిపోతాను....
వేగంగా...
నిరాశతో....





నేనంటూ ఉన్నానని చెప్పింది నీవు...
నాలోని ప్రతి ఆశకు సంకేతానివి నీవు...
నాలోని ప్రతి తలపుకు ప్రారంభానివి నీవు...

నా ఒంటరి జీవితంలో తొలి నేస్తానివి నీవు...
ఇన్నాళ్ల నా ఎదురుచూపుకు అర్థం నీవు...
నా ఇన్నేళ్ల జీవితానికి పరమార్థం నీవు...
నాకు మాత్రమే కనిపించే సరికొత్త రూపానివి నీవు...

అన్నీ నీవు... అంతటా నీవు... నాలోని ప్రతి అణువూ నీవు...
నాలో చలనాన్ని రగిలించింది నీవు...
నాకు సరికొత్త లోకాన్ని చూపించిందీ నీవు...
కానీ నాకు మాత్రం ఏమీ కావు...






జాడలేని ప్రాణం రూపాన్ని పరిచయం చేశావు
నేనెరగని నన్ను నాకే కొత్తగా చూపించావు

చేతికందని నింగిలోని తారల్ని నవ్వుతూ దోసిళ్లలో పోశావు
సరసమైనా తెలియని మనసుకు విరహాన్ని రుచి చూపించావు

మాధుర్యం తెలియని జీవితంలో వసంతాలు రప్పించావు
అన్నీ తెలిశాక మాత్రం అందనంత దూరాన నిలిచావు





నా కనులకు తెలుసు
నే నిన్ను చూడలేనని
నా మనసుకి తెలుసు
నే నిన్ను చేరలేనని
నువ్వు లేవని తెలుసు
ఇక రావని తెలుసు
అయినా నా నేస్తం..
నే ఒంటరిని కాను
నీ తలంపులు నాతో ఉన్నంత కాలం




నా కనుపాపలో నీ రూపం,
నా గుండె లయలో నీ ప్రేమ,
నా ఉచ్వాస నిశ్వాసలలో నీ స్పర్శ,
నా మనసు పొరల్లో నీ జ్ఞాపకాలు,
మరణం లేనివి....!!!
నీవు బాధగా ఉన్నపుడు బయపడ్డాను,
నీవు సంతోషంగా ఉన్నప్పుడు సంబరపడ్డాను ,
నీ తోడు కోసం కొవ్వోతిలా కరగాడానికైనా సిద్దమయ్యాను,
అయినా ....ఎందుకు బదులులేని ప్రశ్నైపోయావు ....
ఎందుకు నా నిరీక్షణను అర్థరహితం చేసావు ...

ఇంకా..ఏదో ఆశ...నీవు నాకై వస్తావని నీ దరికి చేర్చుకున్టావని.... !!!
ఇకనైనా రావా....నను చేరుకోవా ....
దయలేని హృదయాన్ని కాదుగా నేను ప్రేమించింది...
వినలేని మనసుని కాదుగా నేను ఇష్టపడింది...
నీవు నా కలల బందీవి..నను విడిచి ఎన్నటికి వెళ్ళలేవు నేస్తం...
గురుతుంచుకో నా చివరి శ్వాసదాకా.....






నా కల ను సైతం నువ్వు చేరకున్నా
నిన్నటి నీ కలలోనే నిదురిస్తున్నా
నీ మాటల చిరుజల్లు కురిపించకున్నా
నీ తలపుల జడి లో నిత్యం తడుస్తున్నా
కన్నీరే నువ్వు నాకు మిగిల్చిన
నీ రూపం కరిగి పోకుండా వాటిని దిగమింగుతున్నా
నా తోడు నువ్వు రాకున్నా
నిన్నటి నీ అడుగుజాడల తోడు తో సాగుతున్నా
నీ గుండె లో నా రూపం చేర్పి వేసినా
అది నాకు చేత కాక నా గుండె నే ఆపివేస్తున్నా






అతడు నింగిపై నక్షత్రం
నెను భువిపై ఆశ చిత్రం
 అతడుమేఘం ఒడిలో ఏడు రంగుల రూపం
నేను చేరాలని ఎగసిపడె అలల కెరటం
 అతడుప్రతిభింభం నాహృదయంలో
అతనేమో అందని దూరంలో
నా ఆశలనీ కనీరై కలగానే మేగిలాయి
 అతనిచూపులు చినుకులై ఎద లొతులు తకాయి
ఇది గాయపడిన మనసు కధ
జ్ఞాపకాల ప్రేమ వ్యధ (బాధ)
....................................నా ప్రేమ పేరు మౌనం............................................
.............................................అది పెదవి దాటితే శాపం..............................





కన్నుల్లో నీ రూపు కరిగి కన్నీరుగా మారి చెక్కిళ్ళపై జారింది ,
గుండెల్లో నీ ఊసు ఊహగా మారి ఊరించ సాగింది ,
నీ జాడ కోసం నా పాదమే పక్షిగా మారి ఊరంతా తిరిగింది ,
నీ రాక కోసం నా కంటిపాపే కలువలా మారి ఎదురుచూసింది ,
నీ మాట కోసం మదిలోన భావం మెరుపుగా మారి మురిపించ సాగింది ,
నీ చెలిమి కోసం నా పిలుపే నీ తలపుగా మారి తపించ సాగింది ,





నేను నీవని నేను కాదని నన్ను నమ్మించావు...
నీ తలపుతో నీ వలపుతో నన్ను కవ్వించావు..
నాది ఏది లేదని, ఉన్నదంతా మనమని పిచ్చివాడిని చేసి..
నేను నేనని మనము వేరని నా కళ్ళు తెరిపించావు..
నీవు నీవుగా నేను వేరుగా నన్ను కబలించావు..
నీ తలపుతో నా గతముతో జీవించమన్నావు...





ఆ నిమిషం తెలియలేదు
నీ అడుగులో అడుగెయ్యాలని
నీ వెనకే నిలుచున్నాను
నీ
అడుగు మరో అడుగులో పడుతుందని
నా జీవితం మరో యేడడుగులే అని
ఆ నిమిషం
తెలియలేదు

నీ మాటలే నా పలుకవ్వాలని
నా మాటలకి మౌనం నేర్పాను
నీ
మాటలే అరువొస్తున్నాయని
నా పలుకు మూగబోతుందని
ఆ నిమిషం తెలియలేదు

నువు
నాతో ఉంటే యే చిక్కుముడులైతే
నా దారికడ్డమేంటనుకున్నా
నీకు పడ్డ
మూడు ముళ్ళలో
నా ఊపిరి చిక్కుకు పోతుందని
ఆ నిమిషం తెలియలేదు






నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది
నీతో నన్ను ఊహించుకుంటూ నా మది
మురిసిపోయింది
నీ అభిమానానికి నా హృదయం పొంగిపోయింది
ఆ అభిమానానికి
అర్థం తెలిసి నా గుండె ఆగిపోయింది
నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై
కరిగిపోయింది
తీగ తెగిన వీణలా నా గొంతు మూగబోయింది
నీకోసం
ప్రాకులాటలో నా మనసు అలసిపోయింది
ఏంటో ఇదంతా కలలా జరిగిపోయింది
కాని
నీకు తెలియదు, నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది





ఒక చిన్ని వర్షపు చినుకు
కంటికి చిన్నదే కానీ
ఎక్కడో ఒక పుష్పం
దానికోసం ఎదురుచూస్తుంది..
అలాగే ఒక పలకరింపు
స్క్రాప్ చిన్నదే కానీ
నా మనసు దానికోసం





ఒకో క్షణం,
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ విశాల ప్రపంచంలో,
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి
చంచలత్వంతో మోసం చేస్తా
నా నమ్మకాన్ని వెక్కిరిస్తాయి
వాటిని పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి
అనుక్షణం వెంటాడుతూ
నాతో పోరాడతాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి...






నీ తలపుతో కదిలిన ఉదయం
నీ వలపులో నిదురిస్తుంటే....
నివు రావని  తెలిసిన మలుపూ
కన్నీటిని కదిలిస్తుంది.


నీవన్న అలోచనలే
ఈ మనసుని మురిపిస్తుంటే....
నీ నీడగ సాగిన పయనం
నన్నీడనే నిలిపేస్తుంది.


శ్వాసల్లో మిగిలిన ఆశ
ప్రాణాలని ఆపుతు ఉంటే....
కసితీరా  కాలం మాత్రం
నిరీక్షణం లో నిలిపేస్తుంది.


నీదారిలో నిలిపిన కళ్ళకి
ఎదురుచూపు హాయిగ వుంటే.....
కన్నీరు గుండె వైపుగా
ఓదార్పుతో పయనిస్తుంది.





కాలం లో బంధాలు   కాలంలోనే  కలిసిపోతాయ్!
మనసులో బంధాలు  మనసులో మాసిపోతాయ్!
కలిసినడిచే బంధాలు మజిలీల్లోనే నిలిచిపోతాయ్!
ఆత్మబంధాలేనేమో, అంతందాకా నిలిచుంటాయ్!

ఇంత తెలిసినా సత్యం చేరని
ఈ నా తలపుల కాలపు గొలుసు..
అంతారంగానికి  అంతా తెలిసినా,
అనుభవానికొచ్చేదాకా తెగదని తెలుసు!!

ఎందుకంటే, నేనూ కాలంలోనే వున్నాను...
ప్రతి రోజూ కొద్దికొద్దిగా కరుగుతున్నాను!
కాలాన్ని దాటాలంటే కడకు ఒకటే దారి
ప్రేమలో మునిగి ప్రేమనైపోవడమేననీ తెలుసు!!

 నేను కాలనికి వీడుకోలు పలకను, పలికితే
లోలోన తిరిగి కలవాలనే భావన ఉండిపోతుంది.
కాని ప్రేమా! కాలానికి మాత్రం నన్ను వదిలేయకు,
నీవడిలో ఉంటే  కాలం కూడా కొద్దికొద్దిగా కరిగిపోతుంది..






ప్రతి పనికి, ప్రతి అడుగుకి
అలా ఎందుకు, యిలా ఎందుకు అంటూ
పది మందీ
ప్రశ్నలతో గుచ్చి పోతున్నారు

సమాధానం చెప్పకపోతే
చవటనను కుంటున్నారు
సమాధానం చెపుతూ పోతే
నా సమయం వృధా చేస్తున్నారు
సమయం వృధా చేసానంటున్నారు
సహాయం అడిగితే మాత్రం
సమయం లేదంటున్నారు

గమ్యం వైపు సాగిపోతుంటే
సహాయం చేసే చేతులుకన్నా
విమర్సించే మాటలు
వూరంతా వినపడుతున్నాయి

క్రమశిక్షణ పేరుతో
మనసుతో యుద్ధం

ivi bagunnai


మన పరిచయాల జడిలో తడిసిపోయి అలజడిని మరచిపోయాను ,
మీ చిరునవ్వుల సవ్వడిలో శబ్దాన్ని కోపమనే శత్రువుని వదిలించుకున్నాను ,
మీరు పంచిన జ్ఞాపకాలలో మునిగి , అనురాగపు అలలపై తేలుతున్నాను ,
అంతే లేని అందాలు , కన్నీళ్ళే లేని బాధలు ,
బాధలే లేని కష్టాలు , కష్టాలే లేని జీవితం ఉండదేమో ,..............
అన్నీ ఉన్నా ...............
నువ్వు నాతో ఉన్నావన్న భావమే నన్నింకా బతికిస్తోంది...........................
ఈ జన్మకది చాలు నేస్తం....................





మనసులోని భావాలెన్నో:-
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం .......




నీకు రాసివ్వాలనే ఉంది..

గుండె గుండెకు మధ్య
విధి వింతగా ప్రవర్తించినప్పుడల్లా
వెదికి వెదికి వజ్రాన్ని సంపాదించినట్లు
ఆ పిలుపు ప్రకంపనల ద్వారా
నీ హృదయంలో దాక్కోవాలనే ఉంది

నిస్వార్ధంగా...నిజంగా ఉండాలే గాని
తాకి చూడలేని తారల్ని సైతం
తాయిలంలా నీకు పంపాలనే ఉంది

ప్రతిక్షణం పంచే నీ అనురాగంలో
రాగాన్ని నేనై ఉండాలే కానీ
నీ స్పర్శను అంతరాత్మలో భద్రపరుచుకోవాలనే ఉంది

నీ నిత్య నామ స్మరణలో
నా నామం ఒక్క క్షణమైనా వినిపించాలే కానీ
శాశ్వతంగా నీ చిరునవ్వుల చిరునామానైపోవాలని ఉంది

కదులుతున్న ఈ నిరంతర పోరాటంలో
నీకు నేను నాకు నీవు అనిపించాలే కానీ
నీ అడుగుల సవ్వడిని అందరికి వినిపించాలనే ఉంది

కారణం ఏదైనా కానీ
కనుచూపు మేరలో నువ్వు కనబడాలే కానీ
కలవపువ్వునై నిత్యం నిన్ను కొలవాలనే ఉంది

ఈ అనంత విశ్వంలో
ఉన్న ఎన్నో బ్రమ్హాండాలలో
అణువైనా నాకోసం నువ్వు వెదుక్కోవాలే కానీ
హృదయాకారంలో నిన్ను వెంబడించాలనే ఉంది

లక్షల వేల క్షణాల కాలంలో
ఏ కొద్దీ కాలమైనా నువ్వు నాకై నిరీక్షించాలే కానీ
నా జీవితాన్ని నీకు పూర్తిగా రాసివ్వాలనే ఉంది





నిజమిది అని ఒప్పుకోను.....
నేను
నిజమిది అని ఒప్పుకోను
అబద్ధమని మరువలేను
తప్పు నాదని తలవంచలేను
ఒప్పు ఇది అని ఎదిరించలేను
అందుకే..
గుండె రగిలిన మంటల్లో
చలి కాచుకుంటూ..
మనసు ముసురుల్లో
తల దాచుకుంటూ..
ఏకాంత క్షణాల్లో
నిను వెదుక్కుంటూ..
గొంతులో గరళాన్ని
దాచేసుకుంటూ..
నీకోసం..
నేనున్నానని ఊతమిస్తున్నా
నేనుంటానని మాటనిస్తున్నా
నీ సుఖాన్నే కోరుకుంటున్నా..




నిన్నలా , మొన్నలా నువ్వున్నా
నేడు ఏదో తెలియని ఆలాపన నాలోన
నీ శ్వాసలు తాకితేనే నన్ను నేను మైమర్చిపోతున్నా
నీ అడుగుల సవ్వడిలో ప్రతిరోజు గడపాలనుకుంటున్నా
నీ చిరునవ్వుల వేకువ కోసం ఈ నిరీక్షణ చీకటిన్ని భరిస్తున్నా
నీ మాటల చిరుజల్లుకే పుడమిలా పులకరిస్తున్నా
నీ ఒరచూపుకే నన్ను నేను భానిసను చేస్తున్నా
నువ్వు నాకు దగ్గరవుతున్న ఓ క్షణమైనా అలా నిలిచిపోవలనుకుంటున్నా
నువ్వు దూరమై అర క్షణమైనా ఆ విరహవేదన భరించలేకున్నా
ఇంకా ఎన్నో చెప్పలేని భావాలు కలుగుతున్నా
ఎందుకో తెలియక సతమమవుతున్నా

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

 నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?

ఎవరిని నువ్వు కలసినప్పుడు

నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు.

ఎవరిని కోల్పోయినప్పుడు

నీకు అమితమైన దుఃఖము కలుగుతుందో వారు.

నీ చల్లని తోడు చాలు ...నేస్తం..

అందమైన ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడటానికి..
చిన్న చిన్నవి ఈ రెండు కళ్ళు చాలు ...
లోకాలేన్ని ఉన్న అన్నీ ఊహించేందుకు..

చిన్న మెదడు చాలు ...
గమ్యం చేరడానికి ఇంత దూరమైన నడవాలని ఉండాలే గాని..

ఈ కాళ్ళు చాలు ...
బాద అయినా, సంతోషం అయినా భరించేందుకు..

గుప్పెడు గుండె చాలు ...
అలాగే .......
నా జీవితం సంతోషంగా ఉండాలంటే...

నీ చల్లని తోడు చాలు ...నేస్తం..

నీ ఛూపులో వుంది ప్రేమామృతం..

నీ ఛూపులో వుంది ప్రేమామృతం..
నీ నవ్వులో వుంది గానం
నీ మాటలే వేదం
నీ నడకలో నృత్యం.

ప్రేమ లో యెంత వేదనా
దానిని సాధించాలని యెంతో తపన
విఫలమవుతుంది అని యెందుకంత ఆవేదన
కాక పోతే యెందుకంత ఆరాధన...

నీవే నా సర్వస్వం అని నీవే నా ప్రాణం అని
నీవే నా లోకం అని కలలలో విహరించా
నా సర్వం నువ్వు అవుతావా కాలేవు కదా

నాకు ప్రేమించాలి అని వుంది
అభిమానించాలి అని వుంది
గౌరవించాలి అని వుంది
ఆరాదించాలి అని వుంది కాని.....
నీ అనుమతి లేనిదే నేను యేమి చెయ్యలేను కద

ప్రేమకి పునాది ఆరాధన
నీ నవ్వులో నన్ను చూసుకొవాలని
ఊహల ఉప్పెనలో కొట్టుకుంటున్నాను

నీవు కనిపిస్తే నోట మాట రాక
చలనం లేని శిలనై పోతాను
నీ ఒడిలో వాలి ఈ ప్రపంచాన్నే
మరిచిపొవాలన్న నాకోరిక యెనాడు తీరెనో

చల్లగాలి మెల్లగా నరాల స్వరాలు మీటుతుండగా
మనసులో ఆవిరి ఊహలు ఊయలలూగుతుండగా
నీ ధ్యాస మనసు తలుపు తట్టగా
యేదో తెలియని ఆనందం అనుభవిస్తుంది ఈ చిన్ని మనసు

జగత్తు మొత్తం నిదుర పోయే వేళ కలల కోసం నిరీక్షిస్తాను
ఆ కలలొ ఐన మనం యేకమవ్వలని....

పదహారణాల తెలుగమ్మాయి....

పదహారణాల తెలుగమ్మాయి....
కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,
కొంచం లక్షణంగా,
చాల గడుసుగా,
చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ , లంగావోని వేసుకుని వచ్చే ,
తెలుగింటి అమ్మాయిని చూసి చందమామ కూడా మొహం తిప్పుకోక పోతుందా......?
చెప్పండి మీరే......
లక్షణంగా నుదుటిన బొట్టు…
కళ్ళకు కాటుక….
వాలు జడ…
గల గల గాజులు….
పదహారణాల చీర కట్టూ….
కాళ్ళకు పట్టాలు….
గోరింటాకు, పూలు..
పెద్ద పెద్ద కళ్లు…
ఆ కళ్ళలో కూసింత పొగరు…
అన్ని కలగలిపి ఉండే
16 అణాల తెలుగు అమ్మాయిని
అలాంటి బాపు బొమ్మను ఇష్టపడని అబ్బాయిలు ఉండరేమో...








మగువల నగవులకే నీవు నగవు,
కవుల కలములకే నీవు కలవు,
నిన్ను చుసిన సెలఎటి వురుకులకిక సెలవు,
నీ చెంత చేరి పులాకించే సిరిమల్లె తనువు,
హరివిల్లు చూపలేని విరిజల్లు వన్నేవు,
చల్లని వెన్నెల ను కురిపించే కలువవు,
నా మధి లో ఎప్పుడు కదలాడే అలవు,
ఎప్పుడు ఇలా నే వుండాలి నువ్వు ...
ఎన్నడు చేరగనివ్వకు నీ నవ్వు ...!!

జవరాల!

 జవరాల!
లలిత లలితమ్మయిన నీ నవ్వు
తొలి మంచు తెర వెనక
తెలి మల్లె
పువు రేకలను విచ్చినటు
తరగలై వెన్నెలలు భువి కప్పినటు

బరువు
బరువుగ గాలి
పరిమళము మోసికొని
నిండు చూలాలు నిట్టూర్చినటు
ఈ రేయి
వెన్నెల కన్నె
బరువు గాలికి పైట జార్చినటు

చెంత చేరిన ప్రియుడు
మంద
మలయానిలము
సెలకన్నె చెక్కిలిని మీటినటు
గలగలల సెలకన్నె పులకించి
చెలునితో
గుసగుసలు పలికినటు

వలపు నవ్వులు నవ్వు చెలియ!
నీ అంగుళుల
స్పృశియించి
పులకించు
ఇసుక రేణువు కాగ
నా ఎడదనొక తలపు!

5, ఫిబ్రవరి 2011, శనివారం

istam


నన్ను ప్రేమించకు ప్రియతమా
నీ ప్రేమకోసం నేను పడిన వేదన,
నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,
నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ
నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,
దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,
నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,
నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,
నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,
నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,
నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,
అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,
ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,
కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.
అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.




నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా
ఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా
పోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలని
కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలని
చెరిగిపోయిన చిరునవ్వుని
నీ చెలిమితో మరలా చిత్రించాలని..
ఎన్ని ఆశలో తెలుసా...
నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది





నా ప్రేమలేఖ... నీ ప్రేమ లేక...

హాయ్ %$$

ఎలా వున్నావురా? నీవు లేకుండా నేను అస్సలు బాలేను. ఎలా వుండగలుగుతున్నావురా నేను లేకుండా? ఎందుకో తెలియడంలేదు అనుక్షణం నిన్నే చూడాలనిపిస్తుంది.కేవలం నిన్నే చూడాలనిపిస్తుంది. నీ గురించిన వూహలు నన్ను అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నీ జ్ఞాపకాల దొంతరలను నా చుట్టూ పరచుకుని పరచుకుని వాటిని చూస్తూ మురిసిపోతుంటాను. నా మనసులోని భావాలను అక్షరాలుగా పేర్చి నీ మెడలో వేయడానికి దండగా గుచ్చుతున్నాను. నువ్వు నీ నవ్వు, నీ చూపు, నీ మాట, నీ పేరు ప్రతీదీ నాకు అపురూపమే. నీ కళ్ళళ్ళో మేగ్నటిజం, మాటల్లో హిప్నాటిజం, భావాలలో మెస్మరిజం, పెదాలు కాదన్నా అవునంటూ గుసగుసలాడే కళ్ళు ప్రతీ జ్ఞాపకమూ గుండెల్లొ పదిలమే. అవునా! అంటూ కొద్దిగా తల అలా పక్కకి వాల్చి చూడకు, నా తనువంతా రంగవల్లులతో గిలిగింతలు పెట్టినట్లుంది. నీవు నన్ను చూసే క్షణాన నా మనస్సు పొందే సంతోషం మాటలలో చెప్పలేనురా. నీవు కనిపిస్తే నా కళ్ళల్లొ కోటి సూర్యుల కాంతి, కనిపించకపోతే ఏదో కోల్పోయిన భ్రాంతి. ఏమిట్రా ఇది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోతున్నాను. అయినా అది నాకు ఇస్టంగానే వుంది. ఇక్కడ నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ వుంటే అంతా నన్ను పిచ్చిదాని అంటున్నారు. నిజమా? ప్రేమించడం పిచ్చితనం అయితే నేను నిజంగా పిచ్చిదానినే. ఈ పిచ్చిదానికీ ఒక మనసుంటుందనీ అది ఎల్లప్పుడూ నీ కోసమే పలవరిస్తుందని వారికేం తెలుసు? వారేమంటున్నారంటే, ఒక అబాయి నిజంగా మనస్పూర్తిగా ప్రేమించినట్లయితే, తను ప్రేమించినదాని ని కమ్యూనికేట్ చేయడానికి ఎలా అయినా ప్రయత్నిస్తుడు అని మరి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదు. నువ్వు పరిస్తితులు అంటున్నావు. నా కోసం నీ ప్రాణానైనా ఇస్తానన్న  నీ గుండెల్లో నా మీది ప్రేమను ఎలా దాచేయగలుగుతున్నవో నాకు అర్ధం కావడం లేదు. అంతలా ప్రేమించిన ఇలా కూడా వుండగలరా అనిపిస్తుంది.. ఒక చిన్న కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోవడానికి నీవు ఎందుకు ప్రయత్నించడం లేదు? కానీ నా గుండె చిన్నదిరా, నీ మీది ప్రేమ దానిని నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీదగ్గరే వుండాలని, నీ కళ్ళల్లొకి చూస్తూ, నీ పలుకులు వినాలనిపిస్తుంది. నీ పరిచయం నన్ను ఎంతలా మార్చింది. ప్రతీక్షణం నీ ధ్యాసే, నీ వూహే. నేను నీలా మామూలుగా వుండలేక పోతున్నాను. అందరితోనూ కలసివుండే నేను ఇప్పుడు ఎవ్వరితోనూ సరిగా కలవలేక పోతున్నాను. ఒంటరిగా వుంటూ నీ వూహలలోనే గడుపుతున్నాను. చివరకు ఏమైపోతానో నాకే తెలియడం లేదు. ఎందుకురా నాకు నువ్వంటే నాకింత ప్రేమ?

ప్రేమంటే అందరూ రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు, ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మరచి పోవడం అని, ప్రేమిస్తే మరచిపోలేనిదని, రెండు గుండెల చప్పుడు అని, రెండు హృదయాలను దగ్గర చేసి ఎందరికో దూరం చేస్తుందని ఇలా రకరకలుగా అంటుంటారు. కాని నాకు మాత్రం ప్రేమంటే ఒక నువ్వు, ఒక నేను. ఇద్దరం కలిస్తేనే ప్రేమ.

కళ్ళతో చూసే ప్రేమ కొద్దికాలం వుంటే, పెదలపై పలికే ప్రేమ పదికాలాలు వుంటే, మనసులో పుట్టిన ప్రేమ మనం చనిపోయేంతవరకూ వుంటుంది. మనపృఎమ కూడా మనస్సులో పుట్టి, పెదాలపై పెరిగి మనస్సుతో ముడిపడి పోయింది.

నేను వచ్చినప్పటినుండీ నా కన్ను నిన్ను వెదకుతూనే వుంటుంది. నీవు లేవని, రావని అది సమయం కాదని తెలుసు. అయినప్పటికీ ఇంతకుమునుపు నీవు నిల్చున్న ప్రదేసం, నడచిన దారి, తాకిన వస్తువులు అన్నిటిలోనూ నేను నిన్ను వెదకుతూనే వుంటాను. నీ వైట్ & blue డ్రస్ బావుంది. ఈ మధ్య నీకు నేనున్నను అంటూ నీవు చూసే చూపు బావుంది. నీ రికగ్నిషన్ బావుంది. అన్నీ బావున్నయి. బాలేందల్లా నేనొక్కడినే.


ప్రేమ ఈ రెండక్షరాలు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో అంత నరకాన్ని చూపిస్తున్నాయి.నీవు కళ్ళముందు ఉన్నపుడు ఉన్న సంతోషం, నీవు కళ్ళముందు కనబడకపోయేసరికి నీకు ఏమైందోనన్న విషాదం నన్ను నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీవు సంతోషముగా వుండాలనేరా నాకోరిక. నీ కంటి చూపే తప్ప నోటి మాట కరువయ్యింది. ప్రేమ మనిషిలో ధైర్యాన్ని పెంచుతుందంటారు. మన ప్రేమ నిన్ను మరింత పిరికిదాన్ని చేస్తుందేమిటో? నువ్వంటే ప్రాణము రా. అప్పుడూ, ఈప్పుడూ, ఎప్పుడూ కూడా. నీ ప్రతీ పిలుపుకూ నేను సమాధానమవుతుంటాను. అలా కాలేదంటే నేను జీవించి లేనట్టు తెలుసుకో. వెన్నెల లేని జాబిలిలో ప్రకాశం లేనట్టు, నీవు లేని నాలో ఆనందం లేదు.


ఉవ్వెత్తున ప్రేమ కెరటమై నువ్వు నన్ను తాకి పోతావో లేక ముంచి పోతావో లేక నన్ను నీలో కలిపేసుకుంటావో నీ ఇస్టం. ఏదేమైనా నీవు నన్ను చేరడమే నాకిస్టం. నువ్వు అలవే కావచ్చు కాని కలవి కాకూడదని నా కోరిక.


నేను నీకెప్పుడు బై చెప్పను ఎందుకంటే కలలోనైనా నీవు నాకు దూరమవడం ఇస్టముండదు కనుక. ఇక వుండనా మరి.


నీ..

kavi


నేలపై పడుతున్న ప్రతి కన్నీటిబొట్టు నీ ప్రేమకి జ్ఞాపకమే,
నీ తలపులలో జీవించటం నాకు వ్యాపకమే,
నా కనుపాపలో నీ రూపమే,
నా ప్రతిశ్వాస నీ ప్రేమకి ప్రతిరూపమే,
నేను మాట్లాడే ప్రతిమాట నీ ప్రేమరాగమే,
నా ఆనందానికి కారణం నీ అనురాగమే,
నన్ను వదిలి స్వప్నమయ్యావు ,
నా గుండెలో చేరి సర్వమయ్యావు.
నా ప్రేమకి రూపం నువ్వు,
నా మనసుకి అపురూపం నీ నవ్వు.




ఎదురుగా శూన్యమే నిలిచింది
ఎదలలో శూలమై పొడిచింది
కనులే నిదుర మాని ఎదురుచూసే...
మనసే మోడుగా మారింది...
వెలుగే తోడుగా రానంది...
ఇంకా ఎంతకాలం నీ మౌనం...
ఏ పని... చేసినా... నీ పైనె ఉంటుంది ధ్యాసంతా
రేయని ...పగలని... భేదమే లేకుంది రోజంతా...
స్వర్గధామంలో నువ్వుంటే...
నరకకూపంలొ నేనున్నా...
నేలలా నేను నిలుచున్నా...
వానగా నువ్వు రాకున్నా...
ప్రణయమా...నువ్ పలుకుమా ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి నీ కోసం...
ఎదురుగా శూన్యమే నిలిచింది
ఎదలలో శూలమై పొడిచింది
కనులే నిదుర మాని ఎదురుచూసే...





ప్రేమ - ఒక సాహసం!
ఎంతోమంది
ఎన్నో సాహసాలు చేస్తుంటారు . కొన్ని సాహసాలకు ప్రాణం పెట్టుబడి. కొన్ని
సాహసాలకు జీవితం పెట్టుబడి. ప్రాణాన్ని ,జీవితాన్ని - రెంటినీ మూట కట్టి ,
నీ గుప్పెట్లో పెడుతూ నేను చెప్పే మాటే 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' .

ప్రేమను ఇస్తున్నాను అంటే అదేమీ వస్తువు కాదు పూవులా ఇచ్చేందుకు .
ప్రేమను ఇవ్వడం అంటే సర్వాన్నీ ఇవ్వడం . ఇవ్వడం అనేది ఎప్పటికైనా సాహసమే
కదా! అలా ఇవ్వగలమని నమ్మకం ఏర్పడినప్పుడే ఎవరైనా ఎవరినైనా
ప్రేమిస్తున్నాని చెప్పగలరు. స్వార్ధపరులు , పిరికివాళ్ళు, ఇతరుల కోసం
బ్రతకలేని కుంచిత మనస్కులు ప్రేమిస్తున్నానని చెప్పలేరు .

ప్రేమను ఇవ్వడం అంటే కేవలం ఇవ్వడమే. ఇందులో తిరిగి తీసుకోవాలనడం కానీ, ఏదో
ఆశించడం కాని ఉండదు. ప్రతిఫలం ఆశిస్తే ఇవ్వడంలో అర్థం ఏముంది? ఏదీ
ఆశించకండా ఇవ్వడం అన్నది ఎంత సాహసం కదా! అందుకే ప్రేమ - ఒక సాహసం. ఏ
ప్రేమలోనూ రెండు వైపుల నుంచీ ఇవ్వడం అనేది ఉండదు.

తీరా ఇంత సాహసంతో ఇస్తానన్నాక అవతలి వారు అక్కరలేదంటే ..?
దాని గురించి నీకెందుకు? ఇవ్వడానికి సిద్ధపడటమే నీ వంతు. తీసుకోవడం ,
తీసుకోకపోవడం అవతలివారి ఇష్టం. వారికున్నఅవసరం. అంతే! దాంతో నీకు నిమిత్తం
లేదు. చాలా కష్టమైన పని కదా. అందుకే అంటున్నా! ప్రేమ - ఒక సాహసం!






చీకటితో స్నేహం కుదిరింది
చీకటితో స్నేహం కుదిరింది

చెట్టపట్టాలేసుకుని సావాసం చేస్తున్నాను...
ఒకసారి పగలు నిన్ను చూడాలనిపిస్తే ఎలా అని అడిగినప్పుడు,
నీ కళ్ళు మూసుకో నీ చెంతే ఉంటాను అని చెప్పింది
పున్నమి వెన్నెల అలా ఉంటుందంట ఇలా ఉంటుందంట అని నేను చెప్పే కబుర్లు
చక్కగా వింటుంది నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని..
ఒక రాత్రి నాకు పున్నమి వెన్నెల కావాలన్నాను.., అప్పుడు
నా తల నిమురుతూ నన్ను నిద్రపుచ్చింది
నాకు నేస్తం చెప్పనే లేదు
ఒక సాయంత్రం నా కబుర్లలోని వెన్నెలలాంటి వెన్నెల కురవడం మొదలుపెట్టింది...
నేను ఆనందాతిశయంతో అలానే చూస్తుండిపోయాను...
అది చెప్దామని చీకటిని పలకరించబోతే తను ఆందోళనతో
నా వైపు చూస్తూ దూరంగా వెళ్ళిపోతుంది...
నాకు భయం వేసింది
ఆ క్షణంలో ఏంచెయ్యాలో తెలియక...,
రెప్పలు మూసుకుని నా కన్నుల్లో చీకటికి చోటిచ్చాను...
అప్పటికే కన్నుల్లో నెలకొన్న గాఢార్ద్రత
నా చీకటి నేస్తాన్ని చిమ్మ చీకటిగా ఆవిష్కరించింది
నా నేస్తాన్ని అలా చూసి భరించలేకపోయాను
కానీ తను ఎక్కడ దూరమవుతుందేమో అని కళ్ళు తెరవలేకపోయాను...
ఎప్పుడు నిద్రపోయానో తెలియదు... కళ్ళు తెరిచేసరికి తెల్లవారింది...

seshuki nachinavi...


వెన్నెల కాసే అడవి అందాలను ఆస్వాదించాలని ఆశ...
పాటకు అందాన్నిచ్చె పల్లవి కావలని ఆశ....
సెలయెటికి సొగసులనిచ్చె ఓ అలలా బ్రతకాలని ఆశ....
మార్గం లేని జీవితాలకు మార్గదర్సకం కావాలనే ఆశ...
జాలువారుతున్న కన్నీటికి ఓదార్పు అవ్వాలని ఆశ...
అరవిరిసిన కుసుమ సుధను భ్రమరంనై ఆస్వాదించలన్న ఆశ...
జాలువారుతున్న స్వాతి చినుకును పుడమి తల్లినై దొసిలి పట్టాలని ఆశ....
ఉదయిస్తున్న సూర్యునికి తూర్పుని కావలని ఆశ....
విర్రవిగిన వెన్నెలకు శసినై హత్తుకొవాలని ఆశ.....
గానుగెద్దులా తిరుగుతున్నా కాలన్ని నా గుప్పెట్లొ బంధించాలని ఆశ....
తాపంతొ మత్తెకిస్తున్న ప్రకృతి కాంతను మంచు బిందువునై ముద్దాడాలని ఆశ....
హొయలతొ గుబులు పుట్టిస్తున్నా పులరాశులన్నింటికి పరిమళమై కమ్మెయాలని ఆశ....
నాలొ ఎన్ని ఆశలు ఉన్నా నన్ను కని పెంచిన తల్లిదండ్రులు....
నన్ను ఆశీర్వదీంచే నా గురువుల ఆనందాన్ని చూసి తరించాలని ఆశ...




కాలం గడుస్తూంది...
నేత్రం ఎదురుచూస్తూంది...
ప్రాణం నీరీక్షిస్తూంది...
హృదయం ఆరాటపడుతుంది...
మనసు కాంక్షిస్తుంది...
మది చలించిపోతుంది...
కోయిల కూస్తూంది...
వసంతం వస్తుంది...
మల్లె వికసిస్తుంది... మావి చిగురిస్తుంది...
హుమ్మ్... అయినా నా ప్రయాణం ఇంకా ఎన్నాళ్ళో తెలియకుంది





కురిసే ప్రతి బిందువు స్వాతి ముత్యము కాలేదు
విరిసే ప్రతి పువ్వు పరిమళ్ళన్నివేద జల్లలేదు
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు
కనిపించే ప్రతి మనిషి స్నేహితుడు కాలేరు
అందుకే భయపడుతుంది న మనసు
ఎవరితో చేయాలి స్నేహం అని





నీ ప్రక్కన కూర్చుని ఈ ప్రపంచాన్ని వీక్షిస్తే....
ఈ విశ్వమంతా అనుబంధాల అల్లికలా అనిపిస్తుంది...
చీకట్లు ముసిరిన నా మనసులో చిరు దీపం వెలిగినట్లనిపిస్తుంది...
కన్నీరు నిండిన కష్టాలన్నీ దూది పింజలై తేలిపోతాయి....
కలిసి చేసిన ప్రతి పని ఆ పాత మధురమై తీపి ఙ్ఞాపకమైతుంది....
జీవిత బాటసారులమై పయనించే దారులు వేరైనా....
నీ స్నేహం నాకు నేను సాధించుకున్న అత్యంత విలువైన బహుమానం....
మాటలకందని మహోన్నత మధుర భావాల మహా సాగరం....
ఎల్లలు లేని బంధాల సువిశాల ఆకాశం.....
విశ్వాంతరాళంలో మెరుస్తున్న నక్షత్రాల సమాహారం....
నీ స్నేహం!!





వెదుకుతున్నా...
ఇంకా మోయలేని బాధ్యతగా ....
నువ్వొదిలిన వర్తమానంలో
పగిలిన నా హృదయాన్ని ,
అతికించుకోలేని నా అసహాయతనీ ,
వ్యక్తపరచలేని నా ఆవేదననీ ,
చెలమలౌతున్న నా కళ్ళనీ దాచుకొని...
తిరిగిరాని గతంలోని ప్రతి మధురస్మృతినీ
పదిలంగా మోస్తూ ,
గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో
వెదుకుతున్నా ఇంకా ....
మన ప్రేమని....





దారం కొవ్వొత్తిని అడిగిందంట
నేను మండిపోతున్నపుడు
నీకు నువ్వే ఎందుకు కరిగిపోతున్నావు అని,
అప్పుడు కొవ్వొత్తి అందట
నా హృదయంలొ వున్నవారు
బాధ పడుతుంటే
నేను కటినంగా వుండలేను, అందుకే
కన్నీరుగా కరిగిపోతున్నాను అని...
అదికదా స్నేహం అంటే.


4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?


నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా?
ఎవరిని నువ్వు కలసినప్పుడు
నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు.
ఎవరిని కోల్పోయినప్పుడు
నీకు అమితమైన దుఃఖము కలుగుతుందో వారు.

inkonni nachaai


జీవిత గమనంలో చీకటి కెరటాలను
కప్పుకొనినిరంతర మరణ ప్రయాణం చేస్తూ...
ఆనంద పుష్పాలను అన్వేషిస్తూ ఉంటుంది ....నా ఆత్మ !
మాలతీ లంతాంతాలతో నిన్ను అభిషేకించాలనీ...!
నీరెండిన నిశిలో...వెండి వెన్నెల కిరణాలను తనపై ఓంపుకొని...
మసక తెరల విద్యుద్దీపాల మధ్య చూపులను దిగేసి...
శూన్యంలోకి చూస్తూ ఉంటుంది....నా మనసు !
కాంక్ష నిండిన ఈ మదిని అతృతతో నీకర్పించాలనీ....!
జనన మరణ విస్తృతులు...... తనువుని స్పృశిస్తున్నా....
నిశ్శబ్దపు విషాద ఛాయలు మదిలో అలుముకుంటున్నా...
మౌనంగా ఎదురుచూస్తుంది.... నా ప్రాణం!
నా స్మృతి పదంలోకి నడిచి వస్తున్న నీకు స్వాగతం పలకాలనీ...!
తీయని కలల సెగల కన్నీటి ధారలతో...
తన పాదాలను తానే అభిషేకించుకుంటూ...
స్వప్న జగతిలో ఒక చిలిపి ఊహకీ ప్రాణం పోస్తుంది...నా నయనం...!
కళ్యాణ కాంతులు నిండిన కనులలో ప్రత్యక్ష మౌతావనీ...!
అందుకే....
నిశీధి నుండి నిశ్సబ్దం వరకు...
నాలోని సృజన శక్తి మేల్కొలిపిన నీ మనో రసాకృతికీ ....
నా కనురెప్పల్లో నీ ముఖాన్ని...రాగ స్నిగ్ద మలిసంజలా మార్చిన నీ కళాస్మృతికీ...
నా పాదాభివందనం...!
మట్టి పరిమళాన్ని కప్పుకొన్న ఈ పువ్వు ఇంక నేల రాలిన చింత లేదు నేస్తం...




వేల వేల ఆశల్ను అదృశ్యంగా భుజాన మూట కట్టుకుని...
ఏదో సాధించాలని తపనతొ హడావిడిగా ఈ లోకం వాకిట్లోకి ఊడిపడ్డాను...
ఆనందం కోసమో .. అనురాగం కోసమో..
సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో ...
మధ్య మధ్య నీ మండుతున్న విశ్రాంతి భరించలేక ....
ఒక్కోసారి తనువును తగలబెడుతున్న వెలుగు కంటే...
కళ్ళు కనిపించనంత చీకటే నయమనిపించేలా చేసావు.. !
ఒకప్పుడు నీవిచ్చిన ఓదార్పు ఇప్పుడు నిన్ను నా భుజాలపై మోస్తుందని మరిచావు..!
నీ ఆలోచనల చితిలో కాలుతున్నది నేనే!!
నీ ఎడబాటు కొలిమిలో మండుతున్నది నేనే!!
కన్నీరు చింధిస్తున్న కళ్ళలో... ఏ స్వప్నం నీ భావాలను బంధీస్తుంది...!
మౌన నిశ్వాసాల నిట్టూర్పులలో... ఏ హృదయం నీ మదిలో మైత్రి దీపాలను వెలిగిస్తుంది.!
నిశి రాత్రిలో కరిగిపొయే నా జ్ఞాపకాలకు విలువ కట్టలేక....
నేను స్మరించే నీ పేరును నా పెదవి అంచుపై వెతకలేక...
నిస్సహాయతతో నిండిన నా హృదయాన్ని ఓదార్చలేక..
పేరాశతో నిండిన నీ హృదంతర దృగంతరతొ....
సరదాకీ... సభ్యతకీ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్నావు...
కాంక్ష నిండిన కళ్ళతో మరో అమాయకుడిని వెతుకున్నావు....
నువ్వు బాధ పడినప్పుడు నా భుజం...
నువ్వు ఆనందపడినప్పుడు నా హృదయం...
ఎప్పుడు నీకు తోడుగా ఉంటాయని మర్చిపొయావు నేస్తం.....కాకపొతే...
క్షణాలని కాపలాగా పెట్టి ఈ నిరీక్షణ ఎందుకు ??
అలసటతో నిండిన నా గతానికీ ఈ అలజడి ఎందుకు...?