4, నవంబర్ 2010, గురువారం

ప్రతిఫలమన్నది ఎరుగనిది మీ స్నేహం

నీ నమ్మకాన్ని అధిగమిస్తున్న మరుక్షణం నుంచే ...
నీ కలలూ , ఊహలు , ఆశలు నీకు దూరం ఔతున్నాయని అర్థం. 
అనవసరమైన ఆలోచనలు వదిలేసి , వచ్చిన అవకాశాలను
సాధ్యం అయినంత బాగా చేయడానికి ప్రయత్నించు.
అప్పుడు నువ్వు ఆశించే ఫలితం
తప్పకుండా నీ ముందుంటుంది.......ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్
కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...

విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది అనుకున్నా...

వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం అనుకున్నా....

కుల మత బేధం లేనిది...
తరతమ భావం రానిది...
ఆత్మార్పణమే కోరుకొనేది...
ప్రతిఫలమన్నది ఎరుగనిది మీ స్నేహం

కామెంట్‌లు లేవు: