చేరలేని గమ్యం కోసం పూల బాట వేస్తున్న, పూలు నన్ను చూసి జాలి పడుతున్నాయి... కరుణించని ప్రేమ కోసం కన్నీరు కారుస్తున్నా కన్నీరు నన్ను ఓదారుస్తున్నది... దరి చేరని మనసు కోసం మమతల పల్లకీని తయారు చేస్తున్నా, పల్లకి నన్ను చూసి గేలి చేస్తున్నది... వసంతం లేని జీవితంలో కోకిల పాట కొరకు ఎదురుచూస్తున్న, వసంతం నన్ను వెక్కిరిస్తున్నది... మూగబోయిన మనసులో మోహన రాగం కోరుకుంటున్నా, మౌనం నన్ను ఎగాదిగా చూస్తున్నది... ఎండిపోయిన ఎడారిలో అమృతం కొరకు అన్వేషిస్తున్న, ఎడారి నన్ను ఎగతాళి చేస్తున్నది... సముద్రం ఒడ్డున దొరికిన గవ్వలో స్వాతిముత్యాన్ని వెతుకుతున్నా, సముద్రం నన్ను చూసి నవ్వుతున్నది.... ఇన్ని అవమానాలతో కూడిన జీవితం వ్యర్థం అని తలుస్తున్నా.....!!! |

నేను నాకు నచ్చినవి సేకరించి ఇక్కడ పెడుతున్నాను అంటే నేను వ్రాసినవి కావు ఇవి కాకపొతె మనలో భావాలు ఉంటాయి కాని అవి కవిత రూపంలో వ్రాయలేం కదా అందుకే నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవి మీలో ఏఎవరివీయినా కావచ్చు నేను చెసింది తప్పు అయితె నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ నాకు తెలుసులే నన్ను క్షమిస్తారని..... దెనికంటే నేను మీ నేస్తాన్ని కదా...
8, నవంబర్ 2010, సోమవారం
జీవితం వ్యర్థం అని తలుస్తున్నా....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి