ఊహలకే పరిమితమై,
ఆచరణకి దూరమై,
కోరికలతో సతమతమై,
నిన్ను చేరుకొనే మార్గము కొరకై,
రేయి పగలు ఎదురు చూపే నా పనై,
మనసంతా నీ తలంపై,
కొలువు పై ధ్యాస లేక..
మనసు అదుపు కాక ..
నిన్ను చేరుకోలేక..
రాత్రుళ్ళు నిదుర రాక ..
ఆకలి ఆవిరై .. శరీరము శల్యమై ..
అందరిలో అలుసై ..
బ్రతుకుకి దూరమై..
ఛస్తూ బ్రతుకుతున్నా .. నన్ను ఒక్క సారి చూడు చెలి ఏమైనా నాపై నీకు కనికరమున్నా..
ఆపై కనుమరుగవుటకు సిద్ధముగా వున్నా..
ఇంత సీన్ నీకు అవసరమా ..బేబి?
కొలువుపై ధ్యాస మలిచి,
తొలి ప్రొద్దునే సంతోషంగా లేచి,
వ్యాయామము చేచి ..ఆరోగ్యం పెంచి,
ఆనందంగా కొలువుకేతెంచి,
కష్టించి , అగ్రస్థానము అందిరోహించి,
ఆపై చేయి చాప.. అందుకొనుటకు అతివలు చేరువవ్వుదురే అంతా మరచి,
అల్లుకు పోదురే ఆనందముతో తనువంత తెరచి,
ముడి బందముతో ఒక్కటై …ముచ్చటగా జీవించ వచ్చునే జీవితమంతా ..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి