పనిలో వున్నా..పడుకొని వున్నా..
మందిలో వున్నా .. మాటున వున్నా ..
ఎక్కడ వున్నా.. ఏమి చేస్తున్నా ..
నీ తలంపుతోనే బ్రతుకుతూ వున్నా..
నీ మనసులో 'నే' వున్నా ..లేకున్నా..
నిన్ను వీడలేకున్నా ..
అందుకే నిన్ను కలవాలనుకుంటున్నా..
కమ్మని కబుర్లు చెప్పాలనుకుంటున్నా..
నీ మనసుకు చేరువు అవ్వాలనుకుంటున్నా..
ఆపై నీ హృదయాంత రాలలో నిలిచి పోవలనుకుంటున్నా ..
కలిసి కలకాలం జీవించాలనుకుంటున్నా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి