23, నవంబర్ 2010, మంగళవారం

మనసున మనసై...

గాలికిపెట్టిన ముద్దు-నీ చెంపను తాకిందే
నన్నే తాకిన నీరు- నీ వొంటిని తడిపిందే
నాపైవాలిన సీతాకోక చిలుక నీ చెక్కిలి నిమిరిందే
నే పట్టిచూసిన కొత్తకోక నీ తనువును చుట్టిందే
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

1. కాటుకై మారినేను కంటికే అందమిస్తా
హారమై మెడలోచేరి మేనుకే వన్నె తెస్తా
శిరోజాల రోజాపూవై సొగసులే పెంచేస్తా
చెవులకే జూకాలై సోయగాల నందిస్తా
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

2. చేతులకు గాజులుగా సొబగులే కలిగిస్తా
పాదాల మంజీరాలై నాదాలు పలికిస్తా
మనసులోమనసును నేనై నిన్నంత ఆక్రమిస్తా
మోవిపై చిలిపినవ్వునై కడదాక నివసిస్తా
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

hg

కలల  ఊహల  పల్లకీ  లో  ఊరేగుతూ 
క్షణక్షణం నీ తలపులలో బ్రతుకుతూ 
నా వాలుకన్నులనే నీ కోటగా మలచి
నా ప్రేమతో నిన్నా కోటలో బంధించి
నా కంటే సాటి ఇంకెవరూ లేరని భావించే
నీ కంటే నాకింక ఎవరు సాటి..


ప్రేమ,ఆప్యాయతలు  అన్న పదాలకు 
అర్ధం తెలియని పిచ్చిదానను నేను,,
వాటి ఉనికిని అనుక్షణం వెదుకుచూ,
ఆ బంధాలలోని మాధుర్యాన్ని గ్రోలాలని 
నిలువెల్లా తపించే వేర్రిదానను నేను,,
అలాంటి నాకు 
ఆ ప్రేమను,ఆప్యాయతను నిండు మనసుతో 
నువ్వు అందిస్తుంటే,,
నీ ప్రేమను ఎలా కాదనగలను....
పొగడకుండా ఎలా ఉండగలను......













ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
                       ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
                       అద్భుతమైన బంధం...స్నేహం
                       కళ్యానిరాగం అంత మధురమైనది 
                       రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ...
                        .................మన ఈ స్నేహం... 


                       ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
                       ప్రేమకు చూపు ఉంటుంది,
                       అ చూపే నాకు నిన్ను చూపింది
                       నా హృదయాన్ని నీ వైపు నడిపింది
                       నిన్ను నన్ను దగ్గర చేసింది
                       నా "మనసంతా నువ్వే" అనేలా చేసి
                      "నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
                       తనను తానూ నిరూపించుకుంది...


                      నిన్నే నిత్యం తలుస్తూ 
                      నన్నే నిలువునా మరుస్తూ 
                      నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
                      నాలో నేనే మురుస్తూ 
                       నీకై నిలువెల్లా తపిస్తూ 
                       నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,, 
                       నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......


                       నీ రాక కోసం 
                       వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని 
                       నీ పిలుపు కోసం
                       పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని 
                       ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,
                       నా మాట వినదే....
                       తన మారం ఆపదే.....


                      గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం 
                      చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం
                      తలపులలో నీవు కొలువున్నా
                      కలుసుకోలేను ఎదురున్నా...
                      తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,, 
                      అడగవే ఒక్కసారి అయినా  నేస్తమా 
                      నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????









నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని

మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి

గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం

యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
క్రిష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినా 
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా

వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ

దీన్ని రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ట..చాలా బాగా రాసారు అనిపించింది..ప్రస్తుత భాగ్యనగర  పరిస్థితే గుర్తుకువచ్చింది ఈ కవిత చదువుతున్నంత సేపు,, 
మారరు ఈ జనం,మారదు ఈ రాజకీయం...




     బిడ్డ పుడితే అంత బరువు డబ్బు
           హుండీలో వేస్తానని 
           తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు.
           ఆడపిల్ల పుట్టింది.
           ఆనందం లో మొక్కు మరిచాడు
          అమ్మాయి పెళ్లికు 
          వడ్డీతో సహా శ్రీనివాస రావు పేరుతొ 
          అల్లుడి రూపం లో పట్టుకెళ్ళాడు...

           చిన్నప్పుడు రోగం వస్తే నాన్నారు
           "ఆ మెడకు" తయాట్టు కట్టారు,,,
           స్కూల్ లో రాంక్ వస్తే మాష్టారు
           "ఆ మెడకు" గోల్డ్ మెడల్ వేసారు.,,
            కావలసిన కట్నం ఇచ్చాక మొగుడు
           "ఆ మెడకు" తాళి కట్టాడు,,
            ఇంతమందికి నచ్చిన "ఆ మెడకే"
            అత్తగారు ఉరేసింది,,,,,,,

            మానభంగానికి శిక్ష 
            ......ఏడేళ్ళు అట 
            నిజమే 
            న్యాయశాస్త్రాన్ని రాసింది
             ........మగాడే గా
               
            పడుకున్న మా పాప చేతి లో
            కుక్క బొమ్మ ఉన్నది,,
            ఆ బొమ్మ కల్లెప్పుడూ 
            నాకేసి  ప్రశ్న వేస్తుంటాయి,,
            తనలా నేనెందుకు 
            దగ్గర కాలేక పోతున్నాను అని,,,

             వాడి చిన్నతనం లో 
            "ఊరికే" ఆడుతుంటే 
            తండ్రిగా తెగ ఫీల్ అయ్యేవాడిని,,
            నా ముసలితనం లో 
            ఇంకా "ఊపిరి" ఆడుతుంటే 
            బిడ్డగా వాడు ఫీలవుతున్నాడు,,, 
               
            మా ఆవిడ  పురిటి నొప్పులు చూసాక 
            ఇక ఆవిడను ఇబ్బంది పెట్టదలచుకోలేదు,,,
            .........................................
             రెండో పెళ్లి చేసుకున్నాను!!!!!!!!!!

             నా దేహానికి చొక్కాలు
             నా పాదానికి చెప్పులు
             ఏమి వేసినా పదిమంది
             మేచ్చుకోవాలనే దురద..
             అదేమీ చిత్రమో 
             నాకెప్పుడూ ఈ బట్టలు నేసినవాడిని,
             ఈ చెప్పులు కుట్టినవాడిని ,,
             కలిసి మెచ్చుకోవాలి అని అనిపించదు?????????
               




  ఇవి నేను ఒక పుస్తకం లో చదివినవి..అందులో కొన్ని నాకు బాగా నచ్చాయి..మీరూ చదువుతారు అని ఇక్కడ రాస్తున్నాను.
                          దేవుడు ఎంత పక్షపాతి
                          లేనివాడికి ఇంట్లోకి కూడా ఇవ్వడు 
                          ఉన్నోడికి వొంట్లోకి కుడా ఇస్తాడు 
                           .................షుగరు 

                         ఎన్ని చేపల ఏడుపో..
                        ...........................
                        సముద్రం లో ని ఉప్పు.

                         ఒకటే చూసే రెండు కళ్ళు 
                         ఒకదానికి ఒకటి చూస్కోవు 
                         ఎప్పుడు కలిసి ఉండే రెండు పెదాలు 
                         ఒక్క మాట తో విడిపోతాయి 
                         అందుకే..
                         కళ్ళకి ధ్యానం కావాలి,
                         పెదాలకి మౌనం కావాలి.

                         మా ఇంటి చుట్టూ apartments వారికి 
                         కనబడ కూడనివి కనపడుతున్నాయి 
                         మాకు కనపడాల్సిన సూర్యచంద్రులు 
                          కనపడటం మానేశారు...

                          కుటుంబనియంత్రణ 
                          ఒకరు లేక ఇద్దరు,,,,
                           ...............................
                          పిల్లలా????? పెళ్ళాలా ???    

                          వీడియోలు తీయాల్సింది
                          పెళ్లిళ్లకు,పుట్టిన రోజులకు  కాదు 
                          సిజేరియన్ లకు  
                          అది చూసైనా కన్నతల్లి కడుపుకోత     
                          తిరగబడే బిడ్డలకు తెలియాలి..

                          ఒక్క మగాడి హత్య కు 
                          వంద కారణాలు,
                          వంద ఆడవాళ్ళ హత్యలకు 
                          "కట్నం" ఒక్కటే కారణం..





19, నవంబర్ 2010, శుక్రవారం

krutagnatalu














All the Best




















nee nestam... seshu




















ప్రేమతో పంచుకో..

దారులు వెరైనా... నా మనసు మీ దగ్గరె ఉంది సుమా...
దానితో మట్లాడుకో...
మదురాలు మధురభాషనలు
ప్రేమతో పంచుకో..

స్నేహం...

కలల ఒడిలో అలసి పోయి బాధ్యతల మెలుకువ వచ్చింది
మనసు బాధల ఆటుపోట్లు కన్నీళ్ళ ఉప్పెనతో ముంచాయి
దారి తెలియని జీవితమనే నిద్దురలో తీయని కల తిరిగి చుక్కానిలా దారి చూపుతుంటే
కనిపించని ఎండమావులకి పరుగులు తీస్తున్న ఓ హృదయమా !
స్నేహమనే చల్లని నీడ క్రింద తల దాచుకో
బాగున్నావా అనే పలకరింపు తెచ్చే ఆనంద బాష్పలతో
నీ దాహం తీర్చుకో !!!

నా బుజ్జి స్నేహం

అరై ................నీ స్నేహం నా అదృష్టం

నీవు పిలిచిన పిలుపు నా జీవితంలో ఒక అద్బుతం
వచ్చారు నా జీవితంలో ఎందరో కాని లేరెవ్వరు నీలా స్వచ్ఛంగా........

అరై కోతి నిను తలిస్తే వస్తాయి ఆశ్రువులు
కావవి శోక బిందువులు .........అవి ఆనంద బాష్పాలు........

అందుకే రా బుజ్జి నీ స్నేహం అదృష్టం
ఎన్నడు వీడిపోకు నన్ను...వీడిన ఆగిపోవు ఈ జీవితం.........

ఈ జీవితం నీ స్నేహనికే అంకితం
మనం ఇద్డరం ఇలాగె వుండాలి కాలకాలాం మరో జన్మలోను సైతం.....

నీ పలుకులు నాకు వీణ శ్రుతులు ..........నీ చిరునవ్వు ఒక చల్లని వెలుగు

నీతో మాట్లాడిన ప్రతిక్షణం ఓ మదుర జ్ఞాపకం
నీ మాట ఆగిన మరుక్షణం నా మనసు దు:ఖ సంద్రం........

అరై బుజ్జి విడిపోకు ఎన్నడు
వీడిన అగిపోవు నా శ్వస మరునాడు..........

18, నవంబర్ 2010, గురువారం

జ్ఞాపకాలు...

వాటికేం!? వచ్చిపోతుంటాయి
గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో
కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి
తుడిచే వేళ్ళ కోసం.
నిన్నలా నేడుండనివ్వదు
ప్రకృతికెంత పౌరుషం!
మెరుపు చూపిస్తూనే
ముసురు కమ్ముతుంది.
సందెపొద్దులు, శ్రావణమేఘాలు
మధుర రాత్రులు, మౌనరాగాలు
ఎద అంచుల్లో జోడు విహంగాలు
ఏదయినా ఏకాంతం కాసేపే
తిరిగే ప్రతి మలుపులో
కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి
యే జోరువానకో గండి పడి
గుండె లయ తప్పుతుంది
నిశ్శబ్దాన్ని నింపుకుని కలం
రాత్రి రంగు పులుముకుని కాగితం
ఎప్పుడో యే అర్ధరాత్రికో
కలతనిద్రలోకి జారతాయి
గుండెచప్పుళ్ళన్నిటినీ
అక్షరాలు గుర్తించాలనేం లేదుగా!

ఎవరీమె??

మాట మౌనమై
మనసు మూగదై
పెదవి దాటని చిరునవ్వుతో
తెరచాటు నును సిగ్గు దోబూచులతో
అరుదెంచె అందాల అతివ.
ఎవరి ముగ్ధ మందార మకరందమాల?

బుద్ది గడ్డి తిని

కలిస్తే కలవని మనసులు
పిలిస్తే పలకని భావాలు
మడిస్తే ముడవని గొడుగుల్లాంటివి.
బయట వర్షం లో బానే ఉంటుంది
ఇంట్లో కొస్తే నే చీదర చిరాకు
ఎద్దు ఎండకు లాగితే,
దున్న నీడకి లాగినట్లు
కావిడి ని రెండు చేస్తే
ఇంకా అరకెలా దున్నేదీ..
సేద్యమెందుకు చేసేది.
బుద్ది గడ్డి తిని
వాళ్ళు దూక మంటే దూకినాక కాళ్ళు విరిగాయాని ఏడ్చి ఏం ప్రయోజనం.
కాళ్ళే లేక ఎందాకా ఈ ప్రయాణం..??

17, నవంబర్ 2010, బుధవారం

ఆ అందాన్ని చూస్తే ముద్దిడాలని

ఆ అందాన్ని చూస్తే ముద్దిడాలని
అనుకోని మనుషులుండరేమో?
నవ్వినపుడు చమక్కుమనే బుగ్గలోని
సొట్టలో చిక్కుకోని చూపూ వుండదేమో?
గుప్పెట్లో గట్టిగా వేలు పట్టినపుడు
ఎదో అనుభూతికి లోనవ్వని మనసూ వుండదేమో?
మెడను చుట్టే చిట్టి చేతుల బంధానికి
మురిసిపోని అనుబంధమూ వుండదేమో?

ప్రతి పసిపాపా ఓ అందమే..
ప్రతి బోసినవ్వూ ఓ అపురూపమే..
గుండెలను నింపే ఇలాంటి
ఆనందాలు పొందడమూ అదృష్టమే...

ఎదురు చూపుల చివరి ఆశలు

జీవించడానికి కావలసినవన్నీ వున్నాయి
మనసుభారమై అవి దూరమౌతున్నాయి

మాటలకి మాటలే సమాధానమౌతున్నాయి
ప్రవర్తన తో పరివర్తనలు కనుమరుగౌతున్నాయి

ప్రేమ తో చాచిన చేతులు చిన్నవౌతున్నాయి
ఆగిపొయిన ఎదురు చూపులే పెద్దవౌతున్నాయి

స్థూలం పై వేలు చూపి, సూక్ష్మాన్ని దాచి
అంతరంగంలో కునీతిని దాచుకుంటున్నాయి 

ఆత్మద్రోహపు హద్దులు దాటిన దురాత్మలు
దౌర్బల్యాన్ని, ధనంగా, దోచుకుంటున్నాయి

ఎదురు చూపుల చివరి ఆశలు
సుడిగాలి చిగురుటాకుల్లా వణుకుతున్నాయి

8, నవంబర్ 2010, సోమవారం

ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,



తెలియని ఆనందాలను పంచే నీ స్నేహపు హృదయం,
నా మదిలో చీకటిహృదయానికి ప్రేమను ప్రకాసింపజేసిన ఉదయం.

తెలియకుండానే నీ స్నేహంలో ప్రేమను ఆశ్వాదించడం మొదలుపెట్టను.
తెలియజేయలేక నీకు నా ప్రేమను, నా మనసులోనే మధనపడ్డాను.

గుండెలో నుండి జారే కన్నీళ్ళను నీ స్నేహపు ఆనందాభాష్పాలని ఇంకెన్నాళ్ళు చెప్పాలో,
పగిలిపోతున్న హృదయాన్ని అదిమిపెడుతూ పెదవిపై చిరునవ్వును ఇంకెన్నేళ్ళు పొందుపరచాలో.

నేస్తమా నీవే నా మనసులో నిండిన ప్రేమవని ఎలా తెలుపను.
స్నేహమా నీవే నా జీవిత సర్వస్వం అని ఎలా తెలియజేయను.

ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,
స్నేహమే అని మోసంచేస్తూ ప్రేమను దాచుకోలేక.

ఆ చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజెపుడు?

తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?
వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?
ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు!
వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు!
ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు!
లోకమంతా చీకటి...
కన్నె మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి!
ఆ చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజెపుడు?

ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది.

అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నవంట " కదా!
ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను?
దానికి భగవంతుడు చిరునవ్వుతో " నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీ కోసం ఆడుతుంది, పాడుతోంది. నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది. నిన్ను ఎల్ల వేళలా ఆనదంగా ఉంచుతుంది. నన్ను గుర్తుకురాకుండా చేస్తుంది. వెరసి నీ ప్రతి ఒక్క విషయంలోనూ తను ఉంటుంది " మరి నాకు అక్కడ భాష రాదు కదా మాటలు ఎలా అర్ధం చేసుకోను? నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు? అని అడిగింది పాప. నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు. అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది. ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుకొంటుంది. అన్నాడు భగవంతుడు. మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను? నీ దేవత రెండు చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్దించాలో చెబుతుంది. నీలో ఉన్డే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతోంది అన్నాడు.
ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది.
భూలోకం నుంచి వేదనాద ధ్వనులు వినిపించాయి. అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ....
నా దేవత పేరేంటి అని అడిగింది. 
ఆ దేవత పేరు " అమ్మ " అని సమాధానమిచ్చాడు భగవంతుడు.


పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం ‘అమ్మా’
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ‘ఈ జన్మ’

పసిపాప బోసి నవ్వుల కోసం
తల్లి అయినది ఓ నేస్తం
పంచ ప్రాణాలు పాపాయి కోసం 
పంచి ఇచ్చింది ,తన రక్తం

బుజ్జి బుజ్జి పాపయికి బుజ్జగింపునకు జోలపడింది
కోటి ఆశల చిన్న పాపయికి జన్మ నిచ్చింది
చందమామనే మేనమామగా చేసింది
జాబిలినే భువికి రమ్మంది
కమ్మని కథలెన్నో చెప్పింది
ఆది గురువై అక్షరం నేర్పింది
ఈ జీవితంలో నా ప్రియ నేస్తం’అమ్మ’
ఆమె లేకుండ ఉండేదా’ఈ జన్మ’
అందుకే తల్లి ఋణం తీర్చలేం
ఆమెకు ఈ జన్మ అంకితం
సదా కన్న తల్లి దేవత

ఈ జీవితానికి ఆమే విధాత...

నెస్తమా అని పలకరించె హ్రుదయం మీకుంటె...

నెస్తమా అని పలకరించె హ్రుదయం మీకుంటె...
మీ నేస్తానికి చిరకాలం నేతొడుంటా... నేస్తం... మీ శేషు...

జీవితం వ్యర్థం అని తలుస్తున్నా....


చేరలేని గమ్యం కోసం పూల బాట వేస్తున్న,
పూలు నన్ను చూసి జాలి పడుతున్నాయి...

కరుణించని ప్రేమ కోసం కన్నీరు కారుస్తున్నా
కన్నీరు నన్ను ఓదారుస్తున్నది...

దరి చేరని మనసు కోసం మమతల పల్లకీని తయారు చేస్తున్నా,
పల్లకి నన్ను చూసి గేలి చేస్తున్నది...

వసంతం లేని జీవితంలో కోకిల పాట కొరకు ఎదురుచూస్తున్న,
వసంతం నన్ను వెక్కిరిస్తున్నది...

మూగబోయిన మనసులో మోహన రాగం కోరుకుంటున్నా,
మౌనం నన్ను ఎగాదిగా చూస్తున్నది...

ఎండిపోయిన ఎడారిలో అమృతం కొరకు అన్వేషిస్తున్న,
ఎడారి నన్ను ఎగతాళి చేస్తున్నది...

సముద్రం ఒడ్డున దొరికిన గవ్వలో స్వాతిముత్యాన్ని వెతుకుతున్నా,
సముద్రం నన్ను చూసి నవ్వుతున్నది....

ఇన్ని అవమానాలతో కూడిన జీవితం వ్యర్థం అని తలుస్తున్నా.....!!!



వ్యర్థం అని తెలిసినా మిమ్మల్నే తలుస్తున్నా....

చేరలేని గమ్యం కోసం పూల బాట వేస్తున్న, 
పూలు నన్ను చూసి జాలి పడుతున్నాయి... 
           దరి చేరని మనసు కోసం మమతల పల్లకీని తయారు చేస్తున్నా, 
           పల్లకి నన్ను చూసి గేలి చేస్తున్నది... 
వసంతం లేని జీవితంలో కోకిల పాట కొరకు ఎదురుచూస్తున్న,
వసంతం నన్ను వెక్కిరిస్తున్నది... 
           మూగబోయిన మనసులో మోహన రాగం కోరుకుంటున్నా,
           మౌనం నన్ను ఎగాదిగా చూస్తున్నది... 
ఎండిపోయిన ఎడారిలో అమృతం కొరకు అన్వేషిస్తున్న,
ఎడారి నన్ను ఎగతాళి చేస్తున్నది... 
           సముద్రం ఒడ్డున దొరికిన గవ్వలో స్వాతిముత్యాన్ని వెతుకుతున్నా,
           సముద్రం నన్ను చూసి నవ్వుతున్నది.... 
ఇన్ని అవమానాలతో కూడిన ....... వ్యర్థం అని తెలిసినా మిమ్మల్నే తలుస్తున్నా (మీ స్నేహం కోసం).....!!!

భరతమాతకు భవితనివ్వు.....

బుక్కెడు కూడుకు దిక్కులేని జనం ఆకలికి అలమటిస్తుంటే,
పైసల కట్టలకు ప్రాణం వచ్చి పరాయిల పాలై పోతుంటే,
కుప్పలు తెప్పలుగా బలైపోతున్న జీవుల చావుల లెక్కలు కడుతుంటే,
ఆవేశం కడలి కెరటంలా కన్నుల్లో ఉప్పొంగుతోంది,
ఆవేదన అగ్నిజ్వాలలా మనసును దహించివేస్తుంది,
ఆక్రోదం కట్టలు తెంచుకుని అంతిమ యాత్రకు పరిగెడుతుంది....
బ్రతుకంటే జుదమేనా?????????.
మానవత్వమా నీవెక్కడ !!!
నీకు ప్రాణముంటే,
పంచబూతాల సాక్షిగా,
మువ్వన్నెల పతాకం సాక్షిగా,
కదులు, మౌనం వదులు.....
శిలలా మిగిలిన భరతమాతకు భవితనివ్వు.....