8, ఆగస్టు 2013, గురువారం

పాఠంగా ఉండనీయండి

మెరిసే రంగుల వెనుక
దాగిన కన్నీళ్ళు ఎన్నో
వెలుగులను పంచే
హృదయాల వెనుక
ఉండి పోయిన
చీకటి నిండిన దుఖం ఎంతో
నిరంతరం గుండెలనుతమ
చిరునవ్వులతో పలుకరించే వాళ్ళను
చిదిమింది ఎవ్వరో ..
నేరం నీది కాదు ..నాదీ కాదు
ఈ సమాజానిది ..
ఇప్పుడు కనడమే
నేరమైంది దోషమైంది ....
అసలు అందమైన
ఈ లోకానికి పరిచయం చేయటం తప్పైంది
ఇంకానా ఇక ఆపండి
మీ వ్యాఖ్యానాలు ..
విశ్లేషణలు చాలించండి
వార్తలు కావవి ..
రేటింగ్ మాయాజాలం ..పెనుభూతం
ఛీ.. ఇంక ఆపండి
మా మానాన
మమ్మల్ని చావ నీయండి
రేపటి తరానికి
పాఠంగా ఉండనీయండి

కామెంట్‌లు లేవు: