27, ఆగస్టు 2013, మంగళవారం

వెన్నెల విసిరేసింది - నవ్వు అక్కున చేర్చుకుంది

నీ నవ్వు

ముత్యమై మురిసింది

మెరుపై విరిసింది

పువ్వయి పూసింది

గాలి అయి తాకింది

చినుకై పెదవులను ముద్దాడింది

రక్తమై గుండెను మీటింది

పాటగా మారి మనసును మై మరిపించింది

అందుకే

నువ్వంటే ఇష్టం

కాదంటే బతకటం కష్టం

ఇద్దరి కాన్సెప్ట్ ఒక్కటే నిన్ను ప్రేమించడం

|Ÿç|Ÿ+#á+ýË |ŸçÜ $wŸjáÖ“¿ì 
ÿ¿£ alternate –+³T+~
‚<ŠÝ]¿£ì Ôá|ŸÎ 1. neTˆ  2. uó²sÁ«
ÿ¿£sÁT she build ur
life
eTs=¿£sÁT leads ur
life
.
ÿ¿£sÁT eTqÅ£” Èqˆ“kÍïsÁT
eTs=¿£sÁT €ÈHˆ+Ôá+ ¹|ç$TkÍïsÁT
‚<ŠÝ] ¿±Hîà|t¼ ÿ¿£Øfñ “qT• ¹|ç$T+#á&ƒ+
neTˆ n+fñ uó²sÁ+ ¿±<ŠT
uó²sÁ« n+fñ u²“dŸ ¿±<ŠT.

నేలపై పచ్చని చిరునవ్వుల కోసం మనిషి సుగుణ గంగలో మునకేయాలి!

అలా నీలోకి
ఒక వాక్యతరగనై ప్రవహించాలన్నా
నీ కనురెప్పల కింద
కలా విచిత్రమై దోబూచులాడాలన్నా
నీ నాలుక చివర
తేనెతుట్టెనై పూర్ణించుకోవాలన్నా
నేను నిప్పుల మీద సలసల మరిగే కన్నీరవ్వాల్సిందే

నీ పక్కన మూగి
బుడిబుడి అడుగుల ధ్వని సరాగం వినిపించాలన్నా
నీ ఉసూరనే వేళల
సన్నని వానతుంపరై చక్కిలిగిలి పెట్టాలన్నా
నీ పాదాలలసిన తొవ్వల
చెమటనద్దే పాటగా స్పృశించాలన్నా
నేనీ మట్టి పొరల కింద రాచి రంపాన పెట్టుకోవల్సిందే.

నీ చెంప కానించిన కొనగోటి సమయాల్లోకి
దుర్లభ కలిసమయమై దూరాలన్నా
నీ ముడేసిన పెదాల వృత్తంలో
శబ్దాలంకారమై పులుముకోవాలన్నా
చంద్రాంశ తొంగి చూడని నీ ముఖ వర్ఛస్సులో
వేయి పున్నముల పోయెయై నిండిపోవాలన్నా
ఎన్నో కాళరాత్రుల కొరడాలతో
హింసింపబడాల్సిందే.

నీ తల మీద మోస్తున్న జ్ఞాపకాల బుట్టలోకి
మధురోహనై తొంగి చూడాలన్నా
నీ కనుకొనల జారిన భాష్పవలయం చుట్టూ
పరితప్త కందిరీగనై గిరికీలు కొట్టాలన్నా
నీ చాచిన చెయ్యిలోంచి
భవిష్యత్ మాధుర్యాలను కలుగునై తోడుకోవాలన్నా
జుట్టు పట్టుకుని, సముద్రంలోకి లాక్కెళ్లి
నన్ను నేను వందసార్లు ముంచుకోవల్సిందే.

నీ నుదురొక అరణ్యమై విస్తరిస్తే
విల్లెక్కుపెడుతున్న బంజారాగీతమై
కలియ తిరగాలన్నా
నీ హృదయమెక్కడో కాట గలిసిపోతే
దారుల దిగ్బంధనంలో
పోగయ్యే సామూహిక వేదనాభరిత వేదికపై
నిన్ను కనుగొనాలన్నా
జీవితమెక్కడో కుంటుతున్న కుక్కపిల్లై
కాళ్లకడ్డం పడితే
అమ్మ కడుపులోకెళ్లి మమకారాన్నింత మోసుకురావాలన్నా
నాకు నేనే పుల్లలు పుల్లలుగా విరుచుకొని
కట్టగట్టుకొన్న మోపుగా
కొత్తగా అవతరించాల్సిందే.

ఇప్పుడు చెప్పనా
నువ్వెవరివో
నేనెవరినో
నువ్వు
నూరంకెలు లెక్కబెడుతున్న బతుకు చుట్టూ
మూగిన ఆశయానివి
నీ అడుగులకు
మరింత నూరేళ్ల బలాన్నద్దుతున్న నేను
శిల్పాన్ని...!

గుర్తు దొరక్కుండా...
సిహెచ్.వి.బృందావనరావు
ఇప్పుడు మనిషి నెవరూ
బంధించి ఉంచలేరు
సమూహాన్ని చించేసి
ఒంటరితనాన్ని ఒంటికి తొడుక్కొని
నాణేలను ఏరుకుంటూ
నడిచిపోతున్న మనిషినిప్పుడు
ఏ ఆపేక్షుల మోకులూ బంధించలేవు
ఏ ప్రణయబంధాలూ ఆపి వుంచలేవు
కనుచూపుల వేదికలకు
కలల యవనికల్ని వేలాడేసుకొని
తెరల వెనకాల ఉన్నదనుకొన్న ఏదో
తెలియని గమ్యం కోసం
అక్షాంశాల ఆవలికి
ఆశగా పరిగెత్తిపొయ్యే మనిషినిప్పుడు
ఏ కన్న పేగులూ కట్టి పడెయ్యలేవు
ఏ కన్నీటి వాగులూ నిలిపి ఉంచలేవు
ఇప్పుడు మనిషిని పోలిక పట్టడం కూడా
ఏమంత సులభం కాదు
అడవిలోని లేళ్ల మందల్లాగానో
ఆకాశంలోని గువ్వల బారుల్లాగానో
మనిషిప్పుడు తన జాతి జనంతో
జీవించడం మరిచిపోయాడు
ఆశల శిథిలాల అట్టడుగుల
అనగా అనగా ఓ కథగా మిగిలిపొయ్యాడు
అనాధగా ప్రవహిస్తూ
అందని ఏ సముద్రం కోసమో
గునగునా పారే మనిషినిప్పుడు
గుర్తు పట్టడం కూడా వీలుకాదు.
సుగుణ గంగ!
గుర్రాల రమణయ్య
పూయమంటే మొక్క పూయదు
కాయమంటే చెట్టు కాయదు
యాసిడ్ బాటిళ్ల భయంలో
ప్రేమెలా పుట్టుకొస్తుంది
ఆగమంటే యేరు ఆగదు
వద్దంటే రాత్రి రాక మానదు
శాంతి గీతం ఆలపించగనే
పిడికిలెలా విప్పుకుంటుంది!
కాలమే కత్తుల వంతెనపైన
కవాత నడకలు నడుస్తుంటే
మనం ఎత్తిన ప్రతి అడుగూ
పూలపైన నడుస్తున్నట్టుండాలి!

గుండెల్ని దోసిట్లో పట్టుకొని
గుబులు పొదల మాటునుండి
సెకన్ల ముల్లులా అడుగడుగూ వేస్తూ
గూడుదాకా చేరుకోవాలి
మనిషిని మనిషిగా ప్రేమించటం
మరిచిపోయిన క్షణాన్నుంచే
దౌర్జన్యం సంకెళ్లు తెరచుకుంది
దుర్మార్గం ఒళ్లు విరుచుకుంది
ఇప్పుడిక వ్యాపారంలా కాదు
జీవితాన్ని అలాయి-బలాయిల
దృక్కోణం నుండి చూడాలి
మనసుల్ని పుస్తకంలా పరిచి
అందరికీ మమతల పాఠాలు నేర్పాలి
మనిషి గుండెల్లో చొరబడిన
కాలుష్య లక్షణాలని కడిగేయాలి
వాతావరణ కాలుష్యాన్ని నిరోధించి
నేలపై పచ్చని చిరునవ్వుల కోసం
మనిషి సుగుణ గంగలో మునకేయాలి!

మనల్ని మనం వెతుక్కోవడం కోసం

మనల్ని మనం వెతుక్కోవడం కోసం
ఒక అత్యద్భుత ఒంటరితనం కోసం
అప్పుడప్పుడు కొన్ని మైళ్ల దూరం
ప్రయాణవౌతాం.
ఒంటరిగా నిలబడ్డ చెట్టును చూస్తాం
నిర్మలంగా వున్న ఆకాశాన్ని చూస్తాం
లక్ష్యం వైపు సాగే పక్షిని చూస్తాం.
ఆలోచనల్లో స్నానించి
కొత్త పరిమళాన్ని నింపుకొని
మళ్లీ కొత్తగా విరబూస్తాం
మానవ సమూహంలోకి
చిరునవ్వులమై ప్రవహిస్తాం.
వినుడు.. వినుడు..
-జగద్ధాత్రి
మాది లౌకిక రాజ్యం
అందుకే మాకు తన పర భేదాల్లేవు
గుళ్లూ గోపురాలూ
మసీదులూ దర్గాలూ
గురుద్వారాలూ, చర్చిలూ
బౌద్ధ ఆరామాలూ, జైన ఆలయాలూ
దేన్నీ వదలం సుమా
ఎందుకంటే మేము
సర్వ మత సమానత్వమున్నవాళ్లం
అన్నిటినీ సమదృష్టితోనే
వినాశనం చేస్తాం
కుల వర్ణ భేదాలూ లేవు మాకు
భారత రత్నాలకు పాదరక్షల దండ వేస్తాం
జాతి రత్నాలను అవమానిస్తాం
అమానుషత్వ పరాకాష్ట చూస్తాం
వర్గ భేదాలూ లేని సౌభ్రాతృత్వ దేశం మాది
పేదవాణ్ణి శాయశక్తులా
వాడి స్థితి మారకుండా చూస్తాం
గొప్పోడిని మాత్రం తేడా చూపిస్తామా ఛఛా
మాకలాంటి కుయుక్తులు లేవు
వాడినెప్పుడూ గొప్పగానే ఉంచుతాము
అన్నం పెట్టే చేతులు
ఆశలొదిలి ఆత్మహత్యలు చేసుకుంటే
ఊరుకుంటామా
మొసలి కన్నీళ్లు కార్చి మరీ వస్తాం
అధికారుల దురాశకు బలై పోయి
ఆధ్యాత్మికానికి బదులు అంతిమ యాత్రకు వెళ్లిన
వేల మంది మా తోటివాళ్లను
మా నేతలు హెలీకాప్టర్ల నుండి
పర్యవేక్షిస్తారండీ పాపం
మావి జాలి గుండెలు సుమండీ
అసలే అత్యంత ప్రాచీన సంస్కృతి మాది
అందుకే ఎప్పుడూ తాతల నేతులను
గూర్చి కథలు కథలుగా
చరిత్ర కెక్కిస్తాము
మాది పశ్చిమ వికృత సంస్కృతి కాదు
ఏదో ప్రపంచీకరణలో
ఇంతటి దేశం లేకుంటే ఎలా అని
మా పిల్లల్నీ, మనమల్నీ
విదేశాలు కూలికి పంపుతున్నాం
ప్రపంచ మార్కెట్లో వస్తువులుగా
నిలబెడుతున్నాం
ఎన్నిమార్లు ఎన్ని ప్రమాదాల్లో
మమ్మల్ని చంపినా
కలియుగం ఒకేసారి అంతం కాదట
అందుకే ఇలా దఫదఫాలుగా
భూకంపాలు, హిమాలయ సునామీలు
రూపంలో ఆ పరమాత్మ
మోక్షం ప్రసాదిస్తున్నాడని
కాశీ గంగలో మునక వేసి
తర్పణాలొదులుతున్నాం
ప్రకృతి తీవ్రవాదానికి
భగవంతుణ్ణే బాధ్యుణ్ణి చేస్తాం
ఇక మా ప్రభుత్వం గురించి మరి కొంచెం వినండి
మార్పు కోసం చర్చలు జరుపుతుంటాం
పరిమార్చడంలో ఏ చర్చలూ లేవని తెలుపుతుంటాం
ఇవండీ మా సంగతులు
ఏదో మచ్చుకి కొన్ని చెప్పానంతే
మరీ గొప్పలు చెప్పుకోవడానికి
మాకు మొహమాటం కూడానూ
అందుకే ఇక రాబోయే ఎన్నికల కోసం
మా నేతలు మాకు నేస్తాల్లా నటిస్తూ
మమ్మల్నిప్పటినుండే
బుట్టలో వెయ్యడానికి ఎన్ని పాట్లు
పడుతున్నారో చెప్పానా?
లేదే! ఎంతైనా మరీ బడాయి పోవడం
ఎందుకులెండని మనసు కట్టుకుని ఊరుకున్నా
మాది రత్నగర్భ భారతం అవునో కాదో గానీ
నిత్యం భేతాళుడి శవంలాగా
మా శవాలను మేమే
మా తల్లికి కానుకగా ఇచ్చి
ఆమె కంట నీరు ఆగకుండా చూస్తాం
అందులో మాత్రం ఎవ్వరికీ తీసిపోము
మాది అత్యంత ప్రజాస్వామిక దేశం
ఎక్కడా ఎందులోనూ
తారతమ్యాలుండవు సుమా!!

నవ్వుతున్న ముఖాల కోసం దీపాలు వెలిగించి పెట్టాను..

మనిషిని వెదికిన ప్రతి సారి
రాతిబొమ్మే తలకు తగులుతోంది
అది ళ్ళల్లో కళ్ళు పెట్టి చూడదు
కనీసం గుస గుసగా మాట్లాడదు
కనిపించినందుకు మురిసిపోదు
గుండె చెదిరినప్పుడు వీపు నిమురదు
విడిపోతున్నప్పుడు మీద పడి ఏడ్వదు

దాగుడు మూతల జాడల కోసం
కూలిన గోడల్లో జారిపడుతున్నాను
కమ్మని మనసును కోరుకున్నప్పుడు
కరెన్సీ గోడలు అడ్డు లేస్తున్నాయి


అక్కడ అత్తరు పరిమళముండదు
అల్లుకుపోయే మాధుర్యముండదు
దగ్గర చేరే అడ్డదారీ ఉండదు
ముట్టుకునే మొండి ధైర్యమూ ఉండదు

మంటల్లో చిక్కిన ఎలుగుబంటి వెర్రిలా
కంచె చుట్టూ
దొర్లుతున్నాను

ఏ మలుపు చేరినా
ఎవరి తలుపు తట్టినా
గుర్తుపట్టేవాళ్ళు
కరవైపోయారు

విందుల్లో కలిసినా
పస్తుల్లో మగ్గినా
పలకరిస్తే విసుక్కొంటున్నారు

తిరిగి తిరిగి దారి పెరిగి
నీడ కోసం నింగిని చూస్తున్నాను

ఆషరజుఅడుగుల ఆత్మీయత కోసం
అరచేతుల్ని పువ్వుల్లా పరిచాను

నవ్వుతున్న
ముఖాల కోసం
దీపాలు
వెలిగించి పెట్టాను..

ఒక నీటి చుక్క వెలువడి నాతో అన్నది

కంటి నుంచి ఒక నీటి చుక్క వెలువడి నాతో అన్నది
" మిత్రమా! ఇన్నాళ్ళూ నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై వున్నాను.
నీ బాధల్లోనూ పాలుపంచుకున్నాను.
ఈ క్షణం నువ్వుపడే ఈ వ్యధను భరించలేక బైటకు వెళుతున్నాను.
నా ఈ వీడ్కో నీకే మాత్రమైనా సంతోషాన్నిస్తే -
మిత్రమా! నాకు అంతకన్నా కావల్సిందేముంది " ......శలవు!

26, ఆగస్టు 2013, సోమవారం

ని ఊసులే మొదలాయనే ఈ వేల ..

ఎందుకో ఏమిటో , తొలిసారి నా గుండెలో
ని ఊసులే మొదలాయనే ఈ వేల ..
ఎందుకో ఏమిటో , నిడురింక రాదేమితో
కనుపాపలో కల కాదుగా ఈ మాయా ..
ఏపుదూ లేనిది , నాలో అలజడి
ఏవరూ చెప్పలేదే ప్రేమని ..
ఎందుకో ఏమిటో , తొలిసారి నా గుండెలో
ని ఊసులే మొదలాయనే ఈ వేల ..
ప్రేమనే మాటకు , అర్ధమే నాకు రాదే
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసేనే
నీ జాతే చేరగా , నా కధే మారిపోయే
లోకమే బొత్తిగా గుర్తుకే రాదు లే
చినుకై చేరినా , వరదై పోయెనే
ఎవరూ ఆపలేరు ప్రేమని ..
ఎందుకో ఏమిటో , తొలిసారి నా గుండెలో
ని ఊసులే మొదలాయనే ఈ వేల ..
గాలిలో వేలితో , ఆశలే రాసుకోనా
నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా
నీటిలో నీడలో , నిన్నిలా చూసుకోనా
ఊహలో తేలుతూ ఊసులే ఆడనా
లోకం ఎంతగా , మారిందే ఇలా
పగలే జాలువారే వెన్నెలా ..
ఎందుకో ఏమిటో , తొలిసారి నా గుండెలో
ని ఊసులే మొదలాయనే ఈ వేల ..

19, ఆగస్టు 2013, సోమవారం

ఆరోజుకోసమే ఎదురు చూస్తున్నా ....?

నిద్ర పట్టని రాత్రి
నా హృదయం
నీ జ్ఞాపకాలు
ముసురుకుంటాయి
తట్టుకోలేక
తరిమేయ్యలన్న
ప్రయత్నంతో
పారిపోయినట్టే పోయి
మళ్లీ కమ్ముకుంటాయి….
నాహృదయానికి
చిల్లులు పడేలా కుట్టేస్తాయి
హృదయాన్ని చిల్లులు పొడుస్తాయి

చుట్టూ చిమ్మచీకటి
అందరూ ఆదమర్చి
నిద్రపోతున్నవేల
నా ప్రమేయంలేకుండా
కారుతున్న కన్నీరు
బోరున ఏడుపు రాదు ఎందుకో ..
మౌనంగా రోదిస్తాను
గుండె బరువు
తీర్చుకోవటానికి
ఎంత ప్రయత్నించినా
కుదరటంలేదు
కనుకొన నుంచి
ఆగి ఆగి రాలుతున్న,
ఒక్కో కన్నీటి చినుకులో..
తడిసిన తలగడ
చెంపకు ఆని
వెచ్చని కన్నీటితో
గుండె తడిని గుర్తుచేస్తుంది ఈ రాత్రి ఎందుకో


చీకటిలో నిద్రపోదామంటే
వెలుతురులో రాచుకున్న
జ్ఞాపకాలతో నిద్ర పట్టని  ఈ రాత్రి
నన్ను చంపేసేలా ఉంది
రేపటి ఉదయాన్ని చూస్తానో లేదో అనిపిస్తుంది
ఇలా ప్రతి క్షనం ప్రతి నిమిషం
అవమానాల పాలవడం కంటే
అదేబెటరేమో ఆరోజుకోసమే ఎదురు చూస్తున్నా ....?

8, ఆగస్టు 2013, గురువారం

నీ రూపమే తరుముతోంది

ఎన్నేళ్ళ నిరీక్షణ ఇది..?
నీతో కలిగిన పరిచయం
నన్ను మనిషిని చేసింది
మానవత్వాన్ని నేర్పింది
నువ్వక్కడ ... నేనిక్కడ
ఒకే దారి .. ఒకే నడక
నువ్వూ నేను కలిసినప్పుడల్లా
ఈ లోకం అందంగా అనిపించేది
బాహ్యపు ఆహార్యం కంటే
అంతర్ సౌందర్యం గొప్పదంటూ
నీవన్న మాటలు .. నా గుండెను
గుప్పిట బిగించేలా చేసింది ...
ఎవరూ ఓ పట్టాన అర్థంకాని
సమయంలో నువ్వు నాకు అండగా నిలిచావు
ఓ హృదయం మరో మనసుతో
సంభాసిస్తున్నప్పుడు కలిగే తత్తరపాటు
నువ్వు లీలగా గుర్తుపెట్టుకుని
నా చేతిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు
నేను పిల్లాడిలా మారిపోయాను
అలాగే నీ మోము వైపు చూస్తూ
నీ గుండెల్లో తలదాచుకున్నాను
ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని ఆనందం
నీ వెచ్చని ఒడిలో కలిగింది
అప్పుడు అమ్మ ఆత్మీయంగా
గుప్పెట్లోకి తీసుకున్నట్టు
అనిపించింది ... మనిద్దరి మధ్య
ఆ చిన్నపాటి సాహచర్యం మళ్ళీ
మళ్ళీ నీ గురించి ఆలోచించేలా చేసింది ...
ఎక్కడో పుట్టి .. దేనికోసమో వెతికి వెతికి
అలసిపోయినప్పుడు ..
ముళ్ళున్న నా రహదారిలో
నీ హృదయాన్ని మైదానంగా పరిచావు
అప్పుడు మరణం కూడా చిన్నదనిపించింది
అందుకే నీవు లేకుండా నేను
ఉండలేనన్న వాస్తవం తెలిసింది
నువ్వు తోడుంటే నేనో ఆకాశం
నువ్వు నా పక్కనుంటే
అదో .. సముద్రం .. అందులోనే
దూకేయాలన్న ఆవేశం ..
కళ్ళు మూసినా .. కనురెప్పలు కదలాడినా
ఏకాంతంలో నేను ఒంటరినై
నన్ను నేను కన్నీళ్ళతో స్నానం చేసినా
నీ రూపమే తరుముతోంది
నువ్వు నిజం .. నేను అబద్దం
మన సంగమం సహజం ..

ప్రణయ ప్రయాణంలో నీ గొంతు గాలై చుట్టుముడుతోంది

ప్రణయ ప్రయాణంలో
నీ గొంతు గాలై చుట్టుముడుతోంది
నీ చూపు నిజమంటూ
గుండెను కాటేస్తోంది
పిడికెడు హృదయాన్ని మెలిపెట్టి చంపేస్తోంది
అమృతం నిండిన నీ మాటలు
సవ్వడులై నాలో సంచారం ఉన్నవి ...
మనసు నిర్వీర్యమైన చోట
ఆలోచనలు ఇంకి పోయిన చోట
నువ్వు అలవోకగా మనసారా
గలగలమని నవ్వుతూ ఉంటే
నేను .. నువ్వేనా అంటూ
అక్కడే ఆగిపోయా ...
అదే గాత్రం .. అదే అమృతం ...
భాదపడటం తెలియని వాళ్ళను
చూస్తే నవ్వు వస్తుంది
స్పందించే మనసు లేకపోతే
ఈ మూగ బాస అర్థం కాదు
కళ్ళు మాట్లాడే వేళ
చూపులు అరుణ వర్ణం దాల్చుతాయి
సహచారురాలా ..
ప్రేమించటం నేర్చుకోకపోతే
ఈ లోకం అర్థం కాదని
కనీసం బతకటానికైనా ప్రేమించాలని
కనీసం పాటలను .. పూలను ..ప్రకృతి
గురించి కూసింత
రాగాలనైనా నేర్చుకోక పోతే
ఎప్పుడో ఒకప్పుడు
రాలిపోయే బతుక్కి అర్థం ఏముంటుందని .. కదూ ...

గత జన్మ బంధానివా ?

కలలో కనిపిస్తావు
కనురెప్పలపై జాలువారుతావు ,

మనసంతా మల్లెలు పరచి
మధుమాసాన్ని నిమ్పేస్తావు ,

గుండెల్లో చేరి గుట్టుగా
స్నేహ పరిమళాలను వెదజల్లుతావు ,

నీవెవరు నేస్తమా ?
నాకోసం వెతుక్కుంటూ వచ్చిన

గత జన్మ బంధానివా ?
తీరిపోని రుణానివా ?

జీవితమంటే చావు కోసం చేసే ప్రయాణం

"..జీవితమంటే
చావు కోసం చేసే ప్రయాణం
మరణం అంటే
బతుకును తృప్తిగా అనుభవించటం
శాశ్వతంగా నిద్ర పోవడం
ఈ అందమైన ప్రపంచం నుంచి నిష్క్రమించడం
అందరినీ..అయినవారందరినీ వదిలి వెళ్ళడం
స్మశానంలో సేద దీరడం ..."
అలలు లాంటివే కలలు
కల్లలైన కలలే కోటి స్వప్నాలను ఆవిష్కరిస్తాయి
కలలు కనాలి
తనివి తీరా వాటిని నిజం చేసేందుకు ప్రయత్నించాలి
అందులో ఓటమి మనల్ని పలకరించవచ్చు
విజయం చేకూరవచ్చు
కానీ
అది మిగిల్చిన అనుభవం
అనుభూతి మాత్రం కలకాలం మిగిలే ఉంటుంది
మనల్ని వెన్నంటే ఉంటుంది ..

గుండెల్ని మీటేది మాటలే

"..గుండెల్ని మీటేది మాటలే
గుప్పిట బిగించేది మాటలే
గువ్వలా ఒదిగి పోయేది మాటలే
మాటలు మనసు దోచేస్తాయి
హృదయాల మీద పూల సంతకం చేస్తాయి
మౌనం గొప్పదే కాదనలేం
కానీ మాటలు లేకుండా..మాట్లాడకుండా ఎలా ఉండగలం ?
మాటలు కొండంత అండను ఇస్తాయి
చెరిగిపోని స్పూర్తినిస్తాయి
మన ఎడతెగని సంచారంలో
ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి
ఏదీ లేకపోయినా బతకొచ్చు
కానీ ఇష్టమైన వారితో మాట్లాడకుండా ఉండలేం
అనుబంధాలను కలిపేది మాటలే
బంధాలను తెంచేది మాటలే
తనివి తీరా ఏడవాలి ..ఏడిచాకా మాట్లాడాలి
అప్పుడే వాటి విలువ తెలుస్తుంది
మనకు లేకపోతే అర్థమవుతుంది
మాటలకున్న మహత్తు ఏమిటో .."

పాఠంగా ఉండనీయండి

మెరిసే రంగుల వెనుక
దాగిన కన్నీళ్ళు ఎన్నో
వెలుగులను పంచే
హృదయాల వెనుక
ఉండి పోయిన
చీకటి నిండిన దుఖం ఎంతో
నిరంతరం గుండెలనుతమ
చిరునవ్వులతో పలుకరించే వాళ్ళను
చిదిమింది ఎవ్వరో ..
నేరం నీది కాదు ..నాదీ కాదు
ఈ సమాజానిది ..
ఇప్పుడు కనడమే
నేరమైంది దోషమైంది ....
అసలు అందమైన
ఈ లోకానికి పరిచయం చేయటం తప్పైంది
ఇంకానా ఇక ఆపండి
మీ వ్యాఖ్యానాలు ..
విశ్లేషణలు చాలించండి
వార్తలు కావవి ..
రేటింగ్ మాయాజాలం ..పెనుభూతం
ఛీ.. ఇంక ఆపండి
మా మానాన
మమ్మల్ని చావ నీయండి
రేపటి తరానికి
పాఠంగా ఉండనీయండి

వెన్నెల రాత్రుల్లో

వెన్నెల రాత్రుల్లో
వెండి సంతకం
గుండె గొంతుకలో
కదలాడే జ్ఞాపకం
లోకాన్ని ముద్దాడే రాగామది
అనురాగమది..హృదిని మేల్కొల్పే గానమది..
పాటంటే .. సమస్త ప్రపంచం తనలో తాను ఆవిష్కరించడం
పాట లేకుండా నేనుండలేను
పాట లేని జీవితాన్ని నేను తట్టుకోలేను
మరణపు లోగిళ్ళలో పాట పురుడు పోసుకోవాలి
మళ్ళీ జీవం పోయాలి ...అందుకే
పాటకు వందనం ..అభివందనం
సుతిమెత్తని ఆ గొంతు
హృదయపు తోటలో
పూల రాగాలు చల్లుతుంది
నిదురపోతున్న గుండెను
ఉదయమై మేల్కొల్పుతుంది
నిశీధి రాతిరిలో
మనసు ఒంటరిదైతే
అప్పుడు గీతా మాధుర్యం
వెన్నెల చినుకై
పాటల జలపాతంలో
మనల్ని నిండారా
అభ్యంగన స్నానం చేయిస్తుంది ...

కళ్ళను కాపాడే కనురెప్పలు లాంటి ఆ పిల్లలను చూస్తే చాలు..

"..వాళ్ళు నవ్వుతూ ఉంటే
వెన్నెల రాత్రుళ్ళు ముగ్గులు వేస్తున్నట్టు
ఎల్లలు ఎరుగని చిన్నారులు
మాయా మర్మమే లేని పిల్లలు
వాళ్ళు చేసే చేష్టలు చూస్తూ ఉంటే
జీవితమంతా వాళ్ళ ముందు పరచాలని ఉంది ..
వేణు నాదమేదో గుండెలను మీటినట్టు
సరదాగా సాగిపోయే హృదయపు సముద్రం మీద
అలల సంతకం చేసినట్టు
వాళ్ళు ఏడిస్తే ..
చిన్ని ప్రాణానికి యేవో చెల్లులు పడినట్టు అనిపిస్తుంది ...
వాళ్ళను ఎత్తుకుంటే ...
ఏళ్ళ తరబడి గడ్డకట్టుకుపోయిన దుఖం అంతా మటుమాయమై పోయినట్టు ...
గాల్లో గాలి పతంగులు ఎగిరేసినట్టు..
సమస్త ప్రపంచం ఇంద్రధనస్సుగా మారి
బతుకు ముంగిట రంగవల్లులు సందడి చేసినట్టు ..
వాళ్ళు పలకరిస్తుంటే ..
ఓ అద్వితీయమైన ఆనందానికి లోనైనట్టు ..
వాళ్లు కలవరిస్తుంటే ..
చచ్చిపోతున్న ఫీలింగ్స్ ..
అవును ...గతం ఎంత గొప్పది కదూ..
వర్తమాన సంచారంలో ...
బాల్యం చెరిగిపోని సంతకం కదు..
జన్మ అంటూ ఉంటే ...
ఆ బోసినవ్వుల లోకంలో మనసును పారేసుకోవాలని ఉంది..
నన్ను నేను స్పృశించు కోవాలని ఉంది..
అవును ...
పిల్లలా కాదు ...
వాళ్ళు వెన్నెల జలతారు తీగెలు
రవలించే రాగాలు ..
గుండె లోతుల్లో మీటే సరిగమలు ..గమకాలు..
వాళ్ళతో నడిచి వెళుతుంటే ..
యుద్దంలో నడిచినట్టే ఉంటుంది ...
అమ్మ చనుబాలు ఆకలి తీర్చినట్టుగా ఉంటుంది..
అదో అనుభవం..
బాల్యం ఓ తీయని జ్ఞాపకం ...
కళ్ళను కాపాడే కనురెప్పలు లాంటి ఆ పిల్లలను చూస్తే చాలు..
మళ్ళీ మళ్ళీ జన్మించాలని ఉంది.. "

నువ్వు ..హాయిగా ఉండాలని ..వెళ్ళిపోతున్నా నీకు దూరంగా.. "

"ఘనీభవించిన కాలం
ఒక్కోసారి గుండెను గాయం చేస్తుంది
మరోసారి కోలుకోలేకుండా మార్చేస్తుంది
ప్రయాణమే జీవన మార్గంగా మారిన ప్రస్తుత తరుణంలో
మాటలు కరువయ్యాయి ...ఇక చూపులే మిగిలాయి ..
హృదయం మంచు ముద్దగా మారింది ...నీ గురించి ఆలోచించి ..ఆలోచించి ...
అయినా ..నువ్వు అక్కడ నేను ఇక్కడ
దారులు వేరు..గమ్యాలు వేరు ..
ఊహల్లో నేను ..కలల అలలై ఎగసి పడుతుంటే
నేను మాత్రం నీ తలపుల తనువు కోసం ఆరాటపడుతున్నా ...
మన పరిచయం ...సముద్రం లోని దిక్సూచిలాగా మారింది ..
అప్పుడప్పుడు ఓ రెండు మాటలు ..మరికొన్ని వాలు చూపులు ...
నీ కళ్ళు మెరిసినప్పుడు ...నీ పెదవుల మీద దరహాసం విరిసినప్పుడు
నీ గుండెల మీద ..నా చూపు గులాబిగా మారి నిన్ను గుచ్చుకున్నప్పుడు
నేను నేనుగా ఉండలేకపోయా ...
బహుశా ఇది మన మద్య మరింత దూరాన్ని పెంచింది
పెను అనుమానాలకు తావిచ్చింది ...
నిన్ను విడిచి నేనుండలేను ..నన్ను నేను సముదాయించుకోలేను..
మనసు పొరల్లో నిక్షిప్తంగా ఉండిపోయిన ..ఆ కాసిన్ని కన్నీళ్లను కార్చటం తప్పా ...
అందుకే ..నిండారా ..ఏడుస్తూ ఉన్నా ...
నువ్వు ..హాయిగా ఉండాలని ..వెళ్ళిపోతున్నా నీకు దూరంగా.. "

వాళ్ళను మన పొత్తిళ్ళలో దాచుకుందాం ..

"..ఏళ్ళకు ఏళ్ళు
గడిచి పోతున్నవి
తరాలు అంతరించి పోతున్నా
వలసల సంచారం ఆగడం లేదు
పొట్ట కూటి కోసం
సాగిస్తున్న సమరం ఇది
కొందరికి జీవన్మరణ పోరాటం అది
పుట్టిన ఊరిని వదిలి
కన్నవాళ్ళను కాదనుకుని
పొట్ట చేత పట్టుకుని
వందల మైళ్ళు వెళుతూనే ఉంటారు
నేతలు మారారు ..
హామీలు గుప్పిస్తూనే ఉన్నారు
కానీ మట్టి బిడ్డల కథ మార లేదు
స్మశానంలా తయారైన ఈ నేల
మీద ఇప్పుడు శ్వాస పీల్చుకోవడమూ నేరమే
గదిగో ..ఇదిగో తెలంగాణా అంటూ
ఊరిస్తున్న నేతలు ..దొరలై పోయారు
ప్రజా ప్రతినిధులై ..
కమ్మని కబుర్లు చెబుతున్నారు
పోలేపల్లి పోరు బాట పడితే
భూమి కోసం ప్రాణాలు పిట్టల్లా
రాలిపోతుంటే
ఏ ఒక్కడు నిలదీసిన పాపాన పోలేదు
ప్రశ్నించే ధైర్యం చేయలేదు ..
ఇప్పుడు విపణి మార్కెట్లో
తెలంగాణా ఉమ్మడి
సరుకుగా మారింది
అందరికి అంది వచ్చిన
పదమై పోయింది..
బతుకు పోరాటంలో
సామిధలవుతున్నమట్టి బిడ్డలను
కాపాడుకుందాం ..
వాళ్ళను మన పొత్తిళ్ళలో దాచుకుందాం .."

అది మనమేనని..

"..ఏకాంతంలో ఒక్కడినే
నీ కోసం ఎదురు చూడటం
ప్రేమంటే ..
హృదయపు మైదానం మీద
నీ తలపుల వానలో తడిసి పోవటం
ప్రేమంటే
రెండు ఆత్మలు ..
రెండే రెండు మనసులు
కలిసే అరుదైన సంఘటన
ప్రేమంటే
నువ్వు లేక పోయినా
నీ మదిలో సవ్వడిగా
మారిపోయేది ప్రేమంటే
ప్రేమ ఓ ఉద్విగ్నమైన అభినివేశం
ఓ అరుదైన ఆలాపన
నీ కనుల కొలనులో
సాగే నిరంతర స్వాతి చినుకు
ప్రేమంటే ..
నువ్వు నన్ను వెలిగిస్తే
నేను నిన్ను నాలో దాచుకుంటా
నీ కోసం అన్వేషిస్తూ సాగిపోతా
నువ్వన్నది నిజం
మనిద్దరి ప్రయాణం
గమ్యం ఒక్కటేనని
అది మనమేనని.."

ప్రేమా కవ్వించకే .. మనసా తుళ్ళిపడకే ..

ప్రణయ ప్రయాణంలో
నీ గొంతు గాలై చుట్టుముడుతోంది
నీ చూపు నిజమంటూ
గుండెను కాటేస్తోంది
పిడికెడు హృదయాన్ని మెలిపెట్టి చంపేస్తోంది
అమృతం నిండిన నీ మాటలు
సవ్వడులై నాలో సంచారం ఉన్నవి ...
మనసు నిర్వీర్యమైన చోట
ఆలోచనలు ఇంకి పోయిన చోట
నువ్వు అలవోకగా మనసారా
గలగలమని నవ్వుతూ ఉంటే
నేను .. నువ్వేనా అంటూ
అక్కడే ఆగిపోయా ...
అదే గాత్రం .. అదే అమృతం ...
భాదపడటం తెలియని వాళ్ళను
చూస్తే నవ్వు వస్తుంది
స్పందించే మనసు లేకపోతే
ఈ మూగ బాస అర్థం కాదు
కళ్ళు మాట్లాడే వేళ
చూపులు అరుణ వర్ణం దాల్చుతాయి
సహచారురాలా ..
ప్రేమించటం నేర్చుకోకపోతే
ఈ లోకం అర్థం కాదని
కనీసం బతకటానికైనా ప్రేమించాలని
కనీసం పాటలను .. పూలను ..ప్రకృతి
గురించి కూసింత
రాగాలనైనా నేర్చుకోక పోతే
ఎప్పుడో ఒకప్పుడు
రాలిపోయే బతుక్కి అర్థం ఏముంటుందని .. కదూ ...
ప్రేమా కవ్వించకే .. మనసా తుళ్ళిపడకే ..

నువ్వు శాశ్వతం .. నేను అసత్యం

ఏ దివిలో విరిసిన మల్లెపూవువో
ఏ తోటలో విప్పారిన కొమ్మవో
కదిలే నదిలా .. కమ్మని కలలా
నింగిలో వెలుగులు విరజిమ్మే వెన్నెలలా
నాలో నిరంతరం ప్రవహించే రక్తంలా
నాకు ప్రాణ ప్రదమైన శ్వాసగా
నీతో కలిగిన పరిచయం
నన్ను మనిషితనం నుంచి
మానవత్వం దిశగా మార్చేలా చేసింది ..
పండు వెన్నెల్లో
నీ రూపం .. గాలిగా మారి
నా పెదవులను స్పృశించింది
నువ్వో జల్లుగా నా గుండెను
తడుముతుంటే .. నేను
ఆకాశమై నిన్ను హత్తుకుంటూ
ఉండిపోతాను ..
నీ తలపుల్లో జీవిస్తూ
నీ గుండెల మీద వాలిపోతాను
నాలో మిగిలిపోయిన కన్నీళ్లతో
అభ్యంగపు స్నానం చేసి
పునీతుడవుతాను ...
ప్రేమంటే మైకమా .. లేక సాగే ప్రయాణమా
కానే కాదు .. నీకు నేను .. నాకు నువ్వు
ఒకరికి మరొకరం .. కష్టంలో ఇద్దరమే
ఇష్టంలో మనమే ..
నువ్వు లేని చోట
మాటలుండవు ... చూపులు ఉండవు
కళ్ళు ఘనీభవిస్తాయి
గుండె గునపమై పోతుంది
నీ కోసం చావును
ముద్దాడేలా చేస్తుంది ..
నువ్వు శాశ్వతం .. నేను అసత్యం

నేనో పక్షిని ఎగరడం నా ఆదర్శం

నేనో పక్షిని
ఎగరడం నా ఆదర్శం
గాలి వీచినా
నింగి నిప్పులు కురిపించినా
సముద్రం వుప్పొంగినా
మేఘాలు ఉరిమినా
ప్రయాణం సాగిస్తూనే ఉంటా
అదే నా గమ్యం
అదే నా లక్ష్యం .. !

ఆటంకాలను దాటుకుని
ఆవేదనలను దాచుకుని
పరుగులు తీయటమే
నాకున్న పని
విహారమే నాకు నిత్య సంచారం .. !

కొమ్మల్లా
అల్లుకున్న తీగల్లా
అప్పుడప్పుడు ఆగిపోతా
అలుపు లేకుండా సాగిపోతా .. !

నేను ఒంటరిదానిని
అయినా ఈ అందమైన
లోకమే నాకు ఆలంబన
అదే నాకు లోకం
అదే నాకు ప్రాణప్రదం .. !

ప్రతి ఉదయం నాకు
నిత్య పాఠం
ప్రతి సాయంత్రం
నాకో స్ఫూర్తి మంత్రం
ఎగురుతూ.. ఎగురుతూనే ఉంటా
అలసి పోయినా
ఆపను నా దారిని
రెక్కలే ఆధారం
అప్పుడప్పుడు కరెంట్
తీగల మీద వాలిపోతా
ఒక్కోసారి కాలిపోతా .. !

జీవితం చిన్నదని
చావు తప్పదని తెలుసు
అయినా ఆగను
పరుగులు తీస్తూనే ఉంటా .. !

నాతో పాటే
పక్షులు ..పావురాలు
గువ్వలు .గోరింకలు
సీతాకోక చిలుకలు
కదిలే కాలువల్లా
కలిసి పోతాం
నదుల్లా మారిపోతాం .. !

అవును .. నేనో పక్షిని
అందమైన కాలాన్ని
అద్భుతమైన ఈ ప్రపంచాన్ని
ప్రేమిద్దాం .. ఇంకా మిగిలి ఉన్నందుకు
గర్వపడుదాం
పాటల పక్షులమై
పాడుకుందాం .. గుండెల్లో దాచుకుందాం .. !!

సాగిపోతున్న గమ్యానికి ద్వారాలు .. !!

దారులు వేరైపోయినప్పుడు
గమ్యాల స్ఫూర్తి
కొడిగడుతున్నపుడు
ఏకాంతంలో ఒంటరినై
కొట్టుమిట్టాడుతున్నప్పుడు
బతుకంతా నైరాశ్యంలో
కూరుకుపోయినప్పుడు
మెలమెల్లగా పాదాలు
సవ్వడి చేస్తాయి
గూడు చెదిరిన గుండెకు
స్వాంతన కలుగ చేస్తాయి ..!

విరబూసిన పూలు
కొమ్మల మీద వాలినట్టు
సముద్రాన్ని సూర్య కిరణాలు
తమకంతో తాకినట్టు
పాదాలు అలికిడితో
మేల్కొల్పుతాయి ..!

వెచ్చని జ్ఞాపకం
వేకువై చీల్చినట్టు
అడుగుల సవ్వడులు
నాదాలై పోతాయి
రాగాలై మీటుతాయి

నవ్వులే సిరిమువ్వలై
పోయినట్టు
కలలే అలలై కడలిని
ముద్దాడినట్టు
పక్షులై ఆకాశాన్ని
కౌగిలించుకున్నట్టు
నీ అడుగులు జల్లులై
యెదను చుంబించినట్టు
ఆ పాదాలు గుమ్మానికి
వేలాడే తోరణాలవుతాయి ..!

మువ్వల సవ్వడులు
అలల్ని కలల్ని
కౌగిలింతలను
నెమరువేసుకున్నట్టు
ఆ శభ్దాలు జాజిపూల
వనాలై పోతాయి
మాటలకందని మౌనానికి
ప్రేమను పంచుతాయి .. !

ఆ పాదాలు
చెలరేగే నాదాలు
స్వర్గానికి నిచ్చెనలు
సాగిపోతున్న గమ్యానికి
ద్వారాలు .. !!

కలిసిన ప్రేమ పక్షుల బాధను .. !!

ఏ దేవుడు చేసిన బొమ్మవో
నాకు ఈ దక్కిన ప్రాణానివో
కానీ నువ్వు నా పక్కనుంటే చాలు
నేనొక గువ్వ పిట్టనవుతా
గోరువంకనై నీ జ్ఞాపకపు
గుమ్మం ముందు వాలిపోతా ..!

నా కోసం నువ్వు
ఎదురుచూడటం
నీ కోసం నేను
నిరీక్షించటం
పనిలో పనిగా
ఒకరిలోకి ఒకరం
చూసుకుంటూ
కలలను నెమరు వేసుకుంటూ
ప్రవహించటం కొంత కాలంగా
మనకు తెలియకుండానే
అలవాటుగా మారిపోయింది
అది నిత్యం ప్రాతః స్మరనీయై పోయింది .. !

కొందరికి ఈ లోకం
మార్మికం
కానీ మనకు మాత్రం
అదో జీవితాన్ని వెలిగించే
దీపం .. !

కాలానికి ఎదురీది
అలసి పోయిన మనం
చెట్టు నీడన సొమ్మసిల్లి పోయాం
ఇంతలో కల్లోలంగా మారి
అల్లకల్లోలంలో పడి
కొట్టుకుపోతుంటే పాట
మనల్ని కలిపింది
మన గుండెల్లో గాత్రపు
ఝురిని మోగించింది .. !

ఇద్దరం ఒక్కరమవుదామని
ఏకాంతంలో కూర్చుంటే
గాలి మనల్ని బంధించింది
లోకపు చూపుల నుండి
కాపాడింది .. !

ఈ లోకం ఇంతే
ఎప్పటికి అర్థం చేసుకుంటుందో
కలిసిన ప్రేమ పక్షుల బాధను .. !!

ఈ లోకం కొత్తగా అగుపిస్తుంది మనిద్దరిని కలిపేస్తుంది .. !!

సుఖదుఖాల సమ్మేళనం
జీవితపు ప్రయాణం
ఒక్కోసారి కన్నీళ్లు
ఇంకోసారి వెచ్చని జ్ఞాపకాలు
మరోసారి గుండెను చీల్చే సన్నివేశాలు .. !

కాసుల మాయలో కొందరు
వస్తువుల జంజాటంలో
కొట్టుకుపోతున్న వారు ఎందరో
మమతాను రాగాలు మృగ్యమై పోతుంటే
మనం మాత్రం ఎవరి లోకంలో వాళ్ళం
ఎంచ్చక్కా ఎంజాయ్ చేస్తూ
అందమైన ప్రపంచానికి దూరంగా
బావుల్లో కప్పల్లాగా బందీ అయి పోయాం .. !

చావు పుట్టుకలు
సహజమైన చోట
స్వప్నాల గురించి ఆలోచించగలమా
గుండెలను మీటకుండా
సంచారంలో కొట్టుకుపోతుంటే
ప్రశ్నించకుండా ఉండగలమా .. !

సమూహం ప్రవాహమై
చుట్టుముడుతుంటే
కలసిన మనసులు
కన్నీటి కొలనులవుతాయి
కనుపాపలు చెరువులవుతాయి .. !

ఈ అంతులేని దారుల్లో
సాగిపోతుంటే
ప్రేమ మొక్కవుతుంది
మనకు తోడవుతుంది
చెట్టులా నీడలా మనవెంటే ఉంటుంది .. !

ఈ లోకం కొత్తగా
అగుపిస్తుంది
మనిద్దరిని కలిపేస్తుంది .. !!

అమ్మతనం కోసం ఆక్రోసిస్తాయి .. !

ఎవరి దారుల్లో వాళ్ళం
వేరైపోతున్న సందర్భంలో
ఒకరికి మరొకరం
తోడుగా నిలిచే చోట
మనసులు విప్పారే పూలవుతాయి
పొద్దున్నే పొద్దును
ఆత్మీయంగా ముద్దాడుతాయి .. !

దూరం ఎక్కువయ్యే కొద్దీ
ఆరాటం పెను తుపాను అవుతుంది
గుప్పెడు గుండెను ముంచేస్తుంది
ఒక్కోసారి ఆలోచనలు
కెరటాలై ఉవ్వెత్తున ఎగసి పడుతాయి ..!

పచ్చని పైరుల్లా
గాల్లో ఎగిరే పతంగుల్లా
పరుగులు తీసే ప్రవాహంలా
కళ్ళు కౌగిలింతలై పోతాయి
కమ్మని ఊసులు నేర్పుతాయి .. !

కాలపు సోయగంలో
మనిద్దరం కలిసే సమయాన
నీకోసం నేను వేచి చూడటం
బతుకును రాగరంజితం చేసింది .. !

నీవో వైపు
నేనో వైపు
దారులు వేరైనా
మనిద్దరం ఒకే గమ్యమై
ఒకరి కళ్ళల్లోకి
మరొకరం జొరబడుతూ
పయనించటం గొప్ప
అనుభూతిని ఇస్తుంది ..!

కదిలే జ్ఞాపకాలు
ఒక్కోసారి గాయం చేస్తాయి
ఇంకోసారి అలసిన
శరీరాలకు జోలపాట పాడుతాయి
ప్రేమంటే ఆలింగానమా
అర్పించుకోవటమా ..కానే కాదు
అదో జీవన పోరాటం
బతుకు మర్మాన్ని చేదించే సాధనం
రెండు గుండెల ఆర్తి గీతం .. !

ఏకాంతంలో దేనికోసమో
దేహాలు ఆరాట పడుతాయి
కాలపు సాగరంలో
కలిసిపోయాక .. సొమ్మసిల్లి పోతాయి
అంతా ఇంతే కదా అనుకుని
అమ్మతనం కోసం ఆక్రోసిస్తాయి .. !

ఒకే ఒక నాదం మనిద్దరి ఐక్యం .. !!

పండు వెన్నెల్లో
ఆకాశం తలంటు పోసుకున్నట్టు
సముద్రాన్ని కెరటాలు
ముద్దాడినట్టు
గోరువంకలు .గువ్వపిట్టలు ..పక్షులు
గాల్లో తేలిపోతున్నట్టు
నిన్ను చూస్తే చాలు
మనసు దూది పింజెగా మారిపోతుంది
చిక్కటి గుండెను
నీ వాలు చూపు తమకంతో
తడుముతుంది ..!

దారులు వేరు
గమ్యాలు వేర్వేరు
కానీ హృదయాల సమ్మేళనం
ఒక్కటే
జ్ఞాపకాల జడివానలో
సేదదీరుతుంటే
కలల కల్లోలంలో
చిక్కుకుని తల్లడిల్లుతుంటే
నువ్వు పొద్దు పొడుపై
నన్ను రక్షించావు .. !

కదిలే దారుల్లో
ఒంటరితనం శాపమై
కాటేస్తుంటే
నువ్వు సమూహమై
నన్ను హత్తుకున్నావు
అది ఆలింగానమా కాదు
జన్మజన్మల అనురాగ బంధం
ఆనందపు లోకపు వాకిట పచ్చ బొట్టు .. !

జాతరలో జనం
లీనమైనట్టు
సంతలో ప్రేమికులు
కబుర్లలో కాపురం చేసినట్టు
బతుకంతా బతుకమ్మగా మారినట్టు
హృదయం పూల వనమై
పోయినట్టు .. 1

నీ గాజుల సవ్వడి
నీ మువ్వల అందేలా శబ్దంలో
నీ చల్లని ఒడిలో
చల్లంగా వాలి పోయినట్టు
మాటలకందని మౌనపు
ప్రయాణం /అదో మార్మికపు
ప్రేమతనపు సాగరం .. !

ఒకే చూపు
ఒకే రూపు
ఒకే శ్వాస
ఒకే ధ్యాస
ఒకే నడక
ఒకే ఆత్మ
ఒకే ఒక నాదం
మనిద్దరి ఐక్యం .. !!

వెళ్ళిపోతున్నా .. ఇక రాలేనంటూ

తలపులలో నేను
తడిసి ముద్దవుతుంటే
తొలి సంధ్య వేళలో
జాజి కొమ్మై నువ్వు విహరిస్తుంటే
హృదయపు వాకిట
రంగుల హరివిల్లులు
సందడి చేస్తుంటే
నాకు ఈ లోకం కొత్తగా అనిపించింది ..!

చీకట్లో నీ దేహం
ఇంద్రధనస్సులా అగుపిస్తుంటే
అందమైన దానిని
అందుకోవాలనే ఆరాటంలో
నేను నీ ముందు మోకరిల్లా
నీ చల్లని పదాలను తాకుతూ ఉండిపోయా
నీతో పాటే ప్రయాణం చేసే
ఆ మువ్వల సవ్వడి వింటూ
కానరాని లోకంలోకి వెళ్లి పోయా

చెలివో
చెలిమెవో
నాలో రేగే కల్లోలానివో
కళ్ళు మూసుకుంటే
కాటుకతో కాటు వేసే కమ్మని కలవో
రాత్రిలో సంచరించే ముద్దువో
నాలోని నాదానివో
లయవో ... ప్రవహించే రక్తానివో
నీలి తెమ్మెరవో
నాకు శ్వాసగా మారిన
సహచరివో .. !

నాకు నీవు
నీకు నేను
ఒకరికి ఒకరం
ఇద్దరమే ఇప్పటిదాకా
ఇలా మిగిలాం
గదిలో వెలిగే దీపపు చెమ్మలా
కదిలే నదిలా
కురిసే చినుకులా
విరిసే నవ్వులా
నిండు పౌర్ణమిలో
వెలిగే పండు వెన్నెలలా

రాలే కొమ్మలా
పెదవుల మీద వాలిపోయే
ధరహాసంలా
నిశీధిని వెలిగించే వేణువులా
గుప్పెడు గుండెలో రేగే డమరుకంలా
కవ్వించే చూపులా
తళుక్కున మెరిసే
ఇసుక రేణువుల్లా

ఎప్పటికైనా
కరుణిస్తావని
మనసును మనసుతో
మమేకం చేస్తావని
నన్ను నీ ప్రేమతో
మళ్ళీ బతికిస్తావని
వెళ్ళిపోతున్నా .. ఇక రాలేనంటూ

1, ఆగస్టు 2013, గురువారం

ఎప్పటికి నిలిచే ఉంటుంది...

పూసిన పూవు వాది పోతుంది
పండిన పండు కుళ్ళి పోతుంది
ఎండిన ఆకు రాలి పోతుంది
          కాని
నమ్మకంతో ఎర్పడిన 'స్నేహం'
ఎప్పటికి నిలిచే ఉంటుంది...