12, జులై 2016, మంగళవారం

నీతోనే పెరిగిన నీ మనసుని...

చిరు చిరు ప్రాయంలో ,నీతో గడిపే అల్లరి క్షణాల్లో ...
పాటశాల ఒడిలో నీతో చేరి చెడుగుడు ఆటలు ఆడే క్షణాల్లో...
పరువం ప్రాయంలో ..నీ గుండె సవ్వడి వింటూ లయ సబ్దంలా మారే క్షణాల్లో ...

కళ్యాణ ఘడియల్లొ...నిన్ను కన్నవారికంట్లో ... కంటే తొలి కన్నీటి బొట్టు జారే క్షణాల్లో..
చుట్టూ ఎందరో ఉన్నా.. నీ ఒంటరి క్షణాల్లో ..
నేను మాత్రం నిను వీడక ..
నీ ఊపిరిలో ఊపిరినై .. నీ తోడులో నీడనై ...నిన్నె అనుసరిస్తూ .. నీ వెంటే ఉన్నాను ...
నేను ..నీ తోనే పుట్టి నీతోనే పెరిగిన నీ మనసుని.. ... అందులో వెలిగే ప్రాణ జ్యోతిని ....
నేను లేని నీవు లేవు ...నీవు లేకుంటే నాకు ఈ ప్రపంచంతో పనే లేదు ...
రా !!! నేస్తమా !!! నీకు నేను ఎప్పటికి తొలి నేస్తాన్ని!!!!

కామెంట్‌లు లేవు: