8, నవంబర్ 2011, మంగళవారం

అందనంత దూరంలో....

అందమైన చందమామ చేతికందదు..
చేతికందిన చందమామ చక్కగుండదు..
చక్కగున్న చందమామ నన్నుకోరదు..

నన్ను కోరిన చందమామ చల్లగుండదు..
చల్లగున్న చందమామ చెంతచేరదు..
చెంతచేరిన చందమామ నేను కోరను..

నేను కోరిన అందాలా చందమామ..
అందలంలో..ఆటపట్టిస్తూ..
అందనంత దూరంలో....

కామెంట్‌లు లేవు: