స్నేహమంటే....
మతం కాదోయ్ ..
కులం కాదోయ్ ...
మెప్పుకాదోయ్ .. తప్పుకాదోయ్..
తీసుకొనే ఆప్పుకాదోయ్ ..
జాతిబేధం చూపుతున్న నీతిలేంది కాదు కాదోయ్...
మంచులా కరిగిపోయే సంపద మాత్రం కాదు కాదోయ్ .... || స్నేహమంటే||
స్నేహమంటే......
మామా అంటూ బాబాయ్ అంటూ పిలుచుకునే పిలుపు కాదోయ్
స్వార్థం కోసం సాయమడిగే స్వబావమే కాదు కాదోయ్
స్నేహం పేరుతో ప్రేమించే ద్రోహం కాదోయ్ మొహం కాదోయ్
పరిధి దాటినా చేష్టలతో చేసే ర్యాగింగ్ మాత్రం కాదు కాదోయ్
సందు దొరికితే మందు తాగే విందు కాదోయ్ పసందు కాదోయ్...
డబ్బు కోసం మోసం చేసే జబ్బు మాత్రం కాదు కాదోయ్..
కలిసి కాలేజీ ఎగ్గొట్టే బంక్ కాదోయ్..
విరిగిపోయే పెంకుముక్క కాదు కాదోయ్....
అర్థం లేని ఆపార్ధం కాదోయ్...
నీటిమీద రాత కాదోయ్...
నిలిచిపోయే వాత లాంటిదేనోయ్...
స్నేహమంటే....
త్యాగమేనోయ్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి