అదే జ్ఞాపకం పదే పదే మనస్సుని తడుముకుంటూ ఇన్నేళ్లైనా క్షణం క్రితమే జరిగిన౦త కొత్తగా మరిచిపోవటం అనేది అన్నింటికీ కాదేమో నీ జ్ఞాపకాలకు అస్సలే కాదు గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది నువ్వు ఎక్కడ ఉన్నావో వెతకమని ప్రస్తుతం ఆపుతోంది.. ప్రతి అడుగుని నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని వేసే ప్రతి అడుగులో తీసే ప్రతి శ్వాసలో నీ జ్ఞాపకం ఎక్కడో... ఎప్పుడో నువ్వు ఎదురుపడితే ఇదీ...అని చెప్పుకోడానికే ఈ మాత్రం అయినా గెలిచింది నాకు... ఎంత దూరంలో నువ్వున్నావో... తెలియదు మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో మాత్రమే తెలుసు కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని... ఎదురుచూస్తున్నా... |

నేను నాకు నచ్చినవి సేకరించి ఇక్కడ పెడుతున్నాను అంటే నేను వ్రాసినవి కావు ఇవి కాకపొతె మనలో భావాలు ఉంటాయి కాని అవి కవిత రూపంలో వ్రాయలేం కదా అందుకే నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవి మీలో ఏఎవరివీయినా కావచ్చు నేను చెసింది తప్పు అయితె నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ నాకు తెలుసులే నన్ను క్షమిస్తారని..... దెనికంటే నేను మీ నేస్తాన్ని కదా...
29, అక్టోబర్ 2010, శుక్రవారం
నీ జ్ఞాపకం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి