నేను కలిసే క్షణం కోసం
వేయి కనులతో వేచి ఉన్నానన్నావు
నా నవ్వు నచ్చిందన్నావు
నా మాట నచ్చిందన్నావు
కలిసి చదువుకున్న క్లాస్ మేట్ వి కాదు
పరిచయం ఉన్న పక్కింటి అబ్బాయివి కాదు
ఇంటర్నెట్ లొ చూసావు చాటింగ్ లొ కలిసావు
సాఫ్ట్ వేర్ స్నేహానివి టెలిఫోన్ నేస్తానివి
ఆకర్షించే అందగాడివా ! తెలీదు.
సిరులున్న శ్రీమంతుడువా ! తెలీదు.
విశాలమయిన వ్యక్తిత్వం ఉందా ! తెలీదు.
అయినా నీలొ ఏదొ తెలియని ప్రత్యెకత.....
అందుకే అయ్యాను నీకు నెస్తం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి