2, అక్టోబర్ 2012, మంగళవారం

చాలా మంది కన్నీటిని ఇష్టపడరు ఎందుకనో మరి


చాలా మంది కన్నీటిని ఇష్టపడరు ఎందుకనో మరి

కాని నాకు మాత్రం నా కన్నీరంటే చాల ఇష్టం చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం

మాట్లాడాలి అని అనుకున్నప్పుడు పిలవగానే పలుకుతుంది

బాధను పంచుకుందాము అన్నప్పుడు పిలవకుండానే వచ్చి నా చెక్కిలిని తడుముతుంది

ఒంటరిగా ఉన్నప్పుడు నేను తోడున్నాను అని దోబుచులాడుతుంది

గుండె బరువైనప్పుడు మనసుతో ఊసులాడి ఓదార్చుతుంది

నా ప్రతి కష్టంలోను నీతోడు నేనున్నాను అంటు గుండెలకు హత్తుకుంటుంది

ఎందుకో ఈ మధ్య నా కంటే కూడా కన్నీటి మీద ఇష్టం పెరుగుతుంది .

కామెంట్‌లు లేవు: