28, అక్టోబర్ 2012, ఆదివారం

జలజల రాలే చినుకును


జలజల రాలే చినుకును నేను
గలగల పారే ఏరును నేను
అలలతొ పొంగే కడలిని నేను
అందరు కోరే జలమును నేను

మనుజుల కైనా మెకముల కైనా
చెట్టుల కైనా పిట్టల కైనా
దప్పిక దీర్చే జలమును నేను

భూమిని ఉన్నా మట్టిని కలసి
నింగిని ఉన్నా మబ్బులొ దాగి
మధ్యలొ ఉన్నా గాలిని గూడి
అంతట ఉన్నా ఆకృతి మార్చి
అందరు కోరే జలమును నేను

తీయటి రసముగ ఒకచోట
ఉప్పటి నీరుగ ఒకచోట
తెల్లని మంచుగ ఒకచోట
నల్లని నీటిగ ఒకచోట

స్వచ్ఛము గాను ఒకచోట
పంకిలమగుచు ఒకచోట
తేలెడి గడ్డగ ఒకచోట
రాలెడి రేకుగ ఒకచోట

ఆవిరి రూపున ఒకచోట
ఆరని తడిగా ఒకచోట
మెల్లగ సాగుచు ఒకచోట
వెల్లువ యగుచూ ఒకచోట

తిన్నగ ఉరుకుచు ఒకచోట
సన్నని గొందుల ఒకచోట
వెచ్చని ఊటగ ఒకచోట
పచ్చని నదిగా ఒకచోట

చీకటి గుహలో ఒకచోట
వెలుతురు బయలున ఒకచోట
అందని ఎత్తున ఒకచోట
క్రిందకు దుముకుచు ఒకచోట

ఉడుకుచు కుతకుత ఒకచోట
బుడబుడ పొంగుచు ఒకచోట
పరుగులు దీయుచు ఒకచోట
నిలకడగాను ఒకచోట

ఎల్లెడనుండే జలమును నేను
ఎల్లరు కోరే జలమును నేను

వానగ వచ్చి వరదగ పొంగి
పట్టగ లేని ఉరవడి తోడ
చెట్టుల రాల్చి గట్టుల ద్రుంచి
ఇళ్ళను గూల్చి ఊళ్ళను ముంచి
అల్లరి జేసి ఆరటి నిచ్చి
ఇష్టము వచ్చిన రీతిని యంతా
విహరణ జేసే జలమును నేను

అందరు కోరే జలమును నేను
ఎల్లెడనుండే జలమును నేను

వచ్చిందినీవుకాదా....?


నన్ను చూసి నవ్వుకుంటూపోతున్న నల్లని మేఘాలు
వీపుమీద ఉన్న సంచిలో
చూడాలని పైనుంచి ఆత్రంగా చూస్తున్న పక్షులు
మాటల మూటల్ని జాగ్రత్తగా బుజానికెత్తుకొని
వడి వడిగా అడుగులేస్తున్నా
మొత్తానికి కవిసంఘం కు చేరుకున్నా
ఓ మూల కూర్చొని నీకోసం చూస్తున్నా ప్రియా
ఊసులన్నీ పోగేసి వుంచు.
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.
అని అన్నావు కదా అందుకే నీకోసం ఎదురు చూపులు
ఇక్కడ ఎందుకున్నానో తెల్సా..
నీకు కవితలంటే ఇష్టం కదా..
ఎప్పటికైనా ఇక్కడికొస్తావనే ఆశతో చూస్తున్నా..
అదికో నడుచుకుంటూ వస్తున్నది నీవేనా.. ?
ఏంటి కళ్ళు మసకబారాయి..
ప్రియా నీవేంటీ నీటిలో నడుస్తున్నావు.
ఆ వస్తున్నది నీవేనా..
ఇప్పటిదాకా స్పష్టంగా చూసిన నేను
ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు ఎందుకో..
నీవు వస్తున్నా వన్న ఆనందంలో
నాకళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేక
కన్నీళ్ళతో నిండి ఎవ్వరు వస్తున్నది కనిపించడంలేదు ..
అదేంటి ఆగకుండా వెలుతున్నావు
అది నీవుకాదా..ఏంటో నా కన్నీటి పొర
నీవెవరో చూడనీకుండా చేస్తోంది..
అరె..వెళ్ళీపోతున్నావా..
వచ్చిందినీవుకాదా....?

ప్రేమ... స్నేహం...


ప్రేమతో ముడిపడి ఉన్నది మూడుముళ్ల బంధం.. 
ఆ బంధము కంటికి కనురేప్పకు ఉన్న అనుబంధమవ్వాలి.. 
క్షణం రెప్పవేయకుంటే జల జల కారుతుంది కన్నీరు కంటి వెంట.. 
నలక పడితే విల విల లాడుతుంది కదా కంటి రెప్ప.. 
కలిసి కష్టసుఖాలు పంచుకుంటేనే 
జీవితం అవుతుంది నూరేళ్ళ పంట.. 

స్నేహంతో ముడిపడివున్నది మనుషుల మద్య బంధము.. 
ఆ బంధము నింగి నేలకు ఉన్న అనుభందమవ్వాలి.. 
ఒకరినొకరు కలుసుకోకున్నా విడిచి ఉండలేవు.. 
ఎవరి తోడు ఉన్నా లేకున్నా 
నింగికి నేల తోడు నేలకు నింగి తోడు శాశ్వతంగా ఉంటుంది.. 
బాధలన్ని మరిచి స్నేహం నీడన జీవితం గడిపెయ్యవచ్చు..

కంటిపాపకేం తెలుసు,


చిరునవ్వు పెదాల వెనక,
చిలిపి ఆలోచనల వెనక,
మదిలోన దాగిన ఆవేదన ఎవరికీ తెలుసు..??

రంగు రంగుల సీతాకోక చిలకకు ఎం తెలుసు
రాగం లేని మూగ వేదన..??

సడి చేసే మువ్వలకేం తెలుసు,
గోల్లుమనే నా మదిలోని గానము..??

తీరం చేరిన నావకేం తెలుసు
సుడిగుండం లోతు ఎంతో..??

కంటిపాపకేం తెలుసు,
జారిన కన్నీటి విలువ..??

వేచి ఉన్నాను..


సాయంకాలపు సంద్యావేలలో
సరిగంచు చీర కట్టి
సిరి మువ్వల అందెలు తొడిగి
సిరి మల్లెపూలు సిగలో దోపి
చిరునవ్వుల వరమిచ్చే
చెలియ చేతిని పట్టుకొనగా
రెక్కల గుఱ్ఱంపై వస్తావని
రేయినే పగలుగా తలచి
పండు వెన్నెలలో మెరిసే తారలను పిలిచి
నీ జాడ తెలుపుమని ప్రాధేయపడుతూ
నీ కొరకు వేచి ఉన్నాను..!!

మీ స్నేహం చందమామ లాంటిది


మీ స్నేహం చందమామ లాంటిది
నీలాకాశం లాంటి నా మదిలో చందమామ వలే ప్రకశిస్తుంది మీ స్నేహం
చందమామ లేకపోతే రాత్రిపూట ఆకాశం శూన్యంగా ఉంటుంది...
అలాగే మీ స్నేహం లేకపోతే నా జీవితం నేనున్నంతవరకు శూన్యంగానే ఉండిపోతుంది

ఆశ


నువ్వు ఏమవ్వాలని ఆశ పడుతున్నావు అని నన్ను అడిగితే
నేను నీ శ్వాసగా అవ్వాలని ఆశ పడతాను
ఎందుకో తెలుసా?
నువ్వు నన్ను మరిచినా శ్వాసించడం మరచిపోవుగా అందుకని……

నిన్ను ప్రేమిస్తూనే (స్నేహపూర్వకంగా)ఉంటాను…


దీపం ఆరేంత వరకు వెలుగునిస్తుంది..
మెఘం కరిగేంత వరకు వర్షం కురుస్తుంది.. 
పువ్వు వాడేంత వరకు సువాసన నిస్తుంది
నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే (స్నేహపూర్వకంగా)ఉంటాను…

ఈ ప్రేమ.


పూలన్నవి పూయకపోతే మొక్కకు అందం లేదు,
ప్రెమన్నది పుట్టక పోతే మనసుకు అర్థం లేదు,
చిగురించిన వసంతంలో చిగురాకుల గుండెల్లో చినుకుల చిరుజల్లు కై ఆలాపనే ఈ ప్రేమ,
గుబురైన పొదల్లో వికసించిన పూయదల్లో తుమ్మెద కై తపనే ఈ ప్రేమ,
వెరిసిన కలువ కన్నుల్లో చంద్రుడి కై ఆవేదనే ఈ ప్రేమ,
వెరిసిన కమలం హృదయం లో సూర్యుడి కై ఆవేదనే ఈ ప్రేమ.

నువ్వు


నా ప్రతి తలపులో నువ్వు,
ప్రతి ఊహలో నువ్వు,
నా కలల రూపం నువ్వు,
నా ఆశల తీరం నువ్వు,
చెరగని ప్రేమకు సాక్షం నువ్వు,
మాయని మమతకి అర్దం నువ్వు,
అందుకే నా మనసులో పదిలం నా నువ్వు,
నీ కోసమే నేను.

నీతో చెప్పాలనుంది


నీతో చెప్పాలనుంది ఒక తీయటీ మాట,
కానీ చెప్పలేక నీ ఎదుట దాచాను నా మాది లోగిట!
అయినా నీ పేరే వినిపిస్తుంది నా నోట,
నీ రూపమే కనిపిస్తుంది నే చూసే ప్రతిచోట!
నీతో జీవితమే కదా అందాల పూలాబాట.
ప్రతి రేయి కాదా కమ్మని వెన్నలపాట!
నీవే రాజువై పాలించు న కలలకోట.
నీవే రైతువై పండించు నా వలపు తోట!
అందుకే
ఇక చాలించి ఈ దాగుడు మూతలాట,
నాతో తెలుపు నీవు నాకోసమే పుట్టానన్న తీయటి మాట.

అబిమానంగా మొదలయ్యేది ప్రేమ,


అబిమానంగా మొదలయ్యేది ప్రేమ,
అరాదనగా కొనసాగేది ప్రేమ.!
ఇష్టం గా ఏర్పడేది ప్రేమ,
అనుబందం గా ముడి పడేది ప్రేమ.!
కమ్మని కళలు చూపించేది ప్రేమ,
తీయని తలపులతో మురిపించేది ప్రేమ.!
ఆకాశంలా అనంతమైనది ప్రేమ,
సాగరంలా లోతైనది ప్రేమ.!
మనిషిని నడిపించేది ప్రేమ,
మనసులని కలిపే మంత్రమే ప్రేమ.!!

27, అక్టోబర్ 2012, శనివారం

నాకు నేను ఒక ప్రశ్న లా తోస్తాను


నీలోకి చూసిన వేళ
నాకు నేను ఒక ప్రశ్న లా తోస్తాను
అయినా,
నీలోనే ఆ జవాబు నీడలకై వేటుకుతూనే ఉంటాను.
కానీ,
నీవు ఒక ప్రశ్నలానే మిగిలిపోతావు….
అయినా కూడా,
నీలో సమాదానం పొందే వరకు
వెతుకుతూనే ఉంటాను.
ఎందుకో తెలుసా నా ప్రశ్నకి జవాబు
నీవు మాత్రమే చెప్పగలవు,
నీలో మాత్రమే చూపగలవు.

అమ్మ నాన్న కథ...


వాళ్ళిద్దరూ
ప్రేమైక జంట-
వారిది అన్యోన్యదాంపత్యం!

అవును మరి-
అతడు అనుమతించిన వనాలలోనే
విరబూసి పరిమళించే పూదోట ఆమె...

అతడు స్వరపరచిన బాణీలోనే
రాగమాధురి ఆలపించే కోకిల ఆమె!

అతని కనుసన్నల సీమలోనే
నర్తించే కదలికల మయూరి ఆమె...

అతదు తూచిన కొలమానాల మేరకు
ప్రసరించే ప్రేమానురాగాలు ఆమెవి-
ఆమె ప్రపంచమంతటా అతనొక్కడే!

నిజంగా
అతడి హృదయ వైశాల్యమెంతో
ఆమెకన్నా బాగా
మరింకెవరికి తెల్సు?

జీవిత కాలమంతా అతడిచ్చిన ఓ పదెకరాల పరిధిలోనే
ఆమె బ్రతుకు వ్యవసాయం!

ఇది ఒక ఆమె కథ కాదు-
నన్ను కన్న మా ' అమ్మ కథ '...

అతడు ఎవరో కాదు-
నన్ను పెంచిన మా ' నాన్న '...

అందమైన కల...


అందమైన కల...
ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది....

ఎంతో ఆతృతగా చూసే నాకు
ఒక అందమైన దృశ్యం కనిపించింది....

నీలి మేఘాల్లాంటి కురులు..
చూడగానే చెలిమి చేయాలనిపించే కళ్ళు..
మండుటెండల్లో మంచులాంటి చిరునవ్వు..
మకరందాన్ని మరపించే మధురస్వరం..
చంద్రబింబంలా అనిపించే ముఖారవిందం..
మానవత్వానికి మారుపేరు ఆ మనసు..
సంగీతాన్ని మైమరపించే ఆ అందెల సవ్వడి..
మొత్తంగా అజంతాశిల్పమా అనిపించే ఆ రూపం..
అందానికే మారుపేరనిపించే ఆ చిత్రం..
కాదనగలనా కేవలం అది మా అమ్మ ప్రతిబింబం.


ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసాను -
అంతా శూన్యం...
నా కనులలో అంత అందమైన కలా ?!

18, అక్టోబర్ 2012, గురువారం

ముంగురుల మృదులాస్యం


నీలి నింగి అల్లన వొంగి 
నీ శిరస్సును నిమిరెనా ఏమి 

ఆ తుమ్మెదలబారు 
ఒక్కమారు రివ్వున వాలి 
నీ తలపై నడయాడెనా ఏమి

ఒకసారి మోవిపై జారి 
ఒకమారు గాలితో జత చేరి 
ఎన్ని విలాసాలో 
ఎన్నెన్ని విన్యాసాలో 

అభ్యంజనానంతరం 
ఆ కురుల కెంత సంబరం 
మోమున ఆ స్వైర విహారం 
పచ్చని ప్రాంగణాన   చేరి 
ఆ కేరింతల వినోదం 
అవి పలకరింపులో 
పలవరింతలో 
రహస్య సంప్రదింపు లో 

నిసిరాతిరి వేళ 
ఎదపై పవళించిన వేళ 
మోమును కప్పినవి 
కురుల రాగాలా 
కారు మేఘాలా 

ఆకురుల నింగిలో దాగిన
నగు మోము సోయగం 
విరుల పరిష్వంగం లో 
రంగు రంగుల వైభవం
వర్ణించగ నాకు సాధ్యమా

16, అక్టోబర్ 2012, మంగళవారం

ప్రేమ గొప్పదే!!! కానీ ప్రేమ కన్నా జీవితం గొప్పది


ప్రేమ గొప్పదే!!! కానీ ప్రేమ కన్నా జీవితం గొప్పది!! 
ప్రేమను ప్రదర్శించడానికి ముందు జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి , 
ఎప్పుడూ ఒకరి గురించి ఆలోచించడం ప్రేమ కాదు...
మానసికంగా అలసిపోయినప్పుడు ఉత్తేజానిస్తూ గుర్తుకు వచ్చేదే ప్రేమ... 
ఆ గుర్తుకురావడం లో హయే ప్రేమ !!!!

ఎప్పటికీ చకోరంలా నిరీక్షించే... ఓ నేస్తం...


నేస్తమా 
నిన్నటి వరకూ  ప్రాణ స్నేహితులం
కానీ... ఈ రోజు ప్రాణమే
మిగిలింది... స్నేహం కాదు
కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన
స్నేహాన్ని గతంగా మార్చేసింది
ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు
కన్నీటి కంటే ముందు
నేనున్నానని గుర్తుంచుకో...
మనుషులు విడిపోవచ్చు...
మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది
స్నేహమొక్కటే..
ఔను...నిజమే,, ఇప్పటికీ ఏం మారలేదు...  నువ్వు
గుర్తొచ్చినప్పుడు
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి
పోతుంది
ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది
ఇవే
కాస్త ఓదార్పునిస్తోంది
ఎప్పటికీ  చకోరంలా నిరీక్షించే... ఓ నేస్తం...

15, అక్టోబర్ 2012, సోమవారం

మన స్నేహం


ఎంత పరుగులెట్టినా
తెలిసీ..ఎన్ని దారులు మారినా
అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం
ఎంత దూరమెళ్ళినా
గతంపై ఎన్ని రంగులద్దినా
అప్పుడప్పుడు తరచి చూసే పేజీ మన స్నేహం

నేస్తం


ఇంట్లో ఒంటరిగా వున్నాను.
ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న క్షణాలివి.
ఎన్నెన్నో ఆలోచనలు అసంపూర్తిగా.
ఒక ఆలోచనకు, మరొక ఆలోచనకు సంబంధంలేదు.
అసలెంత బాగుందో ఇలా...సమయమే తెలియట్లేదు.
ఈ క్షణంలో ఎవరన్నా తోడుంటే ఇంకా బాగుండుననిపించింది.
వెంటనే నువ్వే గుర్తొచ్చావు.
అదేమిటో కోరుకున్న ఒంటరితనం దొరగ్గానే నువ్వు నాపక్కన వుంటే బాగుంటుందనిపిస్తుంది.
నీకూ అలాగేవుంటుందికదూ!ఉంటుందని చెప్పవూ.
నాకోసం సమయం కావాలంటూ గోల చేసే నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను.
పిచ్చివానిలా నీ గురించి ఆలోచిస్తున్నాను.
అసలు నీ జ్ఞాపకాల తోటలో విహరించడానికే నేను ఏకాంతం కోరుతాను కాబోలు.
సెల్ ఫోను మూగగా కొట్టుకొంటోంది నా గుండెలాగానే.
ఏదో వినిపించాలనే ఆరాటందానిది.
ఆలోచనలు కొనసాగించాలనే పోరాటం నాది.
మనిషితో మాట్లాడాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులో కదా? 
మనసు భాషకు అడ్డులేదు,హద్దులేదు.
మళ్ళా ఎప్పుడో ఇలా తనివితీరా మాట్లాడడం?
నేస్తం
ఊసులన్నీ పోగేసి వుంచు.
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.

13, అక్టోబర్ 2012, శనివారం

మనిషి నిర్వచనం


తనచుట్టుతాను గిరిగీసుకున్నవృత్తం
నలుసై అందని మనిషి నిర్వచనం 
కాసుల ప్రాముఖ్యత నల్లని ముసుగై
కుటుంబ ప్రాధాన్యతను కమ్ముకుంది కాలమేఘమై
జీవనపరుగులో ర్యాంకు,బ్యాంకు మంత్రాక్షరాలు
చెట్టంత మనిషి ఆర్థికయంత్రాలకు చెరకుపిప్పి
నొప్పికి లేపనం పచ్చనోటు పసరు
రెక్కలు మొలిచిన మేధో వలసపిట్టలు 
అంకుల్ శ్యామ్ ఊయల ఒడిలో 
కొట్టే కేరింతలకు డాలర్ల చప్పట్లు 
చిరునవ్వులు చిదిమేసిన సాయంత్రాలు
జటాయువైన వృద్ధాప్యం
అలసిన బాల్యాన్ని పొదువుకునే అమ్మ పేరు టి.వి
అంతర్జాలపు పయనంలో గమ్యమెరుగని మజిలీలు
మనిషిని వెతకాలి,వెతకి పట్టుకోవాలి
చిరునామాను నిర్వచించాలి
మనిషి పేరు మానవత్వం
ఆప్యాయతే నివాసం 
మంచిమాటే చిరునామా.

ఆవిరవుతున్న అనుబంధాలు


ఆవిరవుతున్న అనుబంధాలు
కరుగుతున్న అనురాగపు సాకారాలు
మనిషి మనగడకవి శేషప్రశ్నలు
పేగుబంధానికర్థం నిఘంటువులో
చిరిగినపుట
ఆర్థికబంధంతో రక్తసంబంధం
మసకబారినమాట
మమతలను మసి చేసిన ద్రావకం
స్వార్థపుతలపులతో మనసు మలినం
బాంధవ్యాలే బరువని,బంధనాలు తెంచుకుని
ఇదే స్వేచ్ఛా ఊపిరి అనుకుని నినదిస్తే
అనుబంధాలు ఆమ్లధారలో ఆవిరవుతాయి
మనసులోని కాలుష్యం ఉప్పెనలా వుధృతమై
ఆనకట్టలేని కాలకూట విషప్రవాహమై
ఊపిరాడనివ్వదు అగమ్య స్వేచ్ఛాకెరటం
ఉప్పెన మిగిల్చిన కన్నీటి చారికలు
మృగ్యమైన అనుబంధపు ఆనవాళ్లు
బంధాలకు రహదారి మమతల వంతెన
పరిమళించాలి అనుబంధ సుగంధాలు
మానవతాప్రాకారాలకవి చెరగని పునాదులు

ఆక్రందన


అమ్మా...
ఎక్కడున్నావు, ఇక్కడంతా చీకటి, ఏవో కదలికలు, బహుశా నాలాంటి నెత్తుటి గుడ్లు అనుకుంటా.
నీ గర్భంలో వెచ్చగా ఉండేది, ఇంకేన్నాళ్ళులే ఈ అంధకారం,
త్వరలోనే దొరుకుతుంది అమ్మ మమకారం అనుకున్నా,
లింగ పరీక్షలో నను దొంగలా పట్టుకుని, నిను నిందించి, నాన్నని ఒప్పించారు.
నా  అంతానికి నాన్న సంతకాన్ని  పునాది చేసారు.

శాస్త్రమా...
నీది వైజ్ఞానమా అజ్ఞానమా! నా జాడ తెలుసుకొనుట నీకు సత్ఫలితమా,
విధాత నిర్ణయం నీకు పరిహాసమా,
బ్రహ్మకు ప్రతిసృష్టి అయిన ఆడ శిశువులకిది సమాప్తమా.

దేవుడా ...
ముకుళిత హస్తాలతో మోకరిల్లుతూ రక్తసిక్తమై విలపిస్తూ విన్నవించుకుంటున్నా,
నా రోదన, అమ్మ వేదన కనని  కర్కశపు చేతులు నను తల్లి నుండి వేరు చేసాయి.

ప్రభూ...
అమ్మ వడి కరువైన నన్ను నీ దరిచేర్చుకో.
నేను లేక ఆగిపోనున్న ఈ జగతిని జాగృతి చెయ్యి.
నా ఆగమనం అజరామరం చెయ్యి.

నిన్నేమనుకోను

అలజడి అంబుధిలో మునుగుతున్న నాకు ఆధారంలా అనిపించావు,
ఆశగా పట్టుకుంటే... విదిలించి వదిలించుకున్నావు.
చింత సంద్రాన మునిగిన నాకు చిరుహాసంలా చేరువయ్యావు.
పట్టుకొని అధరంపై అద్దుకోనేలోగా..నిట్టూర్పువై నిష్క్రమించావు.
అంధకార పయోధిలో పడిపోయిన నాకు కాంతిరేఖవై కనిపించావు.
పట్టుకుని కళ్ళలో పెట్టుకొన్నానో లేదో .. కంటిపాపనే ఎత్తుకెళ్ళావ్.
కలల కడలిలో మునుగుతున్న నాకు స్వప్న కెరటంలా కనిపించావ్.
కళ్ళుమూసుకొని స్వాగతించానో లేదో..కలతనిద్రవై కష్టపెట్టావ్.
దిక్కులన్నీ ఏకం చేసి వెతికి,వెతికి జనసమూహాన నినుగాంచి,
పరుగున వచ్చి పలకరినచానో లేదో...అపరిచితునిలా వెడలిపోయావ్.
ద్రవించే హృదయం,మతిలేని మనస్సూ నీ చుట్టూ భ్రమిస్తున్నాయని ,
తెలుసుకోన్నావో లేదూ, కక్షగా వాటి కక్ష్య మార్చివెళ్ళావ్.
విసిగి,వేసారి ఈ వెక్కిరించే ఊహలన్నీ నను ఊపెస్తుంటే ఊపిరి సలపని,
ఉరిఊయల ఊగాలనుకున్నానో లేదో..ప్రాణవాయువై పలకరించావ్.
ప్రతి రోజూ నన్ను నేను గుర్తుచేసుకుంటాను శాపము మోసే శకుంతలలా,
చిరునవ్వుతో పలకరిస్తావ్ అసలేమీ నీకు తెలియదన్నట్లుగా...

కంటి దోషమా?

ప్రత్యూష హిమబిందువుల అందాలు కనిపించవు నాకు.
టీ కొట్టుముందు బెంచీలు తుడిచే చిరుగు చెడ్డీ బుడ్దోడే కనిపిస్తాడు.

నిద్రలేస్తూనే ఏ ప్రభాతగీతాలూ వినిపించవు నాకు, 
ఆరేళ్ళ చిన్నది బంగాళామెట్లు తుడిచే చీపురు చప్పుడే వినిపిస్తుంది.

యజమానివెంట వాకింగ్ చేసే బొచ్చుకుక్కల విన్యాసాలు కనిపించవు నాకు,
పాచిపోయిన అన్నం కతికి కక్కుకునే బక్కకుక్కలే కనిపిస్తాయి.

స్కూలు బస్సులో వెళ్ళే పావురాళ్ళలా ఉన్న పసి పిల్లలు కనిపించరు నాకు
మెకానిక్ షెడ్డులో స్పానరుదెబ్బలు తినే మరకలంటిన పసి మొఖాలు కనిపిస్తాయి.

భాగ్యవంతులిచ్చే విందులో పళ్ళూ , పలహారాలూ కనిపించవు నాకు,
ఎంగిలి ఇస్తర్లలో కుక్కలతో కలబడి కతికే నిర్భాగ్యులే కనిపిస్తారు.

కారులో తిరిగే కలవారి ఆడబిడ్డల సుకుమారం కనిపించదు నాకు,
సిమెంటులో పనిచేసే ఆడకూలీ అరిగిపోయిన కాళ్ళే కనిపిస్తాయి.

అట్టహాసంగా సీమంతం చేసుకొనే సినీతారలు కనిపించరు నాకు,
నెత్తిమీద తట్టనెత్తుకొని నిచ్చెనెక్కే నిండు చూలాలే కనిస్పిస్తుంది.

బాబు సంపాదిస్తే బలాదూర్ గా తిరిగే బడుద్దాయిల డాబు కనిపించదు నాకు 
బతుకు పుస్తకానికి భవిత అట్టలేసుకొనే మధ్యతరగతి యువతే కనిపిస్తుంది.

వనోత్సవంలో అరటిఆకులో తెల్లటి మల్లిపూలంటి వరియన్నం కనిపించదు నాకు
పురుగుల మందు తాగిన రైతన్న నోటివెంట వచ్చే తెల్లటి నురగే కనిపిస్తుంది 

నా కంటిపాపల నిండా ఒలికిన జీవిత విషాదాలే,
నా చెవుల నిండా తెగిన కంఠ మూగరోదనలే,

నాకీ ప్రపంచమంతా వింతగా కనిపిస్తుంది,,అందమైన అద్దంలో వికృత రూపంలా..

12, అక్టోబర్ 2012, శుక్రవారం

కదిలే సెలయేటితో స్నేహం చేసిన


కదిలే సెలయేటితో స్నేహం చేసిన
చిన్నరాయి లా సాగుతున్నాను
సాగుతున్న ఈపయనం లో
నీతో రాలేక ఏదో ఒకచోట
ఆగిపోతానని తెలుసు
అది తలచుకున్న ప్రతిక్షణం
నా కళ్ళల్లో ఒక పారే సెలయేరు కనిపిస్తుంటుంది నేస్తం.......

--- మన స్నేహం ---


స్నేహం ఒక
" భావం "

భావం ఒక
" జీవం "

జీవం ఒక
" ప్రాణం "

ప్రాణం ఒక
" రూపం "

ఆ రూపంకి
" ప్రతి రూపం "

 --- మన స్నేహం ---

ఒంటరి బ్రతుకే హాయనుకుంటే తప్పే తెలుసా….


తొమ్మిది నెలలే బజ్జున్నా దర్జాగా… 
కమ్మగా లాలి వింటూనే చల్లంగా… 
అమ్మ గుండె వినపడక…ఎగిరిపొయింది పడక… 
కళ్ళు తెరిచి చూసాక….వెలుగు కానొచ్చే మొదట… 
పుట్టానట, నేను…పుట్టానట… 
కన్నీటితో, నేనే…వచ్చానట… 
పనొచ్చిందేమో పైన నాన్నకి వదిలేసాడలా.. 
అమ్మ కన్నీట ఉందో ఏమో నాపై ప్రేమ కదా….

అమ్మ నన్నలని చూడాలన్న……ఆశది తీరేనా…???? 
పుట్టకముందూ ఒంటరినే …. ఇకపై కూడానా….??? 
ఆ దేవుడే ఉన్నాడు నీకు అని అన్నారంతా… 
మరి ఆయనేనాడూ కనపడడే ఎకడుంటాడంటా??

ఆకలితోనే పెరిగా నేను…ఏళ్ళేళ్ళుగా…. 
కాస్తైనా నీడే ఎరుగను నేను ఎన్నాళ్ళైనా… 
కన్నీరే చొరవైందే నాకు ఎవరూ లేకా.. 
చీదరింపులే చుట్టకు చూపై వస్తున్నాకా…!!!

రెక్కల కష్టం డొక్కల సాయం స్నేహం లాగా… 
బ్రతికేస్తున్నా బ్రతుకే నాకు శత్రువు కాగా… !!! 
ఎవరూ లేరని అనధ చేసి వదిలారంతా… 
ఓ మాటైన ప్రేమగ అంటే జీవిస్తాగా…!!!

ఎవరికి ఎవరో అనుకుంటూ బ్రతికేసేకన్నా…. 
ఒకరికి ఒకరై చెలిమిగ ఉంటే చేదేంటంట…??? 
నాదేముంది నేడుంటాను….రేపెరిగానా…??? 
నాలాంటోళ్ళకి గొంతై నేను….ఇది చెప్తున్నా…!!!

ఒంటరి బ్రతుకే హాయనుకుంటే తప్పే తెలుసా…. 
ఏ తోడూ లేక మొడై ఉంటూ నరకం చూసా…..నేనే నరకం చూసా…!!!!

10, అక్టోబర్ 2012, బుధవారం

ఆ ఆ ఇ ఈ


అమ్మా ఆవు ఇంటికొచ్చింది
ఈత చెట్టుపై ఉడుత ఊయలూగింది
ఋషిగారు ఎలుకనూ ఏనుగునూ ఐకమత్యంగా ఉందమన్నారు
ఒక ఓడపై ఔషదాలు అంగడికిరావడం అంతహపురంలో రాజు చూసాడు...


                                                                             --  శ్రీను, మేనేజర్, రామారాజ కాలేజ్  --

గుణింతాల కేళి....


కమ్మని కావ్యాన్ని
కిలకిల కీర్తనలా
కుహు కుహు కూసే కూననై
కృష్ణయ్యా కౄరసంహారా
కెరటాల కేరింతలనుకైవసంగొని
కొందంత కొరికతొవస్తి
కౌస్తుభవక్షా కంసమేనల్లుడా

                                                                  -- శ్రీను, మేనేజర్, రామారాజ కాలేజ్ --

9, అక్టోబర్ 2012, మంగళవారం

నేస్తం


నీ కన్నీటి ని చూసి
నా గుండె నిండి పోయింది
నువ్వు చిందించిన కన్నీరు
నాకు భరోసానిచ్చింది

నేస్తం... నీకు గుర్తుందా...
ఆ రోజు నువ్వు
నానిగాడి తో పంపిన ఆ ఉత్తరం...

అందులో కన్నీటి చుక్కలతో
అలుక్కుపోయిన అక్షరాలు
చెప్పేసాయి మన స్నేహం గాఢతని

ఆక్షణం
నీ కన్నీరు నాకెంత ధైర్యాన్నిచ్చిందని?
నాకోసం బాధపడే హ్రుదయం
ఒకటంటూ ఉందని నా మనసెంత గర్వపడిందని?

ఇంతకీ ..
నా కనుల కాగితం పైన
కన్నిటి చిత్రాలు
నీకు కనిపిస్తున్నాయా మరి?

8, అక్టోబర్ 2012, సోమవారం

చెలీ !

ఏ కావ్యానివో నువ్వు. 
నా కనుల చివర నిలిచిన కన్నీటి ముత్యాణివో నువ్వు. 
మేఘం అంచున దాగిన తొలిచిరు చినుకువో నువు. 
నా హృదయంలో స్వప్నమై అల్లరిచెస్తున్నావు. 
సూర్యుడు ఉదయించేవేల సుప్రభాతంలా... 
చంద్రుడు కనిపించేవేల వెనుగానంలా.... 
మల్లెలు వికసించేవేల సుగంధంలా... 
నా మనస్సు స్పందించే వేల మనోగేతంలా ... 
ఎందుకు నా మదిలో ఇంత అలజడి రేపుతున్నావు......? 

నీవు లేకున్నా.....


నీవు లేకున్నా.....
నను ఒంటరితనం వేధించటలా.. ఎందుకంటే???
నీ హృదయం చెప్పిన ఊసులు చెపుతూ..
నీ నిశ్వాస... నా ఉశ్ఛ్వాసగా మారి 
నా హృదయాన్ని ఓదారుస్తూంది

నీకోసం తిరిగే నాకు..
నీ దూరం భారం అనిపించటలా.. ఎందుకంటే???
ఇక మారని నీ రూపం నా తలపులలో..
నాతోనే వస్తూ.. నీవెంటే ఉన్నానంటుంది.

కానీ...నీ ఉన్నపుడు.. 
నీ వెనుక పడతూ..
ఆవేధనగా ఉన్న నాడు..నన్ను ప్రేమికుడన్నారు..

నీవు లేక.. 
నీ ఉసులతో..నీ తలపులతో
నిను ఆరాధిస్తున్నప్పుడు .. 
ఒడ్డును తాకినా గట్టు చెరలేని కెరటం అంటున్నారు

కాని వారికి తెలియదు.... 
గట్టుకు చెరిన కెరటం ఉప్పెనవుతుందని.
హృదయం ఉప్పెన అయితే అది నన్నే మున్చెస్తుందని.. :-(

5, అక్టోబర్ 2012, శుక్రవారం

ఇదే నా మహాప్రస్థానం!


తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...
తలపోసిన వేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక-
మురికితనం కరకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే-
అటుపోతే, ఇటుపోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి
ఒక్కణ్ణీ చేసి వేధించారని, బాధించారని,
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్లిపోయావా, నేస్తం!
తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!
దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్లిపోయావా, నేస్తం!
చిరునవ్వులనే పరిచేషన చేస్తూ...
అడుగడుగునా పొడచూపే
అనేకానేక శతృవులతో,
పొంచి చీకట్లో కరవజూసే
వంచకాల ఈ లోకంతో పొసగక
అంచితానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్‌, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్‌, నేస్తం!
ఎన్ని ఆశలు నీమీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీచుట్టూ పోగు చేసుకుని...
అన్నీ తన్నివేశావా, నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!
బరంపురంలో మనం ఇంకా
నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్యసాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
'ఉదయిని' సంచికలు పట్టుకుని తిరగడం
జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచికగూళ్లేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకుని
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడ ఉన్నామో, ఎక్కడకు పోతామో తెలియని
ఆవేశంతో,
చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించిందో, శఠించిందో మనల్ని:
తుదకు నిన్ను విషనాగురలలోనికి లాగి,
వూపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి,
మా కళ్లల్లో గంధక జ్వాలలు,
గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి,
మాదారిలో ప్రశ్నార్థ చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా,
తనువులో, అణువణువులో
సంవర్త భయంకర
ఝంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను:
ఎంత మోసగించిందయ్యా మమ్ము:
ఎవరు దుఃఖించారులే, నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప!
ఆకాశం పడిపోకుండానే ఉంది!
ఆఫీసులకు సెలవు లేదు!
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది!
సానుభూతి సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం!
ఎవరి పనులలో వాళ్లు!
ఎవరి తొందరలో వాళ్లు!
ఎవరికి కావాలి, నేస్తం!
ఎమయిపోతేనేం నువ్వు!
ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే!
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒకమాటకు బలి అయితే,
కనబడని వూహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే! నియంత్రిస్తే!
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయి పోతేనేం నువు?
మా బురద రోజూ హాజరు!
మా బురఖా మేం తగిలించుకున్నాం!
మా కాళ్లకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ముల లాగే!
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు!
లేదు నేస్తం, లేదు!
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము!
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు
భయం లేదులే అయినప్పటికీ
నీ సాహసం ఒక ఉదాహరణ!
నీ జీవితమే ఒరవడి!
నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు!
కావున ఈ నిరాశామయలోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను!
అందుకో ఈ చాచిన హస్తం!
ఆవేశించు నాలో!
ఇలా చూడు నీ కోసం
ఇదే నా మహాప్రస్థానం!

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!!


జీవితం అంటే.. ఛాయిస్‌ల మయం
అందుకే సరైనదాన్ని ఎంచుకో
ఇతరులతో పోలికా.. వద్దు, వద్దు..
నీ మనసే ఒక వేదం.. ఒక నిజం
అలా అనుకుంటేనే…
గెలుపు అవుతుంది శాశ్వతం

        *    *     *    *    *

నీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలను
అమాంతం మార్చేసే మాటలవైపుకి
హృదయాన్ని చేరువగా తీసుకెళ్లకు
జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకో
గమ్యంవైపు నిశ్శబ్దంగా నడచిపో

        *    *     *    *    *

ఎవరి కోసమూ నువ్వు మారకు
అయితే, నీ కోసం నువ్వు మారాలి
శరీరంలోని ప్రతి అంగమూ
నీదైనప్పడు..
మనోదృష్టి, భావపరంపరలు
కూడా నీవే కదా…
వాటిల్లో పరుల జోక్యమెందుకు..?

        *    *     *    *    *

నీ దృష్టిలోనూ, అభిప్రాయాల్లోనూ
నీదైన ముద్ర ఉన్నప్పుడు
నిన్ను నిన్నుగా ప్రేమించేవారు
ఎప్పుడూ నీ వెంటే ఉంటారు
నిన్నెప్పుడూ ఒంటరిని చేయరు …

ఏం…? నమ్మకం కలగటంలేదా..?

అయితే.. ఓసారి అద్దంలోకి చూడు…!! 

        *    *     *    *    *

వెలుగు రేఖల వెతుకులాటలో…!


నా ఆలోచనలన్నీ
మనసు అనే విరిగిన ముక్కను
తీసుకొచ్చి చేతిలో పెట్టాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్యుడే మెల్లిగా కిందికి పడిపోతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
సంతోషం అనే కలకండ ముక్కను
తీసుకొచ్చి నోట్లో వేశాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
చంద్రుడే హాయిగా కిలకిలా నవ్వుతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
ఆశ అనే రేపటిని
తీసుకొచ్చి ముందు నిలిపాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్య, చంద్రులే పోటీ పడుతున్నట్లు…!

ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది



కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు
ఆ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలోఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం

స్నేహం

ఇరుగింట్లో, పొరుగింట్లో, బడిలో, గుడిలో
బువ్వలాటల్లో, కాకెంగిలి పంపకాల్లో
శ్రీరామ నవమి పందిట్లో నాలుగుస్తంభాలాట ఆడే వేళల్లో
నేలా-బండా ఎక్కి దిగే వేళల్లో
ఆగస్టు పదిహేను ఊరేగింపుల్లో
తప్పు ఎక్కాలకి ఉత్తుత్తి చెంపదెబ్బల్లో
మాష్టారింట్లో కోడిగుడ్డు దీపం వెలుతుర్లో

సవర్ణదీర్ఘాది సంధులు, పైథాగరస్ సూత్రాల వల్లెల్లో
అమ్మ కోప్పడితే తుడిచే కన్నీరులో
సాయంకాలం రామాలయపు అరుగుల మీద
తెలియని ఓదార్పునిచ్చిన భగవద్గీత శ్లోకాలలో

కోతికొమ్మచ్చి కొమ్మల్లో, తొక్కుడు బిళ్ళాటలో
ఒప్పులకుప్పల్లో , చెమ్మచెక్కల్లో
శివరాత్రి జాగరణలో, అట్లతద్ది దాగుడుమూతలాటల్లో
నెల పట్టిన సంక్రాంతి ముగ్గుల్లో, గొబ్బి తట్టే వేళల్లో
వినాయకుడికి పత్రి కోసే వేళల్లో
అమ్మ పూజకి నందివర్ధనాల్ని ఎంచే వేళల్లో
పరీక్ష ముందు భయంలో పరీక్షలయిపోయిన సంబరంలో
వేసవి శలవుల్లో దొంగా-పోలీసు అయిన వైనాల్లో
మల్లెపూల జడల మురిపాల్లో, మొగలిరేకుల్లో
యవ్వనపు తొలిరోజుల చిరు రహస్యాలలో
మలి నాళ్ల భావోద్రేకాల్లో
ఎండల్లో, వానల్లో, చలిలో
మబ్బులు ముసురు పట్టిన వేళల్లో
రాత్రి లో, పగటిలో, కష్టం లో, సుఖం లో
ఎప్పుడూ నాతోనే వున్నావు
ఎక్కడ వెదికితే అక్కడే దొరికావు
అప్పుడప్పుడు చేయి విడిచినా
నిన్ను అందుకోవటం ఎలాగో నేర్పావు…
ఎవరూ నువ్వని ఎవరైనా నిన్నడిగితే
చెప్పు…స్నేహం!
నాకు నువ్వే చెలిమీ, కలిమీ, బలమని.

3, అక్టోబర్ 2012, బుధవారం

ఆత్మ విశ్వాసం


నీడ వంక చూసావా నీడలేకున్నది
తోడు వంక చూసావా తరలిపోతున్నది
నిప్పుకాలం రగిలే హృదయం
కన్నీటితోను ఆరనంది 
చెలిమి కూడా తీర్చలేనిది లోన ఏదో ఉంది

ఐనా ఆగవే మది ఆగిపోకే అందమైన లోకమిది
చూడవే కనులతోటి మొత్తమంతా నీదౌతుంది
ఆశ చేర్చు ఊపిరి తిరిగొస్తుంది
దేనిని వదులుకోకు మళ్ళీ కోరుకున్నా రాదు మరి...
.

పదిలమే నీ స్నేహం..

తెలియని భావన కనులలో కన్నీరా లేక పెదవిపై చిరునవ్వును పలికించాలా అన్నది నాలో తెలియని భావన ... 

చెరిగిపోయిన దూరం సంతోషపెట్టినా చెదరని ఈ మౌనం నన్ను వేధిస్తోంది... 

వెన్నల పర్వంలోని హాయి గుర్తొచ్చినా దానికి నిదుర నన్ను దూరం చేస్తుందేమో అన్న కలవరం నన్ను తొలచి వేస్తోంది...

మెత్తని ముసుగుల వెనుక ముళ్ళ కానుకగా ఈ సమయం వీడని రహస్యంలా వేధించే ఈ అల్లరి గాయం...

ఈ దూరం వీడుతుందని తెలిసిన ప్రస్తుతానికి ఓ సంశయం ఆగని గుండెలో ఎప్పటికి పదిలమే నీ స్నేహం...

విలువైనది స్నేహం

పసిపాపకు దూరంగా

ముసిముసి నవ్వులు కోల్పోయి ఉండగలను 

పొద్దు వెలుగుకు దూరంగా

నా కనులను కొంత సేపు మోసం చేయగలను

ప్రేమకు దూరంగా

నా మనసును కొంత కాలం ఓదార్చగలను 

కాని స్నేహానికి దూరంగా ఉండి జీవితాన్ని పోగొట్టుకోలేను

అది స్వార్ధమో తెలియదు నా అవసరమో తెలియదు

దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా

అ వరమే కరునించాలని కోరుకుంటున్నా ....

చెలిమి గుర్తులను మరువలేను

మట్టికి కూడా తెలియని నీ లేలేత అడుగు జాడలు,

నా స్నేహపు తీరంపై ఇంకా చెరగలేదు చెరిగిపోదు,

అలజడి లా వచ్చే అ అలలను తాకనివ్వను ,

కన్నీటి ధారలా మోసం చేసే ఆ చినుకులను తాకనివ్వను,

ఇంకే అడుగును కూడా దానిపై పడనివ్వను,

ఎండబారిన నేలనై నే శిధిలమై పదిలపరుస్తా కాని,

అ ముచ్చటైన చెలిమి గుర్తులను మరువలేను,

ఇకపై ఆ చెలిమిని పెంచాలని వేడుకుంటాను...

మేఘ సందేశం


మోయవే నా మాటలన్నీ
చేర్చవే నా ఊసులన్నీ
మాయమైన స్నేహానికి
మరపురాని నేస్తానికి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ మేఘమా పో మేఘమా

తన కనులు చూసి పలకరించు
చినుకు చల్లి చెలిమి కోరు
పరవశించి నాట్యమాడే
అందమంతా నాకు చేర్చు 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ మేఘమా పో మేఘమా

కడలి చేరు తీరమంత వెతికి చూడు
తన అడుగు జాడలు ఉన్నవేమో
చిరునామా మరి తెలియునేమో
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ మేఘమా పో మేఘమా

దూరమంటూ ఆగిపోకు
అంతటి స్నేహం ఎక్కడా దొరకదు
తన చెలిమిని నీకు పంచుతాను
వేగమంది తనను చేరు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ మేఘమా పో మేఘమా

దారివెంబడి పూలు ఉంటాయి
వాటి మత్తులోకి జారిపోకు
మాయ చేసే మనుషులుంటారు
మోసపోయి దారి మరచిపోకు
కేరింతలు కవ్వింతలకు ఆదమరచి కురిపించకు
దాచినదంత తనకే ఈ భారమంతా అ స్నేహానికే 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ మేఘమా పో మేఘమా

నా గుండెలనిండా వెచ్చదనం!


వర్తమానం జడివానై ముంచెత్తుతుంటే
నవ్వులెందుకని ప్రశ్నిస్తుంది కాలం,
సమస్యలు సుడిగాలై చుట్టుముడుతుంటే
ఏమిటి నీ ధైర్యమంటుంది లోకం -
నాకు మాత్రమే తెలిసిన నిజమొకటుంది నేస్తం..!
నీ జ్ఞాపకాల గొడుగు కాపాడుతున్నంత కాలం
నా గుండెలనిండా వెచ్చదనం!
నీ ఆలోచనలు తోడైనంత సేపూ
నమ్మకమే నా రక్షణ కవచం..!!





దిగులుమేఘం కరగడానికి 
కత్తుల యుద్ధం కావాలా..!?
బాణాల పోరాటం చెయ్యాలా..!?
నేస్తమయ్యే పవనమొక్కటి చాలదూ..
నమ్మకాల జల్లులు కురిసి,
లోకమంతా పువ్వుల కాంతులు వెలగడానికి!
దారులన్నీ రంగుల వాగులవ్వడానికి!! 

నీడల వాడలనీ, వెలుతురు ద్వారాలనీ
ఎంచి చూసే విద్య నేర్పిన ఉపాధ్యాయుడు,
భావి జీవన సమరానికి సిద్దం చేస్తూ
గెలుపు మంత్రం ఉపదేశించిన యోధుడు,
ఆప్యాయతలో బాధ్యతని గుర్తుచేస్తూ
లక్ష్యం వైపు నడిపించిన సైనికుడు,
తప్పటడుగులు తప్పుటడుగులు కాకుండా
తోడు నడిచిన మార్గదర్సి,
నీకు సరిపడా నీడనివ్వడానికి
కొండలనెత్తడానికైనా తెగించిన సాహసి,
తన పేరుతో నిన్ను గుర్తించే కంటే,
నీ పేరుతో తనని గుర్తిస్తే, గర్వంచిన అల్పసంతోషి, 
ఆ నాన్నకు జేజేలు!
ఆ నాన్నకు జోహార్లు!!


నువ్వు-నేను, మనము-మనసు.. భావాలలో ఒదిగే ప్రేమ -
వృత్తాకార పయనం లాంటిది,
సుదూరప్రయాణం అనిపిస్తుంది,
కానీ 'నువ్వు' చుట్టూనే తిరుగుతుంటుంది..!
కరుణ, జాలి, దయ.. గుండెల నిండుగా నింపే ప్రేమ -
అనంతంగా వ్యాపిస్తుంది
ప్రపంచాన్ని కౌగిలిస్తుంది,
విశ్వజనీనమై పునీతమౌతుంది..!

నిరీక్షించే ఓపికా ఉండాలి!!!


నీటివాలుకి కొంచెంసేపు
ఎదురుగాలికి మరికొంచెంసేపు
ప్రయాణించడం అన్వేషణ!
రేవులో సేదదీరడం
మార్గాన్ని సమీక్షించుకోవడం
అది తాత్కాలిక నిరీక్షణ!!
కోరుకున్న తీరాన్ని చేరాలంటే -
అన్వేషించే చైతన్యమూ కావాలి,
నిరీక్షించే ఓపికా ఉండాలి!!!

మా తెలుగు తల్లికి మల్లె పూదండ


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

2, అక్టోబర్ 2012, మంగళవారం

తొలకరిచినుకులు


ఎందుకిలా
మనసులో
అలజడి
నీటి కొలనిలోని
సంధ్యా సమయపు
నెలవంకలా
తరణి తొలి వలపులో
విరిసిన
కమలంలా
శరత్కాలపు
వెన్నెలలో తడిసిన
కలువలా

నారీహృదయం



అగ్ని పరీక్షకు నిలబడ్డ సీతమ్మ అపనింద భరించలేక
భూమిలోకి క్రుంగింది! అది స్త్రీ ఔన్నత్యం!
అవమానం సహించలేని ద్రౌపది అక్షౌహిణుల సైన్యం తో
కురుక్షేత్రం నడిపించింది! అది స్త్రీ వ్యక్తిత్వం!
మగువ మాంచల ప్రేమాన్వితమూర్తి!
పలనాటి నాగమ్మ పగబట్టిన శైవపుత్రి!
పురాణాలు, చరిత్రలు ఎక్కడైనా తానొక విశ్వరూపం!
ఆరళ్ళు పెట్టే అత్తింట్లో కన్నీళ్ళు తాగుతూ
కన్నతల్లి అవుతుంది! అది స్త్రీ సహన శక్తి!
అగ్నికీలలా జ్వలిస్తూ ఆరని మోహాలలో మగాళ్ళని
ముంచి ఆటాడిస్తుంది! అది స్త్రీ సమ్మోహన శక్తి!
కిరోసిన్ మంటల్లో తగలడుతూ కాపురం నిలబడాలని
కోరుకుంటుంది! అది స్త్రీ సౌశీల్య శక్తి!
యాసిడ్ భుగభుగలు కాల్చినా ప్రేమను
ఛీ కొడుతుంది! అది స్త్రీ నిర్ణయ స్థిరత్వం!
కన్న వాళ్ళను కాదని, కులాన్ని కాదని
కళ్ళుమూసుకుని వెంట నడుస్తుంది! అది స్త్రీ నమ్మకం!
కంటి చూపులతో శాసిస్తూ కాఠిన్యతను
శ్వాసిస్తుంది! అది స్త్రీ సమర్థ నాయకత్వం!
భగవంతుని స్మరిస్తూ ఆధ్యాత్మికతకు తానే
చిరునామా అవుతుంది! అది స్త్రీ విశ్వాసం!
నమ్మిదంటే అర్పణం! ఆగ్రహించిందంటే జ్వలనం!
తోడుగా నడిస్తే నీడ! కసిగా చూస్తే నాగు!
చేయి అందిస్తే చెలి! ఒడలో చేరిస్తే అమ్మ!
ఆడదంటే తోలుబొమ్మే! కాదని నిరూపించే కాళికే!
నాణేనికి రెండే వైపులు కానీ నారీహృదయం ఎన్నో రూపులు!
అందుకే నేస్తం! భర్తృహరి ఆరుగుణాల ఆడతనాన్ని అమరం చేశాడు!

చెదురుతున్న చిత్రం


చెదురుతున్న చిత్రం
---------------------------
ముఖం తడుముతున్న గాలికి
హృదయపు కాన్వాస్ పై
నీ చిత్రం
చెదురుతున్నట్టు
కనిపించిందట

ఎన్నెన్నో కలల రంగులు
పులిమి
ఊహలన్నీ ఊసులన్నీ
సమపాళ్ళలో కలిపి
మనసునే కుంచెగా మార్చి
చిత్రించుకున్నా
ఎంతో పవిత్రంగా మరి
ఏం చేయను ?

గాలి
చెవులలో చేరి
ఏవో కుశల ప్రశ్నలడిగి
హృదయాన్ని ఎందుకు
చేరిందో
తెలియదు కాని
కదులుతున్న నీ రూపం
ఏదో చెప్పాలనుకుంటునట్టు
నాకు
చెప్పకనే చెప్పింది

రోదిస్తున్న
నీ చిత్రంకన్నీళ్లు
నా ప్రేమ రంగులని
చెరిపేసుకుంటూ
తనకు తానే రూపం కోల్పొతుంటే
చూడలేక
నా కళ్లు కూడా
నదులకు స్థానాలయ్యాయి

కారణం ఏంటని
దాన్నే అడిగా !?

మనసు మరో దారి వైపు
మళ్ళింది
ఏం చేయను ?
అని
సమాదానం ఇచ్చింది
కొత్త రంగులెత్తుక్కుంటుందట..

అందుకే
కన్నీళ్లతో
కడిగేసుకుంటున్నా
నాకు కొంచెం
దైర్యం చెప్పరూ..!!

అన్వేషి.//మధ్యతరగతి మానవుడు//


తేదీ చూస్తే ఇరువైఐదు..
విడుదల ఎరుగని జీవితఖైదు..
మధ్యతరగతి మానవుడు
మనసులో మెదులుతున్న మాట..

చక్కెరలేని కాఫీతో లేపిన ఉదయం
బస్సుటికెట్ చిల్లర వెతకడంతో మొదలవుతుంది.
"సరుకులు నిండుకున్నాయండి"..వినిపించి
వినిపించని మాటలను విననట్లే అడుగు బైటకి వేస్తాడు..

సందు చివర కిరాణా షాపువాడు
కిందటి నెల బాకీ అడుగుతాడేమొనని
జవాబు వెతుకుతూ..తరువాత నెల
కోసం బడ్జెట్ తయారుచేసుకుంటూ అడుగులు వేస్తాడు..

అవసరాలు తప్పవు ఆడంబరాలే తగ్గించుకోవాలి
అని మనసులో అనుకుంటూ..ఆలస్యమౌతున్నా
జేబులో చివరి వందనోటు ఆటొని పిలవమంటున్నా
ఆఫీసు దగ్గరేగా అని ఆత్మవంచన చేసుకుంటూ..

"ఈసారైనా ఫీజు కడతావా నాన్నా" అన్న చిన్నకూతురి
మాటలు "అసలు కట్టగలవా" అని సూటిగా నిలదీస్తుంటే
ఆఫీసు వచ్చేసిందని అలోచనలుకి ముసుగు తొడిగేసి
తన మనసుని తానే మోసం చేసుకుంటూ..

మనకి ఒక రోజు వస్తుందని ఆశగా ఎదురుచూస్తూ..
మారుతున్న డైరీలతో మార్పులేని దినచర్యతో
జీవితంతో రాజీ పడిపోయి కాలం వెళ్ళదీస్తుంటాడు..
మనలో ఒకడు..మధ్యతరగతి మానవుడు.

ఏమిటో ఈ వింత ప్రేమగోల,


ఏమిటో ఈ వింత ప్రేమగోల,
నాకే అవుతుంది ఎందుకిలా,

మనస్సులో తన ఊసులే......వెతికి చూస్తే,
కనులలో తన నవ్వులే.....తెరిచి చూస్తే,

ఇంతలా మాయచేసింది తనే అనటంలో ఏ సందేహమూ లేదు,
కొద్ది కొద్దిగా తను నా మదిని దోచగా మిగిలింది కేవలం నా పార్దీవ దేహం,

నిన్ను కలిసాకే తెలిసింది...మాటలతో మత్తు చల్లి మాయచేయచ్చంటూ,
నిన్ను చూసాకే తెలిసింది....మనిషినుంచి మనసుని దూరం చేయచ్చంటూ,

నీ సోయగం చూసి అప్పుడు అనుకున్నా ...నువ్వు పెద్ద అందగత్తెవని,
నా మనసు దాచాకే తెలిసింది ...నువ్వు పెద్ద మంత్రగత్తెవని,

అడగాలని ఉన్నా....నిను చూడగానే నా మాటే మౌనం అయిపోతుంది,
ఇంత చేస్తున్నా....నువ్వు లేకపోతే నాచుట్టూ సోన్యం అయిపోతుంది,

ఎవరికి చెప్పుకోను ఈ వింతగోల,నా మనసే నన్ను వదిలి వెల్లిపోతే,
నీకే తెలుస్తుంది ఈ ప్రేమలోని మాయ ....నాలాగే నీకూ అయితే.

ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో


ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో

మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిసాయి
కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
ఆ….. కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
సన్న సన్నగ వలపు సంగతులు వేసాయి

మోహనా ఆలాపించ మోహమే ఆపింది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
శృతి కలిపి జత కలిసి సొక్కులెరిగిన వాడు తోడైన నాడే నే తోడు పాడేది

ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది
ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది

ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
వేచి ఉన్నది వీణ కాచుకున్నది కాన …

ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో

l l నీకై అక్షరార్చనే l l


l l నీకై అక్షరార్చనే l l
----------------------
మనసును కొస్తూ
అదేదో
నీ జ్ఞాపకానికి నా పై
పగ లేదుగా ప్రేమా

ఏమి చేయను ?
చీకట్లన్ని నావి చేసుకున్నా
వెలుగుల పరదాలని నీ కోసం కొని
మౌనంగా నిల్చుని వెన్నెలని చుస్తూ
చిల్లులు పడ్డ ఆలోచనలలోంచి
వెన్నెల నడిచి వస్తుంటే
గమనిస్తూ

అదో
నీ జ్ఞాపకాలు మొలిచాయి
వేళ్ళకి అలుపెక్కడ
నీకై అక్షరార్చనే
రాతిరంతా
నక్షత్ర పూల పరిమ ళాలను
అక్షరాలకు అద్ది మరీ

విచ్చిన్నం వైరాగ్యం


నాకు నచ్చినవన్నీ
నీకెలా నచ్చవో,
నీకు నచ్చినవి
నాకూ నచ్చకప్పోవచ్చు.
నన్ను పూర్తిగా
ఎలా ఒప్పుకోవో,
నేనూ పూర్తిగా
ఒప్పుకోను నిన్ను.
ఎన్ని నచ్చేవున్న
నచ్చనివున్నా,
అర్దంచేసుకొని
జీవించాలి అప్పుడే,
అందము ఆనందము
లేదంటె బంధం
విచ్చిన్నం వైరాగ్యం

మాదే కులం ?-క్రైస్తవ కులం-


మాదే కులం ?-క్రైస్తవ కులం-
-----------------------------
1.
నాతో వస్తావా ?
ఒకసారి ఏదేను తోటకెల్దాం
మంచి చెడ్డల తెలివినిచ్చే
వృక్షాన్ని ప్రరీశీలించి
దాని మూలాల్లో
కులం ఉందో లేదో
చూద్దాం !

2.
ఒక్క మాటలో
భూమ్యాకాశాన్ని
సృజించిన నాడే
ఏ మట్టితో
మానవుని చేశాడో దేవుడు
ఆ నేలదే కులమో
పరిశీలించి వద్దాం

3.
ఆయన శ్వాసనే
మనలో
ఊదిన నాడు
ఆయన
ఊపిరిదేకులం ?

4.
ఆ చేతులు
మన్నును
ముట్టుకున్న నాడు
మన్ను అంటుకున్న వాని
చేతుల్లో
మనిషైన వాడిదే కులం ?

5.
నేను అనే మాట
దేవుని నుండి మనిషి వరకు
దారులేసుకొని
జారిపోయి వచ్చినపుడు
అస్తిత్వపు ఆస్థిగా
మనం అనే మాట నుండి
వేరు పడి
"నేను "-"నాది "అనే
వేర్పాటు
మాటదే కులం ?

6.
సిలువనెక్కి అభిషిక్తుడు
చిందించిన రక్తంలో
పాపమంటుకున్న దేహాలను
పరిశుద్ద పరిచే నెత్తురులో
పరిశీలించి చూడు
ఆ రక్తానిదే కులం ?

7.
ఆ రక్త ధారలో కడుగబడి
క్రైస్తవుడని
పిలిపించుకుంటూ
అవసరార్ధం
నీకెందుకు
గుర్తొస్తుందీ కులం ?

8.
నా హృదయం
అడిగిప్రశ్నల్ల్లో
నాలో జరిగిన మధనంలోంచి
తెలిసిందిదే
నాదే కులమో ?మాదే కులమో ?

9.
ఆయన శ్వాస నాలో ఉన్నందుకు
మాది " దైవ కులం "
ప్రేమ చూపి ప్రాణం పెట్టినందుకు
క్రీస్తు మాదిరి "ప్రేమ కులం "
నిజమైన నిబంధనలో
యేసు మార్గంలో
తనతో పాటు నడుస్తున్న
వారందరిది
"ప్రేమ కులం "- "సేవ కులం "

10.
అందుకే
దళితులని దూరం చేసినప్పుడు
వెలుగు వెత్తుక్కొని
సిలువనాశ్రయించాం
దాడులు చేస్తున్నా మౌనంగానే
క్రీస్తు ప్రేమ చాటుతున్నాం

kammani prema


చెలి తలపులు స్వాతిచినుకులే...
మదిలో చేరిన ప్రతీసారి కన్నీటి ముత్యాలు కురిపిస్తూ..



విషాదంలో సైతం పెదవులు నవ్వుతున్నాయి..
దూరమైన చెలిని..తలపులలో పలుకరిస్తూ


సలహాలేలనే ప్రేమలో
మనసుతో మాట్లాడేవాళ్ళు తక్కువే యిలలో



నీ ప్రతి కన్నీరుకి ఓ చిరు నువ్వులా తోడుంటా నేస్తం..!!



పొడిబారిన మనసుని చెలి తలపుల జల్లులో తడిపా..
సాక్ష్యం కావాలా..చెమరించిన నాకళ్ళని చూడు..


నేను ఎక్కడి కి వెళ్ళిన నీ వుహలు నాకే దక్కును 
నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంతో నా చుపులు నిన్నే వెతుకును .....


నిను పలికేలా చేసే వసంతాన్ని కాలేను..
మది కదిలేలా చేయగల మౌనాన్ని నేను.


చెలి కోసం 
వెలిగించిన మదిదీపాలు-నా కవితలు



పదును ఎక్కువైందట కలానికి
అవును..మౌనంతో సానపెట్టాగా



నిను పలికేలా చేసే వసంతాన్ని కాలేను..
మది కదిలేలా చేయగల మౌనాన్ని నేను.




 " స్నేహానికి" ఏ వయస్సు అడ్డురాదు స్నేహాంలో స్వార్ధానికి చోటులేదుస్నేహానికి ఏ బందము అడ్డుకాదు స్నేహానికన్న సాటియైనది లోకానా లేదు స్నేహాంతోనే ప్రతిమనిషి జీవితం పరిమళిస్తుంది



















ప్రేమ పుట్టుక:


మనం ఎవ్వరినైన ప్రేమించాలని నిర్ణహించుకుంటే ప్రేమ పుట్టదు...

ప్రేమంటే ఎవ్వరినో మనసులో ఊహించుకుని ప్రేమించటం కాదు...
అలాగని ఎదుటి వారు మనల్ని మనం ప్రేమిస్తున్నారని మనమ ప్రేమించటం కాదు..
ప్రేమంటే మనకు తెలియకుండానే మనం తన ధ్యానంలో లీనం అవ్వటం...
మనకు తెలియకుండానే మనలో మార్పు
మన హృదయాంతరాళం లో ఏదో అలజడి....
మనసుకు మాత్రమే అర్థం అయ్యి అర్థం కాని స్పందనలు......
మాటన్నది మార్చి పోయి కళ్ళతోనే కోటి భావాలు ప్రకటించే కొత్త రకపు భాష మొదలవుతుంది...
అదే ప్రేమంటే....
ఆకలన్నది మార్చిపోయి నీకోసం ఆరాటపడుతుంది.
నీ నుండి నీ నడకను వేరు చేసి తను వెళ్ళే దారినే వెంబడిస్తుంది...
ప్రేమంటే తన గురించి పూర్తిగా మర్చిపోయి తనలో ఇక్యం అయి నీకోసం ఆరాటపడేది
అనుక్షణం నీగురించే ఆలోచించేది....
ఇవే ప్రేమ పుట్టుకకి ఆనవాళ్ళు...
చివరికి తను తనిపోయిన తన మది నిండా బ్రతికున్నవి నీ గురించిన ఆలోచనలే....

చావు లెక్కలు




దోచుకునేవాడు
దొడ్డి దారిలో వాని పని చేసుకుంటున్నాడు
దాపరికం లేకుండా!


చావు లెక్కలతో చావగొడుతుంటే
నువ్వు పాపపుణ్యాల లెక్కలేస్తున్నావా నేస్తం

వాడు పోతే కొందరేడ్చారని
వీడు పోతే కొందరు చచ్చారని
ఇక్కడ చావు లెక్కలూ..దొంగ లెక్కలే
ఇంటోడికి ఏమీ కాదు .
చంటోడిది చావులెక్కల సన్నాయి మేళం !
వీధి వీధి తిరిగి వాయిస్తున్నాడు , ఏ ఊరు వదలకుండా

వాళ్ళకి మరక కూడా మంచిదే
పబ్లిసిటీ పెరిగేందుకు
వాళ్ళకి చావు కూడా మంచిదే
రాజకీయంగా ఎదిగేందుకు

వాళ్ళు ఓట్ల దొంగలే
మనుషులను పంచుకుంటారు
వాళ్ళు నోట్ల దొంగలే
మనలను బికారీలను చేస్తారు
వాళ్ళు, కరువు లెక్కలు దాస్తున్నారు
వాళ్ళు, చావు లెక్కలు మోస్తున్నారు

సమాధి మీద పూచిందో శ్వేతా మందారం
తాజ్ మహల్ సింగారంలా
చావు పాటల పైనే పూస్తుంది యువ రాజకీయం
కీచక పర్వంలా

ఎవడు ఎవడికి పుట్టాడో
'లాబు'లిచ్చిన వారసత్వపు లెక్క పత్రం
రాజకీయానికి కొత్త రంగు తెస్తుందేమో!

చావు లెక్కలు చెప్పుతూ
చావు పాటలు పాడుతూ
యువరాజులు రేపటి రాజకీయాన్ని మింగకముందే
' దొంగల అడ్దాని ' శుద్ధి చేద్దాం ' ఓటు 'తో

నేను నా ప్రియురాలు


ఒంటరితనం
నాకీ మధ్య పరిచయమైన కొత్త ప్రియురాలు
ఒంటరిదైపోయిందో ఏమో

నా నుండి వెలివేద్దామనుకున్న ప్రతీ సారి
ఆమె నాతో మాట కలుపుతూనే ఉంది
మంతనాలు జరుపూతూనే ఉంది

జన కాలుష్యాన్ని వదిలి
ప్రకృతి ఒడిలోకి చేరుకొని
గరిక పోసతో
గడ్డి పువ్వుతో
నేను మాట్లాడుతుంటే
గమనించనే లేదు
ఆమె నా ప్రక్కనే ఉంది

ఎవరు లేని నిర్జనారణ్యంలో
వెలుతురే లేని చీకటి సందర్భంలో
భుజం తట్టింది ఆమే.
భయం పొరల తెరలను చించి
ఆమె నా ప్రక్కనే
నేనున్నానంటూ

ఆమె
నా తనువునుండి మనసును వేరుచేసి
దానికెన్ని ముచ్చట్లు చెప్పుతుందో
ఉలుకు పలుకు లేని నేను
నా ప్రియురాలిని నా మనసుని
కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయాను
యుగాలు గడుస్తున్నాయి వాళ్ళ ఊసుల్లో
నాకు మాత్రం నెత్తి పైన ఎండ నెత్తి పైనే ఉంది
నేనక్కడ మూడో మనిషిని

విసుగొచ్చి వచ్చేసాను
మనసుని నా ప్రియురాలికి అప్పజెప్పి
మళ్ళీ జనారణ్యంలోకి నేను .

జనంలోనే నాకు బలం .

ఓ సాయంత్రం ....




"నువ్వు ప్రేమని విరాళం లా పంచేస్తున్నావ్ అది నాకు నచ్చదు" అన్నాడు అతను
" హహ అదేంటీ అలా అన్నావ్ ?" నవ్వుతూనే అడిగింది
" ఏమోనబ్బా ! నాకు పోసేసివ్నేస్స్ ఎక్కువ , నేనలా అందరితో ఒకేలా ఉండలేను , ప్రేమగా "
" పోసేసివనేస్ , హహ బాగుంది అది ఉంటుంది , ఉండాలి మంచిదే , అసలొక పెద్దాయన అన్నారు అదే లేక పొతే ఏమీ చెయ్యలేమని తెలుసా"
" అదేంటి ఉండాలంటావు మరి ప్రేమిస్తున్నానంటావు, నావారు నా సొంతం అనిపించదా ఎవరి పట్లా?"
" ఎందుకనిపించదు , అందరు నావాళ్ళే కదా అనిపిస్తుంది .." నిశ్చలత ఆమె గొంతులో
" ఏమో నాకు నువ్వు అర్ధం కావట్లేదు పిల్లా"
" అర్ధం కాక పోయేంత గొప్ప వ్యక్తినేమీ కాదులే గానీ....అయినా పోనీ అర్ధం చేసుకోకు , కొన్ని అర్ధం కాకుండా ఉండటమే మంచిది ఆరోగ్యానికి " పకపక నవ్వింది
" అంతేలే ! నువ్వనుకున్నదే నీకు వేదం ..."
" ఎవరికైనా అంతే సారూ! తాను వలచిందే రంభా, తాను మునిగిందే గంగ , వినలేదూ ఈ సామెత ?"
" ఏమో అందరికి పంచేస్తే అది ప్రేమెందుకు అయ్యింది , ఇక ప్రత్యేకత ఏముంది , అయిన మన ప్రేమ పొందే అర్హత అవతలి వ్యక్తి కి ఉండద్దూ?"
" అయ్యో ప్రేమించడానికి అర్హతేంటి సార్ , అది పెద్ద మాట , ఎవర్నైనా ప్రేమించ గలగాలి , ఎవరిని వారుగా ప్రేమించాలి "
" ఏమో నీ ప్రేమ గోల నాకు అర్ధం కాదు "
" అంతే కదా నన్ను ప్రేమించడానికి నీకు నా ప్రేమ గోల , నిన్ను ప్రేమించడానికి నాకు నీ ప్రేమ లేని గోల అడ్డంకులు కావుగా అందుకని "
" అందుకని ..." రెట్టించాడు
" అసలా మాటలే వదిలేద్దాం"
" మొండి ఘటం ..." విసుక్కున్నాడు ముద్దుగా
" మరేమీ చెయ్యను చెప్పు .... నెక్స్ట్ జన్మ బెటర్ లక్..నీకు హహ" నవ్వింది
" వద్దు తల్లీ ! ఈ జన్మకిది చాలు వచ్చే జన్మలో కూడా నువ్వేనా నా బుర్ర తింటావు వద్దులే , మంచి అమ్మాయ్ దొరకాలని అదిగో పద గుడికి పోయి దణ్ణం పెట్టుకుందాం"
" నే రాను ! ప్రేమే దైవం నాకు ఇక గుడిలో కి ఎందుకు , ఆ రాతి బొమ్మలో కాదు మనిషిలోని మమతను చూడాలి అన్నదే నా నమ్మకం "
" నీ నమ్మకము నువ్వు ఇక్కడ ఉండండి నే వెళ్లి వస్తా " కదిలాడు
" ఆగాగు అబ్బాయ్ గుడి లోకి రానన్నాను కానీ నీతో గుడి దాక రానని అనలేదు గా అంత ఆలకైతే ఎలా?"
" అంతే గుడి వద్దు కానీ ప్రసాదం తింటావా " వెక్కిరించాడు
" భేషుగ్గా తింటాను దానికేం ..అసలే ఇక్కడ ఈరోజు చక్కెర పొంగలి ఇస్తారు కూడానూ బహు బాగుంటుంది చలో " పకపకా నవ్వుతూ నడుస్తున్న అతని వెనుక అడుగులో అడుగు వేస్తూ ....ఆమె ....

నేను



నిశ్శబ్ద మాధుర్యాన్ని
నీ కేమీ కాను నేను
నిను గన్న అమ్మను కాను
జీవితం పంచుకున్న అర్ధాంగిని కాను
నీ తోడ బుట్టలేదు నేను
నీ తోడి ఆడిపాడలేదు నేను

ఫలించిన నీ రేతస్సును కాను
గర్వించే నీ యశస్సు నూ కాను
అయినా..............
ఏమీ కాని , నేనే
నీకు "అన్నీ" అది నాకు తెలుసు
అందుకే చెప్తున్నా
నేను నిన్నావరించిన
"నిశ్శబ్ద మాధుర్యాన్ని"
నీ చుట్టూ....
నీతోనే ఉంటూ...
నీలోనే ఉంటూ.....
నా అస్తిత్వాన్ని పండించుకుంటాను

ఆట విడుపు


ఆట విడుపు

అవును నిజమే
అప్పుడప్పుడూ అట విడుపు కావాలి
అహరహమూ ఆడుతోన్న
అవిశ్రాంత జీవితపు ఆటనుండి ఆట విడుపు కావాలి
ఆట తప్పని సరైనా
ఆట విడుపు లేకుంటే
అలసిపోతాము....
ప్రతిరోజూ ఓ పరికరంలా
పని చేసే దేహాన్ని
అనుక్షణం ఆలోచనలతో
వేడెక్కిన మేధో కర్మాగారాన్ని
మనకోసం సాగించే
మర లాంటి మనుగడనీ
అప్పుడప్పుడూ విశ్రమించనియ్యాలి
అనుదిన ఆర్భాటాలనుండి
స్వార్ధపు సుఖాల నుండి
ఓ అడుగు పక్కకు వేసి
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా గమనించాలి...

అప్పుడే...
అనంత మైన ఈ భూగోళంలో
మనమెంత అణువులమో తెలుస్తుంది
మన సంకుచిత పరిధులు దాటి
మనకూ ఓ బాధ్యత ఉందన్న
ఎరుక కలుగుతుంది
మనదైన ఒక ముద్ర
చరిత్ర లో మిగాల్చాలన్న
స్పృహ కలుగుతుంది

అప్పుడు.....
ఆలోగోరే ఘోషిస్తోన్న
గ్లోబల్ వార్మింగ్ గురించి
ఏమి చెయ్యాలో ఆలోచిస్తావు
పాలస్తీనా లోని పాలుగారే పసిపాపల
బుగ్గల కన్నీటి చారికలు
నిన్ను నిలువునా కదిలిస్తాయి
అంటార్క్టిక లో కరుగుతోన్న
మంచు పర్వత శ్రేణులు
నీకు పర్యావరణ పరిరక్షణ
కర్తవ్యాన్ని బోధిస్తాయి
భవిష్యత్ నిర్మాతలు కావాల్సిన భావి పౌరులు
ఆటవికతకు ఆనవాళ్ళుగా
ఎలా విజ్రుంభిస్తున్నారో
అవలోకిస్తావు
గుజరాత్ గుండెల్లో
ఆరని గోద్రా మంటలు
నందీగ్రాం, ముది గొండ ప్రేలుళ్ళతో
ప్రతిధ్వనించే తూటాల శబ్దాలు

నీ చుట్టూ విలయ తాండవం చేస్తోన్న
సమస్యలేమైనా ............
అకాలంగా రాలుతోన్న
శవాల వర్షాలు
సమాధానాలే లేని ఇరుగు పొరుగు దేశాల
పీటముడి ప్రశ్నలు
నీదైన మాటను
నమోదు చేయమంటాయి
నీదైన ప్రతిస్పందనను కోరుతాయి
ఆటవిడుపు అంటే విశ్రాంతి కాదు
ఆత్మావలోకనం

నీ జీవితపు ఆట నుండి
ఒకింత బయట పడి
నిస్వార్ధంతో
నీ కింకర్తవ్యాన్ని
చేపట్టగలగడానికి
సమాలోచన చెయ్యగలిగే
సంసిద్ధతా ప్రయత్నం
ఎంత గొప్పగా ఆడినా
బతుకాటలో వృద్ధాశ్రమం
నీ చివరి పెవీలియన్
ఒంటరితనం మాత్రమే
నువ్వు సాధించుకునే
అక్కరకు రాని నీ "లైఫ్ ట్రోఫి "

జీవితం ముఖ్యమే
కానీ అయువుతో ఉన్న నలుగు ఘడియలు
సమసమాజ నిర్మాణంలో
నీవు కూడా ఓ ఇటుక వైతే
సామాజిక సమస్యా పూరణంలో
నీవూ ఓ కరబంధమైతే
జన్మ సార్ధకతను పొంది
మనిషిగా మనుషుల
మనసులలో మరుసటి
తరాలకు నిలుస్తావు !!

ఆట విడుపు అంటే విరామం కాదు
విశ్వ శాంతి ప్రపంచ కప్ సాధించడానికి
మానవత్వపు జట్టు
ఆటగాళ్లుగా మన మందరం
తర్ఫీదు పొందే
సార్ధక సమయం....!!!

అది మరిచెను గత బంధం


ఆంతులేని ఆకాశంలో స్వేచ్చగా ఎగిరిన విహంగం
హరివిల్లు తాకిన వేల పులకరించెను ప్రతి అంగం
గూడు విడిచి పోయినా అది అంబరం అందిన సంబరం
లోకం లోని అందం కోసం అది మరిచెను గత బంధం

వర్ణలేఖ || ఓ స్త్రీ సంఘర్షణ ||


వర్ణలేఖ || ఓ స్త్రీ సంఘర్షణ ||

బాధనీ భయాన్నీ
బాహువుల్లో బంధించి
నాలో నేను
కుచించుకుపోతున్నా
కన్నుల్లో కరుణలేదు
కన్నీరు తప్ప
నీవెలాగూ ఓదార్చవని
తెలిసి, పొంగుకొస్తున్న
దుఃఖాన్ని జోకొడుతున్నా
నేనెప్పటికైనా మేల్కొందామని

*** *** *** ***

నేనో కాలనాగై
ఎదిగానని తెలియని నీవు
ఉప్పెనలా నిన్ను
ముంచేస్తే ఎలా
విల విలలాడుతావోనని
జాలి పడుతుంది నా
పిచ్చి హృదయం
నిద్ర నటిస్తున్న నేను
కమ్మటి కలలేకాదు
నీ కర్కషపు
మనసును కంటున్నా
నన్ను నీవింకా
పసితనపు దుప్పట్లోనే
జోకొడుతున్నవు. ప్చ్....

*** *** *** ***

ఏదారీ లేదని
గోదారి వెతుక్కునే
రోజులు పోయాయి
మందిలో ఉంటూ
ఒంటరితనం భరించడం
అనవసరం
బానిస బతుకుకి
బందాల పేరు పెట్టి
మీరాడే నాటకానికి
కాలం చెల్లబోతోంది
మరణమే గతి అనిపించినరోజు
ఈ శృంఖలాలను తెంచుకొని
వీర మరణం పొందుతా
కనీసం చావులోనైనా
నాకు ప్రశాంతత
లభిస్తుందనే ఆశతో

మనసుతో అమీ తుమీ...!!


మనసుతో అమీ తుమీ...!!
*****************

కలల ఆశ చూపి
కళ్ళల్లో నిద్దురను నింపి,
వెలుగు ఆశ చూపి
రెప్పల్లోకి రేపటిని ఒంపి
ఆటలాడే ఓ మనసా...
నీకు అలుపు లేదని
నీకైనా తెలుసా?

నీకు ఆశ చూపడమెలాగో
నీలో కలత రేపడమెలాగో
వయసు తేడా లేకుండా
స్థాయి తారతమ్యాలు చూపకుండా

అందరినీ పట్టి ఆడిస్తావు
అలుపురాకముందే ఓడిస్తావు..
అనుకున్నది చేస్తావు
అనుకోనిది చేయిస్తావు...

నీతో వేగడం
మా చెడ్డ కష్టం సుమీ....!!
త్వరలోనే తేల్చుకుంటా
నీతో అమీతుమీ...

పరస్పర సంభాషణ


పరస్పర సంభాషణ

రాయి హృదయంలో తడి
పగులగొడుతూ మాట్లాడే
సుత్తెకే ఎరుక...

సుత్తె మాట్లాడే ఆ దెబ్బల
భాష
పగిలిపొతున్న రాయి చెసే
శబ్ధానికే ఎరుక..

బ్రద్దలు కొడుతూ జరిపే
రాయి సుత్తెల
పరస్పర సంభాషణ
చెదిరని గురికి ..
తప్పని లక్ష్యానికి
ప్రతీక

దెబ్బ దెబ్బకి
చూపు భాష అర్ధం చేసుకునే
చేయి గురి
విజయం ఎంటో తెలిపే
పరీక్షల సూచిక

నీవు నన్ను ద్వేషించినా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను


నీవు నన్ను ద్వేషించినా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను

నీవు మౌనంగా ఉన్నా, దాని వెనుక అంతరంగానై నేనుంటాను

నీవు నన్ను వీడిపోతున్నా నీ నీడల్లే నీతోనే ఉంటాను

ఎందుకూ పనికిరాని ఫీలింగ్ ఎడారిలో వానమబ్బే కదూ?

కూటికోసం కోటి విద్యలు! నిజమే!! ఒప్పుకుందాము!

కానీ ఆ కోటి విద్యకూ శ్రమకు నిలయాలు ఐతే బావుంటుంది!

అలా కాక నీచ, కీచక, యాచక చర్యలుగా మరితే ఎంత అసహ్యం?

ట్రాఫిక్ లో సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ ఆగుతాయి! అందరికీ తెలుసు!

కార్లను, టూవీలర్స్ ను, ఆటోలను చుట్టుముడతారు ముష్టివాళ్ళు!

ఇది ప్రతిరోజూ, ప్రతిపూటా, ప్రతిగంటా,ప్రతి నిముషం జరిగేదే!

కానీ ఈరోజెందుకో చూస్తుంటే భలే కోపంగా అనిపించింది!

జాలి పుట్టిచడం కోసం అని ఎంత దారుణం చేస్తున్నరా అన్న బాధ!

ఒకమగతను, దిట్టంగా, దీపస్థంభం లా బానే వున్నాడు! 

మనిషి కి వయసూ పెద్ద ఎక్కువేమీ కాదు! ఓ 35 ఉంటాయ్!

అతను అడుక్కుంటున్నాడు! చేతిలో ఒక చిన్న నెలలపాపాయి! 

ఒంటిమీద చిన్న బట్ట కప్పలేదు కానీ కాలికి పెద్ద కట్టు కట్టాడు!

ఆకలికో, నొప్పికో, ఎండనబడో పాపం చిన్నపాప ఏడుస్తోంది!

ఆ ఏడుపును కాష్ చేసుకునే దందాలో వీడు! చెయ్యిజాపి ఏడుపు!

పాలకి లేదయ్యా, మందుకి లేదయ్యా, చంటిది చస్తుందయ్యా!!

అని రాగాలు పెడుతూ వసూలు చేసుకుంటున్నాడు! 

తన జన్మ వాడికి తప్ప తనకుపయోగపడదని అప్పుడే తెలుసుకునేసిందేమొ..

చంటిపాప గుక్కపట్టి ఏడుస్తూనేఉంది ఆపకుండా! వాడది పట్టించుకోవడమే లేదు!

మనసుకి చాలా కష్టం వేసింది నేస్తం! కానీ ఏం చెయ్యగలం??

ఎందుకూ పనికిరాని ఫీలింగ్ ఎడారిలో వానమబ్బే కదూ?