- మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.
- మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడాని కంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క.
- అర్ధం చేసుకోగలిగితే జీవితం ఉచితమైనది. ఆపార్ధం చేసుకుంటే మాత్రం జీవితం తెవులు అవుతుంది.
- ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.
- మీకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా తీరికలేని సమయమే విశ్రమించే సమయం అవుతుంది.
- పేరు ప్రఖ్యాతులన్నది మీరు ఉన్న దానిని బట్టి ప్రజల ఆలోచన అవుతుంది. మీరు నిజంగా ఏమో అది మీ గుణగణాలు తెలియజేస్తాయి.
- సమకాలికులు మనిషి అర్హతను కాదు మనిషిని ప్రశంసిస్తారు. కానీ భావితరాలు మనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి.
- ముందుకు ఎదగనిది వెనక్కు ఎదిగి కుళ్ళిపోతుంది.
- కష్టసుఖాలు మానసిక స్ధితులు.
- అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.
- మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి.
- మీ గురించి గభీరంగా ఆలోచించడం మొదలు పెడితే మీరు గొప్ప అపాయానికి గురికాగలరు.
- తాను కోరుకున్న దానిని పొందడం అన్నది కేవలం సంతృప్తి మాత్రమే. ఇతరులు కోరేదాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉంది.
- రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.
- చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
- పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.
- గొప్ప విషయాలలో మనిషి తలదూర్చడం అన్నది గొప్ప అవుతుంది.
- ఉదయం దినాన్ని సూచించినట్లే బాల్యం మనిషిని సూచిస్తుంది.
- సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము.
- మాట్లాడే ముందు ఆలోచించండి. దుమికే ముందు చూడండి.
- నాలో ఎలాంటి లోపం లేదని ఉహించుకోవడమే తప్పులలో అతి పెద్ద తప్పు.
- ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
- వయసు పెరిగే కొద్దీ అందం లోపలి వైపు అపహరించబడుతుంది.
- ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
- యాభై మంది స్నేహిరులున్నారా? అది సరిపోదు. ఒక్క శత్రువున్నాడా? అది మరీ ఎక్కువ.
- చాలాకాలం వరకు కొనసాగే అలవాటే మనిషి గుణం అవుతుంది.
- రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.
- జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
- మంచి సలహాకూ, చెడు సలహాకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పగలిగితే సలహా అవసరమే మీకుండదు.
- పరీక్షలకు గురికాకుండా మనిషి రాణించనట్లే రాపిడికి గురికాకుండా వజ్రం రాణించలేదు.
- నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
- చెడు అలవాట్లు అన్నవి మెత్తటి పరుపులాంటిది. పరుపు నెక్కడం సులభమే కానీ దాని నుండి కిందకు దిగడం కష్టం అయిన పని అవుతుంది.
- పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
- ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
- ధైర్య సాహసాలున్న ఒక వ్యక్తి మెజారిటీ అవుతాడు.
- జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.
- ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
- శాంతంగా ఉండండి కానీ సోమరిగా మాత్రం కాదు.
- ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
- మనసన్నది బంగారం గనితోపాటు ఒక చెత్తకుండి కూడా.
- మనిషి స్వతంత్రంగా పుట్టాడు. కాని అతడు అన్నిచోట్లా బంధాలతో బంధింపబడి ఉన్నాడు.
- మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
- ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.
- మాటలను వ్యక్తపరచడంలో పాండిత్యాన్ని కనబరచే సామర్ధ్యాన్నే నిపుణత అంటారు.
- నమ్మకం అన్నది మనకు వెలుగు నివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి.
- జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.
- ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.
- ఎవ్వరికీ తెలియని విషయంను గురించి కొంత తెలుసుకోవడలోనే విజయవంతమైన వ్యాపార రహస్యం దాగుంది.
- బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.
- ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.
- నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.
- సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.
- చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
- ఆవిష్కారాలు దుస్సంఘటనలు కావు. అవి విసుగు చెందని శ్రమకు లభించే బహుమతులు.
- ఈ ప్రపంచలో సేవ ఉత్తమమైన ప్రార్ధన. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడమే ఉత్తమమైన ఆరాధన.
- చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.
- పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
- తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
- ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.
- ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.
- నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.
- సామాన్యులు ప్రార్ధించరు. యాచిస్తారు.
- ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.
- మనుషుల చేతలు ఒక పుస్తకపు సూచికలాంటివి. పుస్తకంలో ఉన్న అతి చెప్పుకోదగ్గ విషయాన్ని అవి చాటి చెబుతాయి.
- నడవడిక అనబడే అద్దం ప్రతి ఒక్కరి ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తుంది.
- భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.
- జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.
- పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.
- రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవదం- ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు.
- ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.
- మనిషి మనసు గొడుగులాంటిది. తెరవబడినప్పడే గొడుగు బాగా పనిచేస్తుంది.
- కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
- పైన ఉన్న స్వర్గాన్నీ, క్రింద ఉన్న భూమినీ ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది.
- వినయ విధేయతలున్నప్పుడు మీరు పూర్తిగా బీదవారు కాలేరు. వినయ విధేయతలు లేని పక్షంలో మీరు నిజంగా ధనవంతులు కాలేరు.
- సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.
- ఒక మనిషి మరొక మనిషి కోసం చేషే త్యాగంతోనూ, పదిమంది కోసం పడే కష్టంతోను ఈ సమాజం నిర్మతమవుతోది.
- ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.
- కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.
- జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.
- జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.
- తన కోరుకలనూ, వాంఛలనూ జయించిన వ్యక్తి తన అతి పెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు.
- బలహీనులు అవకాశం కోసం ఎదురుచూస్తే బలవంతులు అవకాశాన్ని సృష్టించుకుంటారు .
- సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.
- మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
- తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.
- ఆలస్యంగా చెప్పబడే న్యాయం న్యాయం కాదు.
- మంచి సలహాకూ, చెడు సలహాకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పగలిగితే సలహా అవసరమే మీకుండదు.
- విశ్వాసం పరమ బంధువు.
- ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.
- సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.
- వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.
- తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి.
- ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.
- ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.
- శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.
- బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
- నోరు తెరవనంతవరకు మూర్ఖుడు నెగ్గుకొస్తుంటాడు.
- చేయడానికి తయారుగా ఉన్న హృదయానికి అసంభవమైనదంటూ ఏదీ ఉండదు.
- చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
- పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.
- ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.
- క్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది vక్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది
- చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
- నమ్మకం అన్నది మనకు వెలుగు నివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి.
- అయిన గాయాలను గుర్తుపెట్టుకోకుండా మరచిపోవడమే నిజమైనా గొప్పతనం.
- నమ్మక యోగ్యంగా ఉండడం అన్నదే గొప్ప సామర్ధ్యం అవుతుంది.
- గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.
- ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
- మొత్తం విషయాన్ని అపార్ధం చేసుకోవడం కన్నా కొంత విషయాన్ని అర్ధం చేసుకోవడం మంచిది.
- నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.
- నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
- భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
- దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
- గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.
- చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా.
- 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
- క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
- ఇతరులను గౌరవించడం ద్వారానే గౌరవింపబడే హక్కును పోందగలము.
- మీ గురించి గభీరంగా ఆలోచించడం మొదలు పెడితే మీరు గొప్ప అపాయానికి గురికాగలరు.
- తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తిచేయగలడు.కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.
- స్నేహితుడు లేని జీవితం సాక్షి లేని మరణం లాంటిది.
- హేతువుతో కూడిన ఉత్సాహం. నిజాయితీ అవుతుంది.
- నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.
- సంపదను కూడబెట్టడం తరచుగా అనారోగ్యానికి కారణం అవుతుంది.
- ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
- జీవితపు శీతల సంధ్యాకాలంలో స్నేహితులు అతి గొప్ప స్నేహపు వెచ్చదనాన్ని ఇస్తారు.
- ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.
- జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.
- తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
- చెడు అలవాట్లు అన్నవి మెత్తటి పరుపులాంటిది. పరుపు నెక్కడం సులభమే కానీ దాని నుండి కిందకు దిగడం కష్టం అయిన పని అవుతుంది.
- తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.
- బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
- మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.
- ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.
- పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.
- ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు.
- కరుణ మన జీవిత విధానం కావాలి. నిర్బంధం కాదు.
- సంపదను కలిగి ఉండడంలో ఏమాత్రం తప్పులేదు. సంపద మీపై పెత్తనం చలాయించినప్పుడే తప్పు ప్రవేశిస్తుంది.
- నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.
- గాలులు అలలు ఈ రెండూ ఉత్తముడైన నావికుడి పక్షాన్నే ఉంటాయి.
- ఇతరుల తప్పుల వైపు ఎక్కువగా దృష్టిన్ని సారించేవారికి సొంత తప్పులను పరీక్షించేందుకు తీరిక లభించదు
- మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
- మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.
- నాగరికత అన్నది ఒక ఉద్యమం.నిబంధన కాదు అది సముద్రయానమే కానీ ఓడరేవు కాదు.
- క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
- దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.
- మీ వ్యవహారాలలో మెదడును ఉపయోగించి ఇతరుల వ్యవహారాలలో మీ హృదయాన్ని వాడండి.
- కలసి ఎదగడం అన్నదానికంటే ఎదగడం అన్నది అంత మంఖ్యమైనది కాదు.
- బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
- పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
- కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
- సతత ప్రయత్నం నైపుణ్యాన్ని కూడా అధిగమిస్తుంది.
- తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.
- యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.
- తనను తాను తెలుసుకోవడమే ఈ ప్రపంచంలోని అతి కష్టమైన పని.
- సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.
- మీ లక్ష్యం నుండీ మీ దృష్టిని మరలించినప్పడు అడ్డంకులనే భయాలను మీరు చూస్తారు.
- తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
- పుస్తకాలు లేని పక్షంలో్ ఈ ప్రపంచం తప్పుకుండా నిర్మానుష్యం అయిన ఎడారి ప్రాంతం అవుతుంది.
- ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.
- నేను యుద్ధాన్ని కోల్పోవచ్చును. కానీ ఒక నిమిషాన్ని మాత్రం పోగొట్టుకోలేను.
- సంతృప్తి కలవాడే ధనవంతుడు.
- అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు.
- బాధపడటం అనేది సోమరి లక్షణం దాన్ని వదిలేయండి.
- ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.
- ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
- బావి లోతుకన్న మనసు లోతు మిన్న.
- తనకు తానుగా నచ్చచెప్పుకునే వ్యక్తే మంచి వక్త.
- మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.
- కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
- అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.
- గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
- ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ.
- అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
- మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
- రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.
- మీరు మీరుగా ఉండండి. పక్షపాత రహితంగా సీదాసాదాగానూ, నిజాయితీతోనూ ఉండండి.
- మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
- సుగుణం వెలకు అతీతమైనది.
- పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.
- మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.
- తలవంపులు తెచ్చుకోవడం కంటే కలవరపడడం మెరుగైనది.
- మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రంమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది.
- కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
- ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలూ లేవు. ఉన్నవన్నీ ఫలితాలే - ఆర్.జి. ఇంగర్‌సాల్.
- ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.
- చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
- పెండ్లికి ముందు కండ్లను పెద్దవి చేసుకుని ఉంచుకోవాలి. పెండ్లి తరువాత వాటిని సగం మూసుకోవాలి.
- ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
- ఒకరు మరొకరికి జీవితాన్ని. తక్కువ కష్టాలతో కూడిన దానిగా చేయడం కోసం కాకుండా మనం మరి దేనికోసం జీవించగలము?
- కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.
- ఆశలేని వాని కగచాట్లులేవు.
- అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు.
- తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.
- అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
- దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.
- మనకు తెలిసినది స్వల్పమని తెలుసుకునే వారెందరు?
- మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.
- ఉదారత గౌరవాన్ని ముందుకు చొచ్చుకుని వచ్చేలా చేస్తుంది.
- చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.
- కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.
- గొప్పవారు లేనిదే మనం ఏ గొప్పదాన్ని సాదించలేము. తాను గొప్పవారం కావాలని నిర్ణయించుకున్నప్పుడే మనుషులు గొప్పవారౌతారు.
- సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.
- ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.
- మతం అన్నది చదవడంలో కాదు చేయడంలోఉంది.
- మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
- అతి జాగ్రత్తగా ఉన్న వ్యక్తి జీవితంలో కొద్దిగానే సాధిస్తాడు.
- వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.
- జీవించడం అన్నది ముఖ్యంకాదు. ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నదే ముఖ్యం.
- పైసాకు కొరగాని పనులతో సతమతమవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం.
- ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.
- చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.
- చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా.
- మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.
- దొంగను పట్టుకునేందుకు ఒక దొంగను నియమించండి.
- ఈ ప్రపంచలో సేవ ఉత్తమమైన ప్రార్ధన. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడమే ఉత్తమమైన ఆరాధన.
- ఆత్మవిశ్వాసం అన్నది దాని కలిగి ఉన్న వ్యక్తికి అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
- ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
- దూర ప్రాంతమం పాత స్నేహితుడిని కలవడం అన్నది సుధీర్గమమైన కరువు తరువాత వచ్చే వానంత ఆనందాన్ని ఇస్తుంది.
- మీపట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు.
- ప్రతి పరాజయం విజయాన్ని మరి కాస్త సన్నిహితం చేస్తుంది.
- మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
- నిజం కోసం మనం అన్నింటిని త్యజించవచ్చును. కానీ దేనికైనా సరే నిజాన్ని మాత్రం త్యజించకూడదు.
- ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.
- అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి