- ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.
- మనం ఇతరులకు యిచ్చే సంతోషమే మనం నిజంగా అనుభవించే ఏకైక సంతోషం.
- మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
- తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
- అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
- అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
- ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
- ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
- వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
- చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణశీలాలు.
- విరగడం కంటే వంగడం మంచిది.
- పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ
- ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం.
- అపాయంను చూసి భయపడేవారికి ఈ ప్రపంచంలో అపాయం భయం ఎప్పుడూ ఉంటుంది.
- ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
- తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది.
- విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.
- నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.
- సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.
- ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.
- మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.
- మనలో తప్పులు లేకుండా ఉంటే ఇతరులలో తప్పులను చూసినప్పుడు మనకు ఆనందం కలుగదు
- సంతృప్తి కలవాడే ధనవంతుడు.
- తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.
- ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
- మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
- కలసి ఎదగడం అన్నదానికంటే ఎదగడం అన్నది అంత మంఖ్యమైనది కాదు.
- మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
- ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.
- ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
- మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.
- ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.
- దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
- స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.
- చెడిపోయిన పాలను గురించి చింతించకు.
- శుభ్రత దైవత్వానికి తరువాతది.
- భయం నుండీ ద్వేషానికి దారి తీసే రోడ్డు అతి చేరువలో ఉంటుంది.
- తెలివి తేటలన్నవి వివేకం అనిపించుకోవు.
- ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
- నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.
- విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.
- అప్పుడప్పుడు అవకాశం అన్నది మారువేషంలో వస్తుంది. ఇదే దానితో వచ్చిన పెద్ద చిక్కు.
- పరిచయం అవమానాన్ని పొందితే అపురూపత ప్రశంసలను గెలుచుకుంటుంది.
- ఇద్దరు పోట్లాడుకుంటే ఆ యిద్దరు ఎల్లప్పుడూ తప్పుగా ఉంటారు.
- ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
- పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.
- మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు.
- మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రంమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది.
- వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.
- తమ సొంతం అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.
- మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి.
- దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు.
- మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
- బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.
- మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.
- సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.
- మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
- గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
- సాంకేతిక నిపుణత్వాన్ని మాత్రమే కాదు. ఆత్మ గొప్పతనాన్ని కూడా సాధించాలి.
- ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
- చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
- ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
- విజయవంతమైన జట్టుకు చేతులనేకం, కానీ మనసుమాత్రం ఒకటే
- సూర్య కిరణాల లాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది.
- చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
- సుగుణమే నిజమైన గొప్పదనం.
- దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
- ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.
- పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.
- మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు
- విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.
- మీ సంతోషం కోసం ఆహారం తీసుకోండి. కానీ ఇతరుల సంతోషం కోసం దుస్తులు ధరించండి.
- నవ్వుతూ ఓడిపోయే వాడే గెలుపును సాధించే వ్యక్తి.
- చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది
- మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
- పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
- నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
- పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
- మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.
- అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
- గెలుపు అన్నది ప్రయాణం, లక్ష్యం కాదు.
- సున్నితంగా, సరదాగా మాట్లాడగలిగిన వారినే అందరూ ఇష్టపడతారు.
- చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
- చదువు చేత నిర్దేశింపబడి ప్రేమ ద్వారా ప్రోత్సహింపబడేదే మంచి జీవితం.
- ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.
- దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.
- చాలా తక్కువగా ఉన్నవాడు పేదవాడు. కానీ ఎక్కువకోసం ప్రాకులాడేవాడు అతి పేదవాడు.
- చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
- కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.
- విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.
- ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు.
- జాలి లేనివారే నిజమైన అంటరానివారు.
- విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.
- పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.
- మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
- ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.
- గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
- అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
- వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.
- ఇతరుల అనుభవాల ద్వారా మనలో కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు.
- నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
- వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.
- అంతరాత్మను జయించిన వ్యక్తి అన్ని రకాల అవరోధాలను అవలీలగా జయించగలుగుతాడు.
- నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
- మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.
- దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.
- కొంచెం తెలిసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా తెలుసుకోగలం. తెలుసుకోవడం మొదలుపెట్టిన మన సందేహాలు పెరుగుతాయి.
- జింకలను నడిపించే సింహం జింక నడిపించే సింహాలకంటే ఎక్కువ బలవత్తరమై ఉంటుంది.
- ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.
- ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటారు. కానీ తనను తాను మార్చుకోవాలని ఆలోచించరు.
- ధనాన్ని పొందడం వల్ల కాదు ఇవ్వడంతో మీరు మరింత ధనవంతులవుతారు.
- నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
- మీ హృదయంలో తొంగి చూసుకోండి. లోపల ఒక స్నేహితుడు ఉన్నాడు.
- హృదయం ఈ రోజు తెలుసుకున్న దాన్ని మెదడు రేపు అర్ధం చేసుకుంటుంది.
- ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
- అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
- కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.
- మబ్బునవ్వితే చిరుజల్లు, ఏడుస్తే వడగళ్లు.
- దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
- భగవంతుడి విషయం భక్తుడికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి.
- ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.
- తన కోసం ఎలాంటి కోరిక లేనివాడు అందరిచేత గౌరవాన్ని పొందుతాడు.
- విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.
- మీపట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు.
- హృదయం ఈ రోజు తెలుసుకున్న దాన్ని మెదడు రేపు అర్ధం చేసుకుంటుంది.
- ఒక పౌండు ధైర్యం ఒక టన్ను అదృష్టంతో సమానం.
- సలహా ఆముదం లాంటిది. ఇవ్వడం సులభం తీసుకోవడమే కష్టం.
- ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
- జ్ఞాపకశక్తి మంచిది, కానీ తగిలిన గాయాన్ని మరచిపోవడం అన్నది మరింత గొప్పది.
- కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
- చెప్పకోదగ్గ విజయానికి మంచి గుణం పునాది అవుతుంది.
- చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
- వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
- ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది.
- జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
- నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
- వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
- ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.
- ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.
- శాంతగుణంతో కోపాన్నీ, చెడును మంచితో, పిసినిగొట్టుతనాన్ని ఉదార గుణంతో, అతి వాగుడుతనాన్ని నిజంతో అధిగమించండి.
- ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు.
- వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.
- ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
- వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.
- ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు.
- ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు.
- జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.
- చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.
- ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
- రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.
- 'అంతా తనదే' అన్నది మమకారము.'అంతా తనే' అన్నది అహంకారము.
- అన్నింటికీ మించిన నేరం అన్యాయంతోనూ, అక్రమాలతోనూ రాజీ పడటమే.
- ఏ విషయాన్నైనా స్పష్టంగా చూడగలిగిన వ్యక్తే నిజమైన మేధావి.
- ఓటమి లేనివాడికి అనుభవం రాదు. అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
- ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి.
- గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
- గెలిచినపుడు గెలుపును స్వీకరించు,ఓడినపుడు పాఠాన్ని స్వీకరించు.
- గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
- తపన, పట్టుదల ఉన్న వారి దగ్గరికే విజయం వస్తుంది.
- నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట.
- బలీయమైన ప్రతిపక్షం లేనిదే ప్రభుత్వం ఎంతోకాలం సుస్థిరంగా వుండజాలదు.
- మన కష్ట సుఖాలకు తరచూ కారణమయ్యేది మన మాట తీరే.
- ''విజ్ఞానం అంటే తనకు అంతా తెలుసునన్న అహంకారం. వివేకం అంటే తనకు ఏమీ తెలియదన్న వినమ్రత''
- ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడటం ఓ తపస్సు.
- విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్ర దండమో కాదు. చక్కని ప్రణాళిక , కటిన శ్రమ , అంకిత భావం.
- శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసేవారుండచ్చు. కాని శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వారిని పడదోయడం ఎవరి తరమూ కాదు.
- మీ కష్టాలను ఇతరులతో ఏకరువు పెట్టుకోకండి. చాలామంది వాటిని పట్టించుకోరు. మిగతావారు మీ కష్టాలను విని సంతోషిస్తారు.
- నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
- మీరు శిఖరాన్ని చేరాలనుకుంటే మీ ప్రయాణాన్ని కింద నుండీ ప్రారంభించండి.
- వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.
- దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
- ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
- దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
- పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.
- మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.
- ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి.
- ఈ రోజు మనం గతం శిఖరాలపై నిలుచుంటాము. కానీ ఇవి రేపటి పర్వత పద ప్రాంతాలవుతాయి.
- మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.
- పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి