- సరైన పనిని చూసి ఆ పనిని చేయకపోవడం అన్నది ధైర్యం లేమివల్లే జరుగుతుంది.
- గొప్పవాడిగా ఉన్నందువల్ల నింద అన్నది ప్రజలకు కట్టే పన్ను అవుతుంది.
- అజ్ఞానం అన్నది మనస్సు యొక్క చీకటి.
- నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
- పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
- సత్ర్పవర్తన లేని అందం అంత్యప్రాసలేని కవిత లాంటిది.
- ఓర్పుకు మించిన తపస్సు లేదు.
- మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
- మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
- సంపదను కూడబెట్టడం తరచుగా అనారోగ్యానికి కారణం అవుతుంది.
- సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు.
- మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
- ఒక పౌండు ధైర్యం ఒక టన్ను అదృష్టంతో సమానం.
- కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది. కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది.
- మనం మరణించడం లేదన్నంత ధీమాగా బ్రతికినప్పుడే మనం జీవితంలో గొప్పగా సాధించగలము.
- గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజలచేత గుర్తుచేసుకోబడడం మెరుగైనది.
- ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
- లోతులేని మనుషులు అదృష్టంను విశ్వసిస్తారు. బలమైన మనుషులు కారణ కార్యములలో విశ్వాసాన్ని కలిగి ఉంటారు.
- ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
- తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
- మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.
- పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
- బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
- వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
- మీ చేతి గడియారాన్ని మీ మణికట్టు నుండీ తీసుకుని మీకు సరైన సమయాన్ని చెప్పగల వ్యక్తినే సలహాదారుడు అంటారు.
- న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
- తాను చేయగలిగింది మనిషి చేస్తే తాను అనుకున్నది దేవుడు చేస్తాడు.
- దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
- సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
- చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
- వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.
- అదృష్టం మూర్ఖుడి వద్దకు రానైతే వస్తుంది. కానీ అతడితో తిష్టవేసుకుని కూచోదు.
- విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.
- గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.
- ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
- మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది.
- ఇతరులకు సహాయం చేసే మీరు మీకే సహాయం చేసుకుంటారు.
- కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
- ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.
- ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.
- ఇతరులను గౌరవించడం ద్వారానే గౌరవింపబడే హక్కును పోందగలము.
- నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
- పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
- క్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది vక్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది
- ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
- పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.
- తన కోరుకలనూ, వాంఛలనూ జయించిన వ్యక్తి తన అతి పెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు.
- పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది.
- అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
- నివసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పూర్తిగా అందించబడే చోటే గృహం అవుతుంది.
- ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.
- తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
- ఒంటరిగా ఉండగల సామర్ధాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి.
- విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.
- గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
- శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.
- మనం ఉన్న తీరు మన ఆలోచనల ఫలితమే.
- పుస్తకాలు లేని పక్షంలో్ ఈ ప్రపంచం తప్పుకుండా నిర్మానుష్యం అయిన ఎడారి ప్రాంతం అవుతుంది.
- పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే, మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.
- ప్రతి ఒక్కరికి చెవి వొగ్గండి. కొంతమందికి మాత్రమే మాటివ్వండి.
- జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
- సంతృప్తి కలవాడే ధనవంతుడు.
- నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
- సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది.
- కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు.
- జీవిత పర్యంతం ప్రేమను అనుభవించేందుకు మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి.
- అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు.
- చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.
- చెప్పకోదగ్గ విజయానికి మంచి గుణం పునాది అవుతుంది.
- లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు, మనిషి తన వ్రేళ్ళను లెక్కిస్తాడు.
- బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.
- ఎల్లప్పుడు కాంతివంతమైన పక్షాన్ని చూస్తూ మీ ఆశీస్సులను లెక్కపెడుతూ ఉండండి.
- గర్వం సమృద్దికి అవరోధం.
- మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
- ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.
- విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.
- వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.
- చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
- గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
- అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
- అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
- ప్రేమతో సంరక్షణా భావంతో కూడిన మాటలు కలకాలం నిలిచిపోయే సార్ధకతను పొందుతాయి.
- చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
- ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.
- పేదరికం నేరాలకు తల్లి.
- మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
- బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.
- ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
- త్వరగా పడుకోవడం త్వరగాలేవడం అన్న అలవాటు మనిషికి ఆరోగ్యాన్ని, సంపదనూ, వివేకాన్ని ప్రసాదిస్తుంది.
- జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
- జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.
- త్వరగా పడుకోవడం త్వరగాలేవడం అన్న అలవాటు మనిషికి ఆరోగ్యాన్ని, సంపదనూ, వివేకాన్ని ప్రసాదిస్తుంది.
- శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.
- గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.
- ఆలోచనల,మాటల,చేతల ద్వారా సంస్కృతి అభివ్యక్తీకరించబడుతుంది.
- ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
- మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
- గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజలచేత గుర్తుచేసుకోబడడం మెరుగైనది.
- యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.
- ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
- పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
- మనల్ని ద్వేషంగలవారిగా చేయడానికి కావలసినంత మతం మన వద్ద ఉందే కాని పరస్పరం ప్రేమించుకునేలా చేసేంత మతం లేదు.
- మంచి పనే మంచి ప్రార్ధన.
- చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.
- ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
- ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
- ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.
- విమర్శలు కంటే కూడా పిల్లలకు ఆదర్శవంతుల అవసరం ఎక్కువగా ఉంటుంది.
- ఇతరులను గురించి ఎక్కువగా ఫిర్యాదు చేసేవారు ఫిర్యాదు చేయబడే వారౌతారు.
- గెలుపుకు అనేకమంది తండ్రులుంటారు. కానీ ఓటమికి ఏ ఒక్కరూ ఉండరు.
- తాను కోరుకున్న దానిని పొందడం అన్నది కేవలం సంతృప్తి మాత్రమే. ఇతరులు కోరేదాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉంది.
- పనిచేసే చేతులు ప్రార్ధన చేసే చేతులకంటే ఎంతో అమూల్యమైనవి.
- అందర్ని తృప్తి పరచాలని అనుకుంటే మీరు ఎవర్నీ తృప్తిపరచలేదు.
- త్వరగా పడుకుని త్వరగా లేవడం వల్ల మనిషి ఆరోగ్యవంతుడిగా,భాగ్యవంతుడిగా,వివేక సంపన్నుడిగా తయారవుతాడు.
- కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
- ఊరటను కలిగించే సానుభూతితో కూడిన మాటలు బాధ, దుఃఖాల గాయాన్ని తగిస్తాయి.
- వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.
- ప్రేమ సూర్యుడి లేత కిరణాలలాగా రోజంతా వెచ్చదనాన్ని అందజేస్తుంది.
- అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
- బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
- మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.
- ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
- అనుభవం అన్నది తల వెంట్రుకలు రాలిపోయిన తరువాత జీవితం మీకిచ్చే దువ్వెన.
- ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
- రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.
- నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
- వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
- జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.
- మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
- తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.
- ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
- కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే.
- ప్రతి మనిషిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.
- వ్యసనం, కోపం, పేరాశ- ఈమూడు దయ్యాలను తరిమి కొట్టండి.
- మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి
- ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.
- కఠిన పరిశ్రమకు ప్రత్యామ్నాయం అన్నది లేదు.
- ధైర్యంగా ఉంటూ నిజం వివేకంల మార్గాన్ని అనుసరించండి. అప్పుడు ధర్మదేవత మిమ్మల్ని సంరక్షిస్తుంది.
- మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.
- సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
- ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
- దూరం సోందర్యంనూ, దృశ్యాన్నీ మరింత సుందరం చేస్తుంది.
- ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.
- నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.
- ప్రపంచానికి మీ అవసం ఉండేలా చూసుకోండి. అప్పుడు ప్రపంచం మీకు ఆహారాన్ని ఇస్తుంది.
- ఆశతో కూడా నిరాశ వస్తుంది
- మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.
- పని మనల్ని విసుగుదల, చెడ్దతనం, అవసరాలనే మూడు దుష్టశక్తుల నుండీ కాపాడుతుంది.
- సాహసం అన్నది శారీరిస గుణం కాదు. ఆత్మగుణం.
- పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.
- ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
- మూర్ఖుడి హృదయం నోటిలో ఉంటుంది. కానీ వివేకవంతుడి హృదయంలో నోరు ఉంటుంది.
- గొప్ప హృదయం లేనప్పుడు సంపద. వికారమైన బిక్షగాడు అవుతుంది.
- ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
- బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.
- పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.
- అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
- పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
- సృష్టిలో ఎన్నో అందమైన వస్తువులు ఉన్నాయి. కాని అవన్నీ శిశువంత తియ్యనివి కావు.
- సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు
- మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
- మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు.
- ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.
- అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
- కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
- గొప్పవాడిగా ఉన్నందువల్ల నింద అన్నది ప్రజలకు కట్టే పన్ను అవుతుంది.
- తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
- పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
- అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.
- తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.
- మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
- పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.
- హంస అసమర్ధుడి ఆఖరి ఆశ్రయం.
- ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు
- చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
- లోటు అనే పాఠశాలలో నిజం రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది.
- సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
- పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.
- ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.
- నేను యుద్ధాన్ని కోల్పోవచ్చును. కానీ ఒక నిమిషాన్ని మాత్రం పోగొట్టుకోలేను.
- వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.
- ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.
- బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము.
- నివసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పూర్తిగా అందించబడే చోటే గృహం అవుతుంది.
- త్వరగా పడుకుని త్వరగా లేవడం వల్ల మనిషి ఆరోగ్యవంతుడిగా,భాగ్యవంతుడిగా,వివేక సంపన్నుడిగా తయారవుతాడు.
- చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
- అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు.
- నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.
- సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.
- క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
- శ్రద్దగా వినండి కానీ మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి.
- చెడును చేసేందుకు మంచి మార్గం అంటూ ఉండదు.
- అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
- భావామే అటు స్వాతంత్ర్యానికీ ఇటు ఎదుగుదలకు పని కొచ్చే తాళం చెవి.
- న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
- క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతంది.
- పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.
- ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
- ప్రతి మందలోనూ, ఒక మోసగాడు ఉంటాడు.
- కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
- ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
- మనం నిజంగా ఏమో అదే మన గుణం. మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో అదే మన నడత.
- తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.
- అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
- మిమ్మల్ని ఎవరూ గమనించనప్పడు ఎల వ్యవహరిస్తారో అదే మీరు.
- వివేకవంతుడు మనసును శాసిసే మూర్ఖుడు దానికి బానిస అవుతాడు.
- అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం
- చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా.
- అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
- మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
- ప్రేమ మరియు నిపుణత్వాల కలయిక కళాఖండానికి జన్మనిస్తుంది.
- వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.
- ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.
- సులభంగా తయారయే ముందు అన్ని విషయాలు కష్టంగా ఉంటాయి.
- చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
- పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది.
- నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
- పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.
- ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి.
- నిదురపోయే వ్యక్తిని మీరు మేల్కొలుపవచ్చును. కానీ నిదురపోయేట్లు నటించే వ్యక్తిని మేల్కొలుపలేరు.
- గెలుపు అన్నది ప్రయాణం, లక్ష్యం కాదు.
- మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి.
- పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
- నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
- సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
- కళ సుదీర్ఘం, జీవితం అల్పం.
- ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
- లోభికి నాలుగు దిక్కులా నష్టం.
- పెద్ద విషయాలకు సంబధించి ప్రణాళికను తయారు చేసుకోవడం
- మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకవస్తుంది.
- తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.
- సహనం తియ్యటి ఫలాన్నిచ్చే చేదు మొక్క.
- మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
- సంఘటన జరిగిన తరువాత తెలివిగా ప్రవర్తించడం తేలిక.
- ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాది పైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.
- సాహసవంతుడి వరకూ అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు.
- సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.
- గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
- కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
- పరిస్ధితులు బలహీనులను ఏలుతాయి. కానీ అవే వివేకవంతుల పాలిటి పరికరాలవుతాయి.
- మనలో చాలామంది ఇతరులకంటే కూడా గొప్పగా చేయగలిగిన వారై ఉంటారు. అది తమ చేతివ్రాతను తామే చదవగలిగినవారై ఉంటారు.
- మీరు సరి అయినప్పుడు మీరు ఒప్పుకోని విషయాలకు సంబంధించిన చర్చను మానేయండి.
- మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.
- గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
- ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.
- తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
- ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.
- సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.
- దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి.
- ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.
- ఆత్మ నియంత్రణకు మించిన సంపద ఈ ప్రపంచంలో మరేదీ లేదు.
- ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.
- సందర్బోచితమైన మౌనం మాటలు కంటే ఎక్కువ వాగ్ధాటిని గలిగి ఉంటుంది.
- పుస్తకం నుండి మనం గ్రహించగల వాటిపైన పుస్తకం విలువ ఆధారపడి ఉంటుంది.
- పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
- మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
- మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.
- ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.
- లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు, మనిషి తన వ్రేళ్ళను లెక్కిస్తాడు.
- సత్ర్పవర్తనకు విలువలేని చోట పుట్టుక ఎందుకూ పనికిరానిదవుతుంది.
- కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది. కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది.
- శుభ్రత దైవత్వానికి తరువాతది.
- మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.
- మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.
- తప్పు చేయడం తప్పుకాదు. దానిని మళ్ళీ చేయడమే తప్పు.
- ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి.
- అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.
- నిజమైన అందం పవిత్రమైన హృదయమై ఉంటుంది.
- వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.
- అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి