29, నవంబర్ 2012, గురువారం

వ్యధ


దిగులు  మొగలి పొదలా  గుచ్చుకుంటూ ఉంటుంది.
సమయాన్ని  చావగొట్టి  చెవులు మూస్తుంది.
చైతన్యాన్ని చెంత చేరనీయక  తరిమేస్తుంది.
అంతరంగాన్ని అంధురాలిని చేస్తుంది.
వివేకానికి  వినికిడి  లేకుండా  చేస్తుంది.
వర్తమానానికి  అందత్వవం, భవిషత్తుకు  వ్యంధత్వం  ఇస్తుంది.
ఆచరణని  పాతరవేసి ,వేదాంతాన్ని  వేదికనెక్కిస్తుంది.
ఆకలికి  చరమగీతం పాడి, వేదనతో యుగళగీతం పాడుతుంది.
సమూహంలో  కలసిపోయామా..చంకనెక్కి కూర్చుంటుంది.
పోనీలే  గుండెమూల  పడిఉంటుంది  అనుకోన్నామా...
అరబ్బీషేకు గుర్రంలా...డేరాలో  మకాం  వేస్తుంది.
సరే  వెంటరానీ అనుకున్నామా.. దింపుడు  కల్లాం  వరకూ  దిగబెడుతుంది.

కామెంట్‌లు లేవు: