ఓ నేస్తం...
భారమైన నా హృదయానికి ఓదార్పు నీ స్నేహం
అశాంతితో నిండిన నా మనసుకు ఆదరింపు నీ స్నేహం
ఆవేదనతో రగులుతున్నప్పుడు ఓ చల్లని పలకరింత నీ స్నేహం
ప్రవాహంలా జాలువారే నా కన్నీటికి ఓ అడ్డుకట్ట నీ స్నేహం
అలసిన నా కన్నులలో కమ్మని కల నీ స్నేహం
అస్తమిస్తున్న నా జీవితానికి వెలుగునుచూపిన సూర్య కిరణం నీవు
అందుకే ఓ నేస్తం నీ చిరునవ్వే నా గమ్యం
నా పెదవులపై ఈ దరహాసం విరిసిందీ నీ కోసమే..
కానీ నా నవ్వుకూ నీ నవ్వుకూ చిన్న తేడా ఉంది నేస్తం
నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతావు
నేను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాను
కమ్మని కలల్లా క్షణకాలమే మిగిలే ఈ జీవితంలో నాకు మిగిలిన ఒకే ఒక గుర్తువునీవు....
నన్ను మరు(విడు)వకు నా నేస్తం ఎన్నటికీ....
మిగిలిపోతా నీ స్నేహం అనే సముద్రంలో ఒక బిందువులా..............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి