29, సెప్టెంబర్ 2012, శనివారం

నీ నుండి దూరం అయ్యిపోతునప్పుడు


కన్నుల నుంచి కలలను దూరం చేసే వరమే కోరావె
నీ ఊహల నుంచి నా ఊపిరినే దూరం చెయ్య మంటున్నావె
నీ నీడలా సాగే నా పయనం ఇంక ఆపేయ మంటున్నావె
నీ ఊహలతో నిండిన నా కలల తోడు లేని క్షణం
నేను లేను అని ఎలా తెలుపమంటావె


కలలా నన్ను తడిమినా,
కలవరమై నన్నే కాల్చినా
కవితల్లే నిన్ను మలచనా,
నా మదిలోనే నిన్ను దాచుకోనా  



నీ తలపులే కవితలై
నా మదిని తడిమిన క్షణం
చిరుగాలినై నిన్ను చేరాలని
నా ఇష్టాన్ని నీ ముందు ఉంచాలని
ఆ క్షణం నీ కళ్ళల్లో కదిలే భావాలను
చదవాలని నా మది ఆరాటపడుతోంది నేస్తం



నీ చిరునవ్వుల వెన్నెల కోసం
నేనో సాగరం లా వేచి చూస్తున్నా
నా కలల కౌగిలిలో నిన్ను దాచేందుకు
నేనో అలనై నిన్ను చేరుతున్నా
సిరివెన్నెలలు కురిపించు నెస్తం
నీకూ నేను అంటే ఇష్టమే అని తెలిపి



నా చిరునవ్వు నీ పెదవుల్లో చూస్తున్నా
నా కలలను నీ కళ్ళలో చూస్తున్నా
నా ప్రతి అడుగు వెంటా నీ నీడ చూస్తున్నా
నా మనసు జాడ కోసం నీ మనసులో వెతుకుతున్నా



నేస్తం నా చెంత నువ్వు లేని క్షణం
నాకోసం నేనే వెతుకుతున్నా
నీ జ్ణాపకాల ఒడిలో కరిగిపోతున్న
ఈ కాలాన్ని ఆపలేకపోతున్నా




గుండె రాయిలా మరిపోయిందేమొ అనిపిస్తోందే
నిన్ను అది మరచిపోమన్నప్పుడు
మనసే నాకు లేదేమొ అనిపిస్తోందే
నిన్ను చూడకుండ ఉండమన్నప్పుడు
నేనే నేనుగా ఇక లేనా అనిపిస్తోందే
నీ నుండి దూరం అయ్యిపోతునప్పుడు

కామెంట్‌లు లేవు: