18, డిసెంబర్ 2013, బుధవారం

నీ పాదముల క్రింద మెత్తని పచ్చికనౌవ్వాలని ఉంది

ప్రియా నీ పాదముల క్రింద మెత్తని పచ్చికనౌవ్వాలని ఉంది

నీ పెదవులపై తీయని మాటలతో మచ్చిక చేయాలని ఉంది

మృదుమధుర గీతమై నీ హృదయ తంత్రులను మీటాలని ఉంది

రవివర్మ చిత్రమై నీ కన్నుల రంగులద్దాలని ఉంది

ప్రకృతి సోయగాన్నై వన్నె చిన్నెలతో నీకు స్వాగతం చెప్పాలని ఉంది

భువి నుండి దివికి " వెన్నెల వెలుగువై" రావా.. 

దివికి దిగి ప్రియలాస్యంతో జగాన్ని రంజింపవా...

కామెంట్‌లు లేవు: