30, సెప్టెంబర్ 2013, సోమవారం

subodayam

ఉదయకాంతి వెల్లి విరియగా
మంచు తెరలు కరిగి వెళ్ళగా
పక్షులన్నీ పరవశించగా
పూలు విచ్చి పరిమళించగా
పల్లె పసిపాప బోసినవ్వులా పులకరించగా
మనసులోతు భావాలకు భాష్యమివ్వగా
అది చూసి నామనసు మైమరుపులో ములిగి తేలగా

మనవి చిత్తగించి ఇలానే ఉండిపోవాలని ఈవేళ .........

చిరుగాలి పరవళ్ళు చేసింది ఈవేళ
చిలకమ్మ ముద్దుగా ఎగిరింది ఈవేళ
కోకిలమ్మ గొంతెత్తి పాడింది ఈవేళ
మేఘమేమో చిరు చినుకుల్ని కురిపించింది ఈవేళ
అందమైన ఇంద్రధనస్సు విరిసింది ఈవేళ
అటూ ఇటూ తిరుగుతూ అల్లరి అల్లరి చేస్తూ
పిల్లలు తిరిగేది ఈవేళ
ఇలాంటి ప్రకృతి తోడై ఉంటే చాలు కదా! అని
అనిపించింది ఈవేళ
వయస్సు వెన్నక్కి వెళ్ళింది ఈవేళ
బాల్యం గురుతుకు వచ్చింది ఈవేళ
నన్ను ఉరకలు వేయరమ్మంది ఈవేళ
ఈవేళ
మనసు కోరుకుంటుంది ప్రకృతిని ,
మనవి చిత్తగించి ఇలానే ఉండిపోవాలని
ఈవేళ .........

ఓ నిరాశా..... ఈ రాత్రి మాత్రమే నీది రేపటి ఉదయం...నాది.......

ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో
మనసు మెదడు తో యుద్దం చేస్తుంది
ఫలితమే ఈ నిదురలేని రాత్రి
అయితేనేమిలే...
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను
అందుకే ఇప్పుడు
నా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నాను
ఓ నిరాశా.....
ఈ రాత్రి మాత్రమే నీది
రేపటి ఉదయం...నాది.......

ఆ నిమిషం నిన్ను వర్ణించే కవిత రాసి మెప్పించాలంటే



వసంత ఋతువులో, వేప పూతలో

మామిడి కొమ్మల నడుమ

చిగురులు తింటూ దాగున్న కోయలమ్మ

మధుర గానం చేస్తుంటే

చిలకలు కిలకిలా రావాలతో అనువాదం చేస్తుంటే

తుమ్మెద ఝుంకారంలో వినబడే రాగం లో

జలపాతాల హోరులో వచ్చే శబ్దం తోడౌతుంటే

చిరుగాలికి ఆకులు చేసే సందడి లో

తొలి ఉదయ కాతులలో

నువ్వు అలా అలా మువ్వల సవ్వడితో నడిచి వస్తుంటే

ఆ నిమిషం నిన్ను వర్ణించే కవిత రాసి మెప్పించాలంటే

అక్షరాలు అమరడం లేదు

పదాల పొందిక కుదరడం లేదు .......

16, సెప్టెంబర్ 2013, సోమవారం

నీ నవ్వు

నీ నవ్వు

మిల మిల మెరిసే ముత్యమే నీ నవ్వు
చిలికిన మజ్జిగలా తేలికైనా నీ నవ్వు
విరబూసిన మల్లియలా తెల్లనైనదీ నీ నవ్వు
సూర్యుడి కిరణంలా తళతళాడేదీ నీ నవ్వు
స్వాతి చినుకులా స్వచ్చమైనదీ నీ నవ్వు
ముద్దబంతిలా ముద్దుగా ఉండేది నీ నవ్వు
నిన్ను మదిన తలిచిన క్షణమే తారసపడుతుంది నీ నవ్వు
నయనం మూస్తే చీకట్లను దోసుకుని దర్శనమంస్తుంది నీ నవ్వు
అద్దంలో చూస్తుంటే నాకు బదులు అగుపిస్తుంది నీ నవ్వు
క్షణాలు గడిచినా నా మదిన గూడు కట్టుకుంది నీ నవ్వు
జన్మ ఉన్నంత వరుకూ జ్ఞాపకంగా ఉంటుంది నీ నవ్వు...

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కదిలే మేఘం అదే సింధూరం ..!

స్త్రీకి దేవుడు
ప్రసాదించిన అరుదైన వరం
అద్భుత దృశ్యం
అమోఘం ..ఆనంద తాండవం
కదిలే మేఘం అదే సింధూరం ..!

ఆకాశంలో నిత్యం
వెలిగే చందమామలాగా
పండు వెన్నెల్లో
పరవశించి పోయే పూవులా
గుండెను గుభాలింప చేసే పరిమళంలా
ఒక్కసారి చూస్తే చాలు
హృదయాన్ని గుప్పిట బిగించే జ్ఞాపకంలా
సింధూరం వెంటాడుతూనే ఉంటుంది ..!

ఆ సౌభాగ్యం
మహిళకు దక్కిన గౌరవం
ఎల్లవేళలా ఆమెను అంటి పెట్టుకుని వుండే
ఆ సిందూరాన్ని చూస్తూనే
ఉండి పోవాలని అనిపిస్తుంది
తుపాను వెలిశాక
రాలిన నీటి చుక్కల్లా
అందమైన మోముపై వెలిగే దీపపు చెమ్మ
సింధూరం ..!

పాపిన నుదుటన
అల్లుకున్న అనుబంధం బొట్టు
మనిషికి మనసుకీ మధ్యన
చెరిగిపోని సంతకం సింధూరం
ఒకరికొకరు ఊహల్లో విహరిస్తున్నప్పుడు
ఏకాంతంలో అల్లుకుపోయినప్పుడు
ముద్దు కోసం వాలి పోయినప్పుడు
కళ్ళు వాకిల్లవుతాయి
బొట్టు తాకినప్పుడు
గుండె జారి గల్లంతవుతుంది
ప్రేమతనం ..చిలిపితనమై హత్తుకుంటుంది ..!!

మాట్లాడుకోవటానికి

మాట్లాడుకోవటానికి
మాటలు బాగుంటాయి
మనసుల మధ్య
బంధాలను ..ప్రేమానురాగాలను
కొత్తదనపు కోరికలను
కలిగించే సాధనాలుగా
ఉపయోగపడుతాయి ..!

మౌనంగా ఉండటం కంటే
మాట్లాడుకోవటం గొప్పగా ఉంటుంది
పాలల్లో నీలల్లగా
పచ్చని పైరుల్లో
పరుగులు తీసే లేగ దూడల్లా
మాటలు విడిపోయిన
హృదయాలను కలిపేస్తాయి ..!

ఏకాంతంలో
ఒకరికొకరం
ఏకమై పోయే తరుణంలో
మాతలాడుకోవటం ఉండదు
అప్పుడు మౌనమే
బావుంటుందని అనిపిస్తుంది ..!

ఒకే జ్ఞాపకమై
కలల సంచారం చేస్తున్నప్పుడు
మాటలకంటే మౌనమే
మేలని అనిపిస్తుంది
కళ్ళు కలువల్లా
విచ్చుకున్నప్పుడు
ప్రియురాలి కనుపాపలు
కదలాడుతున్నప్పుడు
కనురెప్పలు మినుగురుల్లా
మిణుకు మిణుకు
మంటున్నప్పుడు
ప్రేమ మళ్ళీ పురుడు
పోసుకుంటుంది
అది ఆ రెడ్ను దేహాలను
అల్లుకునేలా చేస్తుంది ..!

ఓ వెచ్చని కలవరింత
ఓ నులివెచ్చని పులకింత
ఈ బతుక్కి చాలనుకుంటా ..!!

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

నా మనసుకేమయింది ఈవేళ,

నా మనసుకేమయింది ఈవేళ,

స్వర్గం నా కళ్ళముందున్నట్టుంది,

కనురేప్పలమాటున స్వప్నంలో ఎన్నేన్నో ఆశలు దాగినట్టుంది,

నాఉహల ప్రపంచం ఎంతో అందగా మలిచినట్టుంది,

నన్నేవరో మురిపించి మైమరిపించినట్టుంది,

మోహనాంగి అని, సొగసుల సౌందర్యని స్పర్షించినట్టుంది,

తుంటరి వయసులో కంగారుతనాన్ని మెచ్చుకున్నట్టుంది,

నామనసుతో ఇంకోమనసుతో జతచేసినట్టుంది,

ఏడు రంగులతో వెలిసిన అందమైన హరివిల్లు నేనే అన్నట్టుంది,

సాగరానికి చేరువైన నధిలా ప్రవహించినట్టుంది,

కన్నేపిల్ల మనసు దోచినట్టుంది..

నా హృదయస్పందన ఇంకేలా ఉంటుందోమరి,

ఇదంతా ఏమి మహాత్యం, ఏమి అద్బుతం..