19, ఏప్రిల్ 2011, మంగళవారం

ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను

ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను
ఆకాలమే . . . అయినా
ఇవ్వాళ భోరున వాన కురిస్తే బావుణ్ను
మనసు నిండా అలుముకున్న ముసురు
కరిగి కన్నీటి వానగా మారి పోతే బావుణ్ను
ప్రతీ గుండెలో దిగులు గూడు కట్టుకున్నా
ఇంత నిర్లిప్తత ఎందుకో ?
ఏ కన్నూ చెమరించడం లేదెందుకో ?
అలక బూనిన అన్ననో ,తమ్ముణ్నో ?
అక్కనో , చెల్లెలినో అక్కున చేర్చు కుంటే చాలు
ఇప్పటి దాకా కమ్ముకున్న మబ్బులు
ఒక్క టొక్కటిగా విడి పోతాయి
ఒక్కో నయనం నుండి చినుకు
ఒక్క టొక్కటే అయినా
జాతి సమస్తం చెమరిస్తే
జడి వాన కురవదా ?
కమ్ము కున్న కుళ్ళు కొట్టుకు పోదా ?
అపార్థాలు తొలగి పోవా?
మనసులు తేలిక పడవా?

కుండ పోతగా కురిసి
ఈ ముసురు వీడి పోతే బావుణ్ను
హరివిల్లు విరిస్తే బావుణ్ను.

ఎన్నిసార్లయినా పునర్జన్మకు సిద్దపడు. "

" అక్షరాలతో సహవాసం
ఎంత అదృష్టమో కదా !
మాటలతో చెలిమి
మనసును ఆవిష్కరించే కుంచె కదా !
కవిత నీ కన్న బిడ్డ కదా !
అందుకే
గొప్ప కోసం వ్రాయకు
ఎవరి మెప్పు కోసమూ వ్రాయకు
ప్రాసల ప్రయాసల కొఱకు వ్రాయకు
ఆలోచన నిన్ను నిలువనీయనపుడూ
సంతోషం నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
సంవేదన నీ గుండెను మెలిపెట్టినపుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా !
పదాల పొదుపూ ,పొందికా కుదురుతుంది .
ఆత్మ తృప్తి కొఱకు , ఆర్తుల కొఱకు
ఆనందం పంచటానికి
ఆవేదన పంచుకోవటానికి
ఆలోచనల పదును పెంచటానికి
ఎన్నిసార్లయినా పునర్జన్మకు సిద్దపడు. "

నా ఇష్టాలు


పసికందును పొదవుకున్న

పచ్చి బాలింతను చూడడం ఇష్టం

పిల్లలతో ఆడుకునే తల్లి రూపం తన్మయం

పచ్చని ప్రకృతి ఇష్టం
ప్రభాతపు పసిడి ఎండ ఇష్టం
శీతా కాలంలో పచ్చికపై
పరచుకున్న మంచు దుప్పటీ ఇష్టం
తొలకరి చినుకులన్నా,
అందులో తడవడమన్నా ఇష్టం.
పూవులతో నిండిన పచ్చని చెట్లన్నా,
పచ్చదనం ఊసే లేని విరగబూసిన మోదుగ చెట్టన్నా
పసితనమన్నా,పండు ముదుసలి అన్నా
ప్రకృతి ప్రతిరూపమైన స్త్రీ సౌందర్యమన్నా
అచ్చ తెనుగు పదమన్నా
చక్కటి పాటన్నా చాలా చాలా ఇష్టం
సాయంసంధ్యలో సముద్రమంటే ఇష్టం
నిండిన మా వూరి చెరువు
నీళ్ళపై పడి మెరిసే నిండు పున్నమి చంద్రుడన్నా
గిరులు,తరులు,పాల వెల్లువలాంటి జలపాతాలు
పరవళ్ళు తొక్కే నది అన్నా మరీ ఇష్టం

17, ఏప్రిల్ 2011, ఆదివారం

నిశీధి రాత్రిలో తొలి కిరణం నీవు...


నిశీధి రాత్రిలో తొలి కిరణం నీవు...
ఆశల సౌధానికి పునాది నీవు...
ఎడారి పయనంలో నీటి చెలమ నీవు...

శిశిరంలో అరుదెంచిన వసంతానివి నీవు...
అర్థమెరుగని జీవితానికి పరమార్ధం నీవు...
అలసిన మనసుకు ఓదార్పువు నీవు...

నేనంటూ ఉన్నానని చెప్పింది నీవు...
నాలోని ప్రతి ఆశకు సంకేతానివి నీవు...
నాలోని ప్రతి తలపుకు ప్రారంభానివి నీవు...

నా ఒంటరి జీవితంలో తొలి నేస్తానివి నీవు...
ఇన్నాళ్ల నా ఎదురుచూపుకు అర్థం నీవు...
నా ఇన్నేళ్ల జీవితానికి పరమార్థం నీవు...
నాకు మాత్రమే కనిపించే సరికొత్త రూపానివి నీవు...

అన్నీ నీవు... అంతటా నీవు... నాలోని ప్రతి అణువూ నీవు...
నాలో చలనాన్ని రగిలించింది నీవు...
నాకు సరికొత్త లోకాన్ని చూపించిందీ నీవు...
కానీ నాకు మాత్రం ఏమీ కావు...

ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము


నా జన్మ కు మూలమై
నను నడిపిన నేలవై
నా బ్రతుకున దివ్వేవై
ధరిచేర్చిన నావవై
నవ మాసాలు మోసి, కొలిమి కష్టాలకోర్చి తుది శ్వాశ బిగపట్టి ఆది ఊపిరి ఊదినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

నీ వొడిలో పెంచినావ్
వేలు పట్టి నడిపినావ్
ఓనమాలు నేర్పినావ్
ఓర్పెంతో చూపినావ్
నీ ఎర్రని రక్తాన్ని, తెల్లని పాలుగా మలచి, నా కడుపుని నింపాలని నీ కడుపుని మాడ్చినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

గుడిలెన్నో చూపినావు
బడిలోనా చేర్చినావు
చదువుతుంటే మురిసినావు
నను గొప్పగా మలిచినావ్
చదువు రాక నేనుంటే, బడికొద్దని బెట్టుచేస్తే , నా చెంపలు వాయించి నువ్వు చెమ్మ గిల్లినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము


అల్లరెంత చేసినా...
మారేమెంత చేసినా..
సుతి మెత్తగా మందలించి
సుతులెన్నో చెప్పినావు
ఆరుబయట ఆటకెళ్ళి, పక్కోడితో తో పోరుపడితే ,నాతప్పని తెలిసికూడా తగువాడి గెలిచినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము


అబద్ధాలు ఆడినా..
అనర్థాలు చేసినా..
గతి తప్పి తిరిగిన
పెడదారిన నడిచిన
నా మీద కోపమొచ్చి, అయ్య కన్నేరచేస్తే పతి దైవం అని మరచి చురకత్తులు దూసినావు
ఏమిస్తే తీరునమ్మ.... నీ ఋణము
ఎన్నటికి మరువమమ్మ నీ త్యాగము

కమ్మగా పాడే కోకిలను అడిగాను


కమ్మగా పాడే కోకిలను అడిగాను
నీ తీయని మాటలతో మురిపించేది ఎపుడని
చల్లగా తాకే చిరుగాలిని అడిగాను
నీ చల్లని చూపుతో తాకేది ఎపుడని
వర్షించే మేఘాన్ని అడిగాను
నీ నువ్వుల జల్లుల్లో తదిచేది ఎపుడని
హైఇని పంచే వెన్నెలను అడిగాను
ఆ వెన్నల్లో ఊసులాడేది ఎపుడని
పరుగులు తీసే సెలయేటిని అడిగాను
నీ పరుగు నా కోసమేనా? అని
నాలో ఉన్న నా ప్రాణమైన నిన్ను అడిగాను
నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని
నా దరి చేరమని, నను బ్రతికించమని

ఎవ్వరు లేదన్నా నేనున్నానని ఎదురొస్తుంది..


ఎవ్వరు లేదన్నా నేనున్నానని ఎదురొస్తుంది..
ఎవ్వరు భాధలో ఉన్నా ధైర్యాన్ని పంచిస్తుంది..
ఎవ్వరు ఒంటరిగా ఉన్నా తోడుగా నీడగా నడుస్తుంది..
ఎవ్వరు కన్నీరు పెట్టినా గిలిగింతై నవ్విస్తుంది..
ఎవ్వరు వద్దన్నా నీ మదిలో పులకింతై కవ్విస్తుంది..
ఎవ్వరు నువ్వని ప్రశ్నించినా చిరునవ్వులు చిందిస్తుంది..
ఎవ్వరు నీవారని ప్రశ్నించినా చిరుఆశలను చూపిస్తుంది..
నా పేరు "ప్రేమ" నీ హృదయం నా చిరునామా అని బదులిస్తుంది.. ప్రేమంటే ఇదే రా

కొంటెనవ్వుతో చూసే ఓరకంటిచూపులు


కొంటెనవ్వుతో చూసే ఓరకంటిచూపులు
ఉలిక్కిపడి నిదురలేచిన ఆశలు.

దూరమయ్యే నీ మువ్వలచప్పుళ్ళు,
ఆగిపోతున్న నాగుండె చప్పుళ్ళు.

కనుమరుగవుతున్న నీ ప్రతిరూపం,
కనులకు అది కన్నీటి శాపం.

అస్తమిస్తున్న నీ కనుల అరుణాలు,
నా మనసుకి చీకటితోరణాలు.

ఏకాంతంలో కదలాడే నీ తియ్యని జ్ఞాపకాలు,
చెంతలేవని గుండెకుచేసే గాయాలు

నీకై ఎదురుచూసే నా  తడి నయనాలు,
మనోరుధిరం నింపుకున్న ఎరుపుచారలు.

16, ఏప్రిల్ 2011, శనివారం

మగువల గొప్పదనం లిఖించిన చరిత్ర పుటలలో...


మగువల గొప్పదనం లిఖించిన చరిత్ర పుటలలో...
మీ దేహం నుండి జారుతున్న ఒక్కోక్క వస్త్రంలా.....ఒక్కోక్క పేజి చిరిగిపొతుంది....
కామం వంటి కైపులు...ముగ్ధ స్నిగ్ధమైన ఆక్షర్షణలు...
తరుగుతున్న తనువులో... వైడూర్యాలుగా ఎంతకాలం వెలుగుతాయి...?
తొలి యౌవ్వనపు గుర్తులు...బాధ్యతలేని నగ్నత్వపు నడకలు...
కరిగిపొయే నీ వయ్యారపు మూర్తిలో ఎంతకాలం నిలుస్తాయి...'పూనం'?
వాడిన పువ్వులు పొగొట్టుకున్న మృగమద పరిమళాలు...
మహాలయ అమావాస్యతో సమానం...!
పట్టు పరికిణీతో...పదాహారణాల తెలుగుదనంతో కన్పించకపొయిన పర్వాలేదు.......
కాని పరదేశ స్తుతిలో... స్వకీయ సంస్కృతిని విస్మరిస్తూ...
కొరికలకీ... సంతృప్తికీ...మాటలకీ.. ఆచరణకీ...మనిషికీ... మనసుకీ...
నీ నగ్నలాలస పరువంతో... స్త్రీత్వపు కట్టుబాట్లును మాత్రం ఆహుతి చేయ్యకు....!
నగ్నత్వంతో నిండిన సిగ్గుల్నీ... వగల్నీ ఒలకబోసే నెరజాణతనంతో...
అర్ధరాత్రి ధియేటర్లలో... అర్ధనగ్న లాస్యానికి.. సెక్సీ హాస్యానికి...
స్వదేసియ సంస్కృతి జాకిట్లును విప్పుతూ...నీ వికృతి ఆనందాన్ని మాకు చూపకు...!
మాతృధాత్రి శిరసెత్తుకు తిరగలేక...సిగ్గుతో ముఖాన్ని చూపలేక....
ముంజేతులతో కన్నీళ్ళను తుడుచుకుంటుంది....
మనం కలలు కనే ప్రమద ఆదర్శాలు ఇవి కావని రొధిస్తుంది....

మగువల గొప్పదనం లిఖించిన చరిత్ర పుటలలో...
మీ దేహం నుండి జారుతున్న ఒక్కోక్క వస్త్రంలా..... ఒక్కోక్క పేజి చిరిగిపొతుంది....
కామం వంటి కైపులు...ముగ్ధ స్నిగ్ధమైన ఆక్షర్షణలు...
తరుగుతున్న తనువులో... వైడూర్యాలుగా ఎంతకాలం వెలుగుతాయి...?
తొలి యౌవ్వనపు గుర్తులు...బాధ్యతలేని నగ్నత్వపు నడకలు...
కరిగిపొయే నీ వయ్యారపు మూర్తిలో ఎంతకాలం నిలుస్తాయి...'పూనం'?
వాడిన పువ్వులు పొగొట్టుకున్న మృగమద పరిమళాలు...
మహాలయ అమావాస్యతో సమానం...!
పట్టు పరికిణీతో...పదాహారణాల తెలుగుదనంతో కన్పించకపొయిన పర్వాలేదు.......
కాని పరదేశ స్తుతిలో... స్వకీయ సంస్కృతిని విస్మరిస్తూ...
కొరికలకీ... సంతృప్తికీ...మాటలకీ.. ఆచరణకీ...మనిషికీ... మనసుకీ...
నీ నగ్నలాలస పరువంతో... స్త్రీత్వపు కట్టుబాట్లును మాత్రం ఆహుతి చేయ్యకు....!
నగ్నత్వంతో నిండిన సిగ్గుల్నీ... వగల్నీ ఒలకబోసే నెరజాణతనంతో...
అర్ధరాత్రి ధియేటర్లలో... అర్ధనగ్న లాస్యానికి.. సెక్సీ హాస్యానికి...
స్వదేసియ సంస్కృతి జాకిట్లును విప్పుతూ...నీ వికృతి ఆనందాన్ని మాకు చూపకు...!
మాతృధాత్రి శిరసెత్తుకు తిరగలేక...సిగ్గుతో ముఖాన్ని చూపలేక....
ముంజేతులతో కన్నీళ్ళను తుడుచుకుంటుంది....
మనం కలలు కనే ప్రమద ఆదర్శాలు ఇవి కావని రొధిస్తుంది....

14, ఏప్రిల్ 2011, గురువారం

నీ ఋణం తీర్చుకోడానికి నేనేమి చెయ్యలేను...

నేనంటూ లేనప్పుడే నన్ను కోరుకున్నావు
నాకోసం కలలు కన్నావు
పది నెలలు ప్రతి క్షణం
నాకోసమే గడిపావు
అస్తిత్వం లేనప్పుడే
గాడం గా ప్రేమించావు
నేను లోకాన్ని చూడడం కోసం
నువ్వు ప్రాణ త్యాగానికి కి సిద్ధపడ్డావు
నీ గుండెలపై మొదటి అడుగులు వేసినా
నీ చేతులతో తప్పటడుగులు వేయించావు
నీకు నిద్రలేకుండా చేస్తున్నా
నన్ను నిద్రపుచ్చావు
నీ ఆకలి కూడా మరచిపోయి
నాకు ఆకలి అంటే ఏంటో తెలియకుండా చేసావు
అమ్మా నీ గుండె నీకోసం కంటే నాకోసమే
ఎక్కువగా అల్లాడింది ఏమో అనిపిస్తుంది
నిన్ను నా గుండెల్లో పెట్టుకోడం కన్నా
నీ ఋణం తీర్చుకోడానికి నేనేమి చెయ్యలేను...

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

చివరి కోరిక ఏంటంటే నిన్ను చూడాలని.


నువ్వు చెప్పిన ప్రతిసారి నాకు కూడా చెప్పాలనిపిస్తోంది
నీతో నడవాలని ఉందని...
గుండెలోని మాట గొంతులో ఆగిపోతోంది
సాగలేని పయనం మొదలు పెట్టొద్దని...
పెదవి దాటిన మాట మొరటుగా తిట్టింది
మనసు మూగది మోసం చెయ్యొద్దని...
ప్రేమకు నిర్వచనం అడిగితే నేనేమి చెప్పగలను
అందరు వర్ణించేది, ఎవరు నిర్వచించలేనిది కదా...
సంతోషం అంటే ఏంటో అడుగు చెప్తాను
నీతో ఉన్న ప్రతి క్షణం అని...
నువ్వెప్పుడు గుర్తోస్తావో అడుగు చెప్తాను
అనుక్షణం అని...
చివరి కోరిక ఏంటంటే నిన్ను చూడాలని.

నా స్నేహానికిది చాలు


అప్పుడప్పుడు ఎలావున్నావంటూ
ఒక్కపలకరింపు చాలు
నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు
సంతోషమైనా,బాధయినా
నేనుంటే బాగుండుననిపిస్తే చాలు
మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు
కొన్నయినా మధురం గా అనిపిస్తే చాలు
చాలు….
నా స్నేహానికిది చాలు

కలవడానికి చేతులవసరం లేదు


కలవడానికి చేతులవసరం లేదు
కలసిన ఇరువురి స్వచ్చమైన భావాలు చాలు
మాటలు అంత కంటే అవసరం లేదు
మన ఇద్దరి మధ్య క్షణ కాల మౌనం చాలు
ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి,
మనసుని దోచుకోవటానికి
నన్ను చేరడానికి కాళ్ళు అవసరం లేదు
నీ హృదయం లో నా తలపు చాలు
నాగురించి నువ్వు ఆలోచిస్తున్నావని తెలియడానికి
చేరువలో లేకున్నా, ప్రేమను పంచడం లో ఆప్యాయతను పంచడం లో
నువ్వు ఎప్పుడు నా చెంత నుంటా వని నా మనసుకు తెలుసు
ఈ చిన్ని గుండెకి సంతృప్తి నించే ఆ ఆలోచన చాలు

5, ఏప్రిల్ 2011, మంగళవారం

'నేస్తం', అంటూ నా కోసం

'నేస్తం', అంటూ నా కోసం
నీ స్నేహం జత చేసావు.
నాకే తెలియని, ఇక ఫై మరువని
నడకను నాకే నేర్పావు.

తీరం అంతు ఎంతైనా,
అలలకు అలసట కలిగేనా ?
మన దూరం కరిగిన నా
కలలకు నీ ఊహే అందెనులే.

చెదిరిన కల మన గతమైనా ,
చెరగని రూపం నీదేలే .
పెదవులపైనా చిరునవ్వైనా
కలిగిన అది నీవేలే...

గెలుపు ఓటమి తేడా తెలియని
చెలిమే మనలో చిగురించేనా.
పసిపిల్లలమై మనసులు తడిసిన,
ఇరువురి కనులే చమరించేనా.

మౌనం కూడా మన భాషేనా ?
హృదయం తొంగి చూస్తుంది.
తెలుపని మాటలు ఎన్నో ఉన్నా,
మన భావం ఒక్కటయ్యింది.

చలనములేని క్షణములు ఎన్నో
సరసకు రమ్మని పిలిచేలే...
రోజు నీకై వెతికే కనులకు ,
జన్మంతా ఇక నిరీక్షణలే.....

4, ఏప్రిల్ 2011, సోమవారం

మధురం మధురం ...మధురాతి మధురం ....


మధురం మధురం ...మధురాతి మధురం ....
నా ప్రేమ మధురం ..నా ప్రేయసి మధురం ...
ప్రేయసి....నీ ఊహ మధురం ..నీ ఊసు మధురం ..
నీ ఫై నా ఆశ మధురం ....
నీ కోసం నే కన్న కలయే మధురం ...ఆ కలలో నీ కౌగిలి మధురం ..
నీకై నే వేచి చూసిన క్షణమే మధురం ..ఆ క్షణాన నను తాకిన చిరుగాలె మధురం ...
నాకై నువు దాచి చూపిన సొగసే మధురం ..ఆ సొగసును నా దాక మోసిన నీ మేనిముసుగు మధురం ...
నీ రూపం మధురం ...ఆ రూపం రేపిన నా హృదయ తాపం మధురం .....
నీ కోపం మధురం ...ఆ కోపం మాటున నాపై ఇష్టం మధురం ...
నీ అలక మధురం ..ఆ అలక నాకు పెట్టె మెలిక మధురం ....
నీ కులుకులు మధురం ..ఆ కులుకులు నేర్పే చిలిపి పలుకులు మధురం ...
నీ పెదవులు మధురం ...ఆ పెదవుల లోగిలిలో నా చెక్కిలి మధురం .....
నీ స్నేహం మధురం ...
నీ తీపి జ్ఞాపకం మధురం ..
నీతో జీవితం మధురం ...
ప్రేయసి ....నీ ప్రేమ వాకిలిలో నా మరణం కూడా మధురాతి మధురం ......

కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే


కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ

ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే

గుండెల్లో గాయమేదొ చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా

శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా

136 Vemana Padyalu



1.తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
   తలచి చూడనతకు తత్వమగును
   వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
   విశ్వదాభిరామ వినుర వేమ!
2.తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
   మిగిలి వెడలవేక మిణుకుచున్న
   నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
   విశ్వదాభిరామ వినుర వేమ!
3.తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
   మెంత చేసే ననుచు నెంచి చూచు,
   తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
   విశ్వదాభిరామ వినుర వేమ!
4.టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు
   లోకమందు జెప్పి మంచు
   కాకులట్టి జనుల కానరీ మర్మము
   విశ్వదాభిరామ వినుర వేమ!
5.జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
   రెంటినందు రిమ్మరేచునపుడు
   రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
   విశ్వదాభిరామ వినుర వేమ!
6.జాణలమని యంద్రు చపలాత్ములగువారు
   తెలివిలేక తమ్ముతెలియలేరు
   కష్టమైన యడవి గాసీలుచున్నారు
   విశ్వదాభిరామ వినుర వేమ!
7.జనన మరణములన స్వప్న సుషుప్తులు
   జగములందు నెండ జగములుండు
   నరుడు జగమునంట నడుబాటు కాదొకో
   విశ్వదాభిరామ వినుర వేమ!
8.ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు
   లడగి దరినిజేరి పడయవచ్చు
   నట్టునిట్టు దాటనది పోవునిది రామ
   విశ్వదాభిరామ వినుర వేమ!
9.నరుడెయైన లేక నారాయణుండైన
   తత్త్వబద్ధుడైన దరణి నరయ
   మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
   విశ్వదాభిరామ వినుర వేమ!
10.ద్వారంబంధమునకు దలుపులు గడియలు
   వలెనె నోటికొప్పుగల నియతులు
   ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
   విశ్వదాభిరామ వినురవేమ
11.బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి
   మిత్రచంద్ర శిఖులు నేత్రచయము
   మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా
   విశ్వదాభిరామ వినురవేమ
13.యోగిననుచు గొంత యోగముగూర్చక
   జగమునెల్లబట్ట చంపి తినుచు
   ధనము కొఱకు వాడు తగవాడుచుండిన
   యోగికాడు వాడె యోగువేమ
14.అర్ధ యంకణమున కాధారమైనట్టి
   యొంటిమేడ గుంజు నొనరనిల్పె
   నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు
   విశ్వదాభిరామ వినురవేమ
15.అన్నదానమునకు నధిక సంపదగల్గి
   యమరలోక పూజ్యుడగును మీఱు
   అన్నమగును బ్రహ్మమది కనలేరయా
   విశ్వదాభిరామ వినురవేమ
16.బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
   ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
   ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
   విశ్వదాభిరామ వినురవేమ
17.పండువలన బుట్టె బరగ ప్రపంచము
   పండువలన బుట్టె పరము నిహము
   పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన
   విశ్వదాభిరామ వినురవేమ
18.తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
   నొనర శివుని జూడ నుపమ గలదు
   మనసు చదరనీక మహిలోన జూడరా
   విశ్వదాభిరామ వినుర వేమ!
19.తనగుణము తనకు నుండగ
   నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో
   దన గుణము తెలియ కన్యుని
   బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమ!
20.జాలినొందరాదు జవదాటి కనరాదు
   అది మూలమైన ఆత్మమఱుగు
   పోరిచేరి పొంది పూర్ణము నందురా
   విశ్వదాభిరామ వినుర వేమ!
21.జాతి, మతము విడిచి చని యోగికామేలు
   జాతితో నెయున్న నీతివలదె
   మతముబట్టి జాతి మానకుంట కొఱంత
   విశ్వదాభిరామ వినుర వేమ!
22.నీవనినను నేననినను
   భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
   భావంబు దెలిసి మదిని
   ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా
23.నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
   మొనసి వేల్పులకును మ్రొక్కనేల
   కపట కల్మషములు కడుపులో నుండగా
   విశ్వదాభిరామ వినుర వేమ!
24.పంచ ముఖములందు బంచాక్షరి జనించె
   పంచ వర్ణములను ప్రబలె జగము
   పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
   విశ్వదాభిరామ వినురవేమ
25.నేయి వెన్న కాచి నీడనే యుంచిన
   బేరి గట్టిపడును పెరుగురీతి
   పోరిపోరి మదిని పోనీక పట్టుము
   విశ్వదాభిరామ వినురవేమ
26.మంటికుండవంటి మాయ శరీరంబు
   చచ్చునెన్నడైన, చావదాత్మ
   ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
   విశ్వదాభిరామ వినుర వేమ!
27.మంట లోహమందు మ్రాకుల శిలలందు
   పటములందు గోడప్రతిమలందు
   తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
   విశ్వదాభిరామ వినుర వేమ!
28.నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
   లింగ జీవావేశులను గాంచి భంగపడక
   పూజ మదియందు జేరుట పూర్ణపదవి
   పరము గోరిన నిదిచేయ బాగువేమా
29.ధూమాదుల నావృతమై
   వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
   శ్రీమించు శివుని జేరును
   గామాదుల గలియడతడు ఘనముగ వేమా
30.పగలుడుగ నాసలుడుగును
   వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్‌
   తగులుడుగు భోగముడిగిన
   త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!
31.పాల నీటి కలత పరమహంస మెఱుగును
   నీరు పాలు నెట్లు నేర్చునెమలి
   లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా?
   విశ్వదాభిరామ వినుర వేమ!
32.పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
   పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
   పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
   విశ్వదాభిరామ వినుర వేమ!
33.పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
   పురుషుడవనిలోన పుణ్యమూర్తి
   పరుల విత్తమరయ పాపసంచితమగు
   విశ్వదాభిరామ వినుర వేమ!
34.పరధనంబులకును ప్రాణములిచ్చును
   సత్యమంతలేక జారడగును
   ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు
   విశ్వదాభిరామ వినుర వేమ!
35.నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
   వ్రాతకన్న సాక్షి వలవదన్న
   పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
   విశ్వదాభిరామ వినుర వేమ!
36.నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
   నిజములాడకున్న నీతిదప్పు
   నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
   విశ్వదాభిరామ వినుర వేమ!
37.దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
   దశయలేమి నెంత్రు తక్కువగను
   దశయన గమ ధన దశమొక్కటే దశ
   విశ్వదాభిరామ వినుర వేమ!
38.తామసించి చేయదగ దెట్టి కార్యంబు
   వేగిరింప నదియు విషమగును
   పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
   విశ్వదాభిరామ వినుర వేమ!
39.తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
   ధనము సుఖము గూర్చునని గడింత్రు
   కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది
   విశ్వదాభిరామ వినుర వేమ!
40.తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
   పార్వతీభవు లిలబరమగురులు
   కూలివాండ్ర జగతి గురులన ద్రోహము
   విశ్వదాభిరామ వినుర వేమ!
41.తామసించి చేయదగ దెట్టి కార్యంబు
   వేగిరింప నదియు విషమగును
   పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
   విశ్వదాభిరామ వినుర వేమ!
42.పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
   పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
   పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
   విశ్వదాభిరామ వినుర వేమ!
43.పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
   బుట్టిరేమి వారు గిట్టరేమి
   పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!
   విశ్వదాభిరామ వినుర వేమ!
44.లోకమందుబుట్టి లోకమందె పెరిగి
   లోక విభవమోర్వలేక జనుడు
   లోకమందు జనికి లోబడి చెడిపోవును
   విశ్వదాభిరామ వినుర వేమ!
45.మది గలిగిన పూజ మదనారి మెచ్చును
   మనసు నిల్సినంత మహితుడగును
   మనసులేని పూజ మట్టి సమానము
   విశ్వదాభిరామ వినుర వేమ!
46.తామును జనులేమను కొన
   బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
   రాని పధంబున నడిచిన
   దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!
47.మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
   మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
   కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే?
   విశ్వదాభిరామ వినుర వేమ!
48.
   మనసే మాయా మృగమౌ
   మననేమిటి పైకిగానీ మణిపోనీకా
   మనసున మనసును జంపిన
   మనందే ముక్తిగలదు మహిలో వేమా!
49.
   మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
   చేసి తమకుగరుణచెందినదని
   వేదపఠన చేసి వెఱ్ఱులై పోదురు,
   విశ్వదాభిరామ వినుర వేమ!
50.   మఠములోనియోగి మాయలన్నియుగోసి
   ఘటములోన నున్న ఘనునిదెలిసి
   మాట మాటకుగురు మరువక తెలుపురా,
   విశ్వదాభిరామ వినుర వేమ!
51.   తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
   వెంట దేరు ధనము వంటబోరు
   తొనెటకు జనునొ ధనమెందు బోవునో
   విశ్వదాభిరామ వినుర వేమ!
52.   ఆశయనెడు దాని గోసివేయగాలేక
   మొహబుద్ది వలన మునుగువారు
   కాశివాసులైన గనబోరు మోక్షము
   విశ్వదాభిరామ వినుర వేమ!
53.   చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే
   ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప
   గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా
   విశ్వదాభిరామ వినుర వేమ!
54.   భోగంబుల కాశింపక
   రాగద్వేషంబు రంగుడదమలో
   వేగమె మోక్ష పదంబును
   రాగను నాతండు యోగిరాయుడు వేమా!
55.   చనువారెల్లను జనులం
   జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్‌
   వినవలె గనవలె మనవలె
   నని మషులకు దెలుసగూడ దంత్యము వేమా!
56.   ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
   కట్టుపడుచు ముక్తిగానరైరి
   జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో
   విశ్వదాభిరామ వినుర వేమ!
57.   అతిథి రాక చూచి యదలించి పడవైచి
   కఠిన చితులగుచు గానలేరు
   కర్మమునకు ముందు ధర్మము గానరో
   విశ్వదాభిరామ వినుర వేమ!
58.   తను వలచిన దావలచును తను
   వలవక యున్ననెనడు తావలవ డిలన్‌
   తనదు పటాటోపంబులు తన
   మాయలు పనికిరావు ధరలోన వేమా!
59.   మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
   తెలుపవచ్చు దన్ను తెలియలేదు
   సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
   విశ్వదాభిరామ వినురవేమ
60.   తనకేనాడు సుభిక్షము
   తనకేనాడును భగంబు తనరవయునం
   చును తన దశకై యెల్లెడ
   మనసందున జివుకుచుండు మహిలో వేమా!
61.   ఎండిన మా నొకటడవిని
   మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌
   దండిగల వంశమెల్లను
   చండాలుండొకడు పుట్టి చదుపును వేమా!
62.

   నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
   పలుకవలయుగాని పరులకొరకు
   చావకూడ దింక నోపదవ్యం పల్క
   విశ్వదాభిరామ వినురవేమ
63.

   తామును జనులేమను కొన
   బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
   రాని పధంబున నడిచిన
   దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!
64.

   వినియు వినకయుండు కనియు గనక యుండు
   తలచి తలపకుండు తాను యోగి
   మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
   విశ్వదాభిరామ వినురవేమ!
65.

   వెన్న చేతబట్టి వివరంబు తెలియక
   ఘృతము కోరునట్టి యతని భండి
   తాను దైవమయ్యు దైవంబు దలచును
   విశ్వదాభిరామ వినురవేమ!
66.

   రూపువంక పేరు రూఢిగా నిలుచును
   పేరువంక క్రియలు పెనగుచుండు
   నాశమౌను తుదకు నామరూప క్రియల్‌
   విశ్వదాభిరామ వినురవేమ!
67.

   లోభమోహములను ప్రాభవములు తప్పు
   తలచిన పనులెల్ల తప్పి చనును
   తానొకటి దలచిన దైవమొండగుచుండు
   విశ్వదాభిరామ వినురవేమ
68.

   శాంతమే జనులను జయమునొందించును
   శాంతముననె గురువు జాడ తెలియు
   శాంత భావ మహిమ జర్చింపలేమయా
   విశ్వదాభిరామ వినురవేమ!
69.

   వేషధారినెపుడు విశ్వసింపగరాదు
   వేషదోషములొక విధయె యగును
   రట్టుకాదె మునుపు రావణు వేషంబు
   విశ్వదాభిరామ వినురవేమ!
70.

   ఇంగలంబు తోడ నిల సల్పుతోడను
   పరుని యాలితోడ పతితుతోడ
   సరసమాడుటెల్ల చావుకు మూలము
   విశ్వదాభిరామ వినురవేమ!
71.

   ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు
   దాని బలిమి నెంతయైన గూడు
   గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు
   విశ్వదాభిరామ వినురవేమ!
72.

   తామసించి చేయదగదెట్టి కార్యంబు
   వేగిరింప నదియు విషమగును
   పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనా?
   విశ్వదాభిరామ వినురవేమ!
73.

   తల్లీ బిడ్డలకు తగవు పుట్టించెడి
   ధనము సుఖము గూర్చునని గడింత్రు
   కానీయెల్ల యెడల ఘన దుఃఖకరమది
   విశ్వదాభిరామ వినురవేమ!
74.

   దొంగమాటలాడ దొరుకునె మోక్షము
   చేతగాని పలుకు చేటుదెచ్చు
   గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
   విశ్వదాభిరామ వినుర వేమ!
75.

   నలుగురు కల చోటను దా
   దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా
   దలచెడి యాతడు నిచ్చలు
   గల మాటలే పలుకుచుండగా దగు వేమా!
76.

   నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
   కడుపు చల్లజేసి ఘనత విడుచు
   నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
   విశ్వదాభిరామ వినురవేమ!
77.

   పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
   నొక్కడాడుమాట యెక్కదెందు
   వూరకుండు వాని కూరెల్ల నోపదు
   విశ్వదాభిరామ వినురవేమ!
78.

   పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు
   బంగరందు కూర్ప బరువు గనును
   గాని యితర లోహమైన హీనము గాదె
   విశ్వదాభిరామ వినురవేమ!
79.

   జన్నములను మరియు జన్నియల ననేక
   ముల నొనర్చియున్న ఫలముకాన
   రాక యుండు నీతి లేకున్న మాత్రాన
   విశ్వదాభిరామ వినురవేమ!
80.

   తప్పు పలుకు పలికి తాతోట చేసిన
   కూడియున లక్ష్మీ క్రుంగిపోవు
   నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా
   విశ్వదాభిరామ వినుర వేమ!
81.

   భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
   దాన హీనుఁ జూచి ధనము నవ్వు
   కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
   విశ్వదాభిరామ వినురవేమ
82.

   నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
   ఎట్లు కలగుబర మదెంతయైన
   ధనము గలిగియున్న దైవంబు గలుగదు
   విశ్వదాభిరామ వినుర వేమ!
83.

   పగయుడగు గోపముడిగిన
   పగయుడుగన్‌ కోర్కెలుడుగు బరజన్మంపుం
   దగులుడుగు భేదముడిగిన
   త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా!
84.

   పప్పులేని కూడు పరులకోసహ్యమే
   యుప్పులేని వాడె యధిక బలుడు
   ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా
   విశ్వదాభిరామ వినురవేమ!
85.

   నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
   తళుకు బెళుకు రాలు తట్టెడేల
   చదువ పద్యమరయ జాలదా యొక్కటి
   విశ్వదాభిరామ వినుర వేమ!
86.

   పరుల దత్తమొప్పి పాలనచేసిన
   నిల స్వదత్తమునకు విను మడియగు
   నవని పరుల దత్త మహపరింపగ రాదు
   విశ్వధాబిరామ వినురవేమ!
87.

   నిజములాడు వాని నిందించు జగమెల్ల
   నిజము బల్కరాదు నీచులకడ
   నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా
   విశ్వదాభిరామ వినుర వేమ!
88.

   పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
   నొక్కడాడుమాట యెక్కదెందు
   వూరకుండు వాని కూరెల్ల నోపదు
   విశ్వదాభిరామ వినురవేమ!
89.

   పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
   వట్టి మాటలాడు వాడధముడు
   అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా
   విశ్వధాబిరామ వినురవేమ!
90.

   భయమంతయు దేహమునకె
   భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే
   లయమంతయు జీవునకే
   జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమా
91.

   భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
   దాన హీనుఁ జూచి ధనము నవ్వు
   కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
   విశ్వదాభిరామ వినురవేమ
92.

   మాటజెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
   మాట విన్న నరుడు మానుడగును
   మాట వినగ జెప్ప మానుట కూడదు
   విశ్వదాభిరామ వినురవేమ!
93.

   మనసు తెలిసి యొకని మాటకు బ్రతిచెప్ప
   సంతసించు నతడు చాలమెచ్చు
   మనసు దెలియకున్నడనియుచు ననునేదో
   విశ్వదాభిరామ వినురవేమ!
94.

   ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
   వేరేపోవువాడు వెర్రివాడు
   కుక్కతోక పట్టి గోదారీదినా?
   విశ్వదాభిరామ వినుర వేమ!
95.

   జ్ఞానియైనవాని మానక పూజించు
   మనుజుడెప్పుడు పరమునను ముదంబు
   సుఖమునందుచుండుసూరులు మెచ్చగ
   విశ్వదాభిరామ వినురవేమ!
96.

   హాని కలుగబోదు హరిమది నెంచెడు
   వాని కబ్దు పరము వసుధయందు
   పూని నిష్ఠమీరి పొదలక యుండుము
   విశ్వరాభిరామ వినురవేమ!
97.

   అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
   సజ్జనుండు పలుకు చల్లగాను
   కంచు మోగినట్లు కనకంబు మోగునా
   విశ్వదాభిరామ వినుర వేమ!
98.

   న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
   ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు
   జ్యోతిషము జనముల నీతుల దప్పించు
   విశ్వదాభిరామ వినురవేమ!
99.

   దేవుడనగ వేరే దేశముందున్నాడె
   దేహితోడ నెపుడు దేహమందె
   వాహనములనెక్కి పడిదోలుచున్నాడు
   విశ్వదాభిరామ వినురవేమ
100.

   భూమిలోన బుట్టు భూసారమెల్లను
   తనువులోన బుట్టు తత్త్వమెల్ల
   శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను
   విశ్వదాభిరామ వినురవేమ
101.

   వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు
   చేతకంటె హెచ్చు వ్రాత లేదు
   వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
   విశ్వదాభిరామ వినురవేమ!
102.

   అనువుగాని చోట అధికుల మనరాదు
   కొంచెముండుటెల్ల కొదువగాదు
   కొండ యద్దమందు కొంచెమై యుండదా
   విశ్వదాభిరామ వినురవేమ!
103.

   ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ
   నంటి చూడలేక యడవులందు
   నుంట మేటంచునుందురా జోగులై
   విశ్వదాభిరామ వినురవేమ!
104.

   చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
   కొంచెమైన నదియు కొదవగాదు
   విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
   విశ్వదాభిరామ వినుర వేమ!
105.

   అగ్నిబానా మేసి యంబుధి నింకించు
   రాముడవలి కేగ రాక, నిలిచి
   చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
   విశ్వదాభిరామ వినురవేమ!
106.

   ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు
   నం దొకండు విడ్డ పొందు చెడును
   స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
   విశ్వదాభిరామ వినురవేమ!
107.

   ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె
   జీవబుద్ధి వలన జీవుడయ్యె
   మోహబుద్ధిలయము ముందర గనుగొను
   విశ్వదాభిరామ వినురమేమ!
108.

   గుణములోగలవాని కులమెంచగానేల
   గుణము కలిగెనేని కోటిసేయు
   గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు
   విశ్వదాభిరామ వినురవేమ
109.

   తల్లితండ్రులందు దయలేని పుత్రుండు
   పుట్టనేమి? వాడు గిట్టనేమి?
   పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
   విశ్వదాభిరామ వినురవేమ
110.

   కోపమున ఘనత కొంచెమైపోవును
   కోపమునను గుణము కొరతపడును
   కోపమణచనేని కోరికలీడేరు
   విశ్వదాభిరామ వినురవేమ
111.

   ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా
   నలుపు నలుపేకాని తెలుపుకాదు
   కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె
   విశ్వదాభిరామ వినురవేమ
112.

   అల్పబుద్ధివానికధికారమిచ్చిన
   దొడ్డవారినెల్ల తొలగగొట్టు
   చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
   విశ్వదాభిరామ వినుర వేమ
113.

   పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
   పట్టెనేని బిగియ పట్టవలయు
   పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు
   విశ్వదాభిరామ వినురవేమ
114.

   తుమ్మచెట్టు ముండ్ల తోడనేపుట్టును
   విత్తులొననుండు వెడలునట్లు
   మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టను
   విశ్వదాభిరామ వినురవేమ
115.

   కపటి వేషమూని కడగండ్లు పడనేల
   విపిన భూమి తిరిగి విసుగనేల
   యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
   విశ్వదాభి రామ వినుర వేమ
116.

   అనువుగాని చోట అధికులమనరాదు
   కొంచెముందుటెల్ల కొదువకాదు
   కొండ యద్దమందు కొంచమై ఉండదా
   విశ్వదాభిరామ వినురవేమ
117.

   మనసులోనున్న మర్మమంత ఎరిగి
   స్థిరము చేసి ఆత్మ తేటపరిచి
   ఘటము నిల్పవలయు, ఘనతలింకేటికి
   విశ్వదాభి రామవినురవేమ
118.

   కదలనీయకుండ గట్టిగా లింగంబు
   కట్టివేయనేమి ఘనత కలుగు
   భావమందు శివుని భావించి కానరా
   విశ్వదాభిరామ వినురవేమ
119.

   మేక జంకబెట్టిమెలగుచు మందలో
   బ్రమని తిరుగు గొల్ల పగిదిగాను
   దేవునెరుగక పరదవేతల దలచు
   విశ్వదాభిరామ వినురవేమ
120.

   తన కుల గోత్రము లాకృతి
   తన సంపద కలిమి బలిమి తనకేలనయా?
   తన వెంటరావు నిజమిది
   తన సత్యమే తోడువచ్చు తనతో
   విశ్వదాభిరామ వినురవేమ
121.

   కలిమిగల్గనేమి కరుణ లేకుండిన
   కలిమి తగునె దుష్టకర్ములకును
   తేనెగూర్పనీగ తెరువున బోవదా
   విశ్వదాభిరామ వినురవేమ
122.

   ఎండిన మానొకటడవిని
   మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌
   దండిగల వంశమెల్లను
   చండాలుండొకడు పుట్టి చదువును వేమా
123.

   కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు
   ఉభయులరయుగూడి యుండినట్లు
   పేద పేద గూడి పెనగొని యుండును
   విశ్వదాభిరామా వినురవేమ
124.

   మాటలాడు గల్గు మర్మములెరిగిన
   పిన్నపెద్దతనము లెన్నవలదు
   పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా?
   విశ్వధాభిరామ వినురవేమ
125.

   కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
   మొండి వాని హితుడు బండవాడు
   దుండగీడునకును కొండెడు దళవాయి
   విశ్వదాభిరామా వినురవేమ
126.

   ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
   నీటనుండనేని నిక్కిపడును
   అండతొలుగు నెడల నందర పని అట్లే
   విశ్వదాభి రామ వినురవేమ
127.

   తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
   జాలిపడెడు వాడు జడుడు సుమ్మి
   తారతమ్య మెరుగనేరని పశువది
   విశ్వదాభిరామ వినురవేమ
128.

   పరులమేలు చూసి పలుకాకి వలె
   వట్టిమాటలాడు వాడు అధముడు
   అట్టివాని బతుకుటదిఏల మంటికా?
   విశ్వదాభిరామ వినురవేమ
129.

   గంగి గోవుపాలు గరిటడైనను చాలు
   కడవెడైనను నేమి ఖరముపాలు
   భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
   విశ్వదాభిరామ వినురవేమ
130.

   చిక్కియున్నవేళ సింహంబునైనను
   బక్క కుక్కయైనా బాధసేయు
   బలిమిలేని వేళ పంతములు చెల్లవు
   విశ్వదాభిరామ వినురవేమ
131.

   పనసతొనలకన్న పంచదారలకన్న
      జుంటితేనెకన్న జున్నుకన్న
      చెఱుకు రసముకన్న చెలుల మాటలె తీపి
      విశ్వదాభిరామ వినురవేమ
132.

  నిండునదులు పారు నిలచి గంభీరమై
     వెఱ్రివాగు పాఱు వేగబొర్లి
     అల్పుడాడురీతి నధికుండు నాడునా
     విశ్వదాభిరామ వినురవేమ
133.

  ఉప్పులేనికూర యొప్పదు రుచులకు
     పప్పులేని తిండి ఫలములేదు
     అప్పులేనివాడె యధిక సంపన్నుడు
     విశ్వదాభిరామ వినురవేమ
134.

  పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
     పుష్పజాతి వేరు పూజ ఒకటి
     దర్శనంబులారు దైవంబు ఒక్కటి
     విశ్వదాభిరామ వినురవేమ
135.

   చంపదగిన శతృవు తనచేత
       చిక్కెనేని కీడు చేయరాదు
       పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
       విశ్వదాభిరామ వినురవేమ
136.

   ఆపదగల వేళ అరసి బందువు జూడు
       భయము వేళ జూడు బంటుతనము
       పేదవేళ జూడు పెండ్లాము గుణము
       విశ్వదాభిరామ వినురవేమ

ఓ హ్రుదయమా


ఓ హ్రుదయమా

హ్రుదయమా నేనంటే నీకు కోపమా...
నాతో ఆడతావు... పడతావు...
నాలో ఒకధనిగా ఉంటావు...
అంతలోనే దురమవుతావు...
నన్ను నవ్విస్తావు అంతలోనేఏడిపిస్తావు ...

ఉహలేమో నీవి... ఆశలేమో నావి...
తప్పు చేసేది నీవు... ఫలితం నాది...
చలనం నీవైతే... చలించేది నేను...
మౌనంగా ఉండేది నీవైతే...
చూసి బాధపడేది నేను... !!

ఓ హ్రుదయమా

నేస్తం నువ్వు ఊహించిన ఊహించలేకున్న..!


నా మనసులోని మాటలన్నీ మూటగట్టి చెబుతున్న
నువ్వు విన్న వినకున్న
నీకోసం ఎదురు చూసి చూసి నన్ను నేను మరచి పోయా
నువ్వు నమ్మిన నమ్మలేకున్న
నా కన్నులు మూస్తే కలలా కరిగిపోతావని కలవరపడ్డ
నువ్వు తెలుసుకున్న తెలుసుకోలేకున్న
నీ మాటల కోసం నీ నవ్వుల కోసం ఆరాటపడ్డ
నువ్వు అర్ధం చేసుకున్న చేసుకోలేకున్న
నీ తోడూ కోసం నీ స్నేహం కోసం వేచివుంటాను
నేస్తం నువ్వు ఊహించిన ఊహించలేకున్న..!

తేనెలొలుకు నీ పలుకుల ముందర కోయిల గానమే మూగపోద!

తేనెలొలుకు నీ పలుకుల ముందర కోయిల గానమే మూగపోద!
మీనాల కనుల ఓ చినదాన!
నీ రూపు ముందు నింగి లో చుక్కల మాటున దాగిన చంద్రుడే చినబోవును!
రాలే!
ప్రతి కన్నీటి బిందువు నీ రూపం దూరమై మూగపొయే నా ప్రేమ నీవు లేక తను ఒంటరై కరిగే ఈ జీవితాన నా ప్రతి తలపు నీవే అని తెలిపే "గాయపడిన నా మనసు" !

ఒంటరిగా సాగే , ఈ పయనం ,

ఒంటరిగా సాగే , ఈ పయనం ,
గడచిన కాలమందు ...!"
మానని గాయం లా,
చెరగని జ్ఞాపకంలా "
నీ గురుతులను నాకు తోడుగా నిలిపి "..!
నీ తోడు లేని ఈ రోజు ..బ్రతుకే భారమై ...!
శూన్యమైన నా రేపటికి తోడుగా మిగిలింది ...ఓ చెలి ...!
"కనుపాపకు తోడుగా సాగే కన్నీరులా
గడిచే ఈ నిమిషానికి తోడులా వుండే గడచిన కాలములా"
"నీ తోడుంటా స్నేహమా, నా మరణం నా తోడుగా వచ్చే క్షణం వరకు
నీ స్నేహం నాకు తోడు లేకుంటే ,
రాలిపోయే పువ్వు వలె నా గమనం వుండద ! ఈ లోకాన !
ఇప్పటికి! నే తలచే ప్రతి పలుకులో నీ పేరున్నది !
నా మనసులో నిలిచినా , అపురూప అందం నీ రూపు
నా హృదయమంతా నిలిచినా ఓ చెలి
నీ పెదవి పలికే మాటకి ఎదురు చూస్తునది ... నేటికి ...ఎప్పటికైనా
!నను ప్రేమించావ ఓ ప్రియ , ఈ శ్వాస ఆగే లోపు .........!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
నిశీధి లాంటి ఈ జీవితం లో
కాంతి కిరణమై వెలసిన ఓ ప్రేయసి

జీవితం ఓ క్షణ మైతేనేం



జీవితం ఆనందపు అనుభవాల
అనుభూతుల నిత్య నవ్య పయనం
కావాలి ప్రతి ఒక్కరికీ కానీ

నిరంతర వేదనల  రోదనా పథం లో
పయనిస్తూ సగటు జీవి
ఆనందంగా అనుభవించ వలసిన
ఈ జీవితాన గతాన్నిచర్చిస్తూ
 భవితను  తలచుకు దుఖిస్తూ
ఈ రోజు తినకుండా
రేపటికొరకు దాస్తూ
సంతానాన్ని కంటూ
వారి కొఱకు  తపనపడుతూ
చికాకులు కోపాలు కాట్లాటలు
ఏమీ అనుభవించ లేక
అనుభవిన్చెన్దు కేమీ లేక
అను నిత్యం విషాదం  
ఏమిటో జీవితం క్షణ భంగురమే
క్షణ భంగుర జీవితాన
బ్రతికి వున్న  ప్రతీ క్షణం
హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా
 నిరంతరం నిర్మలంగా
నవ్వుతూ బ్రతక గలిగితే
జీవితం ఓ క్షణ మైతేనేం

జీవితం ఓ క్షణ మైతేనేం


జీవితం ఆనందపు అనుభవాల
అనుభూతుల నిత్య నవ్య పయనం
కావాలి ప్రతి ఒక్కరికీ కానీ

నిరంతర వేదనల  రోదనా పథం లో
పయనిస్తూ సగటు జీవి
ఆనందంగా అనుభవించ వలసిన
ఈ జీవితాన గతాన్నిచర్చిస్తూ
 భవితను  తలచుకు దుఖిస్తూ
ఈ రోజు తినకుండా
రేపటికొరకు దాస్తూ
సంతానాన్ని కంటూ
వారి కొఱకు  తపనపడుతూ
చికాకులు కోపాలు కాట్లాటలు
ఏమీ అనుభవించ లేక
అనుభవిన్చెన్దు కేమీ లేక
అను నిత్యం విషాదం  
ఏమిటో జీవితం క్షణ భంగురమే
క్షణ భంగుర జీవితాన
బ్రతికి వున్న  ప్రతీ క్షణం
హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా
 నిరంతరం నిర్మలంగా
నవ్వుతూ బ్రతక గలిగితే
జీవితం ఓ క్షణ మైతేనేం

శూన్యమైన నా రేపటికి తోడుగా మిగిలింది


ఈ జీవితాన నా ప్రతి తలపు నీవే అని తెలిపే "గాయపడిన నా మనసు"!
గడచిన కాలమందు ...!
"మానని గాయం లా,చెరగని జ్ఞాపకంలా "నీ గురుతులను నాకు తోడుగా నిలిపి"..!
నీ తోడు లేని ఈ రోజు ..బ్రతుకే భారమై ...!
శూన్యమైన నా రేపటికి తోడుగా మిగిలింది

నా ఆనందాన్ని క్షణికం చేస్తూ....


కరిగిపోతున్నది జీవితం, కన్న కలలను దూరం చేస్తూ..
కనుమరుగవుతున్నది జీవితం, నా తపనను కన్నీరుగా మారుస్తూ..
నిస్సారంగా మారుతున్నది జీవితం, పచ్చని ఆశలను ఆహుతి చేస్తూ..
భారమవుతున్నది జీవితం, మధుర భావాలను భూస్థాపితం చేస్తూ..
క్షణం ఒక యుగమవుతున్నది జీవితం, నా ఆనందాన్ని క్షణికం చేస్తూ....

కెరటానికి తెలుసా కన్నీటి విలువ..??


కెరటానికి తెలుసా కన్నీటి విలువ..??
మేఘం వానై కురిసినా ఆకాశం తడుస్తుందా ..??
తొలి పొద్దు మంచు బిందువు కమలంపై నిలుచునా..??
ఎడారిలో కురుయునా వలపుల జడి వాన..??
కన్నీటి దారలు వరదై పారినా,
చెరగని చిరునవ్వే కదా తరగని ఆభరణం....!!!

ఎందుకీ అహంభావం?!


మనస్సు నిరాకారమైంది. దీనికి ముగ్గురు చెలికత్తెలున్నారు. అవి బుద్ధి,
చిత్తం, అహంకారం. పంచభూతాలైన ఆకాశం, వాయువు, నీరు, అగ్ని, భూమి కలిసి భౌతిక
శరీరం ఏర్పడితే, అందులో మనస్సు,బుద్ధి, చిత్తం, అహంకారం — ఈ నాలుగూ
అంతర్లీనంగా వుంటాయి. అవసర సమయాల్లో బుద్ధి, చిత్తం, అహంకారం మనస్సుకు
మంచిని మార్గదర్శకం చేస్తున్నా, మనసు పెడచెవి పెడుతూనేవుంటుంది.
అప్పుడుమాత్రం, ఈ ముగ్గురు చెలికత్తెలు తమకెందుకని ప్రక్కకు
తప్పుకుంటుంటారు. అప్పుడు మనస్సు ఏకాకే!! ఇక పంచభూతాల విషయానికి వస్తే, ఈ
ఐదూ విడిపోయినాయా (అంటే, మరణం), అప్పుడూ మనస్సు ఏకాకే!! మరి మనస్సుకు
ఎందుకీ అహంభావం?!

నాకు ఇష్టం..ఎంతో ఇష్టం !!!



మదిలోని భావాల్ని మధురంగా చెప్తూ..
ఊహలలోని ఊసులకు ఊపిరిని పోస్తూ..
మనసుదోచే మాటలను పరిమళంలా వెదజల్లుతూ..
ఆలోచనలనే అక్షరాలను, భావాలనే సిరాలో ముంచి రాస్తూ...
అందంగా చెప్పే కవిత్వమంటే నాకు ఇష్టం..ఎంతో ఇష్టం !!!

నేస్తమా!


నేస్తమా!
ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోతావ్?
నీ వెంట నడవలేక కాదు గాని,
నీకది ఇష్టమో కాదో తెలియక
ఎం చేయాలో తోచక ఆగిపోయా.
ఓ క్షణం ఆగి చూస్తే
నీకూ నాకూ మధ్య యుగాల దూరం.
నీకూ నాకూ మధ్య మాటలు కరువయ్యి,
మనుషులు చొరబడ్డరు.
ఈ దూరాలు చెరిపే అయుధం నీ వద్దే ఉంది.
అందుకే నీ వైపే ఆశగా చూస్తున్నా.
ఒక్క అడుగు ఇటు నా వైపు వెయ్యు.
ఒక్క క్షణం గడువియ్యు...%$$

******స్నేహమంటే....*********


స్నేహమంటే..,
చిరుకానుకను యిచ్చి మురిపించి,
చిన్న చిరునవ్వుతో పలకరించి,
మాటవరసకి మండిపడడం, మరళ
మన్నించు అంటూ వేడుకొనడమే కాదు,
ఒప్పును తప్పుగా లోకం వెలుగెత్తి చాటినా...
ఆ స్నేహం ఎన్ని అవమానపు బాటలువేసినా...
గుండెల్లో జ్జాపకాలనే గుర్తులని చెరిపినా...
నీ మదిలో మాత్రం మార్పులేకుండా ఉండేదే స్నేహమంటే....

స్నేహాన్ని కోల్పోయి అలమటిస్తున్న

జాలువారే నా కన్నిటిని అడుగు,
స్నేహమంటే అర్దాన్న నీకు చూపిస్తాయి,
మూగపోయిన నా మనోవేదనని చూడు,
స్నేహమన్న గొప్పవేదాన్ని నీకు విన్పిస్తాయి,
కాని,
కనిపించని నా ప్రాణాన్ని మాత్రం అడగకు,
ఎందుకంటే....
అది నీ స్నేహోన్ని విడువలేక ఏనాడో కన్నీటిగా మారి కరిగిపోయింది .

నీమాటకై కట్టుబడిన ఈ అల్ప జీవితం


నీమాటకై కట్టుబడిన ఈ అల్ప జీవితం.. నా మనసులోని భావము
నా మనసులోని భావము


నీ రూపం చూసిన నా కనులకు మరొక ప్రపంచం కనిపించటంలేదు
నీ స్వరం తిలకించిన నా మనస్సుకు మరొకరి మాటలు వినిపించటంలేదు

ఎల్లప్పుడు నీ మోమును చూడాలన్న తపన
ఎల్లప్పుడు నీ పలుకులు వినాలన్న ఆలాపన

నా మనసులో దాగి ఉన్న ఎన్నో ఆశలను,ఆలోచనలను,భావాలను,
ఙ్యాపకాలను,... ఇంకా ఎన్నో నీతో ముచ్హటించాలని నా కోరిక

కానీ...
నీతో మాట్లాడలేని నా మూగతనం
నిన్ను చూడలేని నా బెరుకుతనం
నీమాటకై కట్టుబడిన ఈ అల్ప జీవితం

అంతే... తెలియని ఈ అంతం


ఆంతులేని ఆకాశంలో స్వేచ్చగా ఎగిరిన విహంగం
హరివిల్లు తాకిన వేల పులకరించెను ప్రతి అంగం
గూడు విడిచి పోయినా అది అంబరం అందిన సంబరం
లోకం లోని అందం కోసం అది మరిచెను గత బంధం

సరికొత్త పరిచయం లోని కల్మషం
ఎరుగక చేసెను అది స్నేహం
కల్లాకపటం తెలియని ప్రాణి
మార్చుకో ఇక నీ బాణి

నీ మాటలోని తియ్యదనం ఉంటుందా ఈ లొకాన ?
నీ ఆలోచనలోని గొప్పతనం సరితూగేనా ఎవరికైన ?
నీ అనురాగం నిశ్వార్ధం ! అడివిగాచిన వెన్నలేనా ?
నీ చెలిమే ఒక యోగం ! ఆగుమిత్రమా ఇకనైన

నీ గూడు లోన పరికించు,
తరగిపొని ఆస్థి దాగుంది.
ఈ స్వప్నాన్ని ఇక కరిగించు,
తిరిగిరమ్మని గుండె అంది.

ఓ బాటసారి ! నీ ప్రస్థానంలో చివరి మజిలి ఏది?
చూడు ఒక్కసారి ! ఈ ప్రపంచంలో అసలు నకిలి ఏది?
ధుఖ్ఖాన్ని సైతం దరహాసంతో స్వాగతించె సఖ్యము నీది ,
హృదయం లోన నిన్ను గెలిచే మనుషుల్లో ఔన్నత్యం ఏది?

నిజము కాని కల ఇది
కలలో అస్సలు నిజము లేనిది.
తీరని మృగతృష్న ఇది
ప్రయాస చేసినా ఫలితం లేనిది.

సూర్యుడి కోసం ఆరాటమా ! రెక్కలు కాలి అలమటించేనా !
కరున చూపిన వరుణుడు కన్నీటి జడివాన కురిపించేనా !
వెలుతురు కన్నా వేగంగా చీకటే పయనించేనా !
చావు బ్రతుకుకి భేదం లేక అంతా ఒకటే అనిపించేనా.

నీ గూడు మాత్రమే నీ సొంతం ,
జాడ మరువకు ఏ మాత్రం.
ఎవరికొసమే నీ పంతం ?
అంతే
తెలియని ఈ అంతం