27, డిసెంబర్ 2010, సోమవారం

నా బ్రతుకుకి అర్థం లేదంతే ............

నీ తలపుల్లో వసంతాలు నడిచొస్తాయి
నీ చూపుల్లో ఉషోదయాలు కనిపిస్తాయి
నీ అందెల సవ్వడిలో సప్త స్వరాలు వినిపిస్తాయి

నీ పాద స్పర్శతో కఠిన రాళ్లు సైతం పులకిస్తాయి
నీ పరిమళం సోకినవేళ ఎండిన వృక్షాలు చిగురిస్తాయి
నీ పలుకుల్లోని భావాలు కోయిల గానాలను మరిపిస్తాయి


నీకోసం వేచిన వేళ క్షణాలు యుగాలవుతాయి
ీ సానిహిత్యంలో యుగాలు సైతం క్షణాలవుతాయి
ీతో సాగే పయనంలో ఎడారులు కూడా వనాలవుతాయి

ందుకే... చెలీ నీవంటూ లేకుంటే నా బ్రతుకుకి అర్థం లేదంతే .............


కామెంట్‌లు లేవు: