ఆమె జడలోకైనాఎంచుకోలేదు!
ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..
రంగో.. రూపమో.. లోపమెక్కడుందో!
అస్పష్ట సందేహమేదో
ఒంటరిని చేస్తుంటే
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది..
తల్లిపొదనే తనువు చాలించే
స్వేచ్ఛ ఇపుడు నా సొంతమనే
కోయిల సందేశం చేరుతుండగానే
తుమ్మెద తొలిముద్దు పెట్టింది!
కవిత నా భవిత
పాట నా బాట
ఈ కవితకు రూపం నా యెద నిండిన వనిత
నా పాటకు భావం ఆమె కనుచూపుల సయ్యాట
తన మాటల మూట నా కవితల పూదోట
ఆమె నవ్వుల పూలు నా పాటల ప్రాసకు ఓనమాలు
పల్లవిలోంచి చరణంలోకి హాయిగా జారినట్లు
తన వయ్యారాలకు తాళం వేసే వాలుజడ నా పాటల పూగెడ
తన పెదవుల దాగిన సుధ నా పాటకు పంచెను పదసంపద
తన అందెల సవ్వడి,నా యెదలో అలజడి నా పాటకు తెచ్చెను సందడి
తన నడుమున సోయగం నా పదాలకల్లెను కొత్త రాగం
గడిచిన కాలాన్ని అడిగితే
నీ జ్ఞాపకాలు చూపింది
కారే ప్రతి కన్నీటి బొట్టుకీ
కారణం నువ్వే అంది
నిన్ను మరవాలి అన్న నా తపన
నన్ను నా ఆత్మని వేరు చేసింది
నన్ను వీడిన నా ఆత్మ
నీ కోసమే వెతుకుతోంది.
నీ జ్ఞాపకాలు చూపింది
కారే ప్రతి కన్నీటి బొట్టుకీ
కారణం నువ్వే అంది
నిన్ను మరవాలి అన్న నా తపన
నన్ను నా ఆత్మని వేరు చేసింది
నన్ను వీడిన నా ఆత్మ
నీ కోసమే వెతుకుతోంది.
ఉదయించే సూర్యుడు,
ఎగిసిపడే జలధి కెరటాలు
జగతి అంతటా ఆశలు
చిగురింప చేస్థాయి!
ఎగిసిపడే జలధి కెరటాలు
జగతి అంతటా ఆశలు
చిగురింప చేస్థాయి!
ఎందుకిలా చేశావు
ఎదను వదిలి ఎందుకు వెళ్ళావు
ఇన్నేళ్ళ మన అనుభందాన్ని
ఇలా దూరం చేసావు
పరిమళించిన మనసుకు
పాడి ఎందుకు కట్టావు
మనసు లోని మందిరం వదిలి
మాసి పోయిన మంటపాన్ని మిగిల్చినావు
ప్రేమను జయించి పెళ్లి చేసుకున్దామను కుంటే
ఓడించి ఒంటరి తనాన్ని మిగిల్చినావు
ఎదను వదిలి ఎందుకు వెళ్ళావు
ఇన్నేళ్ళ మన అనుభందాన్ని
ఇలా దూరం చేసావు
పరిమళించిన మనసుకు
పాడి ఎందుకు కట్టావు
మనసు లోని మందిరం వదిలి
మాసి పోయిన మంటపాన్ని మిగిల్చినావు
ప్రేమను జయించి పెళ్లి చేసుకున్దామను కుంటే
ఓడించి ఒంటరి తనాన్ని మిగిల్చినావు
మింటనున్న చందమామ కంటికెదురుగా నిలిచెనేమో
జుంటి తేనే మల్లియనే మగువగా మలిచెనేమో
అపురూపం ఆ రూపం
కానరాదె ఏ లోపం
ఆ పలుకు వింటే మహతి శ్రుతి తప్పునేమో
ఆ కులుకు కంటే మతి గతి తప్పునేమో
సుమధుర మధుకరం నీ అధరం
చివురు తొడిగే నేడు శిశిరం
జుంటి తేనే మల్లియనే మగువగా మలిచెనేమో
అపురూపం ఆ రూపం
కానరాదె ఏ లోపం
ఆ పలుకు వింటే మహతి శ్రుతి తప్పునేమో
ఆ కులుకు కంటే మతి గతి తప్పునేమో
సుమధుర మధుకరం నీ అధరం
చివురు తొడిగే నేడు శిశిరం
ప్రేమను ప్రేమించినంతగా
విరహాన్ని ప్రేమించగలగాలి
నేటి కలి కాల ప్రేమికుడు
ఎవరికి తెలుసు ఎప్పుడు ఎలా మారెనో ప్రేయసి మనసు
ఎన్ని తిప్పలు పెట్టి ఎంత దూరం చేసుకుంటుందో
దేవుడు చేసిన పని అని నీ దేవత నీకు దూరమైతే
తట్టుకోగలగాలి కదా ప్రేమికుడు
విరహాన్ని ప్రేమించగలగాలి
నేటి కలి కాల ప్రేమికుడు
ఎవరికి తెలుసు ఎప్పుడు ఎలా మారెనో ప్రేయసి మనసు
ఎన్ని తిప్పలు పెట్టి ఎంత దూరం చేసుకుంటుందో
దేవుడు చేసిన పని అని నీ దేవత నీకు దూరమైతే
తట్టుకోగలగాలి కదా ప్రేమికుడు
ఏమంటే ఏ’మని’ చెప్పను?
ఏమంటే మంటే నా అంటాను!
దానితో తంటానే అంటాను
మిమ్మల్ని కూసింత ఆ భావాల్ని పంచమంటాను
పంచుకోమంటాను
చెబితే వింటుంటాను
వింటే చెబుతుంటాను
హూ...!ప్రేమ ప్చ్...ప్రేమ
అహా ప్రేమ ..ఓహో ప్రేమ
అయ్యో ప్రేమ ..అబ్బో ప్రేమ..
అమ్మో ప్రేమ ఏం ఖర్మో ప్రేమ
ప్రేమకెన్ని రూపాంతరాలు
ప్రేమ కెన్ని అవాంతరాలు
ప్రేమ కెన్ని అనుభూతులు
ప్రేమకెన్ని అనుభవాలు
ప్రేమ కెన్ని అర్థాలు ప్రతిపదార్థాలు
ఏవి ప్రేమ పరమార్థాలు
ప్రేమ కెన్ని నిర్వచనాలు
ప్రేమ కెన్ని దుర్వ్యసనాలు
ప్రేమకెన్ని అవమానాలు
ప్రేమ కెన్ని బహుమానాలు
ప్రేరణ-లో” ప్రే”కూ –మరణం లో “మ” కు గల సంబంధమే ప్రేమా?!
అందుకేనేమో ప్రేమ-రణం అవడమనేది నిజమా?!
ప్రేమంటే పొట్టలో-పొత్తిళ్ళలో
అమ్మ పదిలపరచుకొనే అనురాగం!
ప్రేమంటే గుండెలపై ఆడించే చేయిపట్టి నడిపించే
నాన్న మదిలొ ఉదయించే వాత్సల్యం!!
ప్రేమంటే అనందం అందిస్తూ వేదనలో అనునయిస్తూ
ఏస్వార్థం లేకుండా తోడుండే నేస్తపు స్నేహితం
ప్రేమంటే పదారుప్రాయంలో సదా ఓ తోడు కోసం
పరితపించే పరస్పర ప్రణయం
ప్రేమంటే ఒకరికొకరై ఒకరిలో ఒకరై
తనువులు రెండైనా మనసొకటైన దాంపత్యం
ప్రేమంటే కష్టాల్లో నష్టాల్లో కలిమి లేముల్లో
తోడునీడలై మసలుకొనే హితులబంధువుల ఆత్మీయత
ప్రేమంటే అతిథులు అభ్యాగతులు అనాథలు
ఆర్తులు అన్నార్తులు శరణార్థుల పట్ల చూపే ఆప్యాయత
ప్రేమంటే సకల జీవజాలం పట్ల కనబరచే కరుణ
ప్రేమంటే కాదు చులకన
ప్రేమంటే అవరు పలచన
ప్రేమంటే విశ్వజనీయమైనది
ప్రేమంటే సత్య స్వరూపమైనది
ప్రేమంటే కాలం
ప్రేమంటే దైవం!!
ఏమంటే మంటే నా అంటాను!
దానితో తంటానే అంటాను
మిమ్మల్ని కూసింత ఆ భావాల్ని పంచమంటాను
పంచుకోమంటాను
చెబితే వింటుంటాను
వింటే చెబుతుంటాను
హూ...!ప్రేమ ప్చ్...ప్రేమ
అహా ప్రేమ ..ఓహో ప్రేమ
అయ్యో ప్రేమ ..అబ్బో ప్రేమ..
అమ్మో ప్రేమ ఏం ఖర్మో ప్రేమ
ప్రేమకెన్ని రూపాంతరాలు
ప్రేమ కెన్ని అవాంతరాలు
ప్రేమ కెన్ని అనుభూతులు
ప్రేమకెన్ని అనుభవాలు
ప్రేమ కెన్ని అర్థాలు ప్రతిపదార్థాలు
ఏవి ప్రేమ పరమార్థాలు
ప్రేమ కెన్ని నిర్వచనాలు
ప్రేమ కెన్ని దుర్వ్యసనాలు
ప్రేమకెన్ని అవమానాలు
ప్రేమ కెన్ని బహుమానాలు
ప్రేరణ-లో” ప్రే”కూ –మరణం లో “మ” కు గల సంబంధమే ప్రేమా?!
అందుకేనేమో ప్రేమ-రణం అవడమనేది నిజమా?!
ప్రేమంటే పొట్టలో-పొత్తిళ్ళలో
అమ్మ పదిలపరచుకొనే అనురాగం!
ప్రేమంటే గుండెలపై ఆడించే చేయిపట్టి నడిపించే
నాన్న మదిలొ ఉదయించే వాత్సల్యం!!
ప్రేమంటే అనందం అందిస్తూ వేదనలో అనునయిస్తూ
ఏస్వార్థం లేకుండా తోడుండే నేస్తపు స్నేహితం
ప్రేమంటే పదారుప్రాయంలో సదా ఓ తోడు కోసం
పరితపించే పరస్పర ప్రణయం
ప్రేమంటే ఒకరికొకరై ఒకరిలో ఒకరై
తనువులు రెండైనా మనసొకటైన దాంపత్యం
ప్రేమంటే కష్టాల్లో నష్టాల్లో కలిమి లేముల్లో
తోడునీడలై మసలుకొనే హితులబంధువుల ఆత్మీయత
ప్రేమంటే అతిథులు అభ్యాగతులు అనాథలు
ఆర్తులు అన్నార్తులు శరణార్థుల పట్ల చూపే ఆప్యాయత
ప్రేమంటే సకల జీవజాలం పట్ల కనబరచే కరుణ
ప్రేమంటే కాదు చులకన
ప్రేమంటే అవరు పలచన
ప్రేమంటే విశ్వజనీయమైనది
ప్రేమంటే సత్య స్వరూపమైనది
ప్రేమంటే కాలం
ప్రేమంటే దైవం!!
కంటిచూపు చాలు- వింటితూపులేల
ఒంటి వంపు చాలు-ఇంక ఖడ్గమేల
మాటలే కావాలా మనసు చీల్చడానికి
పదములే కావాలా ఎదను గెలవడానికి
1. చిన్న నవ్వు చాలు చిత్తు చేయడానికి
బుగ్గ సొట్ట చాలు బుగ్గి చేయడానికి
పెదవి మెరుపు చాలు మృతులవ్వడానికి
మూతి విరుపు చాలు చితిని చేరడానికి
2. వయ్యారాల నడకనే వెర్రెక్కించు
సోయగాల ఆ నడుమే కైపుతలకెక్కించు
అంగాంగ భంగిమలే చొంగనే కార్పించు
పడతి పరువాలే పిచ్చిగా పిచ్చెక్కించు
ఒంటి వంపు చాలు-ఇంక ఖడ్గమేల
మాటలే కావాలా మనసు చీల్చడానికి
పదములే కావాలా ఎదను గెలవడానికి
1. చిన్న నవ్వు చాలు చిత్తు చేయడానికి
బుగ్గ సొట్ట చాలు బుగ్గి చేయడానికి
పెదవి మెరుపు చాలు మృతులవ్వడానికి
మూతి విరుపు చాలు చితిని చేరడానికి
2. వయ్యారాల నడకనే వెర్రెక్కించు
సోయగాల ఆ నడుమే కైపుతలకెక్కించు
అంగాంగ భంగిమలే చొంగనే కార్పించు
పడతి పరువాలే పిచ్చిగా పిచ్చెక్కించు
గడిచిన కాలాన్ని అడిగితే
నీ జ్ఞాపకాలు చూపింది
కారే ప్రతి కన్నీటి బొట్టుకీ
కారణం నువ్వే అంది
నిన్ను మరవాలి అన్న నా తపన
నన్ను నా ఆత్మని వేరు చేసింది
నన్ను వీడిన నా ఆత్మ
నీ కోసమే వెతుకుతోంది.
నీ జ్ఞాపకాలు చూపింది
కారే ప్రతి కన్నీటి బొట్టుకీ
కారణం నువ్వే అంది
నిన్ను మరవాలి అన్న నా తపన
నన్ను నా ఆత్మని వేరు చేసింది
నన్ను వీడిన నా ఆత్మ
నీ కోసమే వెతుకుతోంది.
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
దారి చూపేటి దివ్వెను
నీ కడుపు నింపేటి బువ్వను
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
తియ్యని మాట నా కడుపున పుట్టింది
తెలుగు వారందరికీ వారసురాలయింది
ఎంగిలి మాటలు వచ్చి పెత్తనం చేస్తుంటే
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
నీ తోటలోని పువ్వును
పసిపాప మురిపాల నవ్వును
అమ్మ బాబు వేలు వదిలిన బాల్యము
మమ్మీ డాడిల వెంట పరిగెత్తుతున్నది
రోజురోజుకి నేను కనుమరుగైపోతున్నా
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
అందాల పడతి మువ్వను
భాషా గగనాన తారాజువ్వను
నీ జాతికంతటికి వెలుగును
దారి చూపేటి దివ్వెను
నీ కడుపు నింపేటి బువ్వను
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
తియ్యని మాట నా కడుపున పుట్టింది
తెలుగు వారందరికీ వారసురాలయింది
ఎంగిలి మాటలు వచ్చి పెత్తనం చేస్తుంటే
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
నీ తోటలోని పువ్వును
పసిపాప మురిపాల నవ్వును
అమ్మ బాబు వేలు వదిలిన బాల్యము
మమ్మీ డాడిల వెంట పరిగెత్తుతున్నది
రోజురోజుకి నేను కనుమరుగైపోతున్నా
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
అందాల పడతి మువ్వను
భాషా గగనాన తారాజువ్వను

షిర్డీ ప్రవేశమే సర్వదుఖ: పరిహారము
నాకొక విస్తారమైన ఆకారం లేదు నేను సర్వత్రా ఉంటాను
నా పై భారంవేసి విశ్వాసం ఉంచినా వారియొక్క సర్వకార్యాలను సూత్రధారునిగా నేనే నడిపిస్తాను.
తల్లి తన బిడ్డలను కాదు అనదు. నేను నా భక్తులను లేదు అనను.
శ్రీ సాయి విభూది భక్తులకు శ్రీరామరక్ష. రోగాలకు సర్వరోగ నివారిణి.
శ్రీ సాయి నామ స్మరణం సర్వపాప హరణం.
నా శరణు జొచ్చినవారు నిష్పలంగా పోయినదెవ్వరో చూపించు.
సాయిని శ్రద్ధ, సహనముతో కొలిచినవారు తప్పక పొందుతారు సర్వం.
ఈ కలియుగములో సాయిని మించిన దైవము లేదు. సాయి నామమునకు మించిన శక్తి లేదు.
తలచుకోగానే మనసులోని కోరికని తెలుసుకుంటాడు సాయినాధుడు.
నీవు ఆకలిగొన్న వారికి అన్నము పెట్టినచో అది నాకే చెందుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి