18, డిసెంబర్ 2013, బుధవారం

నీ పాదముల క్రింద మెత్తని పచ్చికనౌవ్వాలని ఉంది

ప్రియా నీ పాదముల క్రింద మెత్తని పచ్చికనౌవ్వాలని ఉంది

నీ పెదవులపై తీయని మాటలతో మచ్చిక చేయాలని ఉంది

మృదుమధుర గీతమై నీ హృదయ తంత్రులను మీటాలని ఉంది

రవివర్మ చిత్రమై నీ కన్నుల రంగులద్దాలని ఉంది

ప్రకృతి సోయగాన్నై వన్నె చిన్నెలతో నీకు స్వాగతం చెప్పాలని ఉంది

భువి నుండి దివికి " వెన్నెల వెలుగువై" రావా.. 

దివికి దిగి ప్రియలాస్యంతో జగాన్ని రంజింపవా...

సిరి సిరి మువ్వా .. జన్మదిన శుభాకాంక్షలు

1, సిరి సిరి మువ్వా ..
సొగసరి గువ్వా . .
విరిసిన పువ్వా . .
నెచ్చెలి చిరునవ్వా ......

2. చెలిమికి చిరునామా నువ్వేనమ్మా .
వలపుల తొలకరి చిరుజల్లువమ్మా ..
మెత్తని హృదయంలో సుతిమెత్తని
భావాలను పొందు పరుచుకున్నావమ్మ

3. వసుధైక కుటుంబం మనదేనంటు ..
రసరమ్య గీతికలాలపించిన కోయిలమ్మా ..
ప్రకృతి పరవసింప , పచ్చని పైరులే పారాణిగా
సొగసులద్దిన కూనలమ్మా ..

4.సిరిగా గడసరిగా ..
భావాల రసఝరిగా..
మృదుమధుర శ్రావ్య గీతికగా .
సంస్కృతీ సంప్రదాయాల పట్టుకొమ్మగా ..
ముద్దుగుమ్మగా కల "వరమై " మాముందు నిలిచిన ...

సిరి గారికి జన్మదిన శుభాకాంక్షలు

సిరి సిరి మువ్వ సొగసరి గువ్వా ...అరవిరిసిన పువ్వా నెచ్చెలి చిరునవ్వా
చెలిమికి చిరునామా నువ్వేనమ్మా
వలపుల తొలకరి చిరుజల్లువమ్మా
మెత్తని హృదయంలో సుతిమెత్తని భావాలను పొందు ప్రుచుకున్నావమ్మ
వసుధైక కుటుంబం మనదేనంటూ రసరమ్య గీతికలాలపించినకోయిలమ్మ
సిరిగా గడసరిగా భావాల రసఝారిగా మృదుమధుర శ్రావ్య గీతిక గా
సంస్కృతి సాంప్రదాయాల పట్టుకోమ్మగా ముద్దుగుమ్మగా కలవారమై
మాముందు నిలిచిన సిరి గారికి జన్మదిన శుభాకాంక్షలు