6, మే 2012, ఆదివారం


దూరం పెరగనీ…
స్నేహం కరగనీ…
రేపొచ్చే కల తను ఎవరంటే…
ఏమో అంటూ పెదవులు చెప్పనీ…!!!
నిన్నలే దాటనీ..
నవ్వులే మరవనీ…
ఎదురొచ్చినా అలా తడబడకుండా..
దరికే చూడక పాదం కదలనీ…!!!
ఇన్నళ్ళ మాటలన్ని ఈ వేళలో చెరగనీ…!!!
స్వేచ్చనే పేరునే పూర్తిగా విడవనీ…!!!
….
నేనే లేననీ…మళ్ళీ రాననీ…నమ్మనీ…నీ మనసునీ..
అంతా కల అని…మరేదీ కాదనీ…తెలుపనీ…ఇది నిజమనీ..
….
రేపు నీతో రాను అనీ…
రేపు నాకే లేదు అనీ…
రోజు రోజుకి ఊపిరికీ…
దూరమవ్తు ఉన్నాను అని..!!!
….
నిన్న నేను ఇక లేను అని..
నేటి నేను అది కాదు అని..
ఏనాటికైనా నే రాను అని…
నిన్నలో కనుమూస్తిననీ…!!!
….
కన్నీటి నీటిని దాటుకుని…
ఈదలేనని తెలుసుకునీ…
ఉప్పు నీరంత దాచుకునీ..
ఆవిరవ్తున్న సంద్రాన్ని..!!
….
కలతలూబిలో చిక్కుకునీ…
కదలలేని ఓ జాబిలినీ…
చీకటేల కనిపించనని…
పగిలి పెగిలిన ప్రాణాన్నీ..!!!
…..
వెతకద్దు నన్ను…నే పలికిన మాటలలో…
కలవద్దు నన్ను…నే రాసిన పదములలో…
చూడద్దు నన్ను…చిందించిన నవ్వులలో…
చేరద్దు నన్ను…ఆ గడిచిన నిన్నలలో…
….
నిజం కాను నేను…
నిజమే కాలేను…!!!
కలను కాను నేను…
కనులు దాటి రాను…!!!
నటన కాదు నేను…
నిజాలు దాచలేను…!!!
కధని కాదు నేను…
ఆనందమివ్వలేను…!!!
నవ్వు కాను నేను…
నిముషముండలేను…!!!
కన్నీరు కాను నేను…
కష్టాలు వీడనీను…!!!
ప్రాణాన్ని కాను నేను…
శ్వాసలందుకోను…!!!
స్వేచ్చ కాదు నేను…
సంకెలలో చిక్కినాను…!!!
….
జీవమున్నది ఒక పక్క…
మరణమునదింకో పక్క…
నవ్వులన్నవి ఒక పక్క…
కన్నీరు కారెనింకొక పక్క..
స్నేహమున్నదీ ఒక పక్క..
మోసముందింకొక పక్క…
ప్రేమ ఉన్నది ఒక పక్క…
సంతోషమే లేదు ఎటు పక్కా…!!!
….
దూరం పెరగనీ…
స్నేహం కరగనీ…
రేపొచ్చే కల తను ఎవరంటే…
ఏమో అంటూ పెదవులు చెప్పనీ…!!!
నిన్నలే దాటనీ..
నవ్వులే మరవనీ…
ఎదురొచ్చినా అలా తడబడకుండా..
దరికే చూడక పాదం కదలనీ…!!!

కామెంట్‌లు లేవు: