31, మే 2012, గురువారం


పగటి పూట అందమైన నక్షత్రాలు (చుక్కలు) వెతికే నేను నిజంగానే ఈ రోజు వాటిని చూసాను.
ఈ రోజు వరకు ఎక్కడ దాకున్నాయి అవి అని నేను అలోచిస్తుంటే...
"మేమెప్పుడూ ఇక్కడే ఉన్నాము... నీ చూపులోనే ఇన్నాల్లు దోషముంది సుమా..." అని అవి వెక్కిరించాయి.
అందమైన నక్షత్రాలు చూసిన నాకు... మనసులో ఏదో తెలియని అవ్యక్త భావం..
నాకు తెలియకుండానే నా అంతరాలలో ఒక ఉత్తేజం..
ఈ రోజు నీతో గడిపిన ఆ కొద్ది సమయం..మరువలేను ఈ జన్మలో నేస్తం.
ఓ ప్రియ నేస్తమా...

కనిపించే దైవాలు కనిపెంచే తల్లిదండ్రులు...
ఈ జీవితపు మజిలీలలో ననువీడి వెళతారు!

నిండు నూరేళ్ళూ తోడుంటానన్న భార్యను సైతం....
ఇంటి వద్దే విడిచి నేను పోతాను!

కోటి ఆశలు పెట్టుకున్న కొడుకులు
వల్లకాటి లో నన్ను మసి చేసి పోతారు!

బూడిదగా మిగిలినా...... నేనీ భువినే వీడి వెళ్ళినా....
నా ంకొలువుండేది నీవొక్కడివే నేస్తమా... ఇహ పరాలకందని ఓ గొప్ప భావమా!

ఎన్నో ఆటుపోట్లు గల ఈ జీవననావలో,
కష్టాలు నన్ను సజీవ సమాధి చేస్తూంతే....
ఎదురైన కష్టాలను చూసి ఆప్తులందరూ
నన్ను ఒంటరిని చేసి పోతూంటే....

జన్మ జన్మల నా పుణ్యమే దాల్చెనేమో ...
స్నేహితునిగా నీ రూపము!
వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదిరించమన్న నీ ధైర్యమె...
కాదా నాకు దైవ సమానము!

నీ చెలిమి నా చెంతనున్నంత కాలము....
చెక్కిలిపై చిందలేదు ఏ కన్నీరు!
ఉప్పొంగే జలధిని కనురెప్పలు దాచేసినా....
అయ్యుండదే అది ఆనందపు పన్నీరు!

అరుదైన వరమే అయినా...
పుట్టిన నాడు నేనెరుగను నీ స్నేహము!
మట్టిలో కలిసినా మరువగలదా...
నా మది నీతో పంచుకున్న బంధము !
ఎవరెన్ని విధాల వర్ణించినా ,
తరగిపోదు, కరిగిపోదు ఈ గంధము!

ఎన్ని పదాలు కూర్చి...ఎన్ని జన్మలెత్తి..
తీర్చుకోగలను నేను చేసుకున్న ఋణము!
నీ స్నేహాన్ని వరంగా పొంది...
అయ్యనె నా జన్మ మిక్కిలి ధన్యము!!!

6, మే 2012, ఆదివారం


దూరం పెరగనీ…
స్నేహం కరగనీ…
రేపొచ్చే కల తను ఎవరంటే…
ఏమో అంటూ పెదవులు చెప్పనీ…!!!
నిన్నలే దాటనీ..
నవ్వులే మరవనీ…
ఎదురొచ్చినా అలా తడబడకుండా..
దరికే చూడక పాదం కదలనీ…!!!
ఇన్నళ్ళ మాటలన్ని ఈ వేళలో చెరగనీ…!!!
స్వేచ్చనే పేరునే పూర్తిగా విడవనీ…!!!
….
నేనే లేననీ…మళ్ళీ రాననీ…నమ్మనీ…నీ మనసునీ..
అంతా కల అని…మరేదీ కాదనీ…తెలుపనీ…ఇది నిజమనీ..
….
రేపు నీతో రాను అనీ…
రేపు నాకే లేదు అనీ…
రోజు రోజుకి ఊపిరికీ…
దూరమవ్తు ఉన్నాను అని..!!!
….
నిన్న నేను ఇక లేను అని..
నేటి నేను అది కాదు అని..
ఏనాటికైనా నే రాను అని…
నిన్నలో కనుమూస్తిననీ…!!!
….
కన్నీటి నీటిని దాటుకుని…
ఈదలేనని తెలుసుకునీ…
ఉప్పు నీరంత దాచుకునీ..
ఆవిరవ్తున్న సంద్రాన్ని..!!
….
కలతలూబిలో చిక్కుకునీ…
కదలలేని ఓ జాబిలినీ…
చీకటేల కనిపించనని…
పగిలి పెగిలిన ప్రాణాన్నీ..!!!
…..
వెతకద్దు నన్ను…నే పలికిన మాటలలో…
కలవద్దు నన్ను…నే రాసిన పదములలో…
చూడద్దు నన్ను…చిందించిన నవ్వులలో…
చేరద్దు నన్ను…ఆ గడిచిన నిన్నలలో…
….
నిజం కాను నేను…
నిజమే కాలేను…!!!
కలను కాను నేను…
కనులు దాటి రాను…!!!
నటన కాదు నేను…
నిజాలు దాచలేను…!!!
కధని కాదు నేను…
ఆనందమివ్వలేను…!!!
నవ్వు కాను నేను…
నిముషముండలేను…!!!
కన్నీరు కాను నేను…
కష్టాలు వీడనీను…!!!
ప్రాణాన్ని కాను నేను…
శ్వాసలందుకోను…!!!
స్వేచ్చ కాదు నేను…
సంకెలలో చిక్కినాను…!!!
….
జీవమున్నది ఒక పక్క…
మరణమునదింకో పక్క…
నవ్వులన్నవి ఒక పక్క…
కన్నీరు కారెనింకొక పక్క..
స్నేహమున్నదీ ఒక పక్క..
మోసముందింకొక పక్క…
ప్రేమ ఉన్నది ఒక పక్క…
సంతోషమే లేదు ఎటు పక్కా…!!!
….
దూరం పెరగనీ…
స్నేహం కరగనీ…
రేపొచ్చే కల తను ఎవరంటే…
ఏమో అంటూ పెదవులు చెప్పనీ…!!!
నిన్నలే దాటనీ..
నవ్వులే మరవనీ…
ఎదురొచ్చినా అలా తడబడకుండా..
దరికే చూడక పాదం కదలనీ…!!!

నాకోసం ఎదురు చూస్తూ నువ్వు…
గాడియారం వంక గడియ గడియకి చూస్తుంటే…
నాతో మాట్లాడుతూ నువ్వు…
ప్రేమనే దాచేస్తూ తడబడుతుంటే…
అందమైనా ఓ రాజూ రాణీ కధలా…
కన్నే గుండెనే కదిలించే కలలా…
ఎందుకొచ్చావు నువ్వు…
ఎన్ని చెప్తావు నువ్వు…
కన్నుల్లో చూస్తావు నువ్వు…కన్నీరువవుతావు నువ్వు…!!!
చాటు మాటుగా నువ్వు…
ఎన్నాళ్ళు వెంటాడతావు…
ఎటువైపు చూసినా నువ్వూ…కనిపిస్తూ వేదిస్తున్నావు…!!!  Eye rolling smile
175674_126622620743617_100001876386421_187101_7355865_o
మాయే చేసానని…
నిన్నే దోచానని…
అంతా నేనేనని…
అన్నీ అయ్యాననీ…!!!
కలలే రేపాననీ…
నిజమై నిలిచానని….
కధలా కలిసానని….
మనసే నింపాననీ…!!!
నిజమో ఏమో…తెలియదు కానీ…
నిజమైతే బాగుణ్ణననిపిస్తుందీ…!!
నాతో పాటూ నీ అడుగులు కదిలే…
నా కన్నీరు నీ కన్నుల్లో కారే…
నా నవ్వులే నీ పెదవులపై చేరే…
కొంచం కొంచం గా నేనే నన్నే వదిలానా…
కొంచం కొంచం గా నీలో నేనే కలిసానా…
కొత్తగా ఉంది…కొంటెగా ఉంది…
రొజు రొజుకీ నచ్చుతుంటుందీ…
గుండెలోతుగా గుచ్చుకుంటుంది…
దగ్గరవ్వాలనుంటుందీ…!! Red heart Red heart Red heart