12, జులై 2011, మంగళవారం

తెలుసుకొని పలుకుదాం మనం ప్రతీ మాట..

మనిషికి మనిషికి తొలి పరిచయం 'మాట'..
పెదవులు పలకని మాటలను పదాలతో తెలుపుతాము..

ప్రతీ మాటలో ఉన్నది ఎంతో మహత్యం..
అది వ్యక్తం చెయ్యటానికి కావాలి నైపుణ్యం..

కలుపుతుంది మనసులను మధురమైన మాట..
శక్తిహీనులను చేస్తుంది పెదవి విరిచే మాట..

పెంచుతుంది మనోధైర్యాన్ని ఒక చిన్న మాట..
తెంచుతుంది బంధాన్ని పరుషమైన మాట..

విరిగిన హృదయాన్ని సైతం అతికిస్తుంది విలువైన మాట..
విధిని సైతం ఎదురించే ధైర్యన్నిస్తుంది ఒక మంచి మాట..

తెలుసుకొని పలుకుదాం మనం ప్రతీ మాట..
నోచుకోనక నొప్పించక ఆలోచించి మాట్లాడుదాం,
ఆనందంగా జీవిద్దాం....!!!

రాతలతో నా స్నేహం.......

రాతలతో నా స్నేహం.......
అక్షరాలతో నా అనుబంధం!
నేను రాసే వివిధ పదాలు.......
తెలియకుండానే నా ప్రియనేస్తాలు!
నూతన పరిచయాల యత్నం.....
నన్ను నేను శోధించుకునే ప్రయత్నం
కవితలలో రాసే నా ప్రేమ.......
తెలుపుతుందది నామది చిరునామ!
విధి లిఖించిన నుదిటి రాతలు.....
వాటిని మార్చలేవు ఏ కవితలు!
ఇలా రాయడంలో వుంది నాకు తృప్తి....
అదే నేను రాసే ఈ రాతలకు స్పూర్తి!
నా రాతలకు మీరంతా స్పందిస్తున్న తీరు...
మీ అందరికీ నేను చేస్తున్నాను జోహారు!

నువ్వు కనిపించే ప్రతిరోజు నాకు హేమంతపు పౌర్ణమి

ఇన్నాళ్ళూ అస్పష్టంగా ఉన్న రూపం నీదేనేమో ..... తెలీదు
చిన్నప్పటినించి కన్న కలలు నీ గురించేనేమో ..... తెలీదు
నా జీవితంలో ప్రతిక్షణం నీకోసమేనేమో ..... తెలీదు
ఇన్ని అస్పష్టాల మధ్య తెలిసింది ఒక్కటే
నువ్వు కనిపించే ప్రతిరోజు నాకు హేమంతపు పౌర్ణమి

నీ మౌనం నాకు మరణంతో సమానం

నీ మాటలతో పెదవులపై దరహాసం
నీ తలపులతో బుగ్గల్లో సిగ్గు దొంతరలు
నిన్ను చూడగానే నాలో కలిగే అలజడి
నీ మనసుకు ఇంకా అర్థం కానివా?
మరి ఎందుకు ఈ శీతకన్ను నేస్తం
నీ మౌనం నాకు మరణంతో సమానం

వన్నె చిన్నెల సీతాకోకచిలుక!!

వన్నె చిన్నెల సీతాకోకచిలుక!! 
నీలా 
రెక్కలకు రంగులద్దుకోవాలి, 
నీలాల నింగిలో 
స్వేఛ్చ గా విహరించాలని, 
నవ్వులను చిందించే 
అందాల కుసుమలున్న పూదోటలో, 
మకరందాన్ని ఆస్వాదిస్తూ 
పరవశింప చేసే ప్రకృతి ఒడిలో 
ఒక క్షణికమైన చాలు 
జీవించి తరించాలని 
నా కోరిక... 
............. 
ఎందుకని ఆ మందహాసం 
నేను 
నీలా విప్పారిన రెక్కలతో 
ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ 
పూదోటలో దోబూచులాడలేననేగా!!

"స్వచ్చత" కు మారు పేరు

నీవు 
"స్వచ్చత" కు మారు పేరు 
మల్లెలాంటి మనసల్లే! 
......................... 
నన్ను నీలో 
ప్రతిబింబింప చేస్తావు 
"నా" లోకి నన్ను 
తరచి చూసుకునేలా చేస్తావు 
............................. 
బాహ్య ప్రపంచం కోసం 
నే వేసుకున్న "ముసుగు" 
ఆ "ముసుగు" వెనుక 
నే పడుతున్న ఆవేదన 
నీకు తప్ప 
మరి ఇంకెవరికి తెలుసు?

మా అమ్మ నాకు ప్రత్యేకం. ఈ కవిత మా "అమ్మ" కు అంకితం.

మా అమ్మ నాకు ప్రత్యేకం. ఈ కవిత మా "అమ్మ" కు అంకితం.
అమ్మ!
నీ గర్భం అనే "దేవాలయం" లో
నేను ఊపిరిపోసుకున్నాను
....................................
ఈ రంగులలోకం లోకి
నీవున్నావనే
నమ్మకం తోనే అడుగిడాను
.....................................
నీ ఆత్మీయ స్పర్శ
నీ అనురాగపు పలుకులు
నీతో నే గడిపిన ప్రతిక్షణం
నాకు విలువైన జ్ఞాపకాలే
...............................
నే గెలిచినా -ఓడిన
నీవు నాతోనే ఉన్నావు
.............................
ఈ ప్రపంచం
నన్ను ఒంటరిని చేసిన
ముందుకు సాగుతూనే ఉంటాను
నీవు నాతోనే ఉన్నావనే ధీమాతో!!!

కలం కదిలించాను

కలం కదిలించాను

"అమ్మ"

నీ గూర్చి

వర్ణించడానికి

..................

ఏమని రాయాలి

నిను పోల్చుకోడానికి

సరితూగు పదాలే కరువయ్యాయి

నువ్వెక్కడున్నావో

నువ్వెక్కడున్నావో తెలీకుండానే ఎన్నెన్నో కాలాలు కరిగిపోయాయి..
ఒకే ఒక్కసారి నువ్వెలా ఉన్నావో తెలిస్తే చాలుననుకున్నాను..
నీ ఊసు తెలిసాక ఒకే ఒక్కసారి నీ స్వరం వింటే చాలుననుకున్నాను..
ఇప్పుడేమో ఒకే ఒక్కసారి నీ మోము చూస్తే బాగుండుననిపిస్తోంది..
నిన్నెలా కలుసుకోవాలో, ఎక్కడని వెతకాలో తెలీనప్పుడు కేవలం నీ తలపుల్లోనే యుగాలు గడిపేశాను..
నీ జాడ తెలిసాక మాత్రం నిన్ను గొంతెత్తి పిలవకుండా నిమిషం పాటైనా నను నేను నిలువరించుకోలేకున్నాను..
ఇన్నాళ్ళు నిదురిస్తున్నాయనుకున్న నీ జ్ఞాపకాలు ఇహ ఈ నటన మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి!

ప్రియ నేస్తమా ....

ప్రపంచం అంతా దూరం అయినా...

నీకు ‘నేను’ ఉన్నా అని
చెప్పేవాడే “స్నేహితుడు"...

ఆ స్ధానంలో “నాకు నువ్వు” “నీకు నేను” ఒకరి
కొకరు..

ఈ స్నేహమే మన ప్రపంచం “నువ్వు అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి
నడిపిస్తుంటే...

నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని
వేస్తుంటే...

నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం
చేస్తుంటే.....

ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో...

నువ్వు నా
చుట్టూ పెనవేస్తుంటే....

నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే
...........

నాకు నువ్వు వున్నావనే భావన.....

మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే,


నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....

ఈ ప్రపంచానికంతా
వినపడేలా అరిచి చెప్పాలని ఉంది నేస్తం....

జ్ఞాపకాలు

జ్ఞాపకాలు వేధిస్తాయంటారు
కాని అవి పలకరిస్తాయి
తుళ్ళింత లిస్తాయి
సంతోష పెడ్తాయి
ఆశ్చర్య పరుస్తాయి
భావాల అలజడిలో
కొట్టుకు పోతాయి
మనిషిని పట్టుకొని వేలాడ్తాయి
తరిమికొడితే మరింత
బలంగా చేరువవుతాయి
జీవితం నడవడానికి
కాళ్ళవుతాయి దారవుతాయి
ఆగి ఆగి వస్తుంటే
జీవితాన్నే కుంటుపరుస్తాయి
లేదా మధురిమలు పంచి
మనస్సును అలరిస్తాయి
గుచ్చి గుచ్చి బాధించి
విరక్తినీ కలిగిస్తాయి
మనిషి జీవితం
జ్ఞాపకాల పుట్టయితే
మంచీ చెడుల కలబోత అవి

ప్రేమంటే

ప్రేమంటే

ప్రేమంటే సప్త స్వర సంగీతం
ఇలలో ఆమని అరుదెంచిన సంరంభం
హృదయ సవ్వడుల నాట్యం
అంతరంగంలోని అలజడుల ప్రవాహం
పిడికెడంత మనసులో
ప్రపంచమంత ప్రేమ
గుప్పెడంత గుండెలో
సందేహాలు కొర్డంత
గండి కొడ్తాయి
మారిన అర్ధాలు ప్రేమను
విషపూరితం చేస్తున్నాయి
మారుతున్న సమాజానికి
ప్రతిబింబాల్లా నిలుస్తున్నాయి
పరిశోధనలు చేసి
గుండె జబ్బులు కుదర్చవచ్చు కాని
పరిపరి విధాలమారుతున్న
ప్రేమను మాత్రం అనర్థాల్లోకి
నెట్టేస్తున్నాయి
గమనిస్తే గుండె జబ్బులకు
కారణం ప్రేమ వత్తిళ్ళే
ప్రేమించలేని మనసుగల
మానవులకు అన్నీ జబ్బులే
విశ్వమానవ కళ్యణానికి
మూలం ప్రేమ మయ జీవితం
జీవించాలనెడి కొరికకు నెగడు
ప్రేమజ్వాలలే

అనగనగా ఒక గుడ్డి అమ్మాయి తనకి తను తన బాయ్ ఫ్రెండ్ తప్ప





 అనగనగా ఒక గుడ్డి అమ్మాయి తనకి తను తన
బాయ్ ఫ్రెండ్ తప్ప

ఈ ప్రపంచంలో ఎవరూ ఇష్టం లేరు . ఒక రోజు తన బాయ్ ఫ్రెండు తో మాట్లాడుతూ

నాకు కళ్లు వచ్చిన వెంటన నిన్ను పెళ్లి చేసుకొంటా అని చేపింది .

అలా చెప్పిన కొన్ని రోజులకు తనకు కళ్లు ఎవరో డొనేట్ చేసారు .

తనకు కళ్లు వచ్చిన ఆనందంలో తన బాయ్ ఫ్రెండు దగరకు వెళ్ళింది.

అక్కడ తను ఆశ్చర్య పొంది తన బాయ్ ఫ్రెండు కూడా గూడి వాడు .

అపుడు తన బాయ్ ఫ్రెండు అడిగాడు "నీకు కళ్లు వచాయి కదా మనం ఇంక పెళ్లి చేసుకుందామా."

అనాడు "కొంత సేపు అమ్మాయి అలోచించి ఇబ్బంది గానే చెపింది నేను నిను పెళ్లి చేసుకోలేను అని "

ఆ అబ్బాయి ఏమి మాట్లాడ లేకా పోయాడు కొంత సేపు అలోచించి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతూ

ఇల్లా అన్నాడు "take care of my eyes"

నే రాయలేను కవితలు....

 నే రాయలేను కవితలు....
మనిషి వికృత చేష్టలను పరాకాష్టగా
మారి ఆక్రుతోడిన ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ...

నే రాయలేను కవితలు....
లేని ప్రేయసిన ఊహల్లో ఊహిస్తూ
కాని అందాన్ని, విరహాన్ని వర్ణింపతగనిదాన్న వర్ణిస్తూ...

నే రాయలేను కవితలు....
కీచక ఉపాధ్యాయులున్న ఈ సమాజంలో
ద్రౌపతిగా మారిన నా తెలుగుతల్లిని పూజిస్తూ...

నే రాయలేను కవితలు....
నైతతిక విలువలను తార్యి న్యాయ, ధర్మ
దేవతను వికలాంగులుగా మార్చిన ఈ సమాజాన్న కీర్తిస్తూ...

నే రాయలేను కవితలు....
జనన, జీవన, మరణాల
త్రికార్యములనే జీవితమని వర్ణిస్తూ...

నే రాయలేను కవితలు.... నే రాయలేను కవితలు....