22, జనవరి 2013, మంగళవారం

మాట్లాడటమే సరిగా రాని నేను


మాట్లాడటమే సరిగా రాని నేను
ప్రతి క్షణం నీతో
మాట్లాడటానికే వేచి చూసేవాడిని


ఎవరిని పట్టించుకోని నా కళ్ళు
నీ దర్శనం కోసం ఎప్పుడూ
ప్రతిక్షణం వెతుకుతుండేవి

నువ్వు లేనప్పుడు నాది ఒంటరి ప్రపంచం
నువ్వు వచ్చాక నేను..మరిచాను అ ప్రపంచం


నీవు పరిచయం కానప్పుడు నేనెవ్వరో అన్న ఫీలింగ్
నువ్వు వచ్చాక నాలో ఎక్కడో చెప్పలేని దైర్యిం

ఇంతకు ముందు నాకోసం నేను
నువ్వు వచ్చాక నీకోసం
చావునైనా ఎదిరించే తెగింపు


ఎమిటో మరి ఏమాయ చేసావో
నువ్వు ఇలా వచ్చి..అలా వెళ్ళిపోయావు
ఎందుకిలా జరుగుతోంది అని అడుగలేను..

నీవు మారావు ..నన్ను ఏమార్చావు.
నీవున్నప్పుడు ప్రపంచంలోని సంతోషం అంతా నాదే.
ఇప్పుడు ప్రపంచంలో దుక్కం అంతానాదే ..

ప్రతిక్షనం గుర్తుకొస్తున్నాను అన్న నీవే..
నేను అనే వాన్ని అసలెరుగను అన్నట్టుంటే ..
నా మనసుకు సమాదానం ఏమని చెప్పుకోను..
ఎందాకని ఊరడించను...చెప్పు ప్రియా

ఇలా ప్రతిక్షనం నీకోసం ఆలోచించే గుండె ఎప్పుడో ఆగిపోతుంది..
అయినా నీమనస్సు కరుగదు అలా తయారయ్యావు ఎందుకో..?

12, జనవరి 2013, శనివారం

నువ్వు నవ్వితే నాకు ఆనందం


నువ్వు నవ్వితే నాకు ఆనందం
కానీ ఆ నవ్వు వేరొకరి సమక్షంలో ఐతే,
నేను బాధ పడతాను.
ఆ నవ్వుని నేను కోల్పోయానే అని,

నువ్వు నడుస్తుంటే చూస్తూనే ఉంటాను.
కానీ, తర్వాత ఏడుస్తాను
ఆ నడక నీ నుండి నన్ను దూరం చేసిందని.

నువ్వు నా తో మాట్లాడుతుంటే
నాకు ఏమీ అర్ధం కాదు. ఎందుకంటే,
నీ తీయ్యని స్వరం వింటూ లోకాన్ని మైమరచిపోతాను
నా చెవులు వినటం మానేస్తాయి. .

నువ్వు గమనించావో లేదో ,
కవులందరూ ప్రకృతిలోని అందాన్ని వర్ణిస్తారు.
కానీ నేను నీలోనే ప్రకృతిని చూస్తాను.
ప్రకృతిలో జరిగే అలజడిని నాలో చూస్తాను.

నువ్వు కలల్లో కనపడితే నా కళ్ళు వర్షిస్తాయి
కనపడకపోతే మళ్ళీ వర్షిస్తాయి
ఒకసారి ఆనందంతో అయితే,
మరోసారి దుఃఖంతో..............

నీకు అస్సలు నాజ్ఞాపకాలు గుర్తేలేవుకదా...?
అందుకే అలా ధీమాగా హేపీగా ఉన్నావు
నా లాంటి ప్రెండ్స్ నీకు ఎందరో
కాని నాకు మాత్రం నీవు ఒక్కదానివే ..

ప్రియా నీజ్ఞాపకాలు


ప్రియా నీజ్ఞాపకాలు
మబ్బులా కమ్ముకుంటాయి
వెంటనే కన్నీరు
ఏకధాటిగా బయటకు పరుగులు తీస్తాయి
నీ తలపులు గుర్తొచ్చిన ప్రతిసారి...
నా కళ్ళు ఏకధాటిగా ఇలా వర్షిస్తాయి!

కంటి నిండా కలలున్నాయి...
అవి ఎప్పటికి తీరవేమో
ఎప్పటికీ తీరందాటని ఉప్పెనలా
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి
ఏదో రాయాలని విఫల ప్రయత్నం చేస్తుంటా
ఎందుకో ఒక్కోసారి అక్షరాలు కనిపించకుండా
కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...ప్రియా

అందుకే దేవుడా
నిజంగా నీవు దేవుడవైతే..
ప్రియను దరి చేర్చలేవని తేలింది అందుకే
నా గుండెను రాతి బండను చేయి...
పగిలి పోయిందనుకో ఆ రాయి...
నన్ను మట్టిలో కలిపి వేసేయి...
భగవంతుడా నీవు నాకు
ఈ ఒక్క సహాయము చేయి...
నీవు దమ్మున్న దేవుడవైతే....?

ఓ నిశ్శబ్ద పుష్పం..ఇద్దరి మద్యా చెప్పుకోలేని అఘాదాన్ని చేసింది.


కాలన్ని కాదని
ఏమేరపాటుగా ఎదురు చూస్తున్న క్షనం
ననే నున్నానంటూ వచ్చావు
నీ తియ్యనైన మాటలతో
నీ అద్చుతమైన స్నేహంతో
నా గుప్పెడంత గుండెను ఆక్రమించేసావు
నాలో నన్ను చూసుకుందాం అనుకున్నా
నాలో నీవే కనిపిస్తున్నావు
ఇప్పుడు నాలో నేను లేను
నన్ను ఎప్పుడో నీవు ఆక్రమించేశావు
ఎలా వచ్చిందో తెలీదు
ఎందుకొచ్చిందో తెలీదు
మనిద్దరి మద్యా
అసంకల్పితంగా వికసించింది
ఓ నిశ్శబ్ద పుష్పం
ఇద్దరి మద్యా చెప్పుకోలేని
అఘాదాన్ని చేసింది..
ఆగాదం పూడ్చెదెవ్వరు
ఇలా నా మన్స్స్సులో
ఆలోచనలు
అల్లకళ్ళోలం రేపుతున్నాయి
గుండేకు చిల్లులు చేస్తూ
రేపటి పై ఆశ లేదు
ఈ నిశి రాతిరేనన్నెప్పుడో
మింగేసి చీకట్లో కలిపేసేలాగుంది